Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
సౌందర్య, బుద్ధ, వైకుంఠ మాల
 
636180533435946071.jpg
  • విశాఖ, అమరావతి, తిరుపతి ఓఆర్‌ఆర్‌ పేర్లు
  • రాష్ట్రంలో 16 స్మార్ట్‌ సిటీలు
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): సౌందర్యమాల, బుద్ధమాల, వైకుంఠమాల.. రాష్ట్రంలోని మూడు ప్రధాన నగరాల్లో నిర్మించనున్న ఔటర్‌ రింగు రోడ్ల(ఓఆర్‌ఆర్‌)కు పెట్టనున్న పేర్లు ఇవి. విశాఖ నగరం మధ్య నుంచి బీచ, భోగాపురం విమానాశ్రయం నుంచి తిరిగి నగరం వరకు ఔటర్‌ రింగు రోడ్డును నిర్మించనున్నారు. దీనికి సౌందర్యమాల అని పేరు పెట్టాలని భావిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి చుట్టూ నిర్మించనున్న ఓఆర్‌ఆర్‌కు బుద్ధమాల అని, తిరుపతి నగరం చుట్టూ నిర్మించనున్న ఓఆర్‌ఆర్‌కు వైకుంఠమాల అని పేరు పెట్టాలని యోచిస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ల భేటీలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇంకా ఏమైనా మంచి పేర్లు ఉన్నా సూచించాలని కోరారు. పట్టణాభివృద్ధిపై సమావేశంలో చర్చ జరిగింది.
 
ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీస్‌ పథకం కింద ఎంపిక చేసిన విశాఖపట్నం, కాకినాడ, తిరుపతితోపాటు మొత్తం 14నగరాలు, నగర హోదా పొందిన రెండు పట్టణాలు కలిపి మొత్తం 16 నగరాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని అధికారులు చెప్పారు. 2022కి పీఎంఈవై పథకం కింద 14 లక్షల ఇళ్లు నిర్మించవచ్చని, అయితే ఇప్పటివరకు కేవలం 4.98 లక్షల మంది లబ్ధిదారులనే గుర్తించారని సీఎం వ్యాఖ్యానించారు. లబ్ధిదారుల ఎంపికలో వేగం పెంచాలని సూచించారు. రాష్ట్రంలో 29 శాతం ఉన్న పట్టణ జనాభా 50 శాతానికి పెరగాలన్నారు. పేదలకు నిర్మించి ఇచ్చే ఒక గది, రెండు గదుల ఇళ్లకు కావాల్సిన నిధులకు ఇబ్బంది లేదని సీఎం చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం డెవలపర్లను కూడా ఎంపిక చేయాలని ఆదేశించారు.
 
9colle2.jpg 
Link to comment
Share on other sites

సౌందర్యమాల
 
636181722414140340.jpg
  • విశాఖకు అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదన
  • కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించిన సీఎం
  • కార్యరూపం దాల్చితే నగరంలో తగ్గనున్న ట్రాఫిక్‌ సమస్య
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
ఇప్పటివరకు ‘సాగరమాల’ పేరు విన్నాం. ఇది దేశంలోని మేజర్‌ పోర్టులన్నింటినీ అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న జలమార్గం. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో ‘సౌందర్యమాల’ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఇది విశాఖ అవుటర్‌రింగ్‌ రోడ్డు. హైదరాబాద్‌కు రింగ్‌ రోడ్డు నిర్మించినట్టుగానే విశాఖలోను నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన వుంది. నగరంలోకి భారీ వాహనాలు రాకుండా మళ్లించాలనేది ఆలోచన. అయితే బీజేపీ అధికారం చేపట్టాక...‘విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌’ను ప్రకటించింది. ఆ తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడానికి సంకల్పించారు. సెప్టెంబర్‌ నెలలో విశాఖ నగరం మొత్తం పర్యటించినపుడు ఆయన రామకృష్ణా బీచ నుంచి భీమిలి బీచ వరకు వేస్తున్న నాలుగు లేన్ల రహదారిని పరిశీలించారు. ఆ మార్గాన్ని భోగాపురం వరకు వేస్తే బాగుంటుందని, విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేవారు బీచ మార్గంలో పయనించవచ్చునని సూచించారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తరువాత భీమిలి, ఆనందపురం, మధురవాడ ప్రాంతాలను పరిశీలించినపుడు జాతీయ రహదారి నుంచి ఎక్కడికక్కడ మార్గాలు వేస్తూ బీచకు కనెక్టివిటీ ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు తాజాగా ‘సౌందర్యమాల’ అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రకటించారు.
 
 
ఎలా ఉంటుందంటే...?
సౌందర్యమాల అవుటర్‌ రింగ్‌ రోడ్డు ఒక ఆలోచన మాత్రమే. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధ్యయనం, ప్రతిపాదనలు జరగలేదు. విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ అధికారులే దీన్ని చేపట్టాల్సి వుంది. వారి మాటల ప్రకారం...జాతీయ రహదారి మీద నుంచి బీచ రోడ్డు మీదుగా భీమిలి, భోగాపురం...అక్కడి నుంచి తగరపువలస-ఆనందపురం-పెందుర్తి మీదుగా నగరంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డును కలుపుతూ రింగ్‌ రోడ్డును పూర్తి చేయడానికి అవకాశం వుంది. భీమిలి-భోగాపురం మార్గానికి సీపీడబ్ల్యు అధికారులు ఇప్పటికే సర్వే చేస్తున్నారు. ఇది విశాఖ-చెన్నై కారిడార్‌లో భాగంగా వుంటుందనే వాదన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అవుటర్‌ రింగ్‌ రోడ్డుగా మారిస్తే నగరంలో ట్రాఫిక్‌ తగ్గుతుంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. నగరంలోకి వచ్చి ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండానే నేరుగా అవుటర్‌పై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవచ్చును.
Link to comment
Share on other sites

విశాఖలో స్కై టవర్‌
 
636191723145212502.jpg
  • దేశంలో కెల్లా అతి ఎత్తయిన నిర్మాణం 
  • ఎత్తు 120 మీటర్లు, వ్యయం రూ.68 కోట్లు 
  • 27న సీఐఐ సదస్సులో జర్మనీ కంపెనీతో ఒప్పందం 
 
విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : విశాఖపట్నంలోని కైలాసగిరిపై స్కై టవర్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశాన్ని ముద్దాడినట్టుగా ఉండే ఈ నిర్మాణం ఎత్తు 120 మీటర్ల పైమాటే. ఇలాంటి ఎత్తయిన నిర్మాణాలు ప్రపంచంలో 18 ఉండగా, విశాఖపట్నానికి ఒక ఐకానగా, టూరిస్టులకు ఆకర్షణగా..సీఎం చంద్రబాబు దేశంలోనే తొలిసారిగా స్కైటవర్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుపై జర్మనీకి చెందిన హస్‌ పార్క్‌ ఎట్రాక్షన్స సంస్థ ఇప్పటికే సమగ్ర నివేదిక సమర్పించింది. ఈ నెల 27న విశాఖలో మొదలయ్యే సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి.. జర్మనీ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ నిర్మాణాన్ని విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చేపడుతుందని వుడా వీసీ బాబూరావునాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
 
కైలాసగిరిపై తలపెడుతున్న స్కై టవర్‌..40 అంతస్థుల ఎత్తు ఉంటుంది. అంచనా వ్యయం రూ.68 కోట్లు. సుందర విశాఖని టవర్‌ పైనుంచి వీక్షించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. రొటేటింగ్‌ విధానంలో సీట్లు అమరుస్తారు. సుమారు 70 మంది వరకు కూర్చొనే వీలుండి, 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ ఉంటాయి. చుట్టూ ఉన్న అద్దాల్లోంచి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. అంతేకాదు.. పార్టీలు చేసుకోవడానికి, సమావేశాలు నిర్వహించుకోవడానికీ అనువుగా ఉంటాయి. పర్యాటకుల కోసం ఫుడ్‌ కోర్టులు ఉంటాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...