Jump to content

తెలంగాణ యాసలో అదరగొట్టిన బాలకృష్ణ


RamaSiddhu J

Recommended Posts

హైదరాబాద్: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి తరఫున ప్రచారబరిలోకి దిగారు. శనివారం సాయంత్రం సనత్‌‌నగర్‌‌లో మహాకూటమి అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్‌‌కు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన తెలంగాణ యాసలో అదరగొట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, టీడీపీ తరఫున గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బాలయ్య తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బాహుబలి గురించి మాట్లాడిన బాలయ్య.. సినిమాలో రాజు భళ్లాలదేవుడైనా.. ప్రజలందరూ బాహుబలినే గుర్తు పెట్టుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
 
 
బాలయ్య మాటల్లోనే..
" చంద్రబాబు కట్టిన బిల్డింగుల్లో మీటింగ్స్ పెట్టుకుంటూ కేసీఆర్ ఆయన్నే విమర్శిస్తున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని సైబరాబాద్ నగరంగా సృష్టించింది చంద్రబాబే. తెలుగుదేశం ఒక కులానికి పుట్టిన పార్టీ కాదు..తెలుగు వాళ్లకి ఎక్కడ కష్టమొచ్చినా టీడీపీ ఆదుకుంటుంది. ఇక్కడి ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం మధ్య అవగాహనతో ముందుకు వెళ్తోంది. తల్లి లాంటి పార్టీని మోసం చేసిన వాళ్లకి తగిన బుద్ది చెప్పండి. ఎన్ని సునామీలు వచ్చినా టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. టీడీపీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేరు" అని బాలయ్య చెప్పుకొచ్చారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...