Jump to content

new ration cards


Recommended Posts

ఎన్నాళ్లో వేచిన ఉదయం
ఊపందుకున్న కొత్త కార్డుల ప్రక్రియ
రెండు జిల్లాల్లో 55,726 మందికి ప్రయోజనం
విభజిత కార్డు దరఖాస్తుదారులు మరో నెల ఆగాల్సిందే
ఈనాడు - అమరావతి
amr-top2a.jpg

రేషన్‌కార్డుల కోసం ఎన్నాళ్ల నుంచో కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న వారి ఆశల తీరబోతున్నాయి. ఇప్పటికే కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. గత ఏడాదిన్నరగా ప్రభుత్వం కొత్త కార్డులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో అర్హులు వీటి కోసం డిమాండ్‌ ఏర్పడింది. జూన్‌, 2న నవనిర్మాణ దీక్ష సందర్భంగా వీటిని మంజూరు చేసింది. ఈ ఏడాది జన్మభూమిలో వచ్చిన దరఖాస్తుల నుంచి కేవలం పింఛన్లనే మంజూరు చేశారు. రేషన్‌కార్డుల విషయాన్ని పక్కనపెట్టేశారు. ఇప్పటికి వీటికి మోక్షం కలగబోతోంది. దీని వల్ల రాజధానిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 55,726 మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం కలగనుంది. పౌరసరఫరాల కమిషనర్‌ నుంచి రెండు జిల్లాలకు అర్హుల జాబితా వచ్చింది. వీటిని విచారించి కొత్తవి జారీ చేయాలని ఆదేశాలిచ్చారు. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రభుత్వం అర్హులందరికీ ఇచ్చేందుకు నిర్ణయించింది. వచ్చే ఏడాది జన్మభూమి జరిగే సమయానికి ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈలోపే ఇచ్చేయాలని భావిస్తున్నారు. విభజిత కార్డులకు సంబంధించిన దరఖాస్తులను ప్రస్తుతానికి పక్కనపెట్టేశారు. జులైలో వీటిపై దృష్టి సారించనున్నారు. కేవలం ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకున్న కుటుంబాలకే నూతన కార్డులు రానున్నాయి. లేనివారిని అనర్హులుగా తేల్చడంతో చాలా మందికి నిరాశే మిగులుతోంది.

ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 12.51 లక్షల   రేషన్‌కార్డులు ఉన్నాయి. మొత్తం 2,260 రేషన్‌దుకాణాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా నెలకు 18,500 మె.టన్నుల మేర బియ్యాన్ని పంపిణీ జరుగుతోంది. ప్రభుత్వం కేజీ బియ్యాన్ని లెవీ కింద రూ. 21 వెచ్చించి కొనుగోలు చేస్తోంది. దీనికి జిల్లాలో నెలకు రూ. 3.70 కోట్లు ఖర్చుపెడుతోంది. ఏడాదికి ఈ భారం రూ. 45 కోట్లు అవుతోంది. గుంటూరు జిల్లాలో 14.53 లక్షల కార్డులు ఉన్నాయి. వీటికి 2,742 దుకాణాల ద్వారా సరకులు పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా తెల్లకార్డులకు 22,000 టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నారు. బియ్యం ఒక్కదాని కోసమే నెలకు రూ. 4.50 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఆహార భద్రతా చట్టం అమలులోకి రావడంతో ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 25 కిలోలు మించకుండా ఇస్తున్నారు. కిలో బియ్యాన్ని రూపాయికి అందిస్తున్నారు.

సుదీర్ఘ నిరీక్షణ: కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రతి ఏటా జన్మభూమి సభల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం వాటిపై విచారించి ఏప్రిల్‌ నుంచి కొత్తవి జారీ చేస్తారు. ఈ ఏడాది ఇంకా జారీ చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే జారీ చేయాలని నిర్ణయించింది. కృష్ణా జిల్లాలో కొత్త కార్డుల కోసం 2,69,429 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో అత్యంత అర్హులుగా 9,910 మందిని, అర్హులుగా 17,794 మంది చొప్పున మొత్తం 27,704 మందిని నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో వచ్చిన 2,38,689 దరఖాస్తుల నుంచి 11,778 అత్యంత అర్హులు, 16,244 అర్హులు చొప్పున మొత్తం 28,022 మందిని గుర్తించారు. ఇప్పటికే గుర్తించిన అర్హుల జాబితాను రెండు జిల్లాల్లోని తహసీల్దార్ల కార్యాలయాలకు చేరాయి. వీటిని క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు.

* 2016లో నిర్వహించిన ప్రజాసాధికార సర్వేలో రెండు జిల్లాల్లో చాలా మంది తమ వివరాలు నమోదు చేసుకోలేదు. కొందరి వివరాలు తప్పుగా వచ్చాయి. ప్రభుత్వ పథకాల్లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వివిధ పథకాలకు సర్వేలో నమోదు తప్పనిసరి చేసింది. ఇది మంచిదే అయినా ఇందులో నమోదు చేసుకోని వారికి అన్యాయం జరుగుతోంది. నమోదు దొర్లిన తప్పుల కారణంగా పలువురికి నష్టం జరుగుతోంది. దరఖాస్తుల వడపోతలో ప్రజాసాధికార సర్వేలో పేర్లు లేని వారివి తొలగించారు. కొత్తగా పెళ్లిల్లు చేసుకుని విడిపోయిన కుటుంబాలకు చెందిన వారు చేసిన దరఖాస్తులను ప్రస్తుతం పరిశీలించడం లేదు. ఇటువంటి వాటిని జులైలో చూడాలని తాజాగా పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ విభాగానికి చెందినవి కృష్ణా జిల్లాలో 1,72,774 మంది, గుంటూరు జిల్లాలో 1,59,719 మంది దరఖాస్తు చేశారు. వీరంతా మరో నెల ఆగాల్సిందే.

* కొన్ని ప్రభుత్వ పథకాలకు అర్హతగా తెల్ల రేషన్‌కార్డును అడుగుతున్నారు. సరకులు అవసరం లేకపోయినా చాలా మంది వీటిని తీసుకుంటున్నారు. ఎక్కువ నెలలు సరకులు తీసుకోని కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందన్న ఆందోళనతో దుకాణాలకు వెళ్లి ఈ-పోస్‌పై వేలిముద్ర వేస్తున్నారు. ఇందులో నమోదు చేసిన సరకుల పరిమాణాన్ని బట్టి ధర కార్డుదారుడి ఖాతా నుంచి దుకాణదారుడి ఖాతాకు జమ అవుతుంది. తిరిగి ఆ మొత్తాన్ని కార్డుదారుడికి చెల్లిస్తాడు. సరకులను మాత్రం చౌకదుకాణం యజమాని ఉంచుకుని దాన్ని బయట విక్రయిస్తున్నాడు. ఈ విధానాన్ని మారిస్తే మంచిది. కార్డులను ధ్రువపత్రాలుగా ఉపయోగించుకునే వారి నుంచి సరకులు తీసుకోమని పత్రం తీసుకుంటే వీటిని కూడా అరికట్టవచ్చు.

Link to comment
Share on other sites

30కే కందిపప్పు.. కార్డుకు 2 కేజీలు
05-06-2018 03:35:54
 
636637665620577956.jpg
  •  కొత్తగా మరో 71 విలేజ్‌ మాల్స్‌
  •  రేషన్‌, వైద్యానికి వేర్వేరు కార్డుల యోచన: ప్రత్తిపాటి
అమరావతి(ఆంధ్రజ్యోతి): ఒక్కో రేషన్‌ కార్డుకు రెండు కిలోల కందిపప్పును కేజీ రూ.30కి ఇచ్చే ఆలోచనలో ఉన్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం లభించాల్సి ఉందన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రన్న విలేజ్‌ మాల్స్‌లో వీలైనంత తక్కువ ధరకు సరుకులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాల్స్‌ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రతి జిల్లా నుంచి ఒక డీలరును పిలిచి నెలవారీ సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు. ప్రస్తుతం 83 మాల్స్‌ నిర్వహిస్తుండగా.. మరో 71 మాల్స్‌ కొత్తగా రాబోతున్నట్టు తెలిపారు. ప్రజాసాధికార సర్వేలో 30 లక్షల మంది పాల్గొనకపోవడం వల్లే కుటుంబాల కంటే కార్డులు ఎక్కువ ఉన్నట్టు చూపిస్తోందన్నారు. రేషన్‌కు, వైద్యానికి వేర్వేరు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నదని చెప్పారు. 12.5 లక్షల మంది ముస్లింలకు రంజాన్‌ తోఫా అందిస్తున్నామని తెలిపారు. రంజాన్‌ తోఫా సరుకులు బాగా లేనిచోట నాణ్యమైన సరుకులతో భర్తీ చేయిస్తున్నామని పౌరసరఫరాల శాఖ ఎండీ సూర్యకుమారి చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో పంపిణీ కొంతమేర ఆలస్యమవుతున్నదని తెలిపారు.
 
ఆధారాలతో ఆరోపణలు చేయండి
ఏవో గాలి ఆరోపణలతో జగన్‌, పవన్‌ కల్యాణ్‌ టీడీపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి పుల్లారావు విమర్శించారు. ఎక్కడ అవినీతి జరుగుతోందో ఖచ్చితమైన ఆధారాలుంటే చూపించి ఆరోపణలు చేయాలని మంత్రి సవాల్‌ చేశారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...