Jump to content

Vamsadhara-Nagavali Rivers interlinking

Recommended Posts

  • నదుల అనుసంధానంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
  • జిల్లాలో నాగావళి, వంశధార లింక్‌కు సన్నాహాలు
  • ఏ నదిలో నీరున్నా రైతులకు లాభమే!
  • ప్రణాళికల రూపకల్పనలో యంత్రాంగం

పట్టిసీమ విజయవంతం కావడంతో ప్రభుత్వం నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రధాన నాగావళి, వంశధార నదులను అనుసంధానించి కరువును దూరం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

నదుల అనుసంధానంతోనే ప్రగతి సాధ్యమని ప్రభు త్వం భావిస్తోంది. జిల్లాలోని వంశధార.. నాగావళి నదులను అనుసంధానించాలని ప్రతిపాదించింది. తద్వారా జిల్లాలోని రైతాంగానికి గరిష్టస్థాయిలో సాగునీరు అందించాలన్నది ఉద్దేశం. వంశధార.. నాగావళి నదులను అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నీటి పారుదలశా ఖ మంత్రి దేవినేని ఉమ మరోమారు స్పష్టం చేయడంతో ఈ ప్రక్రియకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్ప ష్టమవుతోంది. వంశధార నదిపై హిరమండలం వద్ద గొట్టాబ్యారేజీ ద్వారా సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీ రు అందుతోంది. దీనిని మరింత విస్తరించాలన్న ఆలోచనతో వంశధారపై నేరడి వద్ద బ్యారేజి నిర్మించి హిరమండలంవద్ద నూతనంగా నిర్మించిన భారీ జలాశయానికి కాలువ ద్వారా నీటిని మళ్లించాలన్నది ఉద్దేశం. ఒడిశా ప్రభుత్వ అభ్యంతరాలతో జాప్యం జరిగిన ఈ ప్రాజెక్టు పరిధిలోని సైడ్‌వీయర్‌ మళ్లింపు కాల్వ ద్వారా నది నీటిని మళ్లించేందుకు సుప్రీంకోర్టు ట్రిబ్యునల్‌ అనుమతులిచ్చింది. దీనికి కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు కూడా లభించాయి. అయితే మరిన్ని అనుమతులు రావాల్సి ఉండటంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం కారణంగా అంచనాలు పెరిగాయి. కొత్త అంచనాలు లేదా కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం పనులు అప్పగించాలి. కొత్త కాంట్రాక్టరా లేక పాత కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉండగా హిరమండలం వద్ద 9 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమైన ఈ జలాశయం నిండితే లక్షల ఎకరాలకు సాగునీ రు అందించే వీలుంది. దీనికి తోడు ఎత్తులో ఉన్న కారణంగా జిల్లాలోని చివరి మండలం ఇచ్ఛాపురం వరకు సాగునీటిని అందించే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. నాగావళి నదిపై గతంలో ఆనకట్ట మాత్రమే ఉండేది. ఇప్పుడు జలాశయం నిర్మితమైంది. దీంతో ఈ నదిలో నీటి ప్రవాహ సామర్ధ్యం తగ్గింది.
 
జిల్లాలోని బూర్జ మండలంలో ఇదే నదిపై నారాయణపురం ఆనకట్ట ఉంది. దీని ద్వారా 80వేల ఎకరాలకు సాగునీరందుతోంది. అయితే తోటపల్లి వద్ద జలాశయం నిర్మితమైన తరువాత నారాయణపురం ఆనకట్ట ఆయకట్టుకు నీరు పుష్కలంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి. దీంతో ఈ ఆనకట్ట పరిధిలోని చివరి దశ ఆయకట్టుకు సాగునీటిని అందించలేదని పరిస్థితి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వంశధార, నాగావళి నదులను అనుసంధానించడం ద్వారా నదుల్లో ప్రవహించే నీటి హెచ్చు తగ్గులను నివారించి, రెండు సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు ఇబ్బందులు లేకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఒక నదిలో నీరు తక్కువగా ఉంటే మరో నదినీటిని మళ్లించుకునే వెసుల బాటు ఉండేలా వీటి నిర్మాణం జరపాలన్నది ప్రతిపాదన. రెండు నదులను అనుసంధానించేందుకు వీలుగా ఇదివరకే నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయడుతో కలిసి ప్రాజెక్టులు, నదుల పరిశీలన చేశారు. అప్పట్లోనే నదుల అనుసంధాన ప్రక్రియ ఆలోచన జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను నీటి పారుదల ఇంజినీరింగ్‌ విభాగం ప్రభుత్వానికి పంపించింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే జిల్లాలో సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలగిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనికితోడు తాజాగా నదుల అనుసంధాన ప్రక్రియ కోసం ఆ శాఖ మంత్రి దేవినేని ఉమ ప్రస్తావించడంతో ప్రభుత్వం నదుల అనుసంధానంపై దృష్టి కేంద్రీకరించిందని స్పష్టమవుతోంది. త్వరగా ఈ ప్రక్రియకు రూపకల్పన జరిగితే జిల్లాలో ఇక జలకళ సంతరించుకోనుంది.
Link to comment
Share on other sites

swas bro ,హిరమండలం-ఇచ్చాపురం హైలెవల్‌ కెనాల్‌

శ్రీకాకుళం జిల్లా హిరమండలం నుంచి మహీంద్ర తనయ ద్వారా ఇచ్చాపురం వరకు హైలెవల్‌ కెనాల్‌ను తవ్వేందుకు జల వనరుల శాఖ సిద్ధమైంది. దీనికిగాను డీపీఆర్‌లను సిద్ధం చేస్తోంది.

:shakehands:  :cheers:

Link to comment
Share on other sites

'పోలవరంపై సుప్రీంకోర్టు, గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు జగన్‌ మనుషులే'
 
636041185730120454.jpg
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు, గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు జగన్‌ మనుషులే వెళ్లారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. జగన్‌ సొంత జిల్లా కడపకు సాగునీటిని రాకుండా అడ్డుకుంటున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మే నెలాఖరు నాటికి వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని దేవినేని తెలిపారు. నాగావళి, వంశధార నదుల అనుసంధానం పనులు వేగవంతం చేశామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రకటించారు.

:super:

Link to comment
Share on other sites

తోటపల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీరు విడుదల
 
విజయనగరం: సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీటిని విడుదల చేశారు. మంత్రులు దేవినేని ఉమ, మృణాళిని, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు చిరంజీవులు, సుజయ్‌ కృష్ణ, ఎమ్మెల్సీలు జగదీష్‌, సంధ్యారాణి, పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని నీటిని విడుదల చేశారు.
Link to comment
Share on other sites

ఉత్తరాంధ్రకు గోదారి జలాలు
 
636041376716645601.jpg
  • మే నాటికి వంశధార, నాగావళి అనుసంధానం
  • ప్రతి ఎకరాకూ నీరు
  • గత పాలకులది ధనయజ్ఞం
  • అభివృద్ధికి జగన అడ్డు
  • మంత్రులు దేవినేని, మృణాళిని,అచ్చెన్న
  • తోటపల్లి నుంచి నీరు విడుదల
పార్వతీపురం, జూలై 14: పోలవరం ఎడమ కాల్వ ద్వారా నాలుగు వేల క్యూసెక్కుల గోదావరి జలాలను విశాఖకు పంపించి ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. గురువారం విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో తోటపల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాల నూతన ఆయకట్టుకు ఆయన నీరు విడుదలచేశారు. అనంతరం జరిగిన సమావేశంలో దేవినేని మాట్లాడారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని చెప్పారు.
 
పోలవరాన్ని అడ్డుకొనేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయినా పోలవరాన్ని నిర్మించి తీరుతామని స్పష్టంచేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ. 1.30 లక్షలు ఇస్తే, సీఎం చంద్రబాబునాయుడు రూ.10.50 లక్షలు ఇస్తున్నారని గుర్తుచేశారు. గత పాలకులు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని ఆరోపించారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు నిర్వాసితులు సహకరిస్తున్నారని, దీనిని చూసి జగన్‌ ఓర్వలేకపోతున్నారన్నారు. పట్టిసీమను అడ్డుకోవాలని జగన్‌ అడుగడుగునా ప్రయత్నిస్తే దానిని తాము తిప్పికొట్టి ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. తమిళనాడు, బెంగళూరులో ఏ భవనం కూలినా, ఏ ప్రమాదం జరిగినా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన తమ్ముడో, చెల్లో, అక్కో ఉంటున్నారని.. ఇది చాలా బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. వెనుకబడిన ఈ రెండు జిల్లాల్లో ప్రతి ఎకరాకూ నీరందించేందుకు వంశధార, నాగావళి నదుల అనుసంధాన ప్రక్రియను 2017 మే 31 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వంశధారను పూర్తిచేసేందుకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కోసం రూ.424 కోట్లు, పనుల కోసం రూ.350 కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. గృహ నిర్మాణశాఖ మంత్రి మృణాళిని మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కె.రామ్మోహననాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
 
Main canal ni 300 small canals ki interlinked whenever water comes all 300 canals will get filled pakka planning tho unaru

Inka river interlinking kuda ayithe water resources will grow

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 10 months later...
ఏడాదిలోగా చారిత్రక ఘట్టం!
 
636355981747456957.jpg
  • వంశధార-నాగావళి అనుసంధానం పనులు షురూ
  • టెండర్లు పూర్తి... రూ.70కోట్ల ప్రాజెక్టు వెంకటరమణయ్య కంపెనీకే
  • హిరమండలం రిజర్వాయర్‌ నుంచి నారాయణపురం వరకు హైలెవెల్‌ కెనాల్‌
  • 650 క్యుసెక్కుల ప్రవాహం తట్టుకునేలా 33కి.మీ మేర నిర్మాణం
  • సీఎం నిరంతర పర్యవేక్షణతో అధికారులు ఉరుకులు పరుగులు
 
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించిన ప్రభుత్వం వచ్చే ఏడాదిలోగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార-నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేయడానికి యుద్ధప్రాతిపదికన అడుగులు వేస్తోంది. నిత్యం నీటి ప్రవాహం ఉండే వంశధార నది నీటిని నాగావళికి మళ్లించడం ద్వారా వేలాది ఎకరాల ఆయకట్టు భూములకు నీటి స్థిరీకరణ జరగబోతోంది. ఈరెండు నదులను హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా కలపడానికి డిజైన్లు పూర్తికాగా, తాజాగా టెండర్లప్రక్రియ కూడా ముగిసింది. రూ.70కోట్ల వ్యయం కానున్న ఈ ప్రాజెక్టును నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట రమణయ్య అండ్‌ కంపెనీ దక్కించుకుంది.
 
రెండే ళ్లనాడే బీజం...
వ్యవసాయానికి ప్రయోజనం చేకూర్చాల్సిన నీరు సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో... 2015 మే 6న ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వంశధార-నాగావళి నదుల అనుసంధానంపై దృష్టిసారించాలని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నాగావళి నదిలో ఏడాది పొడవునా నీటి లభ్యత తక్కువ. దీనికి ఎగువన ఉన్న తోటపల్లి జలాశయంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఖరీఫ్‌ సాగు అవసరాలకు పెద్ద ఎత్తున నీటినిల్వ చేస్తుంటారు. తద్వారా దిగువనున్న వేలాది ఎకరాలకు రబీకీ నీటి లభ్యత ఉండడం లేదు. అటు వంశధార నదిలో నీటి ప్రవాహం అధికం. పైగా ఎగువన ఒడిశాలో ఈ నదిపై ప్రాజెక్టులు కూడా చాలా తక్కువ కావడంతో వేల క్యుసెక్కుల నీరు ఏటా సముద్రంలో కలిసిపోతోంది. ఈనేపథ్యంలో పుష్కల నీటి వనరులున్న వంశధార నీటిని నాగావళికి మళ్ల్లిస్తే వేలాది ఎకరాల ఆయకట్టుకు నీటి స్థిరీకరణ జరుగుతుందని అధికారులు కూడా తేల్చడంతో అనుసంధానం ప్రాజెక్టు పనులు పట్టాలకెక్కించాలని సీఎం అప్పట్లోనే ఆదేశించారు. ఈనేపథ్యంలో గతేడాది పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనుసంధాన ప్రక్రియలో భాగంగా వంశధార నది ఆధారంగా కొత్తగా నిర్మిస్తున్న హిరమండలం రిజర్వాయర్‌ నుంచి నాగావళిపై ఆధారపడ్డ నారాయణపురం ఆనకట్ట వరకు మధ్యలో 33కిలోమీటర్ల మేర హైలెవెల్‌ కెనాల్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. దీనిద్వారా వంశధారకు నీటి ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో ఈ హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా నాగావళికి నీటిని మళ్లించాలనేది ఆలోచన. ప్రతిపాదిత హైలెవెల్‌ కాల్వ స్థానంలో ఇప్పటికే చిన్న కాల్వ ఒకటి ఉంది. ఇదికూడా కొంచెం దూరమే. దీనిద్వారా ప్రస్తుతం 5 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిస్తున్నారు. అయితే నదుల అనుసంధానంలో భాగంగా ఈ హైలెవెల్‌ కెనాల్‌ను 650 క్యుసెక్కుల నీటి ప్రవాహం సైతం తట్టుకునేలా నిర్మించాలని ఇంజనీర్లు డిజైన్లు రూపొందించరు. ఈ అనుసంధానం వల్ల నారాయణపురంపై ఆధారపడ్డ 37,053ఎకరాల ఆయకట్టుకు ఽస్ధిరీకరణ కల్పిచడంతోపాటు తోటపల్లి ప్రాజెక్టు ఒత్తిడి కూడా తగ్గనుంది.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...

మార్చి నాటికి వంశధార- నాగావళి నదుల అనుసంధానం

జలవనరులశాఖ మంత్రి ఓఎస్‌డీ కె.రాజేంద్రప్రసాద్‌

skl-gen7a.jpg

హిరమండలం, న్యూస్‌టుడే : 2018 మార్చి నాటికి వంశధార-నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జలవనరుల శాఖ మంత్రి ఓఎస్‌డీ (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ) కె.రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన వంశధార జలాశయం పనులను పరిశీలించారు. అనంతరం వంశధార అతిథి గృహంలో ఇంజినీర్లతో పనుల ప్రగతిపై సమీక్షించారు. జలవనరుల మంత్రి ఆదేశాల మేరకు భామిని, కొత్తూరు మండలాల్లో 87, 88 ప్యాకేజీల పనులను పరిశీలించనట్లు తెలిపారు. పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని, వర్షాలు కారణంగా కాస్త మందగించాయని అధికారులు ఓఎస్‌డీకి తెలిపారు. అనంతరం ఓఎస్‌డీ విలేకరులతో మాట్లాడుతూ జనవరి 5న ముఖ్యమంత్రి జలాశయాన్ని ప్రారంభిస్తారని, అప్పటికి జలాశయంలో 8టిఎంసీల నీటిని నింపుతామని, అనంతరం మార్చి నాటికి 19టిఎంసీలు నీటి నిల్వచేసి హైలెవెల్‌ కాలువ ద్వారా నాగావళి నదికి అనుసంధానిస్తామని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభమైన తొలిఏడాది జలాశయంలో నీటిని నింపి క్రమేపీ నిల్వలు పెంచుతామని పేర్కొన్నారు. నిర్వాసిత గ్రామాల నుంచి పనులకు ఆటంకం లేదన్నారు. ఈకార్యక్రమంలో వంశధార కన్స్‌స్ట్రక్షన్‌ ఈఈ ఎంఏ సీతారామనాయుడు, ఈఈ అప్పలనాయుడు, డిఈఈలు, ఏఈలు ఉన్నారు.

Link to comment
Share on other sites

  • 4 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...