Jump to content

Amaravati heart project


Recommended Posts

V

నీరుకొండ వద్ద 108 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం 
నాలుగు ఆకృతులను పరిశీలించిన ముఖ్యమంత్రి 
తుది మెరుగులు దిద్దాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: రాజధానిలో 108 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నీరుకొండ వద్ద ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నాలుగు ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పరిశీలించారు. వాటికి మరింత మెరుగులు దిద్ది వచ్చే మంత్రివర్గం నాటికి ఆకృతులు సిద్ధం చేయాలని ఆదేశించారు. తొలుత కృష్ణా నది ఒడ్డున కోర్‌ క్యాపిటల్‌కు అభిముఖంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. తాజాగా ఆ ప్రాంతాన్ని మార్చి నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని తీర్మానించారు. విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉంటుంది. ఈ కొండపైనే ఎన్టీఆర్‌ స్మారక కేంద్రం, కన్వెన్షన్‌ కేంద్రాలు, గ్రంథాలయం, ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనశాల ఉంటాయి.


 

Link to comment
Share on other sites

Guest Urban Legend

http://www.andhrajyothy.com/artical?SID=531554

అమరావతిలో ‘అన్నగారి’ స్మారకం!
636533115954099245.jpg

  • 08 అడుగుల భారీ విగ్రహం
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): మహా నటుడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావుకు రాష్ట్ర ప్రభుత్వం అఖండ నీరాజనాలు సమర్పించనుంది. 108 అడుగుల ఎత్తుతో అన్నగారి దివ్యరూపాన్ని కళ్లెదుట నిలి పే విధంగా విగ్రహం రూపొందించనుంది. రాజధానికి దక్షిణం కొసన ఉన్న నీరుకొండ గ్రామంలోని కొండపై దాన్ని ఠీవిగా కొలువుదీర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్కడినుంచి అమరావతి మహానగరాన్ని ఎన్టీఆర్‌ వీక్షిస్తున్న రీతిలో రూపుదిద్దుకోబోయే ఈ స్మారకం కోసం జెనెసిస్‌ కంపెనీకి చెందిన నిపుణులు నాలుగు డిజైన్లను రూపొందించారు. సీఎం మరోసారి సవరించిన డిజైన్లు పరిశీలించి, ఒకదాన్ని ఎంపిక చేయనున్నారు.
 
మారేది పీఠం డిజైన్‌, పరిమాణమే
ఎన్టీఆర్‌ స్మారకం కోసం నాలుగు డిజైన్లను రూపొందించినప్పటికీ అన్నిట్లోనూ ఒకే తరహా విగ్రహమే ఉంటుంది. దిగువన ఉండే పీఠం మాత్రమే మారుతుంది. మన సంస్కృతిని ప్రతిబింబించడంతో పాటు ఎన్టీఆర్‌కు ఉన్న ఘనమైన ఇమేజ్‌ను తలపింపజేసేలా ఈ పీఠం కోసం వేర్వేరు డిజైన్లు రూపొందించారు. స్వాతిముత్యం (దీనికి సంబంధించి 2 డిజైన్లు), పరిక్రమ, కమలం ఆకారాల్లో ఈ పీఠం రూపుదిద్దుకోనుంది. మన పౌరాణిక గ్రంథాలు, ఆచార వ్యవహారాల్లో వాటికి ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా ప్రతిపాదించారు.
 
           పవిత్రతకు పర్యాయపదంగా భావించే స్వాతిముత్యం, సభక్తికంగా సమర్పించే ప్రదక్షణకు చిహ్నమైన పరిక్రమ, ఆధ్యాత్మిక భావనతో పాటు చలన చిత్రాల్లో ఎన్టీఆర్‌ పోషించిన పలు పౌరాణిక పాత్రలను తలపింపజేసేలా కమలాన్ని దీనికోసం పరిగణనలోకి తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్‌ స్మారకాన్ని కృష్ణానదీ తీరాన, అమరావతికి ఉత్తర భాగాన ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అన్నగారి విగ్రహాన్ని ప్రపంచంలోనే 4వ ఎత్తయినదిగా(324అడుగులు) రూపొందించాలనుకున్నారు. అయితే ఆ తర్వాత నీరుకొండ వద్ద ఉన్న కొండపై దీన్ని స్థాపించాలని నిర్ణయించారు. నిపుణుల సూచనల ప్రకారం విగ్రహం ఎత్తును 108అడుగులకు తగ్గించారు. అయితే పీఠం ఎత్తు, పరిమాణాన్ని మాత్రం గణనీయంగా పెంచారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 3 weeks later...
ఎన్టీఆర్‌ స్మారక చిహ్నానికి ఆరు ఆకృతులు
సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో ప్రజాభిప్రాయ సేకరణ
30ap-main2a.jpg

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని నీరుకొండ గ్రామంలో కొండపై ఏర్పాటుచేసే ఎన్టీఆర్‌ భారీ విగ్రహం, స్మారక చిహ్నం, మ్యూజియంకి సంబంధించి అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఆరు ఆకృతుల్ని సిద్ధం చేసింది. ఎన్‌సీసీ, జెనెసిస్‌, ఎల్‌ అండ్‌ టీ సంస్థలు వీటిని రూపొందించాయి.  సంబంధిత వీడియో చిత్రాలను ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) వెబ్‌సైట్‌లో ఉంచారు. నౌక(క్రూయిజ్‌), ఆల్చిప్ప(ఆయిస్టర్‌), ఆలయం, ఇహంపరం, వెండితెర, ఎన్టీఆర్‌ స్మారక సంబంధిత అంశాలతో ఈ ఆరు ఆకృతుల్ని రూపొందించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది ఏ ఆకృతి వైపు మొగ్గు చూపితే దాన్ని ఎంపిక చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

పర్యాటక ప్రచారంపై 10 ప్రతిపాదనలకు ఆమోదం.. రాష్ట్రంలో పర్యాటకంపై ప్రచారానికి పలు సంస్థలు సమర్పించిన ప్రతిపాదనల్లో పదింటికి రాష్ట్ర స్థాయి పర్యాటక మార్కెటింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రచారానికి వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మంత్రి భూమా అఖిలప్రియ కార్యాలయంలో బుధవారం కమిటీ పరిశీలించింది. ప్రతిపాదిత సంస్థలతో ఈ కమిటీ సమావేశమై.. ఒక్కో దానిపై ప్రత్యేకంగా చర్చించింది. అనంతరం పది ప్రతిపాదనలకు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఇందులో ఒకటి విమానాల్లో సీటు వెనకవైపు చిరు పుస్తకాలు(బుక్‌లెట్స్‌), ప్రచార చిత్రాలను ప్రదర్శించే ప్రతిపాదన ఉంది. ఈ కమిటీలో పర్యటక శాఖ కమిషనర్‌ హిమాన్షు శుక్లా, ఆర్థిక శాఖ ఉపకార్యదర్శి మల్లేశ్వరరావు, సాంస్కృతిక, సమాచార, పౌరసంబంధాల అధికారులు ఉన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...