sonykongara Posted June 11, 2017 Author Posted June 11, 2017 అమరవాతి నడిబొడ్డున ‘స్వరాజ్య మైదానం’ స్వరాజ్య మైదానాన్ని అభివృద్ధి చేస్తాం.. చైనా, న్యూయార్క్‌ల తరహాలో స్వ్కేర్‌లు 20 శాతంలోనే నిర్మాణాలు.. 80 శాతం ఆహ్లాదం కోసమే.. నగర కమిషనర్ నివాస్ ఆంధ్రజ్యోతి, విజయవాడ: ‘స్వరాజ్యమైదానాన్ని ఎవరికీ కట్టబెట్టడం లేదు. రాజధాని నడిబొడ్డున ఉన్న ఈ సువిశాలమైన స్ధలాన్ని ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం. అందులో చైనాలోని తియాన్మెన్ స్క్వేర్ తరహాలో స్థూపాన్ని నిర్మిస్తాం. న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్ తరహాలో ఒక బ్రహ్మాండమైన ఐకాన్ నిర్మిస్తాం. దాని చుట్టూ చక్కని గ్రీనరీ, ఫౌంటెన్లు, పార్కులు ఉంటాయి. స్వరాజ్య మైదాన్‌లోని 80శాతం స్థలాన్ని ఖాళీగా ఉంచి సుందరంగా తీర్చిదిద్దుతాం. మిగిలిన 20 శాతంలో మాత్రమే కమర్షియల్ నిర్మాణాలు ఉంటాయి’ నగర మునిసిపల్ కమిషనర్ జి.నివాస్ చెప్పారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వరాజ్యమైదానం పరిధిలో ఉన్న 26 ఎకరాల స్థలాన్ని సిటీ స్క్వేర్‌గా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. దీనిపై కొంతమంది అనుమానాలు, అపోహలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సుమారు 15 వందల కోట్ల విలువైన ఈ భూమిని ప్రభుత్వం ఎవరికీ అప్పగించదని అన్నారు. ఢిల్లీలోని ఇండియాగేట్, తరహాలో సిటి స్వ్కేర్‌ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మూడొంతుల స్థలం ప్రజలు ఉచిత సందర్శనకు వీలుగా ఉంటుందని తెలిపారు. మిగిలిన దానిలో స్టార్ హోటళ్లు, పార్కులు, చిల్డ్రన్ గేమ్స్, ఫుడ్ పార్కుల వంటివి రావచ్చని అన్నారు. ఇరిగేషన్‌కు చెందిన ఈ స్థలాన్ని ప్రభుత్వం ఇంకా నగర పాలక సంస్థకు అప్పగించాల్సి ఉందని నివాస్ చెప్పారు. యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని వివరించారు. ఢిల్లీలోని పాలికాబజార్‌లో మాదిరిగా అండర్‌గ్రౌండ్‌లో కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణాలు చేపట్టే ప్రతిపాదనలను పరిశీలిస్తు న్నామన్నారు. సిటీ స్క్వేర్‌ను సుందరంగా తయారు చేయడానికి ప్రతిపాదనల కోసం కొటేషన్లు పిలిచామని కమిషనర్ చెప్పారు. అందులో పాల్గొనే బిల్డర్లు సమర్పించే డిజైన్లు చూసి మళ్లీ టెండర్లు పిలుస్తామన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా స్వరాజ్య మైదానాన్ని ప్రైవేటుకు ఇచ్చేస్తున్నామని ప్రచారం చేయడం మంచిది కాదని అన్నారు. సిటీ స్క్వేర్ నిర్మాణం జరిగాక కూడా ఇప్పుడు అక్కడ జరుగుతున్న విధంగానే యోగా, వాకింగ్ వంటివి చేసుకోవచ్చునని చెప్పారు. కాల్వ గట్లను సుంద రంగాతీర్చిదిద్ది చుట్టూ వంతెనలు ఉన్న వరకు ఫెన్సింగ్ నిర్మిస్తామనిచెప్పారు. తొలుత ఏలూరు కాల్వకు రైల్వే ట్రాక్ వరకు ఫెన్సింగ్ వేస్తామన్నారు. బందరు కాల్వలో కాలుష్యాన్ని తగ్గించటానికి అందులో కలిసే కొన్ని డ్రైన్లను దారి మళ్లిస్తున్నామని వివరించారు. డస్ట్‌బిన్లు పెంచడంతో పాటు, వాహనాల సంఖ్య కూడా పెంచాల్సి ఉందన్నారు. మలేరియా నివారణకు స్ర్పేయింగ్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
sonykongara Posted July 18, 2017 Author Posted July 18, 2017 సిటీ స్క్వేర్‌లో.. ట్విన్ టవర్స్ ఆర్‌ఎఫ్‌పీ తయారు చేయించిన జిల్లా యంత్రాంగం చైనాకు చెందిన గిజ్‌హౌ సంస్థ డిజైన్ల రూపకల్పన త్వరలో సీఎంకు ప్రజంటేషన్ విజయవాడ: నగరం నడిబొడ్డున పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేస్తున్న ‘సిటీ స్క్వేర్ ’ ప్రాజెక్టులో నగరానికే తలమానికంగా నిలిచేలా ‘ట్విన్ టవర్స్’ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. మలేషియాలో కనిపించే ట్విన్‌టవర్స్ తరహాలో భారీ హై రైజ్ బిల్డింగ్స్ సిటీ స్క్వేర్‌లో ఏర్పాటు కానున్నాయి. విజయవాడ నగరానికే ట్విన్ టవర్స్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచేలా నిర్మాణం చేపట్టబోతున్నారు. సిటీ స్క్వేర్ నిర్మాణ పనులను చైనాకు చెందిన గిజ్‌హౌ ఇంటర్నేషనల్ సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే. తొలుత గిజ్‌హౌ సంస్థ సిటీ స్క్వేర్‌కు సంబంధించిన డిజైన్లను రూపొందించి సీఎం చంద్రబాబుకు చూపించిన సంగతి తెలిసిందే. ఈ డిజైన్లను పరిశీలించిన చంద్రబాబు పలు మార్పులు చేర్పులకు సూచించారు. అప్పట్లో సీఎం ఏమి సూచించారన్నది బహిర్గతం కాలేదు. మలేషియాలో మాదిరిగా ప్రత్యేక ఆకర్షణగా కనిపించేలా ట్విన్‌టవర్స్ ఏర్పాటుకు సీఎం సూచించినట్టు సమాచారం. జిల్లా యంత్రాంగం ఈ దిశగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ) తయారు చేసింది. దీనికి అనుగుణంగా గిజ్‌హౌ సంస్థ వాటికి సంబంధించిన డిజైన్లకు రూపకల్పన చేసింది. మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ట్విన్ టవర్స్ డిజైన్స్‌ను కలెక్టర్ ఆధ్వర్యంలో గిజ్‌హౌ సంస్థ ప్రజంటేషన్ చేయనుంది. డి జైన్లను సీఎం పరిశీలించిన అనంతరం ట్విన్ టవర్స్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ట్విన్‌టవర్స్‌ను పూర్తిగా రిక్రియేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించటానికి వీలుగా భారీ షాపింగ్ మాల్ కోసం కూడా జిల్లా యంత్రాంగం ఆర్‌ఎఫ్‌పీలో ప్రతిపాదించింది.
fan no 1 Posted November 29, 2017 Posted November 29, 2017 China vadiki runapadipptunnam annamata chivariki
sonykongara Posted December 13, 2017 Author Posted December 13, 2017 http://www.vijayawadacitysquare.in/
APDevFreak Posted December 13, 2017 Posted December 13, 2017 9 minutes ago, sonykongara said: naku 3 nacchindi Greenary takkuva ga vundi kada...
sonykongara Posted December 13, 2017 Author Posted December 13, 2017 1 minute ago, Jeevgorantla said: Greenary takkuva ga vundi kada... adi park kadu ga bro
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now