Jump to content

Amaravati


Recommended Posts

అమరావతి నగరం..ప్రజాకాంక్షకు ప్రతిరూపం
 
636269748802729722.jpg
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
ప్రజా రాజధాని అమరావతి నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ప్రభుత్వ భవనాల సముదాయ డిజైన్లు అందరి ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశానుసారం వివిధ కళాశాలల విద్యార్థులకు సీఆర్డీయే నిర్వహించిన వర్క్‌షాపులో పలువురు ఆసక్తిగా పాల్గొని, తమ అభిప్రాయాలను తెలియజేశారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో జరిపిన ఈ కార్యక్రమంలో నగరంలోని వీఆర్‌ సిద్ధార్ధ, పీవీపీ సిద్ధార్ధ, ఆంధ్రా లయోలా ఇంజినీరింగ్‌ కళాశాలలతోపాటు కేఎల్‌యూ, గీతం విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత వారికి సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావు అమరావతి నగర ప్రణాళికను, మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్‌ (లండన్) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ ప్రాథమిక డిజైన్లను వివరించారు. 900 ఎకరాల్లో నిర్మితమవనున్న గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌తోపాటు అందులోని రెండు ఐకానిక్‌ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టులకు మన చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే అత్యుత్తమ, అధునాతన డిజైన్లు రూపొందేలా సామాన్యుల నుంచి నిపుణుల వరకూ అందరి అభిప్రాయాలనూ తెలుసుకుంటున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాలతోపాటు ఇలాంటి వర్క్‌షాపుల ద్వారా విద్యార్థుల సూచనలను తీసుకుంటున్నామన్నారు. 50 శాతానికిపైగా పచ్చదనం, 10 శాతం జలవనరులతో గ్రీన్- బ్లూ కాన్సెప్ట్‌లో ‘హ్యాపీ సిటీ’గా అమరావతి నిర్మితమవనుందని, ఎండ తగలని రీతిలో వీధుల డిజైనింగ్‌ ఉంటుందని, వాటి మధ్యభాగంలో డ్రైవర్లు అవసరం లేని వాహనాలు, ఆటోమేటెడ్‌ బస్సులను నడిపే యోచన ఉందని పేర్కొన్నారు. సిసలైన ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణమయ్యేలా చూసేందుకు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సీఆర్డీయేలో ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం ప్రవేశపెట్టామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాజధాని డిజైనింగ్‌ ప్రక్రియలో తమనూ భాగస్వాములను చేయడం హర్షణీయమన్న విద్యార్థులు అనంతరం నార్మన్ ఫోస్టర్‌ డిజైన్లపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.
వేస్ట్‌వాటర్‌ మేనేజ్‌మెంట్‌, కాలుష్య నివారణ, పార్కింగ్‌ సౌకర్యాలపై సాయిపవన మాట్లాడారు. గ్రీన్- బ్లూ కాన్సెప్ట్‌పై మాట్లాడిన ఉష రాజధాని నేల స్వభావం, వరద, భూగర్భజలమట్టాలు, ఫౌండేషన్ డిజైన్, ప్లానింగ్‌పై కొన్ని సూచనలిచ్చారు. భావి నీటి అవసరాలు, భద్రతా ప్రణాళిక, రోడ్‌ క్రాసింగులపై ప్రశాంత, ఎకో, సోలార్‌ వ్యవస్థలు, డిజైన్లలో రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబింపజేయడంపై పవనకుమార్‌, కాలుష్య నివారణ, ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టెక్నాలజీలపై మహేశ్వరి మాట్లాడారు. రోడ్ల డిజైనింగ్‌, భూకంపాల నివారణ, భద్రతా ప్రమాణాలు, సుందరీకరణలపై పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల ఫ్యాకల్టీ సభ్యుడు ఎ.శ్రీనివాసరావు సూచనలిచ్చారు.
Link to comment
Share on other sites

అమరావతి రాజధాని రోడ్లపై బస్‌ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ లేన్లు
 
636269761453244230.jpg
  • రాజధానిలో ఏడు, 11 ప్రాధాన్య రోడ్లలో బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ లేన్లు 
  • దూసుకుపోనున్న పొడవాటి బస్సులు 
  • నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలు చేరుకోనున్న ప్రజలు 
  • నిర్ణయించిన అమరావతి డెవలప్‌మెంట్‌ అథారిటీ
రాజధాని నగరంలో తలపెట్టిన ప్రాధాన్య రోడ్లపై బస్సులు రయ్‌..న దూసుకుపోనున్నాయి. ఇందుకోసం బీఆర్‌టీ పద్ధతిలో రోడ్లను నిర్మించేందుకు అమరావతి డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్ణయించింది. దీంతో ప్రజా రవాణా భేష్‌.. అనేలా ఉండబోతోంది. లక్ష్యం పూర్తయితే వచ్చే ఏడాది నాటికే బీఆర్‌టీ లేన్లలో వాహనాలు పరుగులు తీస్తాయి.
ఆంధ్ర జ్యోతి, గుంటూరు : అమరావతి రాజధాని నగరంలో నిర్మాణం తలపెట్టిన ఏడు, 11 ప్రాధాన్య రోడ్లలో తప్పనిసరిగా బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ పద్ధతిలో నిర్మించేందుకు అమరావతి డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏడీఏ) నిర్ణయించింది. ఇందుకోసం ఆయా రోడ్లలో 14 మీటర్ల క్యారేజ్‌ వేని నిర్మించనుంది. పొడవాటి బస్సులు ఎదురెదురుగా రాకపోకలు సాగించనున్నందున రాజధానిలో ప్రజారవాణా భేషుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతోన్నారు. బీఆర్‌టీ వాహనాలకు ఎలాంటి ఆటంకాలు ఉండనందున గంటకు 100 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిమిషాల వ్యవధిలో ప్రజలు వారి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. గ్రేటర్‌ వైజాగ్‌, విజయవాడ నగరాల్లో ప్రస్తుతానికి బీఆర్‌టీ లేనలు ఉన్నాయి. వైజాగ్‌లో ఈ రోడ్లు వినియోగంలో ఉన్నప్పటికీ విజయవాడలో ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. రాజధానిలో ప్రజారవాణాకు విపరీతమైన డిమాండ్‌ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏడీఏ ముందుచూపుతో బీఆర్‌టీ లేన్లను ఏడు, 11 ప్రాధాన్య రోడ్లలో ప్రతిపాదించింది. ఏడు ప్రాధాన్య రోడ్లు ప్రధానంగా నెక్కల్లు, శాకమూరు, మల్కాపురం, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు, అబ్బరాజుపాలెం, పెనుమాక, నవులూరు, బేతపూడి, దొండపాడు గ్రామాల మీదగా నిర్మాణం జరుగుతాయి. అలానే 11 ప్రాధాన్య రోడ్లు మోదుగులంకపాలెం, మల్కాపురం, లింగాయపాలెం, అబ్బరాజుపాలెం, నేలపాడు, పెనుమాక, అనంతవరం, వెలగపూడి, వెంకటపాలెం, బేతపూడి, నీరుకొండ, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల మీదగా ఏర్పాటు కానున్నాయి. రాజధానిలో ఇంచుమించు అన్ని గ్రామాలను కలుపుతూ ఈ రోడ్లు నిర్మాణం జరగనున్నాయి.
వెలగపూడికి తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ రాకతో ఇప్పటికే ప్రజా రవాణాకు డిమాండ్‌ ప్రారంభమైంది. ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణం జరిగితే ప్రస్తుతం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వేర్వేరు చోట్ల ఉన్న డైరెక్టరేట్‌లన్ని ఒక గొడుకు కిందకు రానున్నాయి. దాంతో నిత్యం వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి రాకపోకలు సాగిస్తారు. రాజధానిలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కార్యాలయ అవసరాలు దృష్ట్యా రాకపోకలు పెరుగుతాయి. ఆ పరిస్థితుల్లో బీఆర్‌టీకి డిమాండ్‌ ఏర్పడుతుంది. ప్రాధాన్య రోడ్లతో పాటే బీఆర్‌టీ లేన్లను కూడా సమాంతరంగా ఏడాది వ్యవధిలో నిర్మించేందుకు లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొంటే వచ్చే ఏడాది నాటికే బీఆర్‌టీ లేన్లలోనూ బస్సులు పరుగులు తీస్తాయి.
 
10 కిలోమీటర్ల వ్యాసార్థంలో అనుకూలతలు
ప్రాధాన్య రోడ్ల నెట్‌వర్కుకు 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న అనుకూలతలను ఏడీఏ ప్రాజెక్టు నివేదికలో పొందుపరిచింది. ప్రాజెక్టుకు సమీపంలోనే ఎనహెచ-16 ఉన్నది. తాడేపల్లికి కిలోమీటర్‌ దూరంలో కేసీ కెనాల్‌ రైల్వేస్టేషన, 22 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్‌పోర్టు, మూడు కిలోమీటర్ల దూరంలో విజయవాడ, 160 మీటర్ల దూరంలో కృష్ణానది, 1.74 కిలోమీటర్ల దూరంలో తాడేపల్లి కొండలు, ఉండవల్లి గుహలు ఉన్నాయి. 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఎలాంటి జాతీయ పార్కు లేదు. తాడేపల్లి, మంగళగిరి కర్లపూడి, మోతడక, కొత్తూరు, కొండపల్లిలో రిజర్వు ఫారెస్టు ప్రాంతాలు ఉన్నాయి. డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ 4.10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తుళ్ళూరు: రాజధానిలో ఏర్పడబోయే ఏడు, పదకొండు రోడ్ల నిర్వహణపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను మంగళవారం తుళ్ళూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించారు. రోడ్ల పర్యావరణ ప్రభావ అంచనా, నిర్వహణ గురించి వీఆర్‌ అసోసియేట్‌ సంస్థ ప్రతినిధులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన ద్వారా వివరించారు. రోడ్లు సముద్ర మట్టానికి 18 నుంచి 26 మీటర్ల ఎత్తులో ఉంటాయని తెలిపారు. 66.22 కిలోమీటర్లు కలిగిన ఏడు ప్రాధాన్యత రోడ్లు నిర్మాణ అంచనా వ్యయం రూ.915 కోట్లని, 71 కిలోమీటర్ల కలిగిన పదకొండు రోడ్లు అంచనా వ్యయం రూ.1149.41 కోట్లుగా తెలిపారు. భవిష్యత్ తరాల వారిని దృష్టిలో ఉంచుకొని సర్వే చేసి ప్రణాళికలు రూపొందించాలని వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధి రామకృష్ణ అసోసియేట్‌ సంస్థకు సూచించారు. రోడ్లు వేసే క్రమంలో చెరువులు పూడ్చివేయాల్సి వస్తుందని దానివలన గ్రామాల్లో భూగర్భ జాలల మట్టాలు తగ్గిపోతాయని, ప్రత్యామ్నాయం చూడాలని తుళ్లూరుకు చెందిన రైతు పువ్వా సురేంద్ర సమావేశంలో కోరారు. తుళ్లూరు ఎడ్యుకేషన్‌ సొసైటీ కింద నిర్వహింపబడుతున్న జానియర్‌, డిగ్రీ కాలేజీలున్నాయని వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ఎడ్యుకేషన్‌ సొసైటీ కరస్పాండెంటు జొన్నలగడ్డ శంకర్‌ కోరారు. రైతుల సూచనలను అసోసియేట్‌ ప్రతినిధులు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డిఫ్యూటీ కలెక్టర్లు, సీఆర్‌ఢిఏ లాండ్సు డైరెక్టర్‌ చెన్నకేశవరావు, అటవీ శాఖ అధికారులు, వరల్డ్‌ బ్యాంకు సీనియర్‌ ఎన్విరాల్‌మెంటు స్పెషలిస్ట్‌ అద్దేపల్లి సీతారామకృష్ణ, వీఆర్‌ సంస్థ ప్రతినిధి భాషాకరీముల్లా, అన్ని యూనిట్‌ల డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

సీడ్‌యాక్సెస్‌ రోడ్డుతో.. మరింత శోభ
 
636269589374713226.jpg
  • దారి పొడవునా హరిత శోభితం
  • 15 మీటర్లలో లాన్లు, చిన్న కొలనులు
అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): అడుగడుగునా, అంతర్జాతీయ స్థాయి డిజైన్లు, అత్యుత్తమ మౌలిక వసతులతో నిర్మితమవనున్న అమరావతికి జీవనాడిగా పేర్కొంటున్న సీడ్‌ యాక్సెస్‌ రహదారి కేవలం రవాణా సౌకర్యాలకు కేంద్ర బిందువుగానే కాకుండా నేత్రపర్వంగా ఉండే పచ్చదనం, పలు ఆకర్షణలతో రాజధానికి కలికితురాయిలా భాసించనుంది. రాజధాని ప్రాంతంలో తూర్పు కొసన ఉన్న ఉండవల్లి నుంచి పశ్చిమ దిక్కున ఉన్న దొండపాడు మధ్య 18.27 కిలోమీటర్ల పొడవున 60 మీటర్ల(196.80 అడుగుల) వెడల్పుతో, రూ.215 కోట్ల అంచనా వ్యయంతో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఈ రోడ్డే అమరావతిలోని అన్ని రహదారుల్లో ప్రధానమైనది, భారీది. దీనిలో భాగంగా ఇరువైపులా మూడేసి వరుసల సాధారణ వాహనాల లేన్లు(క్యారేజ్‌ వే), మధ్యలో 2 వరుసల బస్‌ ర్యాపిట్‌ ట్రాన్సపోర్టు (బీఆర్టీ) వరుసలతో మొత్తం 8 వరుసలుంటాయి. 2 వైపులా ఉండే క్యారేజ్‌ మార్గాల తర్వాత కొంత విస్తీర్ణంలో హరితం, అనంతరం నాన మోటార్‌ ట్రాన్సపోర్టు(ఎనఎంటీ) జోన ఏర్పాటు చేస్తారు. ఈ జోనలో భాగంగా సైక్లింగ్‌ ట్రాక్‌లు, అనంతరం మళ్లీ కొద్దిపాటి విస్తీర్ణంలో మొక్కలు, ఆ తర్వాత నడక మార్గాలు ఉంటాయి. బీఆర్టీ జోన, క్యారేజ్‌ మార్గాలపై పడే వర్షపు నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు నేలలోకి వెళ్లేందుకు వీలుగా బీఆర్టీ జోనకు ఇరువైపులా, క్యారేజ్‌ మార్గాలు-ఎనఎంటీ జోన్ల మధ్య డ్రెయిన్లు ఏర్పాటు చేస్తారు.
 
72.16 అడుగుల్లో గ్రీన జోన్లు!
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెడల్పు 196.80 అడుగులు కాగా.. దాని పొడవునా, అదనంగా మరొక 72.16 అడుగుల(22 మీటర్ల) మేర గ్రీన బెల్టులను అభివృద్ధి పరచనున్నారు. అంటే వీటితో కలుపుకొంటే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెడల్పు 268.96 అడుగులు(82 మీటర్లు) అవుతుంది! రాజధాని నిర్మాణంలో భాగంగా సీడ్‌ యాక్సెస్‌ రహదారితో సహా వందలాది కిలోమీటర్ల పొడవైన పలు రకాల రోడ్లను అభివృద్ధి పరచనున్నారు. వీటి కారణంగా పెరిగే వేడిని నిరోధించి, రాజధాని ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ గ్రీన ఫిల్టర్‌ జోన్లకు ఏడీసీ ప్రణాళికలు రూపొందించింది. తద్వారా సీఎం చంద్రబాబు చెబుతున్న మేరకు రాజధానిలో ఉష్ణోగ్రతలు చుట్టుపక్కల ప్రాంతాల కంటే కనీసం 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్‌ తక్కువ ఉండేలా చూడనున్నారు. కాగా.. పూర్తయిన తర్వాత ఇంతటి భారీ వెడల్పుతో, పలు రకాలైన రవాణా సాధనాలు ప్రయాణించగలిగే వీలుండి, పచ్చదనంతో విలసిల్లే రోడ్లు ఒక్క మన రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే అరుదని చెప్పొచ్చు.

హరిత శోభితం
ఈ గ్రీన్ బెల్టులను సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు ఒకవైపు 15 మీటర్లు(49.2 అడుగులు), మరొకవైపు 7 మీటర్ల(22.96 అడుగులు) వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ రెండింట్లోనూ ఆకట్టుకునే రీతిలో పచ్చిక బయళ్లు, వృక్షాలు, నడకమార్గాలు ఉంటాయి. అయితే, 49.2 అడుగుల వెడల్పున ఉండే భాగాన్ని మాత్రం మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతారు. దీనిలో అవెన్యూ ప్లాంటేషనను అభివృద్ధి పరుస్తారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక రకం చొప్పున ఈ రహదారి పొడవునా వేర్వేరు రకాల వృక్షాలను పెంచుతారు. మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండి, కాలుష్యాన్ని అరికట్టి, నీడను, ఆక్సిజనను పెంచడంలో తోడ్పడే వృక్ష జాతులను ఎంపిక చేస్తున్నారు. అంతేకాకుండా.. సుందరమైన నీటికొలనులు, ఫౌంటెన్లు ఏర్పాటు చేస్తారు.
Link to comment
Share on other sites

సీఆర్డీఏకు మరో కన్సల్టెంట్‌
 
అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 10 మంది కన్సల్టెంట్లను నియమించుకున్న ఏపీసీఆర్డీఏ తాజాగా మరొక కన్సల్టెంట్‌ నియామకానికి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఆర్కిటెక్చర్‌ సలహాలు, సేవలను అందించడం ఈ కన్సల్టెంట్‌ బాధ్యత. ప్రభుత్వ భవనంలోని రెండు ఐకానిక్‌ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టులకు ప్రత్యేకంగా డిజైన్లపై ప్రజలు, నిపుణులు వెలిబుచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సంస్థ తుది ఆకృతులను ఈ నెల 3వ వారంలో అందజేయనుంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...