sonykongara Posted February 9, 2017 Author Posted February 9, 2017 ఖర్చు రహిత ప్రకృతి సేద్యం! 5 లక్షల మంది రైతులకు అవగాహన విప్రోతో ప్రభుత్వం ఒప్పందం తాడికొండ, ఆగస్టు 8: రాష్ట్రంలో ఖర్చు రహిత ప్రకృతి సేద్యంపై రైతులకు అవగాహన కల్పించేందుకు విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్‌జీ ఫిలాంత్రోఫిక్ ఇనీషియుటీవ్స్(ఏపీపీఐ)తో వ్యవసాయశాఖ, రైతుసాధికార సంస్ధ ఒప్పందం చేసుకున్నాయి. గుంటూరులో బుధవారం మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్‌కుమార్ సమక్షంలో ఏపీపీఐ సీఈవో అనంత పద్మనాభన, ఎండీ అన్వర్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ.రాజశేఖర్, రైతు సాధికార సంస్ధ సీఈవో కే మధుసూదనరావు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో 5 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి, 5 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు చేపడతామని చెప్పారు. దీనికి ప్రభుత్వం రూ.600 కోట్లు, ఏపీపీఐ రూ.100 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రకృతి, సేంద్రి య వ్యవసాయంపై సీఎం చంద్రబాబు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారన్నారు. మంత్రి కిశోర్‌బాబు మాట్లాడుతూ, రసాయనాలవల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నందున సేంద్రి య సాగును ఉద్యమంగా చేపడతామన్నారు
sonykongara Posted March 10, 2017 Author Posted March 10, 2017 సేంద్రియ సాగుకు ప్రత్యేక కేటాయింపులు అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): రసాయనిక ఎరువులు, పురుగుమందులకు చెక్ పెట్టి, సహజసిద్ధమైన సాగు పద్ధతులు అవలంబించే లా రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 2017-18 వ్యవసాయ బడ్జెట్‌లో ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేక కేటాయింపులు జరపనుంది. వచ్చే మూడేళ్లలో 5 లక్షల మందిని సేంద్రియ సాగుకు మళ్లించాలని భావిస్తోంది. ముఖ్యంగా కూరగాయల రైతులను ఎంపిక చేయనుంది. రాష్ట్రంలో రైతులు అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగులు మందులు వాడుతున్నారని పలు నివేదకలు పేర్కొన్నాయి. మితిమీరిన రసాయనాలు వాడటం వల్ల పంటలు విషపూరితంగా మారిపోతున్నాయి. వాటిని తిన్న జనం ఆ తర్వాత జబ్బుల బారినపడడం ఆందోళన కలిగిస్తోంది. ఎరువుల అధిక వాడకంతో పంట భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. దీని తో అన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చుపెట్టినా ప్రయోజనం ఉండడం లేదు. దీనితో ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన పోషకాలతో కూడిన పంటల దిగుబడిపై దృష్టిసారించింది. బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు తెలిసింది. సేంద్రియ పంటలు ప్రజల జీవన ప్రమాణాలను కూడా పెంచేందుకు దోహదపడతాయి. ప్రభుత్వ ఆలోచన కార్పొరేట్ వర్గాలనూ ఆకర్షిస్తోంది. జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం విప్రో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్వాక్రా గ్రూపుల తరహాలో వచ్చే 8 నెలల్లో దాదాపు 30 వేల గ్రూపులను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందిస్తోంది. అలాగే నాబార్డ్ లాంటి సంస్థల సహకారంతో చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. సేంద్రియ వ్యవసాయ విధానంపై ఇప్పటికే సుభాష్ పాలేకర్ వంటి నిపుణులతో రైతులకు శిక్షణ ఇప్పించింది.
TDPforever Posted April 17, 2017 Posted April 17, 2017 two lakhs per acre in jasmine crop is impressive.
sskmaestro Posted April 17, 2017 Posted April 17, 2017 Enni anna cheppandi middle men unnantha varaku agriculture chesey vyakti srama ki 100% nyayam undadu
Nandamurian Posted April 21, 2017 Posted April 21, 2017 Very good post by sonykongara...oopika ki mechkovali antha data sekarnchi malli ikkada veyydam...appdpdu anipistundi very good forum to discuss some good and bad issues.
Nandamurian Posted April 21, 2017 Posted April 21, 2017 Enni anna cheppandi middle men unnantha varaku agriculture chesey vyakti srama ki 100% nyayam undadu ageed annia...veeti tho paaptu water is the main sourceee
sskmaestro Posted April 22, 2017 Posted April 22, 2017 ageed annia...veeti tho paaptu water is the main sourceeeWater edo rakam fa techukuntunnaru bro... tankers or motors or bores etc etc.... I mean raithu avasaram aithe okati leka rendu tadulaki kharchu chestunnaru..... but they are unable to fetch the prices they deserve! Ala ani end consumer ki velley product value ekkada taggatledu....
sonykongara Posted May 10, 2017 Author Posted May 10, 2017 ప్రకృతి వ్యవసాయమే పరమౌషధం సేద్యమూ కళాత్మక అంశం కావాలి యోగాతో రైతుల ఆత్మహత్యల నివారణ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ వెల్లడి సేంద్రియ సాగుపై కీలక సదస్సు ఈనాడు, బెంగళూరు: భారతదేశంలో సేద్యమూ ఓ కళాత్మక అంశంగా పరివర్తన చెందాలని, శాస్త్రీయ అంశాలు మేళవించి మానవ జీవన పథానికి చక్కని బలంగా రూపొందాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ఆకాంక్షించారు. ప్రకృతి వ్యవసాయాన్ని మించిన దివ్య విప్లవం ఇంకేదీ ఉండదని పేర్కొన్నారు. బెంగళూరు శివార్లలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో మంగళవారం ఉదయం ప్రకృతి సేద్యంపై ప్రత్యేక సదస్సు ప్రారంభమైంది. శ్రీశ్రీ రవిశంకర్ సదస్సును ప్రారంభించి కీలకోపన్యాసమిచ్చారు. భారతీయ సమాజంలో రైతులు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు ప్రకృతి వ్యవసాయానికి మించిన పరిష్కార మార్గమేదీ లేదని తేల్చి చెప్పారు. రైతుల్లో ఆత్మహత్యల నైరాశ్యాన్ని పారదోలేందుకు యోగా, ఆధ్యాత్మిక మార్గాలను ఎంచుకునేలా చేస్తే చక్కని ఫలితం ఉంటుందని ఉద్బోధించారు. ‘గతంలో 250 గ్రాముల వరి విత్తనాలతో క్వింటాలు ధాన్యం అందివచ్చేది. నేడు ఆ పరిస్థితి ఏదీ? ఆ రకం గింజలు ఏమయ్యాయి? ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో వివిధ సందర్భాల్లో మాట్లాడినప్పుడు..... సంప్రదాయం నుంచి సేంద్రీయం వైపు రైతులను మళ్లించడానికి శ్రమిస్తున్నట్లు వారు నాతో చెప్పారు’ అని వివరించారు. ‘సేంద్రీయ సాగు విధానాలతో గుజరాత్‌లో గోధుమలు పండించడంలో మేం విజయం సాధించాం. వరి, గోధుమే కాదు.. కంది, పప్పు దినుసులు, చిరు ధాన్యాల ఉత్పత్తి ఎన్నడూ నష్టదాయకం కాదు’ అని తెలిపారు. లక్ష్యం దిశగా ఆంధ్రప్రదేశ్ 60 లక్షల మంది రైతులను ప్రకృతి సేద్యం దిశగా మళ్లించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ నష్టాల నివారణలో భాగంగా పెట్టుబడి అవసరంలేని సహజ సేద్యం (జెడ్.బి.ఎన్.ఎఫ్.) విధానాన్ని 13 జిల్లాల్లో ఎంపిక చేసిన 130 క్లస్టర్లలో అమలు చేస్తున్నామని చెప్పారు.
sonykongara Posted May 15, 2017 Author Posted May 15, 2017 ప్రకృతి సాగు.. ఆదాయం బాగు ఒక్క రూపాయి ఖర్చులేకుండా అధిక దిగుబడులు ‘జీవామృతం’తో ఇది సాధ్యం రైతుల ఆత్మహత్యలూ నివారించొచ్చు ప్రధాని మోదీ లక్ష్య సాధనకు ఇదే ఏకైక మార్గం ‘ఈనాడు’తో వ్యవసాయ రంగ నిపుణుడు సుభాష్ పాలేకర్ లక్షలాది మంది ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని వెల్లడి ఈనాడు - హైదరాబాద్ వ్యవసాయంలో పెట్టుబడి పెరిగి పంటలకు గిట్టుబాటు ధర రాక ఓ వైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరోవైపు రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలతో వ్యవసాయ ఉత్పత్తులు విషతుల్యంగా మారి ప్రజారోగ్యం దెబ్బతింటోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రకృతి సిద్ధంగా సాగు చేయడం ద్వారా రెట్టింపునకుపైగా దిగుబడి సాధించడమేకాకుండా పంటలకు అధిక ధర కూడా పొందొచ్చని వ్యవసాయ రంగ నిపుణుడు, పద్మశ్రీ గ్రహీత సుభాష్ పాలేకర్ నిరూపిస్తున్నారు. ఖర్చులేని ప్రకృతి వ్యవసాయ (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) విధానాలపై పరిశోధనలు చేసి లక్షలాది మంది యువరైతులకు శిక్షణ ఇచ్చి ఆ విధానాలు ఆచరించేలా చేస్తున్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని చిన జీయర్‌స్వామి ఆశ్రమంలో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ఆ వివరాలు.. ఖర్చులేని ప్రకృతి వ్యవసాయ విధానమంటే ఏమిటి? దీంతో రైతులకు ఎలా లాభం చేకూరుతుంది? ఈ విధానంలో ఎరువులు, క్రిమిసంహారకాల వినియోగం ఉండదు. అదేసమయంలో వర్మీకంపోస్ట్ తదితరాలతో అసలు పనే ఉండదు. ప్రకృతి సిద్ధంగా మేము రూపొందించిన జీవామృతం వినియోగించి సాగు చేయొచ్చు. మార్కెట్ నుంచి ఏమీ కొనాల్సిన పని ఉండదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. పైగా పది శాతం నీరు మాత్రమే అవసరమవుతుంది. గాలిలో ఉండే తేమలోని 90 శాతం నీరు ఈ సాగు పద్ధతిలో ఉపయోగపడుతుంది. విద్యుత్తు వినియోగం కూడా 10 శాతానికి మించి ఉండదు. దిగుబడులు రెట్టింపునకు పైగానే వస్తున్నాయి. ఈ పద్ధతిని అనుసరిస్తే ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి రాదు. లక్షలాది మంది ఇలా సాగు చేసి లాభపడుతున్నారు. ప్రజలు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను కొంటున్నారు. సేంద్రియ సాగు మంచిది కాదంటారా? సేంద్రియ సాగు ఒక మోసం(ఫ్రాడ్). సేంద్రియ సాగుకు వెళ్లాలంటే రైతులు నాలుగు రెట్ల వరకూ అధికంగా పెట్టుబడులు పెట్టాలి. దీంతో నష్టపోతారు. ఇది మన దేశ వ్యవసాయ పద్ధతి కాదు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన తరవాత పంట అవశేషాలను తగలబెడతారు. దీంతో వాతావరణం దెబ్బతింటుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ వినాశనం ఉండదు. యువ రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? యువ రైతులు బాగా స్పందిస్తున్నారు. ఇక్కడికి శిక్షణ కోసం వచ్చిన 3 వేల మందిలో 99 శాతం మంది యువకులే. వీరిలో 500 మందికిపైగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు. ఎకరం భూమి ఉండి.. నీటి వనరులు ఉంటే ప్రకృతి సాగు విధానం ద్వారా ఏటా రూ.12 లక్షల దాకానూ సంపాదించొచ్చు. కనీసం రూ.6 లక్షలు వచ్చినా నెలకి రూ.50 వేలు వచ్చినట్లే కదా. అందుకే యువత ఆకర్షితులవుతున్నారు. తమ ఉద్యోగాలు వదులుకొని వచ్చి మరీ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.. అందుకు ఖర్చులేని ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గం. విజయగాథలు ఏమైనా ఉన్నాయా..? అనేకం ఉన్నాయి. చాలా మంది రైతులు వచ్చి తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ పద్ధతిలో సాగు చేసిన మామిడి పండ్లు కిలో రూ.75కి అమ్ముతున్నారు. అనంతపురం జిల్లాలోని కరవు పీడిత ప్రాంతాల్లో మంచి ఫలితాలు వచ్చాయని ఏపీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ ఈ శిక్షణకు వచ్చి నిర్ధారించారు. దేశ భవిష్యత్తు అవసరాలకు ఇదే ప్రత్యామ్నాయమని ఎలా చెబుతారు? ప్రస్తుతం దేశంలో 26 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2050 నాటికి ఇది 50 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరాలని ప్రధాని మోదీ చెప్పారు. రైతుల ఆదాయం కూడా రెట్టింపు అయ్యేలా చూడాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ లక్ష్య సాధనకు మీవద్ద ఏమైనా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంగానీ, పరిశోధనగానీ ఉందా? అని హరిత విప్లవానికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న పంజాబ్ వ్యవసాయ వర్సిటీ వీసీ, శాస్త్రవేత్తలు, నిపుణులను ఇటీవల అడిగితే.. వారు లేదనే సమాధానం చెప్పారు. ప్రధాని మోదీ లక్ష్యం నెరవేరాలంటే ఖర్చులేని ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం. ఇందులోనే రెట్టింపు దిగుబడులు, ఆదాయం సమకూరుతాయని నిరూపించి చూపుతున్నాం. ఇప్పటికే దేశంలో వ్యవసాయ భూములన్నీ రసాయనాలతో నిండిపోయి ఉన్నాయి. మీ పద్ధతిని అనుసరించి ప్రక్షాళన చేయడం సాధ్యమేనా? కచ్చితంగా సాధ్యమే. మేము రూపొందించిన జీవామృతం వాడితే మూడు నెలల్లో తేడా కనిపిస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఈ జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో మేము నేర్పిస్తున్నాం. ప్రభుత్వాల సహకారం ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ విధానాన్ని రైతులకు తెలియజెప్పి అమలు చేసేలా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలూ సహకారం అందిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన పంటల దిగుబడులకు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? నాగ్‌పుర్‌లో ప్రత్యేక స్టోర్లు ఉన్నాయి. ఇక్కడ మంచి ధరకి రైతులు అమ్ముకుంటున్నారు. ఇక సామాజిక మాధ్యమాల ద్వారా రైతులు నేరుగా వినియోగదారలకు అమ్ముకునే పద్ధతిని ప్రోత్సహిస్తున్నాం. ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తేనే అధిక దిగుబడులు వస్తాయన్న అభిప్రాయం ఉంది కదా..? ఎరువులు, పురుగుమందులు, హైబ్రిడ్ విత్తనాలను ఉపయోగించి సాధించిన ఉత్పత్తి కంటే ప్రకృతిసిద్ధంగా మా విధానంలోనే దిగుబడులు ఎక్కువగా వస్తున్నట్లు నిరూపించాం. దాదాపు 50 లక్షల మంది దీన్ని నమ్మి వ్యవసాయం చేస్తున్నారు. సాధారణ సాగు పద్ధతిలో ఎకరానికి 12 క్వింటాళ్ల బాస్మతి ధాన్యం దిగుబడి మాత్రమే వస్తుంది. ఖర్చు లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో డెహ్రాడూన్‌లో రైతులు 24 క్వింటాళ్లు పండిస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 12 క్వింటాళ్ల గోధుమలు పండుతాయి. కానీ, మా పద్ధతి అనుసరించిన వారికి 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. స్థానిక విత్తనాలను వినియోగించుకుంటూ హైబ్రిడ్ కన్నా 50-100 శాతం అధిక దిగుబడి పొందుతున్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now