Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

విశాఖలోఎలక్ట్రిక్‌ బస్సులు

తిరుమల-తిరుపతిలోనూ అమలు

కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు

ఈనాడు - అమరావతి

ఫైబర్‌గ్రిడ్‌ను వినియోగించి, పోలీసులతో కలిసి ఇళ్లకు భద్రత ఇచ్చే పని చేపడితే బాగుంటుంది. ఇంటి యజమానులు వాచ్‌మెన్‌లకు ఇచ్చే దాంట్లో 10శాతం చెల్లించినా నిర్వహణ అద్భుతంగా ఉంటుంది.

తిరుపతి-తిరుమల, విశాఖలోని శీఘ్ర రవాణా వ్యవస్థ(బీఆర్‌టీఎస్‌)లో ఎలక్ట్రికల్‌ బస్సులు ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో శుక్రవారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. పురపాలికల్లో యాచకులకు ఎట్లా పునరావాసం కల్పించొచ్చో ఆలోచించాలని సూచించారు. అందుబాటులో ఇళ్ల పథకంలో ఇళ్ల ధరలు అధికంగా ఉన్నట్లు ఎమ్మెల్యేలు ప్రస్తావించారని, దీనిపై కసరత్తు చేయాలని, ఒకవేళ ఎక్కువగా ఉన్నదాన్ని పురపాలికలు, ప్రభుత్వం భరిస్తాయని వివరించారు. తిరుపతిలో ఒక కాలనీలో ఇళ్లు కట్టాలని అనుకున్నా పూర్తి చేయలేకపోయామని, ఒక్క కాలనీకే ఇలా అయితే ఎట్లాని ప్రశ్నించారు. నంద్యాలలో 13వేలు ఇళ్ల నిర్మాణానికి ఎస్సార్బీసీ భూముల అంశాన్ని మంత్రివర్గంలో పెట్టాలని సీఎం సూచించారు.

ఆ సౌరవిద్యుత్తు ప్లాంటుపై..

‘‘కడప జిల్లా మైలవరంలో సౌరవిద్యుత్తు యూనిట్‌కు రూ.3.15 చొప్పున చేసిన కేటాయింపులపై ఒప్పందాలు చేసుకోకపోతే పరిశీలించాలి. ఎందుకంటే రాజస్థాన్‌లో యూనిట్‌కు రూ.2.45 చొప్పునే నెలకొల్పుతున్నారు. సౌరవిద్యుత్తు నిల్వకు టెస్లా కంపెనీ యూనిట్‌ వ్యయం రూ.8 కాగా.. అమరరాజా కంపెనీది రూ.5గా ఉంది. రెండింటిలో మెరుగైన, నాణ్యమైన విధానాన్ని ఎంపిక చేయాలి’’ అని చంద్రబాబు విద్యుత్తు అధికారులకు సూచించారు. అనంతపురం జిల్లాలోని ఎన్‌పీకుంట సౌరవిద్యుత్తుకు రెండు వరసల రహదారి నిర్మాణ పనులను సీఎస్‌ఆర్‌, ప్రభుత్వ నిధులతో చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా లక్ష కనెక్షన్లు ఇచ్చిన తర్వాత ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల మధ్య మరొక వంతెన ప్రతిపాదనలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో వంద ఆర్థిక నగరాలను అభివృద్ధి చేయనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించింది. వరదనీటి వినియోగం, రోడ్లు, పారిశుద్ధ్యం, మురుగునీటిశుద్ధి,ఇంటింటి చెత్తసేకరణలో విశాఖపట్నం, కృష్ణాలు మొదటి, రెండో స్థానాల్లో నిలిచాయి.

Link to comment
Share on other sites

  • Replies 1.1k
  • Created
  • Last Reply

యుద్ధవిమాన మ్యూజియం పనులు వేగవంతం చేయాలి

అధికారులకు మంత్రిగంటా ఆదేశం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే:

vsp-gen7a.jpg

టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, కమిషనర్‌ హరినారాయణన్‌, వుడా వీసీ బసంత్‌కుమార్‌, ఏయూ వీసీ నాగేశ్వరరావు, శాసనసభ్యులు వాసుపల్లి గణేష్‌కుమార్‌, పల్లా శ్రీనివాసరావు, వుడా సీఈ చంద్రయ్య తదితర అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ యుద్ధవిమాన మ్యూజియం ఏర్పాటు పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను ఆరా తీశారు. ఆగస్టు 15వ తేదీనాటికి మ్యూజియం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి యుద్ధ విమాన విభాగాలను తరలించాలని నౌకాదళ అధికారులు కోరుతున్నారని, తక్షణమే బీచ్‌రోడ్డులో ప్రతిపాదిత స్థలంలో ఒక ప్లాట్‌ఫామ్‌ం ఏర్పాటు చేసి దీన్ని తరలించే ప్రక్రియను చేపట్టాలన్నారు. ఏయూకు చెందిన ఎకరం స్థలంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆ స్థలంలోని పాత భవనంలో నిర్వహిస్తోన్న తరగతులను మరో భవనానికి మార్చాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే మ్యూజియం ఏర్పాటుకు సవివర నివేదికను తయారుచేసేందుకు పలువురు ఆసక్తి వ్యక్తపరుస్తూ నివేదికలు ఇచ్చారని, వారితో సమావేశం ఏర్పాటు చేసి ఖరారు చేయాలన్నారు. రాజీవ్‌ స్మృతి భవన్‌, వార్‌మెమోరియల్‌, మల్టీలెవల్‌ పార్కింగ్‌ కలుపుకొని నివేదిక రూపొందించాలన్నారు. రెవెన్యూ, వుడా, ఏయూ, పర్యాటక శాఖ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీలో భాగంగా స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు చేశామని, యుద్ధవిమాన మ్యూజియం నిర్వహణ, రెవెన్యూ వసూలు వంటి బాధ్యతలను ఆ సంస్థకు అప్పగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.

Link to comment
Share on other sites

Naxal&emergency lo baga use avutundi........

 

Gitam vadi hospital kuda SUPER untundi.....TOo much invest chesadu Murthy dani kosam....also ekkada compromise kaledu...

 

 

/********************

Awaits no objection certificate from Fire Services Department; Chief Minister to inaugurate it on July 14
An air ambulance with roof-top helipad and add-on facilities like wellness centres are in the offing at a 10-floor corporate hospital being opened with an investment of Rs. 220 crore in the heart of the city abutting the National Highway by a team of local doctors.

 

After obtaining clearance from the Civil Aviation Ministry, the hospital with bed strength of 600, which the management says is the largest so far in the private sector in Andhra Pradesh, is awaiting a ‘no objection certificate’ from the Fire Department and clearances from other statutory agencies. Air ambulance will be of great help in saving lives of the victims of industrial accidents, those injured in police-Maoist encounters and major road accidents in evacuating the patients within a few minutes to the hospital for expert care. When major accidents occurred at the Visakhapatnam Steel Plant and the HPCL Visakh Refinery, those who suffered serious burns had to be shifted to Mumbai by engaging an air ambulance paying huge amount. Pradhama Hospital will obtain an air ambulance costing Rs. 3 crore in about six months. The building has a built-up area of six lakh sq.ft. with basement parking for 600 cars near

 

Venkojipalem Junction.

Healthcare to all

“Our dream to have a hospital of our own to provide healthcare to all sections of society has become a reality. The investment has been made by 62 experienced city-based doctors on a ‘cooperative basis’. The people will also have an opportunity to invest in it as it is being made operational as a cooperative hospital,” hospital Managing Director P. Visweswara Rao told The Hindu on Monday.
Chief Minister N. Chandrababu Naidu is scheduled to inaugurate the hospital on July 14.

It has all super-specialities with 13 stretcher lifts with a carrying capacity of 20 to 30 persons.
Three hundred junior doctors will offer 24x7 service with separate burns ward, cardiac, cath lab, blood bank and other facilities.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...