Jump to content

Recommended Posts

11 minutes ago, Raaz@NBK said:

Bro CBN strategy ne question chesthunnaru ga.. India wide effect vuntadhi.. Kontha mandhi CM's follow avutaru CBN ni.. Janalaki kuda oka message velthadhi BJP valu chese panulu enti anedhi..

Ee move value ento chalamandhiki ippudu theliyadhu....

Link to comment
Share on other sites

  • Replies 110
  • Created
  • Last Reply
1 hour ago, Bollu said:

cbi case lu pedithe jagan gadi laga cry chesi sympathy kodithe aipoyedi kada ma meeda kaksha kattaru ani,..babu garu&co ki emi advantage kanapadindo inko few days agithe telusthadi

Actually peddalu ilane guess chesaru - appudu CBN kuda same ani message pampudam ani

ippudu game choodali

Link to comment
Share on other sites

9 minutes ago, swarnandhra said:

If CBI does not need any permission why are they asking for consent of the state to begin with?

 Court's authority is already known. There is no question on that.

  

Here is kutumbarao explanation from min:5. only 10 states have given an consent so far. today ap, wb taken consent back

 

Link to comment
Share on other sites

19 రాష్ట్రాల్లో ఇంతే!
17-11-2018 03:18:47
 
  • సీబీఐకి జనరల్‌ కన్సెంట్‌ ఇవ్వలేదు..
  • వాటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలూ ఉన్నాయి
  • ఏపీ తీసుకున్న నిర్ణయం కొత్తేమీ కాదు
  • ప్రజలకు వివరించాలని ప్రభుత్వ నిర్ణయం
అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సీబీఐ పరిధికి కత్తెర వేస్తూ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు, కారణాలు, రాష్ట్రానికి ఈ విషయంలో ఉన్న అధికారంపై ప్రజలకు పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై అవగాహన పత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని తీర్మానించింది. ‘‘ఇది కొత్తగా, మన రాష్ట్రం ఒక్కటే తీసుకున్న నిర్ణయం కాదు. 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాలు సీబీఐకి జనరల్‌ కన్సెంట్‌ ఇవ్వలేదు. ఇందులో బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, హరియాణా, ఛత్తీ్‌సగఢ్‌ వంటివీ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో కొంత కాలం క్రితమే సీబీఐ అధికార పరిధి పెంచారు. దేశంలో మెజారిటీ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్నే ఏపీ ఎంచుకుంది. మోదీ పాలనలో సీబీఐ స్వయంప్రతిపత్తిని కోల్పోయినందునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
ఇదీ ప్రభావం...
ఏ కేసునైనా రాష్ట్రం స్వయంగా అప్పగిస్తే లేదా హైకోర్టు ఆదేశిస్తే మాత్రమే సీబీఐ దర్యాప్తు చేపట్టగలదు. ఇక... రాష్ట్ర పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులపై సీబీఐకి ఎప్పుడూ ప్రత్యక్ష అధికారం లేదు. వెరసి... రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ అధికారులపై సొంతంగా చర్యలు చేపట్టే అధికారం మాత్రమే సీబీఐ కోల్పోతోందని ఒక అధికారి తెలిపారు. ఒక్కో కేసుకు విడిగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా గతంలో రాష్ట్ర ప్రభుత్వం గంపగుత్తగా అనుమతి (జనరల్‌ కన్సెంట్‌) ఇచ్చేసింది. దీనిని రద్దు చేయడంతో ఒక్కో కేసుకు విడిగా అనుమతి తీసుకోక తప్పదని... ఒకవేళ రాష్ట్రం అనుమతించకపోతే సీబీఐ ఏమీ చేయలేదని వివరించారు.
Link to comment
Share on other sites

పవర్‌... ఫుల్లు!
17-11-2018 03:17:58
 
636780253005979617.jpg
  • రాష్ట్రానికే ఎక్కువ అధికారాలు
  • కేంద్ర ఉద్యోగులూ ఏసీబీ కిందికే
  • అవినీతి నిరోధక చట్టంలో స్పష్టత
  • సీబీఐకి ముందస్తు అనుమతి తప్పదు
  • ఢిల్లీ పోలీసు చట్టం చెబుతున్నదిదే
  • కోర్టు తీర్పులూ రాష్ట్రానికే అనుకూలం
  • పోలీసింగ్‌... రాష్ట్ర పరిధిలోని అంశం
  • రాష్ట్రాల్లో సీబీఐ అధికారాలు పరిమితమే
  • మన నిర్ణయంపై జాతీయస్థాయిలో చర్చ
ఔనా... నిజమేనా? ఇదెలా సాధ్యం?
ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ సొంతంగా దర్యాప్తు చెయ్యలేదా? కేంద్ర ఉద్యోగులపైనా ఏసీబీ దాడులు చేయవచ్చా?
 
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పలు వర్గాల్లో తలెత్తిన సందేహాలు, ప్రశ్నలివి! రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. దీనిపై చర్చ మొదలైంది! ఔను... సీబీఐ ఒక రాష్ట్ర పరిధిలోని కేసులపై దర్యాప్తు చేపట్టాలన్నా, అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నా, ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే! నిజానికి... సీబీఐ ఏ కేసునూ సొంతంగా దర్యాప్తునకు చేపట్టలేదు. కేసు విస్తృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కోరినప్పుడు... లేదా కోర్టు ఆదేశించినప్పుడు మాత్రమే సీబీఐ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అయితే... ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫస్ట్‌ గెజిటెడ్‌ స్థాయి ఉన్న రాష్ట్ర అధికారులు, పౌరులు... విడివిడిగా లేదా కలిసి అవినీతికి పాల్పడినట్లయితే సీబీఐ చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాల్సిందేనని ఢిల్లీ స్పెషల్‌ పోలీసు చట్టమే చెబుతోంది. మొన్నటిదాకా రాష్ట్రం సీబీఐకి ఇచ్చిన గుండుగుత్త అనుమతి (జనరల్‌ కన్సెంట్‌)ని రాష్ట్రం ఇప్పుడు రద్దు చేసింది.
 
కేంద్ర ఉద్యోగుల మాటేమిటి?
ఇతరత్రా కేసుల్లో ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తే చేశారు... మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందా? రాష్ట్ర ఉద్యోగులపై జరిపినట్లుగానే... ఆదాయపు పన్ను శాఖ, టెలికాం వంటి కేంద్ర ఉద్యోగులపై ఏసీబీ సోదాలు/దాడులు నిర్వహించవచ్చునా? ఇది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న! అవినీతికి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ వల వేసి (ట్రాప్‌) పట్టుకోవచ్చు. రాష్ట్ర విభాగాలకు ఆ అధికారం లేదని సీబీఐ పుట్టుకకు కారణమైన ఢిల్లీ పోలీసు చట్టంలో ఎక్కడా లేదు. పైగా... అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌)లోని సెక్షన్‌ 17లో దీనిపై మరింత స్పష్టత ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఎక్కడ, ఏ స్థాయి పోలీసు అధికారి చర్యలు తీసుకోవచ్చునో ఇందులో తెలిపారు. దీని ప్రకా రం... కేంద్ర ఉద్యోగుల అవినీతిపై సీబీఐ అధికారులైతే ఇన్స్‌పెక్టర్‌ స్థాయి, మెట్రో పాలిటన్‌ నగరాల్లోనైతే ఏసీపీ, ఇతర ప్రాంతాల్లో డీఎస్పీ స్థాయి అధికారులు రంగంలోకి దిగవచ్చు. వెరసి... కేంద్ర ఉద్యోగుల అక్రమాల అంశం సీబీఐ పరిధిలోకి మాత్రమే వస్తుందని ఎక్కడా లేదు.
 
హైకోర్టు తీర్పు...
1999లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన అర్బన్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ రీజనల్‌ చీఫ్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అయితే... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినైన తనను పట్టుకునే అధికారం రాష్ట్ర ఏసీబీకి లేదని ఆ అధికారి వాదించారు. దీనిపై 2001లో రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ‘‘పీసీ యాక్ట్‌ సెక్షన్‌ 17 కింద ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ కింద ఏర్పడిన సంస్థలే కాకుండా రాష్ట్ర ఏజెన్సీలు కూడా అవినీతి నిరోధక చర్యలు తీసుకోవచ్చు’’ అని తెలిపింది. ఏదైనా నేరం జరిగినప్పుడు భూభాగం ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్ప అధికారాలు, పరిధుల పట్టింపు ఉండదని వివిధ సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాలు తీర్పు ఇచ్చినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.
 
సీబీఐ మాన్యువల్‌...
సీబీఐ మాన్యువల్‌లో ఉన్న ఒక నిబంధన ప్రకారం అత్యవసరమైతే కేంద్ర ఉద్యోగులపై ఏసీబీ కూడా దాడులు చేసి కేసులు పెట్టవచ్చు.
 
 
రాష్ట్రానికే ఎక్కువ అధికారం...
వివిధ చట్టాల్లోని అంశాలు, న్యాయస్థానాల తీర్పును పరిశీలిస్తే అవినీతి కట్టడిపై కేంద్రంకంటే రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలున్నట్లు స్పష్టమవుతోంది.
 
రాజ్యాంగం ప్రకారం...
రాష్ట్ర జాబితాలోని రెండో అంశమే పోలీసింగ్‌. తమ భూభాగంలో పోలీసింగ్‌ కార్యకలాపాలన్నీ ఆ రాష్ట్ర పరిధిలోకే వస్తాయి. చివరకు పోలీసింగ్‌ నిర్వహణకు ఆధారమైన ఐపీసీ, సీఆర్‌పీసీ వంటి చట్టాలు కూడా ఉమ్మడి జాబితాలో ఉన్నాయి తప్ప పూర్తిగా కేంద్రం పరిధిలో లేవు.
 
అవినీతి నిరోధక చట్టం..
పీసీ యాక్ట్‌ 1988లోనూ రాష్ట్రానికే విశేష అధికారాలు ఉన్నాయి. దీని ప్రకారం... కేంద్ర ఉద్యోగుల అవినీతి వ్యవహారాలపై సీబీఐతోపాటు ఏసీబీ కూడా చర్యలు తీసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ఏ స్థాయి అధికారులకు ఈ అధికారం ఉంటుందో పీసీ చట్టంలో స్పష్టం చేశారు. అయితే... సీబీఐ వేలు పెట్టాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాల్సిందే!
- ఆంధ్రజ్యోతి, అమరావతి
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...