Jump to content

Prakruthi vyavasayam


Recommended Posts

  • Replies 351
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Very good post by sonykongara...oopika ki mechkovali antha data sekarnchi malli ikkada veyydam...appdpdu anipistundi very good forum to discuss some good and bad issues.

 

sony bro really rocks !! 

 

especially in digging back the old posts and to continue the history of the issue (besides continually gathering valuable info for us) !! 

 

he found the best medicine for our short memories !! that medicine is much much needed for all of us !! 

 

kudos sony bro !! 

Link to comment
Share on other sites

ప్రకృతి వ్యవసాయంపై 11నుంచి శిక్షణ
 
హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రైతులకు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు 11 నుంచి 14 వరకు నాలుగు రోజులపాటు తిరుపతిలో ఈ తరగతులు జరుగుతాయి. సుభాష్‌ పాలేకర్‌ నేతృత్వంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు ఎక్స్‌అఫీషియో కార్యదర్శి చిరంజీవి చౌదరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Link to comment
Share on other sites

నెల్లూరు వ్యవసాయం... చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం!
 
 
635940752992337995.jpg
అదో కుగ్రామం... ఎటుచూసినా పచ్చని పంటపొలాలు కనువిందు చేస్తాయి. కాని ఎక్కడా బోర్లు, కాలువలు, వాగులు వంటివేవీ కనిపించవు. పైపెచ్చు ఒక్క బొట్టు నీటిని కూడా వినియోగించకుండా వాళ్లు పంటలు పండిస్తున్న విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోయి తీరాల్సిందే. అర్ధ శతాబ్ధకాలంగా సిరిమంచుతో వారు వేరుశెనగ సిరులు పండిస్తున్న తీరు అబ్బురపరుస్తుంది. బహుశా ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి సేద్యం లేకపోవచ్చు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వడ్డికండ్రిగలో నడుస్తున్న వినూత్న సేద్యం ఇది.
 

గూడూరుకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉందీ వడ్డికండ్రిగ. ఇక్కడ రెండు వందల కుటుంబాలు అనాదిగా నివాసం ఉంటున్నాయి. ఈ ఊరిలో ముత్యాలమ్మ చెరువు, పాతాల చెరువు, అంకమ్మ చెరువు ఉన్నాయి. అయితే అన్నీ చిన్నచిన్నవి కావడంతో, వాటి కింద నాలుగు వందల ఎకరాల భూముల్లోనే వరిసాగు చేస్తూ ఉండేవారు. వర్షాలు కురవక చెరువులు నిండకుంటే, ఆ ఏడాది పంటలు పండేవి కాదు. ఊరి చుట్టూ ఇసుక నేలలు. చుట్టుపక్కల గ్రామాల్లోని ఇసుక నేలల్లో బోర్లు వేస్తే తియ్యటి నీరు పడుతుంది కానీ... ఈ ఊరి నేలల్లో మాత్రం ఉప్పునీరు పడుతుంది. ఆ నీటితో పంటలు పండించలేరు. అందుకే యాభై ఏళ్ల కిందటి వరకూ మాగాణి భూముల్లో మాత్రమే పంటలు పండించేవారు.. అదీ చెరువులు నిండితేనే. చెరువులు నిండకుంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. తినడానికి కూడా ధాన్యం కొనుక్కోవాల్సి వచ్చేది. పొరుగు ఊళ్లల్లోని బంధువుల ఇళ్లకి వెళ్లి ధాన్యం బదులు తెచ్చుకునేవారు. పంటలు పండితే, బదుళ్లు తీరుస్తూ ఉండేవారు. అప్పట్లో కూలిపనులు కూడా పెద్దగా ఉండేవి కావు. దాంతో కడుపు నింపుకోవడానికి శతకోటి కష్టాలు తప్పేవి కావు.

 
అనుభవ పాఠం... ఆలోచన మంత్రం ...

యాభై ఏళ్ల కిందట... ‘వడ్డికండ్రిగ’ ఊరి పెద్దలకి ఓ ఆలోచన వచ్చింది. పదిహేను కిలోమీటర్ల దూరంలోనే సముద్రం ఉండటం వల్ల శీతాకాలం సిరిమంచు (దీన్ని పొగమంచు అని కూడా అంటారు) విపరీతంగా కురుస్తుంది. ఓ నెలరోజులు పాటు, ఎదుటి మనిషి కూడా కనిపించినంత మంచు పడుతుంది. ఆ మంచు మొక్కలపై నుంచి నీటి చుక్కల్లా జారిపడుతూ ఉంటుంది. శీతాకాలానికి ముందే.. ఏదైనా పంట వేస్తే పండుతుందేమోనని ఆలోచన చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రకం పంట వేశారు. వేరుశెనగ పంట బాగా పండటం గమనించారు. అంతే... అప్పటి నుంచి ఊరు ఊరంతా వేరుశెనగ పంట వేయడం మొదలెట్టారు. ఆ ఒక్క ఆలోచన ఆ ఊరి ఆర్థిక స్థితిగతుల్ని మార్చేసింది.

 
వర్షమొస్తేనే ఇబ్బంది ...
ప్రతి రైతు వర్షం రావాలని కోరుకుంటాడు. కానీ ‘వడ్డికండ్రిగ’ రైతులు మాత్రం పంట వేసిన తర్వాత ‘వర్షం రాకుంటే బావుణ్ను’ అని దేవుణ్ణి వేడుకుంటారు. నెల్లూరు జిల్లాలో సాధారణంగా నవంబరు నెల చివరి వారంలో, డిసెంబరు నెల మొదటి, రెండు వారాల్లో వర్షాలు పడుతుంటాయి. వర్షం పడగానే రైతులు దుక్కిదున్ని వేరుశెనగ విత్తనాలు చల్లేస్తారు. దుక్కి సమయంలోనే కావాల్సిన ఎరువులు వేస్తారు. భూమిలోని నెమ్ముతోనే మొక్కలు మొలుస్తాయి. శీతాకాలంలో ప్రతిరోజూ మంచు పడుతుంది. కాబట్టి మంచు కరిగినపుడు ఆకులపై నుంచి నీరు ఒక్కొక్క బొట్టే డ్రిప్‌ ఇరిగేషన్‌లా మొక్క మొదట్లో పడుతుంది. అందువల్లే పగటి వేళల్లో ఎంత ఎండకాసినా వాళ్లకి ఇబ్బందే ఉండదు. అవసరాన్ని బట్టి ఒకటీ, రెండుసార్లు పురుగు మందు పిచికారీ చేస్తారంతే. మార్చి నెలాఖరు, ఏప్రిల్‌ నెల మొదటి వారంలోనే పంట చేతికొస్తుంది. జనవరి నెలలో భారీ వర్షాలు పడితే మాత్రం మొక్కలు పాచిపోయి పంట దెబ్బతింటుంది. అందుకే పంట వేసినప్పటి నుంచి, ఇక్కడి వారంతా వర్షం రావొద్దని కోరుకుంటారు. యాభై ఏళ్లకాలంలో నాలుగైదుసార్లు మాత్రమే వర్షాల వల్ల పెట్టుబడులు పొందలేకపోయామని రైతులు చెప్పారు.
 

‘‘దీన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయమనొచ్చు. వేరుశెనగ తరహాలోనే పెసర, మినుము, జొన్న, సజ్జ వంటి పంటలూ పండించవచ్చు. ఇటీవల కాలంలో నీటి వినియోగం ఎక్కువగా లేని సాగుపై మేము కూడా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాం. వృధాగా ఉండే భూముల్లో ఇలాంటి సాగు చేపట్టి, రైతులు ఎక్కువ ఆదాయాలు పొందే వీలుంది’’ అని వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ హేమమహేశ్వరరావు అన్నారు. ఈ వినూత్న సేద్యంలో రైతులు ఎకరాకి ముప్పై ఎనిమిది బస్తాల వరకు దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరాపై 35 వేల వరకూ ఆదాయం పొందుతున్నారు. అందుకే బ్యాంకులు కూడా విజయమాల్యా లాంటి వాళ్లకు కాకుండా దేశానికి వెన్నెముక అయిన రైతులకు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరుకుందాం.

Link to comment
Share on other sites

పల్లెకు రండి.. యువతకు సుభాష్‌ పాలేకర్‌ పిలుపు
 
636092396825500013.jpg
  • తిరుపతిలో ప్రకృతి సాగుపై శిక్షణకు 300 మంది ఐటీ ఉద్యోగులు 

తిరుపతి, సెప్టెంబరు 11: వ్యసాయం దండగని ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన యువత తిరిగి పల్లెలకు రావాలని ప్రకృతి వ్యవసాయ సాధకుడు, పరిశోధకుడు పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ పిలుపునిచ్చారు. వ్యవసాయన్ని లాభాసాటిగా చేయడం మన చేతుల్లోనే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ రైతు శిక్షణ తరగతులను ఆదివారం ఆయన తిరుపతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలేకర్‌ మాట్లాడుతూ.. ఆత్మహత్యల నివారణకు పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడమే ఏకైక మార్గమని సూచించారు. రసాయనిక ఎరువుల వినిమయ వ్యవసాయ పద్ధతి కన్నా సేంద్రియ వ్యవసాయం మరింత ప్రమాదకరమైనదన్నారు. ప్రకృ తి వ్యవసాయమే దీనికి ఏకైక పరిష్కారమన్నారు. ఏపీ లో దేశంలోనే అత్యుత్తమైన ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయని, ఇలాంటి ఆవు ఒకటుంటే రూపాయి ఖర్చులేకుండా 30 ఎకరాల్లో సాగు చేయొచ్చన్నారు. దీనిని యువత సవాల్‌గా స్వీకరించి గ్రామాల బాట పట్టాలన్నారు. అనంతరం మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీ వ్యవసాయంలో రెండంకెల ఆర్థిక వృద్ధి సాధించే దిశగా సీఎం చంద్రబాబు సంస్కరణలు తెస్తున్నారన్నారు.

Link to comment
Share on other sites

5 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు : ప్రత్తిపాటి
 
తిరుపతి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటల సాగు చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై రైతు శిక్షణ తరగతులు బుధవారం ఇక్కడ ముగిశాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంటల సాగుపై ఆసక్తి చూపుతూ 13 జిల్లాల నుంచి 5723 మంది రైతులు హాజరవడం సంతోషంగా ఉందన్నారు. ఏపీలో రసాయనిక ఎరువుల పంటల సాగును పూర్తిగా నిషేధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుభా్‌షపాలేకర్‌ మంత్రికి సూచించారు. పెట్టుబడి లేని సేద్యంపై పార్లమెంటులో చర్చ జరిగేలా చూడాలని ఎంపీ శివప్రసాద్‌ను కోరారు. కార్యక్రమంలో మంత్రి బొజ్జల, ఎమ్మెల్సీ గౌనివారి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...