Jump to content

Asia's biggest Seed Park in Kurnool


Recommended Posts

http://www.andhrajyothy.com/artical?SID=474246

 

ఆంధ్రా విత్తనం

09-10-2017 02:11:35
 
636431118932031862.jpg
  • ఆ బ్రాండ్‌తో 101 రకాల విక్రయాలు
  • అయోవా వర్సిటీ భాగస్వామ్యంతో తంగడంచలో మెగా సీడ్‌ పార్కు
  • రూ.670 కోట్లు... 623 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
  • నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం
కర్నూలు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): విత్తనోత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్‌ తనదైన ముద్ర వేయనుంది. ఏకంగా 101 రకాల ఆహార పంటలు, ఉద్యాన పంటల విత్తనాలకు కర్నూలు కేరాఫ్‌ అడ్రస్‌ కానుంది. కర్నూలు జిల్లా తంగడంచలో ఏర్పాటు చేస్తున్న మెగా సీడ్‌ పార్కు నుంచి ఈ విత్తనాలు రానున్నాయి. అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్కును ఏర్పాటు చేస్తోంది. దాదాపు 670 కోట్ల వ్యయంతో 623 ఎకరాల విస్తీర్ణం నిర్మించే ఈ కేంద్రానికి సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ అధికారులు పూర్తి చేశారు. ఆరోగ్యకరమైన విత్తనాల ఉత్పత్తికి కర్నూలు జిల్లా అనువైనదిగా ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో, కర్నూలు జిల్లాను మెగా సీడ్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తానని 2014 ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు అమెరికాకు చెందిన అయోవా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యవసాయశాఖ, ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా కర్నూలు మెగాసీడ్‌ హబ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. జూపాడుబంగ్లా మండలం తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రానికి చెందిన భూములను ఈ పార్కు నిర్మాణానికి కేటాయించారు.
 
మూడు విడతల్లో అభివృద్ధి
ప్రస్తుతం రైతులకు అవసరమైన విత్తనాలలో ప్రభుత్వరంగ సంస్థల నుంచి 25 శాతానికి మించి అందడం లేదు. మిగిలిన విత్తనాలు, హైబ్రీడ్‌ విత్తనాల కోసం ప్రైవేటు రంగ సంస్థలు, విదేశీ సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో కొన్ని ప్రైవేటు సంస్థలు సరఫరా చేసే నాణ్యతలేని విత్తనాలను కొనుగోలు చేసి రైతులు చితికిపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తన సరఫరా, విత్తనోత్పత్తిలో భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా మెగా సీడ్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మూడు విడతల్లో అభివృద్ధి చేస్తారు. తొలి విడతలో రూ.150 కోట్లతో భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. రెండో దశలో ప్లానింగ్‌, విత్తనోత్పత్తి, సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్రారంభిస్తారు. మూడో దశలో రైతుల ఎంపిక, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామంతో విత్తనోత్పత్తి చేస్తారు. ప్రధానంగా నాణ్యమైన, అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలపై పరిశోధనలు, విత్తనోత్పత్తి, రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఉత్పత్తి అయిన విత్తనాలను ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. ‘ఆంధ్రా బ్రాండ్‌’ పేరుతో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా మన విత్తనాలు ప్రవేశపెడుతున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ పేర్కొన్నారు.
 
అమెరికాకు ప్రత్యేక నిపుణుల కమిటీ
విత్తనోత్పత్తిలో భాగంగా మెగా సీడ్‌ పార్కు ప్రత్యేక నిపుణుల కమిటీ ఈ నెల 16 నుంచి 19 వరకూ అమెరికాలో పర్యటించనుంది. ఆయోవా విశ్వవిద్యాలయం చేస్తున్న విత్తనోత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం, ఆ దేశంలో విత్తనాల ఉత్పతి, ప్రాసెసింగ్‌ తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. 19న అయోవా యూనివర్సిటీలో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికారులు తెలిపారు.
Link to comment
Share on other sites

  • Replies 73
  • Created
  • Last Reply

Top Posters In This Topic

ఆంధ్రా విత్తనం
 
 
636431118932031862.jpg
  • ఆ బ్రాండ్‌తో 101 రకాల విక్రయాలు
  • అయోవా వర్సిటీ భాగస్వామ్యంతో తంగడంచలో మెగా సీడ్‌ పార్కు
  • రూ.670 కోట్లు... 623 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
  • నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం
కర్నూలు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): విత్తనోత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్‌ తనదైన ముద్ర వేయనుంది. ఏకంగా 101 రకాల ఆహార పంటలు, ఉద్యాన పంటల విత్తనాలకు కర్నూలు కేరాఫ్‌ అడ్రస్‌ కానుంది. కర్నూలు జిల్లా తంగడంచలో ఏర్పాటు చేస్తున్న మెగా సీడ్‌ పార్కు నుంచి ఈ విత్తనాలు రానున్నాయి. అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్కును ఏర్పాటు చేస్తోంది. దాదాపు 670 కోట్ల వ్యయంతో 623 ఎకరాల విస్తీర్ణం నిర్మించే ఈ కేంద్రానికి సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ అధికారులు పూర్తి చేశారు. ఆరోగ్యకరమైన విత్తనాల ఉత్పత్తికి కర్నూలు జిల్లా అనువైనదిగా ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో, కర్నూలు జిల్లాను మెగా సీడ్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తానని 2014 ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు అమెరికాకు చెందిన అయోవా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యవసాయశాఖ, ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా కర్నూలు మెగాసీడ్‌ హబ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. జూపాడుబంగ్లా మండలం తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రానికి చెందిన భూములను ఈ పార్కు నిర్మాణానికి కేటాయించారు.
 
మూడు విడతల్లో అభివృద్ధి
ప్రస్తుతం రైతులకు అవసరమైన విత్తనాలలో ప్రభుత్వరంగ సంస్థల నుంచి 25 శాతానికి మించి అందడం లేదు. మిగిలిన విత్తనాలు, హైబ్రీడ్‌ విత్తనాల కోసం ప్రైవేటు రంగ సంస్థలు, విదేశీ సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో కొన్ని ప్రైవేటు సంస్థలు సరఫరా చేసే నాణ్యతలేని విత్తనాలను కొనుగోలు చేసి రైతులు చితికిపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తన సరఫరా, విత్తనోత్పత్తిలో భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా మెగా సీడ్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మూడు విడతల్లో అభివృద్ధి చేస్తారు. తొలి విడతలో రూ.150 కోట్లతో భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. రెండో దశలో ప్లానింగ్‌, విత్తనోత్పత్తి, సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్రారంభిస్తారు. మూడో దశలో రైతుల ఎంపిక, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామంతో విత్తనోత్పత్తి చేస్తారు. ప్రధానంగా నాణ్యమైన, అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలపై పరిశోధనలు, విత్తనోత్పత్తి, రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఉత్పత్తి అయిన విత్తనాలను ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. ‘ఆంధ్రా బ్రాండ్‌’ పేరుతో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా మన విత్తనాలు ప్రవేశపెడుతున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ పేర్కొన్నారు.
 
అమెరికాకు ప్రత్యేక నిపుణుల కమిటీ
విత్తనోత్పత్తిలో భాగంగా మెగా సీడ్‌ పార్కు ప్రత్యేక నిపుణుల కమిటీ ఈ నెల 16 నుంచి 19 వరకూ అమెరికాలో పర్యటించనుంది. ఆయోవా విశ్వవిద్యాలయం చేస్తున్న విత్తనోత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం, ఆ దేశంలో విత్తనాల ఉత్పతి, ప్రాసెసింగ్‌ తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. 19న అయోవా యూనివర్సిటీలో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికారులు తెలిపారు.
Link to comment
Share on other sites

  • అయోవా’ సహకారంతో విత్తనోత్పత్తి

  • సీమను హార్టీకల్చర్‌ హబ్‌గా మారుస్తా

27 నీటి ప్రాజెక్టులూ పూర్తి చేస్తాం

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన

కర్నూలు జిల్లా తంగడంచలో మెగా సీడ్‌ పార్కుకు శంకుస్థాపన

రైతులకు రుణమాఫీ చెక్కుల పంపిణీ

కర్నూలు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాను. ఎక్కడైనా బ్యాంకుల్లో పొరపాట్ల వల్ల అర్హత ఉండీ రుణమాఫీ కాకపోతే రైతులు 1100 నంబరుకు కాల్‌ చేయండి. వారికి రుణమాఫీ చేసే బాధ్యత నేనే తీసుకుంటాను. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో విత్తనాలు లభించక, ఎరువుల కోసం లాఠీదెబ్బలు తినాల్సి వచ్చేది. ఆ పరిస్థితి రానివ్వను. నా చివరి రక్తపుబొట్టు వరకు రైతు సంక్షేమం కోసమే కృషి చేస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా తంగడంచలో అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్తంగా చేపట్టిన మెగా సీడ్‌ పార్కు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

 

మూడో విడత రుణమాఫీలో భాగంగా 36.72 లక్షల మంది రైతులకు రూ.3,600 కోట్ల చెక్కును సీఎం అందించి పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఆనాడు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఐటీ రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను ప్రపంచపటంలో నిలిపాను. ప్రస్తుతం ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి నవ్యాంధ్రను అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనే సంకల్పం, రైతన్నకు వ్యవసాయం లాభాసాటిగా మార్చాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా భూములు, వాతావరణం విత్తనోత్పత్తికి అనుకూలమని శాస్త్రవేత్తలు గుర్తించారని తెలిపారు. ఇక్కడ పండించే కర్నూలు సోనా బియ్యానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉందంటే ఇక్కడి భూములు ఎలాంటివో తెలుస్తోందన్నారు.

 

ఇక్కడ విత్తనోత్పత్తి చేపట్టాలని 2016లో అమెరికా పర్యటనలో అయోవా విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నామని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే 623.40 ఎకరాల్లో రూ.670 కోట్ల వ్యయంతో సీడ్‌ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ‘ప్రపంచ విత్తనోత్పత్తి కేంద్రంగా కర్నూలును తీర్చిదిద్దుతాను. దేశంలోనే నంబర్‌ వన్‌ సీడ్‌ పార్కుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. విత్తనోత్పత్తి, పరిశోధనలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ యూనివర్సిటీ అయోవా. 350 రకాల విత్తనాలను ఉత్పత్తి చేసి 80 దేశాలకు పైగా సరఫరా చేస్తోంది. కొద్ది రోజుల్లో అమెరికా వెళ్తున్నాను. ఈ ప్రాంతానికి 100 పైగా కంపెనీలను తీసుకురావాలన్నదే నా సంకల్పం’ అని తెలిపారు.

 

అయోవా ప్రతినిధి దిలీప్‌ కుమార్‌ను సీఎం అభినందించారు. ‘మన రాష్ట్రానికి చెందిన దిలీప్‌ ఇక్కడే చదివి వ్యవసాయ, సీడ్‌ ఉత్పత్తిలో ప్రత్యేక శిక్షణ పొంది అయోవా యూనివర్సిటీలో పని చేస్తున్నారు. జన్మభూమికి సేవ చేయాలని మెగా సీడ్‌ పార్కు ఏర్పాటుకు ఎంతో కృషి చేస్తే.. ఆయన్ను కూడా విమర్శిస్తున్నారు. తమ్ముళ్లూ.. వీళ్లను ఏమనాలి’ అని అన్నారు. దిలీప్‌తోపాటు ఆ వర్సిటీ డైరెక్టర్‌ మంజిత్‌ కె.మిశ్రాకు జ్ఞాపికలు అందజేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చుతానని, హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చే పూచీ తనదేనని సీఎం హామీ ఇచ్చారు. లాభసాటి పంటల వైపు రైతులను మళ్లించాలని, రైతుల్లో కూడా మార్పు రావాలని, పండ్ల తోటల పెంపకం, పాడిపరిశ్రమ వైపు అడుగులు వేయాలని పిలుపిచ్చారు.

 

ఒక గేదె ఇంట్లో ఉంటే ఆ రైతు కుటుంబంలో కష్టాలు ఉండవన్నారు. ‘సాగునీటి ప్రాజెక్టుల కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని పని చేస్తున్నా. ఒక పక్క అభివృద్ధి యజ్ఞం చేస్తుంటే కొందరు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.ప్రకృతి కరుణించి మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురిశాయి. ప్రాధాన్య క్రమంలో 27 ప్రాజెక్టుల పూర్తికి రూ.1300 కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని సీఎం తెలిపారు.

 

రుణమాఫీ చెక్కుల పంపిణీ

రుణమాఫీలో భాగంగా మూడో విడత 36.72 లక్షల మంది రైతులకు రూ.3,600 కోట్లు మాఫీ చేసి ఉపశమనం కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ‘2012లో పాదయాత్ర సందర్భంగా ప్రతి రైతు కళ్లల్లో కష్టాలు చూశాను. రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాను. మాట తప్పకుండా రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక కష్టాలున్నా.. ఆర్‌బీఐ ఒప్పుకోకపోయినా.. బ్యాంకులు సహకరించకున్నా.. ఒక రాష్ట్రానికి ఇస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయని కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసినా.. రైతు సంక్షేమమే ధ్యేయంగా రూ.24 వేల కోట్ల రుణమాఫీకి శ్రీకారం చుట్టా. మొదటి విడతలో 55 లక్షల మందికి రూ.7,365 కోట్లు, రెండో విడతలో 36.46 లక్షల మంది రైతులకు రూ.3,302 కోట్లు ఇప్పటికే వారి ఖాతాలో జమ చేశా. రూ.50 వేల లోపు ఉన్న రైతులకు ఏకకాలంలో రుణవిముక్తులను చేశా. మూడో విడతగా 36.72 లక్షల మంది రైతులకు రూ.3,600 కోట్ల రుణమాఫీని తంగడంచ కేంద్రంగా రైతులకు పంపిణీ చేస్తున్నాం. 10 శాతం వడ్డీతో ఖాతాలో జమ చేస్తాం’ అని తెలిపారు.

 

మెగా సీడ్‌ పార్కుకు శంకుస్థాపన సీఎం పట్టుదలకు నిదర్శనమని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ‘ఆయన రాష్ట్రానికి ఒక్క మగాడు’ అని కొనియాడారు. 70 ఏళ్లలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి రుణమాఫీ చేయలేదని, ఆ ఘనత చంద్రబాబుకే వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. విత్తనోత్పత్తిలో సీఎంకు అద్భుతమైన విజన్‌ ఉందని మిశ్రా అన్నారు. వ్యవసాయ నిపుణుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ హరిత విప్లవానికి కృషిచేస్తే.. చంద్రబాబు విత్తన విప్లవానికి నాంది పలుకుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, ఎంపీలు ఎస్పీవై రెడ్డి, టీజీ వెంకటేశ్‌, వ్యవసాయ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌, కలెక్టర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...

650 ఎకరాల్లో మెగా సీడ్‌ పార్క్‌.!
అయోవా విశ్వవిద్యాలయం సహకారంతో ఏర్పాటు
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: అమెరికాకు చెందిన అయోవా స్టేట్‌ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్రంలో 650 ఎకరాల్లో మెగా సీడ్‌ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ తెలిపారు. విశాఖలో జరుగుతున్న వ్యవసాయ సాంకేతిక శిఖరాగ్ర సదస్సులో గురువారం స్థానిక సవాళ్ల పరిష్కారానికి ప్రపంచ వ్యవసాయ సాంకేతికత అంశంపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ దక్షిణాసియాలోనే అతిపెద్ద విత్తన పార్కును రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల నాణ్యమైన విత్తనాలు రైతులకు అందడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఐటీ కంపెనీల్లో ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది యువత ప్రకృతి వ్యవసాయానికి ముందుకొస్తున్నారని, దీంతో ఈ రంగంలో సాంకేతికత పెరిగిందని చెప్పారు. బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవసాయ డైరెక్టర్‌ డాక్టర్‌ నిక్‌ఆస్టిన్‌ మాట్లాడుతూ ఐటీ, డ్రోన్స్‌, ఉపగ్రహాలద్వారా సాంకేతికతను వినియోగిస్తూ ఆహార ఉత్పత్తుల దిగుబడి పెంచేందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగాఉన్నామని వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రోబోటిక్స్‌ సేవలను అమల్లోకి తెచ్చేలా పరిజ్ఞానాన్ని అందజేస్తున్నామన్నారు.

అందుబాటులో 500 రకాల యాప్స్‌..: వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించేలా తమ సంస్థ ఇప్పటికే సుమారు 500 రకాల యాప్‌లను రూపొందించినట్లు నెదర్లాండ్‌కు చెందిన వ్యవసాయ, సహకార సాంకేతిక సంస్థ సమన్వయకర్త డాక్టర్‌ బెంజిమిన్‌ క్వాసిఅడోం చెప్పారు. యాప్‌లు కావాల్సిన వారు ‌www.apps4ag.org వెబ్‌సైట్‌ నుంచి దిగుమతి చేసుకోవచ్చని వివరించారు. వ్యవసాయంలో ఆధునికతను తీసుకురావడానికి, ఔత్సాహికులు ఈ రంగంపై పరిశోధించడానికి  ప్రభుత్వం రూ.వంద కోట్లు ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరం ఉందని అడ్వాంటా లిమిటెడ్‌ బోర్డు సభ్యుడు రామ్‌కౌండిన్య అన్నారు. కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ ముఖ్య పరిశోధకులు రణవీర్‌చంద్ర, బోష్‌ గ్లోబర్‌ అగ్రిటెక్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రతినిధి రాజేంద్రనాథ్‌ గోస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
విత్తన భాండాగారానికి ప్రత్యేక సంస్థ
ప్రభుత్వ వాటా 50% పై మాటే
సీఈవోగా ఐఏఎస్‌ అధికారి
జూన్‌ నుంచి ప్రక్రియ ప్రారభించాలని లక్ష్యం

ఈనాడు, అమరావతి: రైతుకు నాణ్యమైన విత్తనం అందించే దిశగా కర్నూలు జిల్లా తంగెడంచలో మెగా సీడ్‌పార్కు నిర్మాణానికి చర్యలు జోరందుకుంటున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద విత్తన భాండాగారంగా దీనికి రూపమివ్వనున్నారు. వచ్చే ఖరీఫ్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. తదనుగుణంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పార్కు కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించాల్సి ఉన్నందున ప్రత్యేక వాహక సంస్థ(ఎస్‌పీవీ) ఏర్పాటుచేసి, ముఖ్య కార్యనిర్వణాధికారి(సీఈవో) ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తారు. ఈ పదవిలో ఐఏఎస్‌ అధికారిని నియమించాలనే ప్రతిపాదనలున్నాయి. సంస్థలో 50శాతానికి మించిన వాటా ప్రభుత్వానికి ఉంటుంది. విత్తన తయారీ సంస్థలు, రైతు ఉత్పత్తి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకూ  భాగస్వామ్యం కల్పిస్తారు. అయోవా, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు విజ్ఞాన ప్రదాతలు(నాలెడ్జి ప్రొవైడర్స్‌)గా వ్యవహరిస్తాయి. ఇక్కడ అవసరమైన శాస్త్రవేత్తలను వాటి నుంచి నియమిస్తారు. తంగెడంచలో జూన్‌ నుంచి ప్రాథమిక కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలో విత్తన ప్రదర్శనాక్షేత్రాలు ఏర్పాటుచేస్తారు.రాష్ట్రవ్యాప్తంగా రైతుల్ని తీసుకొచ్చి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తయారుచేస్తున్న విత్తనాలపై అవగాహన కల్పిస్తారు. రైతులు సొంతంగా అభివృద్ధి చేసిన వాటినీ ఇక్కడ అందించనున్నారు. విత్తనోత్పత్తిపై రైతులకు శిక్షణ ఇచ్చి రబీ నుంచి ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు అధికారులు వివరించారు. 2018 డిసెంబరు నాటికి పరిశోధనా కేంద్రాలు అందుబాటులోకి తెస్తారు.
రైతుకు దగ్గరగా: రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం
విత్తన భద్రత: ఉద్యాన, వ్యవసాయ పంటలకు చెందిన లక్ష టన్నుల విత్తనాలను తయారుచేస్తారు.
వ్యవసాయ విప్లవం: 40లక్షల హెక్టార్లలో అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యం.
శిక్షణ: విత్తనతయారీ, శుద్ధి రంగంలో రైతులకు, విస్తరణ సిబ్బంది, శాస్త్రవేత్తలకు శిక్షణ ఇస్తారు.
పరిశోధన అభివృద్ధి కేంద్రంగా: విత్తన పరిశ్రమకు, పరిశోధనా కేంద్రాలకు వేదికగా తయారుచేస్తారు. బోధనలో భాగంగా వ్యవసాయ, ఉద్యాన విద్యార్ధులకు అమెరికాలోని అయోవాలో, అక్కడి విద్యార్ధులకు ఇక్కడ అవకాశాలు కల్పిస్తారు.
ఎగుమతులకు వీలుగా: పరిశోధనా సంస్థలు తమ విత్తనాలకు పరీక్షలు చేసుకోవచ్చు. విదేశీ ఎగుమతులకు ధ్రువీకరణపత్రాలు అందజేస్తారు.
విత్తన పరిశ్రమకు ప్రోత్సాహం: విత్తన తయారీదారులకు ప్రపంచవ్యాప్త అవకాశాలను కేంద్రం ద్వారా అందుబాటులోకి తెస్తారు. అధునాతన పరిశోధన కేంద్రాలు, శుద్ధికి అవసరమైన సాంకేతికత, గిడ్డంగులు, శాస్త్రవేత్తల సూచనలు అందిస్తారు.

పదిరోజులకోసారి సమీక్షిస్తా
మెగా సీడ్‌పార్కు పనులు త్వరితగతిన చేపట్టాలి. పురోగతిని పదిరోజులకోసారి సమీక్షిస్తా. సంస్థ నమోదు పూర్తయిన వెంటనే నియామకాలు పూర్తిచేస్తాం. 2018 ఖరీఫ్‌ నాటికి విత్తనాలకు సంబంధించిన ప్రక్రియ అక్కడ మొదలవుతుంది.
- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వ్యవసాయ, ఉద్యానశాఖ మంత
విస్తీర్ణం: 623 ఎకరాలు
ప్రాజెక్టు వ్యయం: 670 కోట్లు
తొలి దశలో: 150 కోట్లు
Link to comment
Share on other sites

  • 2 months later...

కంపెనీగా మెగా సీడ్‌పార్కు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, అమెరికాకు చెందిన అయోవా స్టేట్‌ యూనివర్శిటీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ మెగా సీడ్‌పార్కు పబ్లిక్‌లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటైంది. కర్నూలు జిల్లా తంగెడంచలో చేపట్టనున్న పార్కు అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ సంస్థను నమోదు చేయించారు. దీనికి వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. వైస్‌ఛైర్మన్‌, ఎండీగా వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ డా।।హరిజవహర్‌లాల్‌ను నియమించారు. ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, వ్యవసాయ, ఉద్యానశాఖల కమిషనర్లు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీలు ఎక్స్‌అఫిషియో సభ్యులు, డైరెక్టర్లుగా వ్యవహరిస్తారని ప్రభుత్వం సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సలహా బోర్డుగా మార్పు..: మెగా సీడ్‌పార్కు అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు ఏర్పాటైన ప్రత్యేక వాహక సంస్థ పేరును సలహా బోర్డుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Link to comment
Share on other sites

తంగడంచ మెగా సీడ్‌ పార్క్‌కు రూ.190 కోట్లు
21-02-2018 02:52:49
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కర్నూలు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా తంగడంచ మెగా సీడ్‌ పార్క్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.310 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని, ఈ బడ్జెట్‌లో రూ.190 కోట్లు కేటాయించనున్నామని, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దీనికి ఆమోదం తెలిపారని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.
 
మెగా సీడ్‌ పార్క్‌ అభివృద్ధిపై మంగళవారం కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో వ్యవసాయాధికారులు, ఐవోవ స్టేట్‌ విశ్వవిద్యాలయం ప్రతినిధులు, సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, రైతులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సీడ్‌ పార్క్‌కు 600 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. ఐవోవ విశ్వవిద్యాలయం సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సీడ్‌ పార్క్‌గా దీనికి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రైవేట్‌ సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు సైతం ముందుకు వస్తే వారికి కావాల్సిన భూమి, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామన్నారు. దేశ అవసరాలకే కాకుండా ఇతర దేశాలకు సైతం మేలు రకం విత్తనాలు పంపిణీ చేసే స్థాయికి తీర్చుదిద్దుతామన్నారు. మార్చి తొలి వారంలోనే మౌలిక సదుపాయాల పనులకు శ్రీకారం చుడతామన్నా

Link to comment
Share on other sites

  • 3 months later...
  • 4 weeks later...
ఆధునిక పరిజ్ఞానంతో మెగా విత్తన పార్కు
నాణ్యత నిర్ధారణకు బార్‌ కోడింగ్‌
‘ఈనాడు’తో అయోవా విశ్వవిద్యాలయ అంతర్జాతీయ కార్యకలాపాల
పర్యవేక్షకుడు దిలీప్‌ కుమార్‌

ఈనాడు, అమరావతి: ‘బీజ విత్తనంతో వస్తే విత్తన పాకెట్లతో బయటకు వెళ్లేలా కర్నూలు జిల్లా మెగా విత్తన పార్కు ఏర్పాటవుతోంది. బార్‌ కోడింగ్‌తో నాణ్యమైన విత్తనమో కాదో రైతులు మొబైల్‌ ద్వారా తెలుసుకోవచ్చు’ అని అయోవా విశ్వవిద్యాలయ అంతర్జాతీయ కార్యకలాపాల పర్యవేక్షకుడు దిలీప్‌ కుమార్‌ వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విత్తనం అందించడం కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ‘ఆంధ్రప్రదేశ్‌ మెగా విత్తన పార్కు’లో విత్తనాలు ఉత్పత్తి చేస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా తంగెడంచలో 600 ఎకరాల్లో ఏర్పాటయ్యే విత్తన పార్కుకు అమెరికాకు చెందిన అయోవా విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ సందర్భంగా జరిగిన కార్యశాలకు హాజరైన ఆయన ‘ఈనాడు’తో  మాట్లాడారు. ‘ప్రస్తుతం విత్తన పరిశోధన, ఉత్పత్తి, ఆరబెట్టడం, శుద్ధి, ధ్రువీకరణ వేర్వేరు చోట్ల జరుగుతున్నాయి. దీనివల్ల కాలహరణంతోపాటు విత్తన లభ్యత జాప్యమవుతుంది. మెగా విత్తన పార్కులో సీడ్‌ వ్యాల్యూ చైన్‌ విధానం అమలు చేస్తాం. ప్లాట్లుగా విభజించి విత్తన తయారీ సంస్థలు, రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలకు కేటాయిస్తాం. వారంతా ఇక్కడే నాణ్యమైన విత్తనాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇస్టాను (ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ సీడ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ) ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇందులో అన్ని విభాగాలుంటాయి. విదేశాలకు ఎగుమతి చేసుకునే విధంగా సౌకర్యాలుంటాయి. బార్‌కోడింగ్‌ విధానంలో నకిలీ విత్తనానికి చెక్‌ పెట్టవచ్చు. నాణ్యమైన విత్తనాన్ని ధ్రువీకరించి ప్యాకెట్లను బార్‌ కోడింగ్‌కు అనుసంధానిస్తాం. దీంతో అక్రమంగా నాసిరకం విత్తనాలను కలిపి విక్రయించాలన్నా సాధ్యం కాదు. విత్తనం ఎక్కడ నుంచి వచ్చింది? నాణ్యమైనదా? కాదా? అనేది రైతులు తమ మొబైల్‌ నుంచే తెలుసుకోవచ్చు. ప్రస్తుత ఖరీఫ్‌ నుంచే ఇక్కడ ప్లాట్లు వేసి విత్తన తయారీ మొదలవుతుంది’ అని ఆయన వివరించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...