Jump to content

Vykuntapuram Barrage

sonykongara

Recommended Posts

బ్యారేజీలు
రాజధాని తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదిపై నిర్మాణం
ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువన ఒక్కోటి
వైకుంఠపురం వద్ద రూ.3600 కోట్లు
చోడవరం వద్ద రూ680 కోట్లు
తుది కసరత్తు పూర్తి

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి సమీపంలో కృష్ణా నదిపై కొత్తగా రెండు బ్యారేజిలు నిర్మించేందుకు పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికలు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌ వీటిని సిద్ధం చేసింది. ప్రభుత్వానికి ఈ నివేదికలు అందగానే టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో ప్రకాశం బ్యారేజికి దిగువన ఆధునిక సాంకేతికత వినియోగించి ఉబర్‌ మేయర్‌ పద్ధతిలో బ్యారేజి నిర్మించనున్నారు. వీటి నిర్మాణం వల్ల రాజధాని ప్రాంతానికి అవసరమైన తాగునీరు అందించడానికి వీలవుతుంది. నదీ అభిముఖ రాజధాని నిర్మాణంలో ప్రకాశం బ్యారేజి దిగువన 12 కిలోమీటర్ల   వరకు ఎగువన మరో 30 కిలోమీటర్ల వరకు కృష్ణా నదిలో నిరంతరం నీటిని నిల్వ చేసేందుకు వీలుంటుంది. నగర సుందరీకరణ, పర్యాటక కోణంలోను వీటి ప్రాముఖ్యం ఉంది.

1. ప్రకాశం బ్యారేజి ఎగువన
* పులిచింతలకు దిగువన, ప్రకాశం బ్యారేజికి ఎగువన దీన్ని నిర్మిస్తారు.
* దాదాపు 25 టీఎంసీల నిల్వ సామర్థ్యం
* అంచనా వ్యయం సుమారు రూ.3600 కోట్లు
* గుంటూరు జిల్లా దామలూరు, కృష్ణా జిల్లా వైకుంఠపురం మధ్యలో నిర్మాణం.
* నదిపై 1.4 కిలోమీటర్లు.
* వ్యాప్కోస్‌ సంస్థ లైడార్‌ సర్వే చేపట్టి ఈ డీపీఆర్‌ను కొలిక్కి తీసుకువచ్చింది. నిపుణులతో  సమావేశం తర్వాత అన్ని అంశాలు సమగ్రంగా ఖరారు చేసి తుదిరూపం ఇస్తారు.

Link to comment
Share on other sites

  • Replies 235
  • Created
  • Last Reply
1 minute ago, swarnandhra said:

@Sony bro, I did not get you. I was just echoing what @manaNTR and @rk09 said.

by the way, this dam is very much needed for drinking water needs of Vijayawada-Guntur surroundings and for the growth of Amaravati

bro,sagam type chesi ,delete chesa enduku le ani ,adi kuda purthiga delete cheyyala ippude chusanu adi kuda

Link to comment
Share on other sites

  • 3 weeks later...
సీఎం సై...
16-12-2017 02:29:45
 
  • వైకుంఠపురానికి గ్రీన్‌ సిగ్నల్‌
విజయవాడ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియను మూడు దశల్లో చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొదటి దశలో వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి అనుమతించారు. వైకుంఠపురం-దాములూరు గ్రామాలను కలుపుతూ ఒక వంతెన నిర్మిస్తారు. ప్రకాశం బ్యారేజీలో గరిష్ఠంగా మూడు టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తయితే... 20 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయవచ్చు.
 
ఈనెల 23వ తేదీన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో... గోదావరి - పెన్నా అనుసంధాన ప్రక్రియకు సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ పథకం అమలులోకి వస్తే 1500 టీఎంసీల గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయని సీఎం పేర్కొన్నారు. వ్యాప్కో్‌సతో సమీక్ష ముగిసిన వెంటనే... ఉన్నతాధికారులు సీఎం ఆదేశాల మేరకు వైకుంఠపురం బ్యారేజీపై సమగ్రప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయడంపై కసరత్తు మొదలు పెట్టారు. వైకుంఠపురం బ్యారేజీ/వంతెన వల్ల... హైదరాబాద్‌ నుంచి అమరావతి, చెన్నై వెళ్లాల్సిన వాహనాలు విజయవాడకు రావాల్సిన అవసరం ఉండదు. బెజవాడపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గుతుంది.
Link to comment
Share on other sites

  • 1 month later...
3 బ్యారేజీలు..  22 టీఎంసీలు
వైకుంఠపురం వద్ద రూ. 1,900 కోట్లతో నిర్మాణం
  ప్రాజెక్టు నివేదిక వారంలో సిద్ధం, ఆ తర్వాత టెండర్లు
  చోడవరం, శ్రీకాకుళం వద్ద మరో రెండింటికి సన్నాహాలు
ఈనాడు - అమరావతి
25ap-main3a.jpg

ప్రకాశం బ్యారేజి ఎగువన వైకుంఠపురం వద్ద కృష్ణా నదిపై బ్యారేజి నిర్మాణానికి దాదాపు రంగం సిద్ధం చేశారు. లైడార్‌ సర్వే పూర్తి చేసిన వ్యాప్కోస్‌ సంస్థ నిపుణులతో జలవనరులశాఖ అధికారులు గురువారం భేటీ అయ్యారు. జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, హైడ్రాలజీ చీఫ్‌ ఇంజినీర్‌ కుమార్‌, జలవనరులమంత్రి ఓఎస్డీ రాజేంద్రప్రసాద్‌ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజి దిగువన యనమలకుదురు సమీపంలో చోడవరం వద్ద; మరీ దిగువన ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద బ్యారేజీల నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసేందుకు వేరే కన్సల్టెన్సీ కసరత్తు చేస్తోంది.

12 టీఎంసీలు... 1,900 కోట్లు
ప్రకాశం బ్యారేజికి ఎగువన నిర్మించే బ్యారేజి వల్ల దాదాపు 10 నుంచి 12 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయవచ్చు. సుమారు 22 టీఎంసీల వరకు వినియోగించుకోవచ్చు. 50 లక్షల మంది తాగునీటికి లేదా రెండున్నర లక్షల ఎకరాలకు పైగా ఆయట్టుకు ఈ నీరు ఉపయోగపడుతుంది. వ్యాప్కోస్‌ వారు రూ.3,278 కోట్లతో ఈ బ్యారేజి నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. జలవనరులశాఖలో గతంలో పని చేసిన అనుభవం ఉండి మంత్రి దేవినేని ఓఎస్డీగా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్‌ కొందరి అధికారుల సహకారంతో క్షేత్రస్థాయి సమాచారంతో రూ.1,901 కోట్లకే ఈ బ్యారేజి పూర్తి చేసేందుకు అవకాశం ఉందని ఒక నివేదిక సిద్ధం చేశారు. వీటిపై చర్చించిన అధికారులు 1,900 కోట్ల ఖర్చుతో  నిర్మాణం పూర్తి చేయవచ్చని అంచనాకు వచ్చారు.

మునేరు ఆధారం
ఈ బ్యారేజిలో నీటి నిల్వకు మునేరు వాగే పెద్ద ఆధారం. ఈ వాగులో ప్రతి ఏడాది దాదాపు రెండు నెలల్లో 50 టీఎంసీల లభ్యత ఉందని లెక్కిస్తున్నారు. గతంలో అన్ని చోట్లా వర్షాలు పడ్డ సమయంలో ఈ మునేరు నీరే సముద్రంలోకి వృథాగా పోయిన సందర్భాలూ ఉన్నాయి. పాలేరు వాగు నుంచి కూడా కొన్ని ప్రవాహాలు ఉంటాయి.

లంకలు తొలగించి..
కృష్ణా నదిలో కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, అమరావతి మండలాల్లో దాదాపు 8 లంకలు ఉన్నాయి. మొత్తం 13 వేల ఎకరాలకు పైగా భూమి అవసరం. ఈ లంకలను తొలగిస్తే నదిలో పూడిక తీసేయవచ్చు. దాదాపు 10.68 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక వస్తుంది. అది నది గట్లు పటిష్ఠం చేసుకునేందుకు, రాజధాని నిర్మాణానికి ఉపయోగపడుతుంది. నదిలో అదనంగా 3 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే వీలుంటుంది.

చోడవరం, శ్రీకాకుళం బ్యారేజీలతో...
చోడవరం వద్ద 2.4 టీఎంసీలు నిల్వ చేసేలా బ్యారేజి నిర్మాణం జరిగితే విజయవాడ నగరం చుట్టూ నీరు ఉంటుంది. శ్రీకాకుళం వద్ద 6.5 టీఎంసీల నీటితో మరో బ్యారేజి వల్ల లంక గ్రామాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందడంతో పాటు సముద్రం నుంచి ఆటుపోటుల వల్ల ఆ ప్రాంత భూములు ఉప్పుకయ్యలుగా మారుతున్న ఇబ్బందులూ పరిష్కారమవుతాయి.

Link to comment
Share on other sites

@kiran bro, evi enti

అమరావతికి జలదానం!
26-01-2018 10:49:43
 
636525605876144764.jpg
  • వైకుంఠపురం బ్యారేజీ ఏర్పాటు
  • రూ.1,995 కోట్లతో ప్రతిపాదన
  • సాకారమైతే ఏడాదంతా నీరు
  • డీపీఆర్‌ సమర్పించిన వాప్కోస్‌
  • నివేదికపై మంత్రి ఉమా సమీక్ష

అమరావతి (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతి దాహార్తిని సంవత్సరం పొడుగునా తీర్చడం కోసం, వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్‌ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికపై జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం తన కార్యాలయంలో సమీక్షించారు. పులిచింతల నుంచి కృష్ణా జిల్లా శ్రీకాకుళం దాకా ఆనకట్టలలో ఈ బ్యారేజీని సిద్ధం చేయాలని ప్రతిపాదించారు. ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన తలపెట్టిన ఈ నిర్మాణం పొడవు 3.20 కిలోమీటర్లు, నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు. బ్యారేజీ, స్పిల్‌ వే భాగం 1.2 కిలోమీటర్లు , కుడి, ఎడమల గైడ్‌ బండ్స్‌ ఎనిమిది కిలోమీటర్లు ఉంటాయి. రాజధాని ప్రాంత రైతుల సాగునీటి అవసరాలను కూడా తీర్చే ఈ బ్యారేజీ నిర్మాణంలో ఎనిమిది లంక గ్రామాలు మునకకు గురవుతాయి.
 
కృష్ణా జిల్లాలోని కంచకచర్ల మండలం పరిధిలోని గనియత్‌కూరు లంక, చెవిటికల్లు లంక, ఇబ్రహీం పట్నం మండలం పరిధిలోని దాములూరు లంక, వైకుంఠపురం లంక, ధరణికోట లంక, అమరావతి మండలం పరిధిలోని దిగుడులంక, పొందుగుల లంక, అమరావతి లంకలు అస్థిత్వం కోల్పోతాయి. ఈ లంక గ్రామాల్లో భూ సేకరణ కోసం 565 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. దాదాపు 9,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు గురవుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,995 కోట్లుగా వాస్కోస్‌ అంచనా వేసింది. లంక భూముల నుంచి తవ్వి తీసిన ఇసుక, బంకమట్టిని రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం వినియోగించే వీలుంది. ఇసుక, మట్టి తవ్వకాల వల్ల ప్రవాహ వేగం పెరుగుతుందని, ఇదే తరుణంలో ..అమరావతి నగర నిర్మాణం కోసం కావాల్సినంత ఇసుక, మట్టి లభ్యమవుతాయని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. బ్యారేజీ పూర్తయితే .. గ్రావిటీ ద్వారా రాజధాని నగరం అమరావతికి తాగు నీటి అవసరాల కోసం నీటిని తరలించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ..ఇందుకు సంబంధించి కాలువలు .. స్టోరేజీ రిజర్వాయరును నిర్మించడంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ‘వాప్కోస్‌’ను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు.
 
  పులిచింతల-శ్రీకాకుళం (కృష్ణా) మధ్యలో ఆనకట్టల నిర్మాణం 67 టీఎంసీల నిల్వ సామర్థ్యం
వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణంతో రాజధాని నగర తాగు నీటి కష్టాలు తీరడంతోపాటు.. కృష్ణా,గుంటూరు జిల్లాల్లో భూగర్భ జలాల మట్టం కూడా పెరుగుతుంది. ఎగువన కృష్ణా నదిపై నిర్మించిన పులిచింతలలో 45టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది. వైకుంఠపురం ఆనకట్ట సామర్థ్యం 10 టీఎంసీలు. బ్యారేజీ పనుల్లో భాగంగా చేపట్టే పూడికతీతతో అదనంగా మూడు టీఎంసీలకు అది పెరుగుతుంది. చోడవరం వద్ద ఆనకట్ట నిర్మిస్తే రెండున్నర టీఎంసీలు,  శ్రీకాకుళం (కృష్ణా) ఆనకట్టలో మరో ఆరున్నర టీఎంసీలు నిల్వ చేస్తే ..మొత్తం 67 టీఎంసీల నీటిని నిలువరించే అవకాశం ఉంటుందని వాప్కోస్‌ వివరించింది.
 
ఇలా నిలువ చేసిన జలాలను ఎప్పటికప్పుడు వినియోగించుకుంటూనే .. ఆ మేరకు ప్రాజెక్టులలో నీటిని ఎప్పటికప్పుడు నింపుకుంటూపోతే .. ఏడాది పొడుగునా తాగు,సాగు నీటికి ఎలాంటి అవరోధాలూ ఎదురుకాబోవని వాప్కోస్‌ ప్రతినిధులు వివరించారు. దీనికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు కూడా అంగీకరించారు. కృష్ణా జిల్లా చోడవరం నుంచి శ్రీకాకుళం దాకా లంకల్లో తొమ్మిది టీఎంసీల జలాలను స్టోరేజీ చేసుకునే వీలుందని జల వనరుల శాఖ అధికారులు వివరిస్తున్నారు.
Link to comment
Share on other sites

12 టీఎంసీలు... 1,900 కోట్లు
ప్రకాశం బ్యారేజికి ఎగువన నిర్మించే బ్యారేజి వల్ల దాదాపు 10 నుంచి 12 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయవచ్చు. సుమారు 22 టీఎంసీల వరకు వినియోగించుకోవచ్చు. 50 లక్షల మంది తాగునీటికి లేదా రెండున్నర లక్షల ఎకరాలకు పైగా ఆయట్టుకు ఈ నీరు ఉపయోగపడుతుంది. వ్యాప్కోస్‌ వారు రూ.3,278 కోట్లతో ఈ బ్యారేజి నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. జలవనరులశాఖలో గతంలో పని చేసిన అనుభవం ఉండి మంత్రి దేవినేని ఓఎస్డీగా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్‌ కొందరి అధికారుల సహకారంతో క్షేత్రస్థాయి సమాచారంతో రూ.1,901 కోట్లకే ఈ బ్యారేజి పూర్తి చేసేందుకు అవకాశం ఉందని ఒక నివేదిక సిద్ధం చేశారు. వీటిపై చర్చించిన అధికారులు 1,900 కోట్ల ఖర్చుతో  నిర్మాణం పూర్తి చేయవచ్చని అంచనాకు వచ్చారు.

మునేరు ఆధారం
ఈ బ్యారేజిలో నీటి నిల్వకు మునేరు వాగే పెద్ద ఆధారం. ఈ వాగులో ప్రతి ఏడాది దాదాపు రెండు నెలల్లో 50 టీఎంసీల లభ్యత ఉందని లెక్కిస్తున్నారు. గతంలో అన్ని చోట్లా వర్షాలు పడ్డ సమయంలో ఈ మునేరు నీరే సముద్రంలోకి వృథాగా పోయిన సందర్భాలూ ఉన్నాయి. పాలేరు వాగు నుంచి కూడా కొన్ని ప్రవాహాలు ఉంటాయి.

లంకలు తొలగించి..
కృష్ణా నదిలో కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, అమరావతి మండలాల్లో దాదాపు 8 లంకలు ఉన్నాయి. మొత్తం 13 వేల ఎకరాలకు పైగా భూమి అవసరం. ఈ లంకలను తొలగిస్తే నదిలో పూడిక తీసేయవచ్చు. దాదాపు 10.68 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక వస్తుంది. అది నది గట్లు పటిష్ఠం చేసుకునేందుకు, రాజధాని నిర్మాణానికి ఉపయోగపడుతుంది. నదిలో అదనంగా 3 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే వీలుంటుంది.

చోడవరం, శ్రీకాకుళం బ్యారేజీలతో...
చోడవరం వద్ద 2.4 టీఎంసీలు నిల్వ చేసేలా బ్యారేజి నిర్మాణం జరిగితే విజయవాడ నగరం చుట్టూ నీరు ఉంటుంది. శ్రీకాకుళం వద్ద 6.5 టీఎంసీల నీటితో మరో బ్యారేజి వల్ల లంక గ్రామాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందడంతో పాటు సముద్రం నుంచి ఆటుపోటుల వల్ల ఆ ప్రాంత భూములు ఉప్పుకయ్యలుగా మారుతున్న ఇబ్బందులూ పరిష్కారమవుతాయి.

కృష్ణా జిల్లాలోని కంచకచర్ల మండలం పరిధిలోని గనియత్‌కూరు లంక, చెవిటికల్లు లంక, ఇబ్రహీం పట్నం మండలం పరిధిలోని దాములూరు లంక, వైకుంఠపురం లంక, ధరణికోట లంక, అమరావతి మండలం పరిధిలోని దిగుడులంక, పొందుగుల లంక, అమరావతి లంకలు అస్థిత్వం కోల్పోతాయి. ఈ లంక గ్రామాల్లో భూ సేకరణ కోసం 565 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. దాదాపు 9,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు గురవుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,995 కోట్లుగా వాస్కోస్‌ అంచనా వేసింది. లంక భూముల నుంచి తవ్వి తీసిన ఇసుక, బంకమట్టిని రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం వినియోగించే వీలుంది. ఇసుక, మట్టి తవ్వకాల వల్ల ప్రవాహ వేగం పెరుగుతుందని, ఇదే తరుణంలో ..అమరావతి నగర నిర్మాణం కోసం కావాల్సినంత ఇసుక, మట్టి లభ్యమవుతాయని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు

kiran bro,7 islands ki master plan tayaru chesaru, ippudu muguthayi antunaru avi evi okatikadha, naku ఇబ్రహీం పట్నం మండలం పరిధిలోని దాములూరు లంక, వైకుంఠపురం లంక, ధరణికోట లంక, అమరావతి మండలం పరిధిలోని దిగుడులంక, పొందుగుల లంక, అమరావతి లంకలు అస్థిత్వం కోల్పోతాయి evi naku bhavani islands master plan lo unna islands laga anipisthunayi  kochem clear ga chebutra naku

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

కృష్ణా జిల్లాలోని కంచకచర్ల మండలం పరిధిలోని

Quote

గనియత్‌కూరు లంక, చెవిటికల్లు లంక, ఇబ్రహీం పట్నం మండలం పరిధిలోని దాములూరు లంక, వైకుంఠపురం లంక, ధరణికోట లంక, అమరావతి మండలం పరిధిలోని దిగుడులంక, పొందుగుల లంక, అమరావతి లంకలు

అస్థిత్వం కోల్పోతాయి. ఈ లంక గ్రామాల్లో భూ సేకరణ కోసం 565 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. దాదాపు 9,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు గురవుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,995 కోట్లుగా వాస్కోస్‌ అంచనా వేసింది. లంక భూముల నుంచి తవ్వి తీసిన ఇసుక, బంకమట్టిని రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం వినియోగించే వీలుంది. ఇసుక, మట్టి తవ్వకాల వల్ల ప్రవాహ వేగం పెరుగుతుందని, ఇదే తరుణంలో ..అమరావతి నగర నిర్మాణం కోసం కావాల్సినంత ఇసుక, మట్టి లభ్యమవుతాయని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు

kiran bro,7 islands ki master plan tayaru chesaru, ippudu muguthayi antunaru avi evi okatikadha, naku ఇబ్రహీం పట్నం మండలం పరిధిలోని దాములూరు లంక, వైకుంఠపురం లంక, ధరణికోట లంక, అమరావతి మండలం పరిధిలోని దిగుడులంక, పొందుగుల లంక, అమరావతి లంకలు అస్థిత్వం కోల్పోతాయి evi naku bhavani islands master plan lo unna islands laga anipisthunayi  kochem clear ga chebutra naku

Eee Lankallo residents lera. Only farming aa?.

Like in our Village (Kothuru Lanka) down stream from Prakasam barrage. Ippudu Srikakulam daggara propose chesthunna lankalu maavi. Around 10 villages and 8000-10000 population and around 10000acres farming land.

It would be bad idea to remove these people from these villages and do the barrage at Srikakulam. If they can store at srikakulam without removing them then it is good idea.

Same alane "నియత్‌కూరు లంక, చెవిటికల్లు లంక, ఇబ్రహీం పట్నం మండలం పరిధిలోని దాములూరు లంక, వైకుంఠపురం లంక, ధరణికోట లంక, అమరావతి మండలం పరిధిలోని దిగుడులంక, పొందుగుల లంక, అమరావతి లంకలు" lankallo residents lekapothe may be they can submerge them and build. However ee lankalu kooda manchi fertile lands aithe land submerge kakunda store chesukokaligithe better, rather than digging them for soil.

Link to comment
Share on other sites

11 hours ago, sonykongara said:

12 టీఎంసీలు... 1,900 కోట్లు
ప్రకాశం బ్యారేజికి ఎగువన నిర్మించే బ్యారేజి వల్ల దాదాపు 10 నుంచి 12 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయవచ్చు. సుమారు 22 టీఎంసీల వరకు వినియోగించుకోవచ్చు. 50 లక్షల మంది తాగునీటికి లేదా రెండున్నర లక్షల ఎకరాలకు పైగా ఆయట్టుకు ఈ నీరు ఉపయోగపడుతుంది. వ్యాప్కోస్‌ వారు రూ.3,278 కోట్లతో ఈ బ్యారేజి నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. జలవనరులశాఖలో గతంలో పని చేసిన అనుభవం ఉండి మంత్రి దేవినేని ఓఎస్డీగా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్‌ కొందరి అధికారుల సహకారంతో క్షేత్రస్థాయి సమాచారంతో రూ.1,901 కోట్లకే ఈ బ్యారేజి పూర్తి చేసేందుకు అవకాశం ఉందని ఒక నివేదిక సిద్ధం చేశారు. వీటిపై చర్చించిన అధికారులు 1,900 కోట్ల ఖర్చుతో  నిర్మాణం పూర్తి చేయవచ్చని అంచనాకు వచ్చారు.

మునేరు ఆధారం
ఈ బ్యారేజిలో నీటి నిల్వకు మునేరు వాగే పెద్ద ఆధారం. ఈ వాగులో ప్రతి ఏడాది దాదాపు రెండు నెలల్లో 50 టీఎంసీల లభ్యత ఉందని లెక్కిస్తున్నారు. గతంలో అన్ని చోట్లా వర్షాలు పడ్డ సమయంలో ఈ మునేరు నీరే సముద్రంలోకి వృథాగా పోయిన సందర్భాలూ ఉన్నాయి. పాలేరు వాగు నుంచి కూడా కొన్ని ప్రవాహాలు ఉంటాయి.

లంకలు తొలగించి..
కృష్ణా నదిలో కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, అమరావతి మండలాల్లో దాదాపు 8 లంకలు ఉన్నాయి. మొత్తం 13 వేల ఎకరాలకు పైగా భూమి అవసరం. ఈ లంకలను తొలగిస్తే నదిలో పూడిక తీసేయవచ్చు. దాదాపు 10.68 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక వస్తుంది. అది నది గట్లు పటిష్ఠం చేసుకునేందుకు, రాజధాని నిర్మాణానికి ఉపయోగపడుతుంది. నదిలో అదనంగా 3 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే వీలుంటుంది.

చోడవరం, శ్రీకాకుళం బ్యారేజీలతో...
చోడవరం వద్ద 2.4 టీఎంసీలు నిల్వ చేసేలా బ్యారేజి నిర్మాణం జరిగితే విజయవాడ నగరం చుట్టూ నీరు ఉంటుంది. శ్రీకాకుళం వద్ద 6.5 టీఎంసీల నీటితో మరో బ్యారేజి వల్ల లంక గ్రామాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందడంతో పాటు సముద్రం నుంచి ఆటుపోటుల వల్ల ఆ ప్రాంత భూములు ఉప్పుకయ్యలుగా మారుతున్న ఇబ్బందులూ పరిష్కారమవుతాయి.

కృష్ణా జిల్లాలోని కంచకచర్ల మండలం పరిధిలోని గనియత్‌కూరు లంక, చెవిటికల్లు లంక, ఇబ్రహీం పట్నం మండలం పరిధిలోని దాములూరు లంక, వైకుంఠపురం లంక, ధరణికోట లంక, అమరావతి మండలం పరిధిలోని దిగుడులంక, పొందుగుల లంక, అమరావతి లంకలు అస్థిత్వం కోల్పోతాయి. ఈ లంక గ్రామాల్లో భూ సేకరణ కోసం 565 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. దాదాపు 9,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు గురవుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,995 కోట్లుగా వాస్కోస్‌ అంచనా వేసింది. లంక భూముల నుంచి తవ్వి తీసిన ఇసుక, బంకమట్టిని రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం వినియోగించే వీలుంది. ఇసుక, మట్టి తవ్వకాల వల్ల ప్రవాహ వేగం పెరుగుతుందని, ఇదే తరుణంలో ..అమరావతి నగర నిర్మాణం కోసం కావాల్సినంత ఇసుక, మట్టి లభ్యమవుతాయని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు

kiran bro,7 islands ki master plan tayaru chesaru, ippudu muguthayi antunaru avi evi okatikadha, naku ఇబ్రహీం పట్నం మండలం పరిధిలోని దాములూరు లంక, వైకుంఠపురం లంక, ధరణికోట లంక, అమరావతి మండలం పరిధిలోని దిగుడులంక, పొందుగుల లంక, అమరావతి లంకలు అస్థిత్వం కోల్పోతాయి evi naku bhavani islands master plan lo unna islands laga anipisthunayi  kochem clear ga chebutra naku

kiran bro, islands munige paristhi unte e master plan evi cheyyatam enduku waste kadha,.

Link to comment
Share on other sites

e barrage valla lbham entha undo nastam antha undi

- Deep dredging required and we loose permanently the natural islands

- Not sure what is the height of barrage they are planning...but they have to be very careful.....Capital some villages will be less height then this barrage and it is risky..

- barrage here creates BACKFLUSH problem for NARUKULLAPADU vagu and that will divert water to capital area villages which are low height(via pedaparimi water will flow to undavallai area)

- Amaravati temple kooda water takuddi almost and we loose temple ghat

Link to comment
Share on other sites

అంచనాల్లో ఇంత తేడానా?
వైకుంఠపురం బ్యారేజీకి వ్యాప్కోస్‌ అంచనాలు రూ.3278 కోట్లు
జలవనరులశాఖ లెక్కిస్తే రూ.1901 కోట్లు
వ్యాప్కోస్‌ సర్వేను తప్పుపడుతున్న జలవనరుల బృందం
లేని భూమి ఎక్కడినుంచి వచ్చిందంటూ ప్రశ్నలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి రూ.3278 కోట్లతో వ్యాప్కోస్‌ సిద్ధం చేసిన పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక (ప్రాథమిక) జలవనరుల శాఖ ఇంజినీర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. రూ.కోట్లు చెల్లిస్తూ ప్రభుత్వం వారికి బాధ్యతలు అప్పగిస్తే ఆ సర్వేలో తప్పులు చోటుచేసుకోవడమే కాకుండా లేని భూమిని ఉన్నట్లు చూపించడంతో పాటు వాస్తవాలకు మించి అంచనాలు లెక్కించిన వైనాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇదే ప్రాజెక్టుపై జలవనరుల శాఖ మంత్రి ఓఎస్డీ రాజేంద్రప్రసాద్‌, మరికొందరు ఇంజినీరింగు, రెవెన్యూ అధికారుల సాయంతో క్షేత్ర స్థాయి సర్వే చేసి సమాచారం తీసుకుని లెక్కించగా అంచనా విలువ రూ.1901 కోట్లకు తగ్గింది. వ్యాప్కోస్‌ పేర్కొన్న భూమి వివరాలు తదితర అంశాల్లో తప్పుల వల్ల ఏకంగా అంచనాలు రూ.1376 కోట్ల మేర పెరిగాయని ఒక ఇంజినీరింగు అధికారి ‘ఈనాడు’ వద్ద వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జలవనరుల శాఖ ప్రాజెక్టులను రూపొందించేందుకు చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌కే సర్వే బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికే గోదావరి పెన్నా అనుసంధానంపై ప్రాజెక్టు నివేదికను రూపొందించే బాధ్యతను ఎప్పుడో ఏడాదిన్నర కిందట అప్పటి అధికారులు వ్యాప్కోస్‌కు అప్పగించారు. గడువు పెంచినా ఇప్పటికీ వారు పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికను అందించలేదని జలవనరుల శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపు మాపు అంటున్నారని జలవనరులశాఖ అధికారులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా వారి పూర్తి స్థాయి కార్యాలయం అమరావతిలో ఏర్పాటుచేయకపోవడం, సమావేశాలు ఏర్పాటుచేయాలనుకున్నా ఆలస్యమవుతూ వస్తుండటమూ విమర్శలను ఎదుర్కొంటోంది.

అంతభూమి ఎక్కడుంది?
కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణానికి వ్యాప్కోస్‌ సర్వే చేసింది. ప్రాథమికంగా పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి అధికారులతో చర్చకు పెట్టింది. ఇందులో వారు భూసేకరణ కోసం ఏకంగా రూ.1510 కోట్లు కేటాయింపులు చూపారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి వ్యాప్కోస్‌ 29,065 ఎకరాలు అవసరమవుతాయని లెక్క తేల్చిందని, ఇందుకు పరిహారంగా రూ.1510 కోట్లు అవసరమవుతాయని పేర్కొందని ఒక అధికారి తెలిపారు. నిజానికి అక్కడ అంత భూమి లేదు.. అంత ఖర్చు అవసరం ఉండదని.. ఈ విషయాన్ని వ్యాప్కోస్‌తో గురువారం జరిగిన సమావేశంలోనూ తెలియజేశామని చెప్పారు. వ్యాప్కోస్‌ పంపిన ప్రాథమిక పూర్తి స్థాయి నివేదికను పరిశీలించి క్షేత్రస్థాయి నుంచి తాము వివరాలు రప్పించి పోల్చి చూస్తే ఎన్నో తప్పులున్నాయని పేర్కొంటున్నారు.

ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, అమరావతి మండలాల్లోని ఎనిమిది లంకల్లో మొత్తం 10,400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, వ్యాప్కోస్‌ దీన్ని ఏకంగా 14,507 ఎకరాలుగా చూపించిందని జలవనరులశాఖ నిపుణులు చెబుతున్నారు. పట్టా, అసైన్డ్‌ భూములు కలిపి 2951 ఎకరాలే ఉండగా వ్యాప్కోస్‌ ఏకంగా 11,600 ఎకరాలు చూపిందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాప్కోస్‌ పేర్కొన్న 2901 ఎకరాల అటవీభూమి ఎక్కడ ఉందని కూడా అధికారులు కొందరు ప్రశ్నిస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

వైకుంఠపురం బ్యారేజీతో రాజధానికి తాగునీరు 
10 టీఎంసీలు నిల్వచేసేలా నిర్మాణం 
రూ.1985కోట్ల ప్రతిపాదనలతో సిద్ధమైన నివేదిక 
మూడేళ్లలో పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళిక 
ఈనాడు-అమరావతి
రాజధాని ప్రాంతంలో తాగునీటి అవసరాలు తీర్చడంతోపాటు పులిచింతల దిగువభాగంలో వచ్చే వరదనీటిని నిల్వచేయడానికి వీలుగా కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కార్యాచరణ నివేదిక సిద్ధం చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.1985కోట్లు వెచ్చించి మూడేళ్లలో పూర్తిచేయాలనేది ప్రణాళిక. ఇక్కడ 10టీఎంసీల నీటిని నిల్వచేసే సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తారు. ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు 60కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించనున్నారు. బ్యారేజీ నిర్మాణంతో నదికి రెండువైపులా భూగర్భజలాలు పెరగనున్నాయి. భవిష్యత్తులో రాజధాని ప్రాంతంలో తాగునీటి కొరత లేకుండా ఇక్కడి నుంచి నీటిని సరఫరా చేస్తారు.
9738 ఎకరాల భూసేకరణ 
వైకుంఠపురం బ్యారేజీ నిర్మించే ప్రాంతంలో 75 ఏళ్లలో కృష్ణానదిలో నీటిలభ్యత సగటు 35.44టీఎంసీలు ఉన్నట్లు లెక్కించారు. ఇందులో ఏటా 10టీఎంసీలు నిల్వచేసి ఉపయోగించుకోవాలనేది ప్రణాళిక. కృష్ణానదికి వరదలు సమయంలో వైకుంఠపురం బ్యారేజీ నుంచి ఒకరోజులో 100.68 టీఎంసీలు నీటిని విడుదల చేసేలా 55 గేట్లను ఏర్పాటుచేస్తున్నారు. మొత్తం 1250 మీటర్ల మేర స్పిల్‌వే నిర్మిస్తారు. బ్యారేజీలో 10టీఎంసీల నీటినిల్వతో కృష్ణానదితోపాటు పరిసర ప్రాంతాల్లో 9738 ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది. భూసేకరణకు సుమారు రూ.770కోట్లు నిధులు అవసరమని అంచనా వేశారు. కాంక్రీటు నిర్మాణాలకు రూ.919కోట్లు, భవనాలు, సర్వీసు రహదారులు, వంతెలు తదితర పనులకు కలిపి మొత్తం రూ.1985కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి త్వరలోనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. పనులు చేపట్టిన మూడేళ్లలో పూర్తిచేసి నీటిని నిల్వచేయాలని నిర్ణయించారు.

వాగుల వరదనీటికి అడ్డుకట్ట 
కృష్ణానదిలో వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించడం ద్వారా వరదనీటికి అడ్డుకట్ట వేసి ఉపయోగించుకోనున్నారు. పులిచింతల దిగువన కృష్ణానదిలోకి మునేరు, పాలేరు తదితర వాగులు వచ్చి కలుస్తున్నాయి. వర్షాకాలంలో వాగులకు వరదల వల్ల కృష్ణానది ద్వారా వరదనీరు ప్రకాశంబ్యారేజీకి చేరుతోంది. ప్రకాశంబ్యారేజీ నీటినిల్వ సామర్థ్యం 3టీఎంసీలు మాత్రమే కావడంతో అదనంగా వచ్చిన వరదనీటిని నదిలోకి వదులుతున్నారు. అదే సమయంలో స్థానికంగా వర్షాలు పడుతున్నందున సాగునీటి అవసరాలు తక్కువగా ఉండటంతో వరదనీరు నదిలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు పోలవరం కుడికాలువ ద్వారా వస్తున్న నీటిని కొన్నిరోజులు పాటు నిలుపుదల చేయాల్సి వస్తోంది. వీటన్నిటికి పరిష్కారమార్గంగా వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించి వాగుల ద్వారా వచ్చే నీటికి అడ్డుకట్ట వేస్తారు. పులిచింతల దిగువ, వైకుంఠపురం బ్యారేజీ నడుమ 60కిలోమీటర్ల వ్యవధిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని నీటిని 10టీఎంసీలు నిల్వచేస్తారు. ఈనీటిని రాజధాని తాగునీటి అవసరాలకు ఉపయోగించడంతోపాటు అత్యవసరమైనప్పుడు ప్రకాశంబ్యారేజీకి విడుదల చేసి వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. దీంతోపాటు గరిష్ఠంగా 25మీటర్ల మేర బ్యారేజీలో నీటిని నిల్వచేయడం ద్వారా పరిసరప్రాంతాల్లో భూగర్భజలాలు పెరగనున్నాయి. వీటిన్నిటిని దృష్టిలో ఉంచుకుని వీలైనంత తొందరగా నిర్మాణం పూర్తిచేయాలన్న యోచనలో జలవనరులశాఖ కార్యాచరణ ప్రణాళికతో సిద్ధమవుతోంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
కరుణిస్తే.. కొండకు వైభవం 
తితిదే సహకారంతో వైకుంఠపురం ప్రగతి 
‌అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రమే.. 
స్వయంభువుగా వెలసిన వేంకటేశ్వరుడు 
పురాతన ఆలయం ప్రగతి 
ఈనాడు-అమరావతి 
amr-sty3a.jpg

కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే ప్రాంతం.. స్వయంభువుగా వెలసిన వేంకటేశ్వరుడు.. సుమారు 5వేల సంవత్సరాల నాటి ఆలయం.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్రమైన వైకుంఠపురం వేంకటేశ్వరుని ఆలయం అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా రాజధాని ప్రాంతానికి తలమానికం కానుంది. రూ.100కోట్లతో వెంకన్న ఆలయాన్ని నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ప్రకటించింది. ఈ ఆలయ ప్రాశస్త్యం, పవిత్రత, ఇతర అంశాల ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడే ఆలయాన్ని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. వాసిరెడ్డి వెంకట్రాదినాయుడు కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది. అంతకుముందు పాలించిన రాజులు భూములు ఇచ్చి చేయూతనిచ్చారు. రాజధాని నిర్మాణం నేపథ్యంలో వైకుంఠపురం కొండపై ఆలయాన్ని అభివృద్ధి చేయడం అన్నివిధాలా అనుకూలమైనదన్న వాదన వినిపిస్తోంది.

ఆధ్యాత్మిక, పర్యటకానికి అనుకూలం 
అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం సమీపంలో కౌంచగిరి కొండపై వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలిశారు. సుమారు 5వేల సంవత్సరాల క్రితం నుంచి ఆలయం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో కొండ కింది భాగంలో ఆలయం నిర్మించారు. రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మికంగా పేరొందిన ఈ ఆలయ ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ఆలయాన్ని నిర్మించాలని తితిదేని కోరింది. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండపై చదునైన ప్రాంతం లేనందున అభివృద్ధి పనులకు అధిక వ్యయం చేయాల్సి వస్తుందని, ప్రత్యామ్నాయం చూడాలని తితిదే ప్రభుత్వానికి లేఖ రాసింది. కొండ పైభాగంలో బైరవకోనగా పిలుస్తున్న ప్రాంతంలో సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో చదునైన ప్రాంతం ఉంది. దీనిని వినియోగించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వైకుంఠపురం వద్ద కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుండటంతో ఈప్రాంతం పవిత్రమైనదిగా భావిస్తారు. తొలి ఏకాదశి రోజున వేలమంది భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం కొండపైకి మెట్లదారి మాత్రమే ఉంది. కొండను ఒకవైపు గట్టుగా చేసుకుని వైకుంఠపురం బ్యారేజీ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇక్కడే గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ రోడ్డు వంతెన, రైలు వంతెన కృష్ణానదిపై నిర్మించనున్నారు. ఈక్రమంలో వైకుంఠపురం కొండను అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మికంగా, పర్యటకంగా వృద్ధి చెందడానికి అనేక అనుకూలతలు తోడ్పడుతాయి. గతంలోనే కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణం ప్రారంభమైనా రాజకీయ కారణాలతో అడ్డంకి ఏర్పడి ఆగిపోయింది. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదికి కుడివైపు కరకట్ట వైకుంఠపురం కొండ వరకు ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి కరకట్ట మీదుగా భక్తులు వైకుంఠపురం ఆలయానికి చేరుకునేవారు. ఈమార్గాన్ని ఇటీవల కొంత అభివృద్ధి చేశారు. రాజధాని నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కృష్ణానది కరకట్ట ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

పట్టాలెక్కేనా? 
రాజధానికి  మణిహారం 
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి సమీపంలో వైకుంఠపురం ఉంది. తితిదే ప్రకటించినట్లు దీనిని రూ.100కోట్లతో పనులు చేస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంది. పర్యటకంగా ప్రగతి సాధ్యమవుతుంది. సమీపంలో పంచారామాలలో ప్రథమారామం అమరలింగేశ్వరుని ఆలయం, అనంతవరం కొండపై వేంకటేశ్వరుడు, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, కృష్ణానదికి అటువైపు కనకదుర్గ ఆలయం ఉండటంతో వీటన్నింటినీ కలిపి ఆధ్యాత్మిక వలయంగా అభివృద్ధి చేయవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో ఉంది. తితిదే తాజాగా ఫిబ్రవరి 26వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ప్రభుత్వ తీసుకునే నిర్ణయంపై వైకుంఠపురం ఆలయ వైభవం ఆధారపడి ఉంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
కొత్త ప్రాజెక్టులకు ఏప్రిల్‌లో టెండర్ల ఖరారు
మొత్తం రూ.13,640 కోట్లతో 11 ప్రాజెక్టులకు కార్యాచరణ
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా రూ.13,640 కోట్ల విలువ చేసే దాదాపు 11 ప్రాజెక్టులకు కార్యాచరణ సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి అన్ని అంశాలు కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే ఇందులో కొన్నింటికి జలవనరులశాఖ అధికారులు పాలనామోదం ఇచ్చేశారు. మరికొన్ని పూర్తి స్థాయి ప్రాజెక్టులుగా సిద్ధమవుతున్నాయి. వీటిని ఆయా చీఫ్‌ ఇంజినీర్ల నుంచి రాష్ట్ర జలవనరులశాఖకు; అక్కడి నుంచి ఆర్థికశాఖకు వెళ్లి ప్రభుత్వ ఆమోదంతో జలవనరులశాఖ పాలనామోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా వేగంగా పూర్తి చేసి ఏప్రిల్‌ నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతస్థాయి ఆదేశాలు ఉన్నాయి.
వీటితోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూ.2,022 కోట్లతో తొలిదశకు ఇప్పటికే పాలనామోదం ఇచ్చి ఉన్నారు. ఇందులో కొంతమేర టెండర్లు పిలిచారు. మిగిలిన వాటికి టెండర్లు పిలిచి ఖరారు చేయాల్సి ఉంది. హిరమండలం జలాశయాన్ని రూ.1,055 కోట్లతో ఇచ్ఛాపురం హైలెవెల్‌ కాలువకు అనుసంధానం చేపట్టాలని ఇప్పటికే ఆలోచన ఉంది. దీనిని పూర్తిస్థాయి ప్రాజెక్టుగా సిద్ధం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ డీపీఆర్‌ త్వరగా పూర్తి చేయాలన్న సూచనలు అధికారులకు
image.jpgఅందుతున్నాయి.

* గోదావరి-పెన్నా తొలిదశ డీపీఆర్‌ సిద్ధమవుతోంది.
* సత్యసాయిగంగ కాలువ నుంచి ఎత్తిపోతల తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమే. ఇప్పటికే సవరించిన అంచనాలు ఆమోదం పొందాయి.
* వేదవతి ప్రాజెక్టు కర్ణాటక, కర్నూలు సరిహద్దులో నిర్మించాల్సింది. డీపీఆర్‌ సిద్ధం కావాలి. కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
* కర్నూలు జిల్లాలోని ఏడు పశ్చిమ మండలాలకు హంద్రీనీవా నుంచి కాలువ ద్వారా నీటి మళ్లింపు. మొత్తం 1.243 టీఎంసీలు మళ్లించాలని యోచన. త్వరగానే చేపట్టే అవకాశం ఉంది. గుండ్రేవుల.. కర్నూలు జిల్లా వాసుల చిరకాల వాంఛ. ఎప్పటి నుంచో ప్రభుత్వం చెబుతూ వస్తున్నందున ప్రజల్లో విశ్వసనీయత ఏర్పడటం లేదనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే డీపీఆర్‌ పూర్తయింది. పాలనామోదం ఇస్తే తక్షణం చేపట్టే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...