Jump to content

లగడపాటి సర్వేకు, ఈ సర్వేకు ఇంత వ్యత్యాసమా.. మంత్రుల సందేహం!

KING007

Recommended Posts

లగడపాటి సర్వేకు, ఈ సర్వేకు ఇంత వ్యత్యాసమా.. మంత్రుల సందేహం!
14-07-2018 10:52:58
 
636671623781188693.jpg
ఆంధ్రా మంత్రులకు కొత్త సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని నివృత్తిచేసేవారు లేక వారు ఆ విషయాన్ని మీడియా వద్ద ప్రస్తావించారు. సందేహం విన్న మీడియా ప్రతినిధుల్లో కొంతమంది "మీ సందేహానికి సమాధానం చంద్రబాబు మాత్రమే చెప్పగలరు'' అని తేల్చారు. "ఆ సంగతి తమకు కూడా తెలుసు, కానీ ఆయనను అడిగేవారు ఎవరు?'' అని ఈ సందర్భంగా ఒక మంత్రివర్యుడు సాగదీశాడు. ఇంతకీ ఏపీ మంత్రులకు వచ్చిన ఆ సందేహం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
 
       ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతున్న అంశం "రియల్ టైమ్‌ గవర్నెన్స్''. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చ్యూవల్ సమీక్షలు, ఆకస్మిక తనిఖీలు, శాఖాపరమైన సమీక్షలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఇటీవల విజయవాడ ప్రకాశం బ్యారేజి ఎగువ భాగంలో తూటుకాడ విపరీతంగా పేరుకుపోయింది. కెమేరాల ద్వారా ఆర్టీజీ సెంటర్ నుంచి చంద్రబాబు ఈ దృశ్యాన్ని చూశారు. వెంటనే స్పందించారు. "గుంటూరు, విజయవాడ నగరాలు సహా రాజధానిలోని పలు గ్రామాలు, పట్టణాలకు తాగునీటిని సరఫరా చేసే ప్రకాశం బ్యారేజి నీటిలో ఈ తూటుకాడ ఏంటి?'' అని బ్యారేజి అధికారులను, జలవనరుల శాఖ అధికారులను సీఎం నిలదీశారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. రెండురోజుల్లో తూటుకాడను తొలగించారు.
 
         ఏపీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆర్టీజీ సెంటర్ ప్రతీ నెలా సర్వేలు నిర్వహిస్తుంటుంది. ప్రభుత్వ పనితీరుపై కూడా సర్వే చేపడుతుంటుంది. ఇందులో భాగంగా చంద్రబాబు వాయిస్‌తో మొబైల్స్‌కి కాల్ వస్తుంది. "ప్రభుత్వ పనితీరు బాగుంటే ఒకటి నెంబర్‌ నొక్కండి. పనితీరు బాగోకపోతే రెండు నెంబర్‌ నొక్కండి'' అని వినిపిస్తుంది. ఇలా లక్షలాది కాల్స్ ఆర్టీజీ సెంటర్ నుంచి వెళుతుంటాయి. ఇందులో సగానికి పైగా కాల్స్‌కి ఆన్సర్స్‌ రావు. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన వారిలో కొందరు చంద్రబాబు వాయిస్ విన్న వెంటనే "ఎప్పుడూ వచ్చే కాల్సే..'' అని భావించి కాల్‌ని కట్‌చేస్తుంటారు. మరికొందరు బాబు వాయిస్‌కి స్పందనగా ఒకటి నొక్కి వదిలేస్తారు. ఒకవేళ ఎవరైనా రెండు నెంబర్‌ని ప్రెస్‌ చేస్తే వెంటనే ఆ కాల్ 1100తో అనుసంధానమైన పరిష్కార వేదికకు కనెక్ట్ అవుతుంది. మీ కాల్‌కి కొద్దిసేపటిలో ఆన్సర్ చేస్తామంటూ 10 నిముషాల సేపు లైన్‌లో ఉంచుతారు. ఈలోపు విసుగుపుట్టి కొందరు కాల్‌ని కట్‌చేస్తుంటారు.
 
      ఒకవేళ ఎవరైనా ఓపికగా వెయిట్‌ చేస్తే ఆపరేటర్‌ లైన్‌లోకి వస్తారు. "ప్రభుత్వ పనితీరుపై మీరెందుకు అసంతృప్తిగా ఉన్నారో చెప్పండి? కారణాలు ఏంటి?'' అని అడుగుతారు. తమ సమస్యలను వారు నివేదిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం అని చెబుతారు. ఇలా ఆర్టీజీ సెంటర్ నుంచి వెళ్లిన కాల్స్‌లో సరైన సమాధానం 10 శాతం కాల్స్‌కు కూడా రావడంలేదు. ఈ పదిశాతం కాల్స్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతృప్తి 75 శాతం వరకు ఉందని పదేపదే చెడుతున్నారు. కానీ ఇటీవల నిర్వహించిన సర్వేలలో వస్తున్న లెక్కలకీ, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న లెక్కలకీ కొంత తేడా ఉంటోంది.
 
        లగడపాటి రాజగోపాల్ ఆధ్వర్వంలోని ఆర్.జీ ఫ్లాష్ టీమ్‌ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ పనితీరుపై 53 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నారని తేల్చింది. దీనితో పలువురు మంత్రులు ఆర్టీజీ సర్వేకు, రాజగోపాల్ సర్వేకు ఇంత వ్యత్యాసం ఏంటన్న డైలమాలో పడ్డారు. సచివాలయంలో కొంతమంది అధికారులు, భావసారూప్యం ఉన్న ఇతర మంత్రుల వద్ద తమ సందేహాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కొందరు అధికారులు ఆర్టీజీ సెంటర్ నుంచి వెళ్లే ఫోన్‌కాల్స్ గురించి కథలు, కథలుగా మంత్రులకు వివరించారు. ఆ కాల్స్ ఎలా వెళతాయి? వీటిపై ఏ ప్రాతిపదికన లెక్కలు కడతారు? సంతృప్తి శాతాన్ని పెంచడానికి ఏం చేస్తారు? వంటి వివరాలను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మంత్రిగారికి చెప్పుకొచ్చారు. ఆ మాటలు విన్న సదరు అయ్యవారు అవాక్కయ్యారు.
 
      ప్రకాశం బ్యారేజి ఎగువ భాగాన తూటుకాడ ఉందని ఆర్టీజీ సెంటర్ ద్వారా కెమేరాలు ఉపయోగించి కనుగొనాల్సిన అవసరం ఏమీ లేదనీ, విజయవాడ నుంచి సచివాలయానికి వెళ్లే అధికారులు, మంత్రులు, ఉద్యోగులు, మీడియా, ఆ దారిన వెళ్లే వారందరికీ ఆ విషయం తెలుసనీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మరో మంత్రికి వివరించారు. ఆర్టీజీ నుంచి వెళ్లే కాల్స్‌ని ప్రాతిపదిక చేసుకుని సంతృప్తి శాతం బాగుందని మురిసిపోతే మునగడం ఖాయమని మరో సీనియర్ మంత్రి తన శాఖ అధికారులతోనే వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీ సెంటర్‌కు వెళ్లి గంటల తరబడి సమయాన్ని వెచ్చించడంపై మరో సీనియర్ మంత్రి ఆక్షేపించారు. ఒక సందర్భంలో తాను సీఎం కోసం రెండు గంటలపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఇలాగే టెక్నాలజీ వైపు పరుగులు పెట్టి 2004లో అధికారాన్ని చేజార్చుకున్నామని ఒక మంత్రి ప్రస్తావించారు.
 
     ముఖ్యమంత్రి మళ్లీ టెక్నాలజీ వైపే ఎక్కువ మొగ్గుతున్నారని ఆయన ఒకింత ఆందోళనగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందే విషయంలో ఆర్టీజీ అధికారులు కొత్తకొత్త నిబంధనలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిణామం వల్ల లబ్ధిదారులు అసంతృప్తి చెందుతున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి అంశాలపై మంత్రుల్లో అసంతృప్తి గూడుకట్టుకుందనీ, ఏదో ఒకనాడు సీఎం చంద్రబాబు సమక్షంలోనే ఈ విషయాలను ఏకరవుపెడతామనీ ఇంకొక అమాత్యవర్యుడు వ్యాఖ్యానించారు. చూద్దాం ఈ వాస్తవాలను ప్రభుత్వ పెద్దలు ఎప్పటికి గుర్తిస్తారో..!
Link to comment
Share on other sites

ప్రకాశం బ్యారేజి ఎగువ భాగాన తూటుకాడ ఉందని ఆర్టీజీ సెంటర్ ద్వారా కెమేరాలు ఉపయోగించి కనుగొనాల్సిన అవసరం ఏమీ లేదనీ, విజయవాడ నుంచి సచివాలయానికి వెళ్లే అధికారులు, మంత్రులు, ఉద్యోగులు, మీడియా, ఆ దారిన వెళ్లే వారందరికీ ఆ విషయం తెలుసనీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మరో మంత్రికి వివరించారు. ఆర్టీజీ నుంచి వెళ్లే కాల్స్‌ని ప్రాతిపదిక చేసుకుని సంతృప్తి శాతం బాగుందని మురిసిపోతే మునగడం ఖాయమని మరో సీనియర్ మంత్రి తన శాఖ అధికారులతోనే వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీ సెంటర్‌కు వెళ్లి గంటల తరబడి సమయాన్ని వెచ్చించడంపై మరో సీనియర్ మంత్రి ఆక్షేపించారు. ఒక సందర్భంలో తాను సీఎం కోసం రెండు గంటలపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఇలాగే టెక్నాలజీ వైపు పరుగులు పెట్టి 2004లో అధికారాన్ని చేజార్చుకున్నామని ఒక మంత్రి ప్రస్తావించారు.

nijame, malli cm cheppe daka officers, minsters emi pikutunnaru clean chepicha vacchu kadha kallu dobbaya, mundu valla pani vallu edisthe chalu cheyyalsina pani cheyyaru kani vedava vagudu ekkuva ayyindi .

Link to comment
Share on other sites

I agree too. Technology avasaram ledu ani kaadu kaani janaalaki close gaa undatam chala avasaram. Aa connect eppudu miss avakoodadu.  No technology can replace human relations and emotions. Especially India lo aa emotional connect and reach public tho chala avasaram.

Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:

nijame, malli cm cheppe daka officers, minsters emi pikutunnaru clean chepicha vacchu kadha kallu dobbaya, mundu valla pani vallu edisthe chalu cheyyalsina pani cheyyaru kani vedava vagudu ekkuva ayyindi .

Link to comment
Share on other sites

11 hours ago, sonykongara said:

ప్రకాశం బ్యారేజి ఎగువ భాగాన తూటుకాడ ఉందని ఆర్టీజీ సెంటర్ ద్వారా కెమేరాలు ఉపయోగించి కనుగొనాల్సిన అవసరం ఏమీ లేదనీ, విజయవాడ నుంచి సచివాలయానికి వెళ్లే అధికారులు, మంత్రులు, ఉద్యోగులు, మీడియా, ఆ దారిన వెళ్లే వారందరికీ ఆ విషయం తెలుసనీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మరో మంత్రికి వివరించారు. ఆర్టీజీ నుంచి వెళ్లే కాల్స్‌ని ప్రాతిపదిక చేసుకుని సంతృప్తి శాతం బాగుందని మురిసిపోతే మునగడం ఖాయమని మరో సీనియర్ మంత్రి తన శాఖ అధికారులతోనే వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీ సెంటర్‌కు వెళ్లి గంటల తరబడి సమయాన్ని వెచ్చించడంపై మరో సీనియర్ మంత్రి ఆక్షేపించారు. ఒక సందర్భంలో తాను సీఎం కోసం రెండు గంటలపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఇలాగే టెక్నాలజీ వైపు పరుగులు పెట్టి 2004లో అధికారాన్ని చేజార్చుకున్నామని ఒక మంత్రి ప్రస్తావించారు.

nijame, malli cm cheppe daka officers, minsters emi pikutunnaru clean chepicha vacchu kadha kallu dobbaya, mundu valla pani vallu edisthe chalu cheyyalsina pani cheyyaru kani vedava vagudu ekkuva ayyindi .

brother do u know the procedure for govt works..govt permission ivvakunda evari chetilo dabbulu petti cheyinchali.. ala cheyinchi bokka pettukkunna vallu unnaru telusa..

Link to comment
Share on other sites

1 minute ago, surapaneni1 said:

brother do u know the procedure for govt works..govt permission ivvakunda evari chetilo dabbulu petti cheyinchali.. ala cheyinchi bokka pettukkunna vallu unnaru telusa..

minsters kuda a pani cheyichalera

Link to comment
Share on other sites

4 hours ago, Nfan from 1982 said:

Aa RTG calls anni fake anukuntunna. Enduku ante naaku every week call vastundhi. I think programmers have set calls to only positive responders. 

responce sarigga ledani vallu report iste next day nundu vallaki pani lekunda poddani bhayam..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...