Jump to content

GST,,,


sonykongara

Recommended Posts

  • Replies 76
  • Created
  • Last Reply
జీఎస్‌టీ శ్లాబులపై త్వరలో శుభవార్త
 
 
636424804633367872.jpg
ఫరీదాబాద్ : వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) శ్లాబులను తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలు ఇచ్చారు. జీఎస్‌టీ అమల్లోకి వచ్చి రెండు, మూడు నెలలే అయిందన్నారు. మెరుగుపరిచేందుకు ప్రతి రోజూ అవకాశం ఉంటుందన్నారు. చిన్న తరహా పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీకి అనుగుణంగా నడచుకునేందుకు వీలుగా పన్ను శ్లాబులను తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ఆదాయం అటూ, ఇటూ కాకుండా ఉన్నపుడు తక్కువ శ్లాబుల వంటి భారీ సంస్కరణల రూపంలో, అటువంటి పరిస్థితిని మెరుగుపరిచే అవకాశం ఉందన్నారు. ప్రజలు వినియోగించే వస్తువులపై పన్ను రేట్లు తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రత్యక్ష పన్నులను ఎక్కువగా సంపన్నులే చెల్లించాలని, బలహీన వర్గాలు చెల్లించకూడదని చెప్పారు. పరోక్ష పన్నుల వల్ల అందరిపైనా భారం పడుతుందన్నారు. సామాన్యులు ఎక్కువగా వినియోగించే వస్తువులపై అత్యంత తక్కువ పన్ను విధించే ప్రయత్నం నిరంతరం జరుగుతుందన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కొటిక్స్ నిర్వహించిన కార్యక్రమంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ప్రస్తుతం జీఎస్‌టీ శ్లాబులు నాలుగు ఉన్నాయి. 5, 12, 18, 28 శాతం కేటగిరిలలో వస్తువులకు, సేవలకు పన్నులు విధిస్తున్నారు. కొన్ని ఉత్పత్తులపై జీఎస్‌టీ పరిహార సుంకాన్ని కూడా వసూలు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

జీఎస్టీలో ఇక 3 శ్లాబులే!
 
 
అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానంలో ప్రస్తుతం అమలవుతున్న 4 పన్ను శ్లాబులను 3 శ్లాబులుగా కేంద్ర ప్రభుత్వం కుదించనుంది. ఈ మేరకు నిర్ణయం దాదాపు ఖరారైంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులతో చర్చలు జరిపిన అనంతరం జీఎస్టీలో 3 శ్లాబులు ఉంచాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుం జీఎస్టీలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను శ్లాబులు అమలవుతున్నాయి. ఇందులో కనీస శ్లాబు 5 శాతాన్ని అలాగే ఉంచి, మిగిలిన మూడింటినీ సవరించి 2 శ్లాబులకు కుదించనున్నారు. పన్ను చెల్లింపు భారం ఎక్కువగా ఉండడంతో కొన్ని వస్తువులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేదా పన్ను రేట్లు తగ్గించాలని రాష్ట్రాల నుంచి వినతులు వస్తున్నాయి. ముఖ్యంగా 28 శాతం పన్నుపై మరోసారి నిర్ణయం తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. దీంతో కేంద్రం పునరాలోచన చేసింది. ఇందులో అన్ని రాష్ట్రాలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతోనే అన్ని రాష్ట్రాల మంత్రులు, అధికారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంది.
Link to comment
Share on other sites

పన్ను తగ్గించినా ధరలు దిగవేం?



  • ప్రజలకు లాభం చేకూరడం లేదు
  • ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది
  • ధరల పర్యవేక్షణకు జాతీయ వ్యవస్థ
  • కేంద్రానికి యనమల లేఖ

అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నిత్యం ఉపయోగించే అనేక వస్తువులపై జీఎ్‌సటీ పన్ను తగ్గించినప్పటికీ.. వాటి ధరలు దిగిరావడం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ప్రజలకు ప్రయోజనం చేకూరడం లేదని.. పైగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పన్ను మినహాయింపు లేదా పన్ను తగ్గింపుతో.. ధరలు తగ్గిందీ లేనిదీ పర్యవేక్షించడానికి జాతీయ స్థాయి నియంత్రణ వ్యవస్థను ఏర్పాటుచేయాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్‌ చైర్మన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి గురువారం లేఖ రాశారు.

 

ఆంధ్రప్రదేశ్‌, మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన ఎస్‌జీఎస్‌టీ, సీజీఎస్‌టీ, ఐజీఎ్‌సటీ, సెస్‌ చెల్లింపుల వివరాలను రియల్‌టైమ్‌ ప్రాతిపదికన జీఎ్‌సటీఎన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలని అందులో విజ్ఞప్తి చేశారు. ‘చిన్న వ్యాపారులు, ట్రేడర్లకు వెసులుబాటు కల్పించడానికి నెలవారీ రిటర్నుల్లో మినహాయింపు ఇవ్వాలి. అల్పాదాయవర్గాల ప్రజలు వినియోగించే వస్తు, సేవలపై పన్ను మినహాయించాలి. లేదంటే తగ్గించాలి. ప్రభుత్వ పనులు నేరుగా చేసే కాంట్రాక్టర్లపై జీఎ్‌సటీని 12 శాతానికి తగ్గించినప్పటికీ.. ప్రధాన కాంట్రాక్టర్ల తరపున పనిచేసే సబ్‌కాంట్రాక్టర్లపై 18 శాతం అమలవుతోంది. దీని వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. అందుచేత సబ్‌కాంట్రాక్టర్లపై విధించే జీఎ్‌సటీని కూడా 12 శాతానికి తగ్గించాలని కోరారు.

 

విశాఖపట్నంలోని గిరిజన సహకార కార్పొరేషన్‌ మార్కెటింగ్‌ చేస్తున్న తేనె, కాఫీ, పసుపు, సబ్బులు, చింతపండు, కుంకుడుకాయ, శీకాకాయ షాంపూలు, నన్నారి, బిల్వాషర్బత్‌లు గిరిజనుల అటవీ ఉత్పత్తులు. వారిని ప్రోత్సహించేందుకు వాటిపై జీఎ్‌సటీ మినహాయించాలి. బయోడీజిల్‌పై అమలవుతున్న 18 శాతం పన్నును 5 శాతానికి తగ్గించాలి. చేపలు పట్టే వలలు, వాటికి ఉపయోగించే వస్తువులపై 12 శాతం జీఎ్‌సటీ అమలవుతోంది. దీనివల్ల కొన్ని లక్షల మంది మత్స్యకారులు జీవనాధారం కోల్పోతున్నారు. అందుచేత వాటిపై జీఎస్‌టీని మినహాయించాలి’ అని అభ్యర్థించారు. గ్రానైట్‌ శ్లాబులపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతోందని, దీన్ని ఐదు శాతానికి తగ్గించాలని కోరారు. నాపరాళ్లపైనా 28 శాతం జీఎస్‌టీ ఉందని, దానినీ తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పత్తినూలు ఉండలపై 5 శాతం జీఎ్‌సటీ విధింపుతో చేనేతవర్గం తీవ్రగా నష్టపోతోందని, వీటిని పన్ను నుంచి మినహాయించాలని కోరారు.

 

నాటు పొగాకు చుట్టలపై 28 శాతం పన్ను విధించారని.. 50 రూపాయలున్న సిగరెట్‌పైన, రూపాయి విలువ గల చుట్టలపైన ఒకే పన్ను రేటు సబబు కాదన్నారు. ట్రాక్టర్లపై 12 శాతంగా ఉన్న జీఎస్‌టీని ఐదు శాతానికి తగ్గించాలని కోరారు. పౌరసరఫరాల సంస్థకు సరఫరా కోసం చేస్తున్న రైస్‌ మిల్లింగ్‌పై జీఎ్‌సటీ అమలవుతుందో లేదో స్పష్టత కావాలన్నారు. నీటిపారుదల శాఖలో కాంట్రాక్టు పనులు, ప్రభుత్వం చేపట్టే ఇతర కాంట్రాక్టు వర్కులపై జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలని కోరారు. పర్యావరణహితమైన హైబ్రిడ్‌ కార్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వీటిపై 28% జీఎస్‌టీ విధించడంతో పాటు 15 శాతం సెస్‌ అమలుచేస్తున్నారని, సెస్‌ను 3 శాతానికి తగ్గించాలని యనమల కోరారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...