Jump to content

Amaravati

Recommended Posts

రాజధానిలో మైస్‌ హబ్‌
బిడ్‌లు ఆహ్వానించిన సీఆర్‌డీఏ
22 ఎకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌, ఐదు నక్షత్రాల హోటల్‌, ఎగ్జిబిషన్‌ కేంద్రం
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో 42 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మైస్‌ (మీటింగ్స్‌, ఇన్సెంటివ్స్‌, కాన్ఫరెన్సింగ్‌, ఎగ్జిబిషన్స్‌) హబ్‌ నిర్మాణానికి బిడ్‌లు ఆహ్వానిస్తూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) బుధవారం టెండరు ప్రకటన జారీ చేసింది. రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారికి పక్కనే, సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌కి సమీపంలో మైస్‌ హబ్‌ నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేశారు. హబ్‌ నిర్మాణాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో రెండు వేర్వేరు ప్రాజెక్టులుగా చేపడతారు. 22 ఎకరాల్లో మెగా కన్వెన్షన్‌ సెంటర్‌, ఐదు నక్షత్రాల హోటల్‌, ఎగ్జిబిషన్‌ కేంద్రం నిర్మిస్తారు. 20 ఎకరాల్లో నివాస, వాణిజ్య భవనాల నిర్మాణం చేస్తారు. రెండు ప్రాజెక్టుల కోసం వేర్వేరుగా ప్రత్యేక వాహక సంస్థల్ని (ఎస్పీవీ) ఏర్పాటుచేస్తారు. రెండు ప్రాజెక్టులకు ఒకే అభివృద్ధిదారు ఉంటారు. టెండరు ప్రక్రియలో ఎంపికైన అభివృద్ధిదారుతో సీఆర్‌డీఏ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంటుంది. మైస్‌హబ్‌ నిర్మాణానికి ఎంపికైన సంస్థ భూమికి ఎలాంటి ధరా చెల్లించాల్సిన అవసరం ఉండదు. సీఆర్‌డీఏ తన వాటా పెట్టుబడిగా భూమి కేటాయిస్తుంది. కన్వెన్షన్‌ సెంటర్‌, హోటల్‌, ఎగ్జిబిషన్‌ కేంద్రం నిర్మించే 22 ఎకరాల్ని సీఆర్‌డీఏ.. అభివృద్ధిదారుకి 66 సంవత్సరాలకు లీజుకు ఇస్తుంది. వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని సీఆర్‌డీఏకి భాగస్వామ్య సంస్థ చెల్లిస్తుంది. వచ్చే ఆదాయంలో సీఆర్‌డీఏకి ఎవరు ఎక్కువ శాతం ఇచ్చేందుకు ముందుకొస్తే వారిని అభివృద్ధిదారుగా ఎంపిక చేస్తారు. ఇతర ఆర్థిక, సాంకేతిక అర్హతల్నీ ప్రామాణికంగా తీసుకుంటారు. మిగతా 20 ఎకరాలపై అభివృద్ధిదారుకి సీఆర్‌డీఏ పూర్తి హక్కులు(ఫ్రీహోల్డ్‌) కల్పిస్తుంది. అందులో నిర్మించే భవనాల్లో కనీసం 10లక్షల చ.అడుగుల భవనాల్ని సీఆర్‌డీఏకి అభివృద్ధిదారు ఇవ్వాల్సి ఉంటుంది. అభివృద్ధిదారు ఎంపికకు దీన్ని కూడా ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. అంతకు మించి ఎవరు ఎక్కువ విస్తీర్ణం గల భవనాన్ని సీఆర్‌డీఏకి ఇచ్చేందుకు ముందుకొస్తే వారిని ఎంపిక చేస్తారు. దీనిలో 18 అంతస్తులకు మించి భవనాలు నిర్మించేందుకు అనుమతిస్తారు.

ప్రాజెక్టు వ్యయం రూ.1562 కోట్లు!: మైస్‌ హబ్‌ ప్రాజెక్టుని మొత్తం నిర్మాణ వ్యయం రూ.1562 కోట్లుగా అంచనా వేశారు. తొలి దశలో 22 ఎకరాల్లో 6వేల మంది కూర్చునేలా కన్వెన్షన్‌ సెంటర్‌, హోటల్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్‌ నిర్మిస్తారు. దీని అంచనా వ్యయం రూ.533 కోట్లు. కన్వెన్షన్‌ సెంటర్‌ని రెండో దశలో 10వేల సీట్లకు పెంచే వీలుంటుంది. రెండో దశలో 20 ఎకరాల్లో రూ.1029 కోట్లతో వాణిజ్య, నివాస భవనాల నిర్మాణం చేపడతారు. తొలి దశ ప్రాజెక్టుని మూడేళ్లలో, రెండో దశ ప్రాజెక్టుని మరో మూడేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. మైస్‌ హబ్‌కి బిడ్‌లు సమర్పించేందుకు సెప్టెంబరు 17 వరకు గడువుంది.

Link to comment
Share on other sites

అమరావతి అభివృద్ధిని ప్రజలకు చూపిస్తాం 
నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి 
హైకోర్టు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి 
మంత్రి నారాయణ వెల్లడి 
25ap-state1a.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు చూపిస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి డా.పి.నారాయణ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి చూపించిన విధంగానే అమరావతి పనులను వర్షాకాలం పూర్తయ్యాక చూపించనున్నట్లు మంత్రి వివరించారు. అమరావతి అభివృద్ధి పనులను, రాయపూడి సమీపంలో నిర్మిస్తున్న ఆలిండియా సర్వీసెస్‌ అధికారుల నివాస భవన నిర్మాణాలను అమరావతి డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏడీసీ) సీఎండీ డి.లక్ష్మీపార్థసారథితో కలిసి బుధవారం పరిశీలించారు. ప్రపంచంలో వివిధ రాజధానుల నిర్మాణ పనులను తాను చూశానని, వాటితో పోల్చితే అమరావతి నిర్మాణం చాలా వేగంగా జరుగుతోందన్నారు. ఎప్పుడో ఏర్పడిన నయారాయపూర్‌, గాంధీనగర్‌ రాజధానుల పనులు నేటికీ పూర్తి కాలేదన్నారు. పరిపాలన, న్యాయ నగరాలను 1450 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు వివరించారు. రాజధాని రైతులకు ఇచ్చిన హామీ మేరకు రోడ్ల పనులు వేగంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో రూ.48 వేల కోట్లతో వివిధ రకాల పనులను చేపట్టామన్నారు.

40 అంతస్తులతో సచివాలయం నిర్మాణం 
ఐదు టవర్లలో.. 40 అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించేందుకు రెండేళ్లు పట్టనుందని మంత్రి తెలిపారు. హైకోర్టు నిర్మాణానికి టెండర్లు బుధవారం పూర్తి చేశామన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.1500 కోట్లు మాత్రమే మంజూరు చేసిందన్నారు. ఇంకో వెయ్యికోట్లు ఇస్తామని చెబుతోందన్నారు. విమర్శించే వ్యక్తులు అభివృద్ధి పనులను చూసి సద్విమర్శలు చేస్తే ఆహ్వానిస్తామని నారాయణ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

రాజధానిలో 4 ఎల్పీఎస్‌ జోన్లు?
26-07-2018 07:23:08
 
636681865879631689.jpg
  • మొత్తం పనుల విలువ రూ.5,066 కోట్లకు పైమాటే!
  • రూ.2704 కోట్ల విలువైన మరో 2 ఎల్పీఎస్‌ జోన్ల పరిస్థితీ ప్రశ్నార్థకమే..
అమరావతి: రాజధాని నిర్మాణార్ధం భూములిచ్చిన వారికి బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిర్మాణ, మౌలికరంగాల్లోని ప్రముఖసంస్థలు అనాసక్తి ప్రదర్శిస్తున్నాయని విశ్వసనీయం గా తెలుస్తోంది. ఫలితంగా ఇప్పటికే ఆలస్యమైన ఈ జోన్ల పనులు పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టనుంది.
 
రెండు సార్లు టెండర్లు పిలిచినా.. ప్చ్‌..
రాజధానిలోని రిటర్నబుల్‌ ప్లాట్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరిచేందుకు వాటిని మొత్తం 14 ఎల్పీఎస్‌ జోన్లుగా విభజించిన విషయం విదితమే. వీటిల్లో 1, 2, 3, 6, 7, 10 జోన్లకు ఏపీసీఆర్డీయే టెండర్లు పిలువగా వాటిల్లో చేపట్టిన పనులు ఆశించినంతస్థాయిలో లేనప్పటికీ సాగుతూనే ఉన్నాయి. 8, 11 జోన్లలో భూసేకరణ ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కిరానందున వాటికి టెండర్లు ఆహ్వానించ లేదు. మిగిలిన 4, 5, 9, 9 ఏ, 12, 12 ఏ జోన్ల పరిస్థితి సందిగ్ధంలో పడింది. వేర్వేరు విధానాల్లో ఒకటికి రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ వీటిల్లోని 4 ఎల్పీఎస్‌ జోన్లకు సంబంధించి సరైన సామర్ధ్యమున్న సంస్థలేవీ స్పందించలే దు. దీంతో మొత్తం రూ.5,066.59 కోట్ల భారీ వ్యయంతో తీర్చిదిద్దదలచిన ఆయా జోన్ల పరిస్థితి డోలాయమానంలో పడింది. మొత్తం రూ.2703.81 కోట్ల అంచనాలతో 9 ఏ, 12 జోన్లకు 2వ సారి పిలిచిన టెండర్ల స్వీకరణ గడువు మంగళ, బుధవారాల్లో ముగియగా, వాటి పరిస్థితేమిటన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. అందుతున్న సమాచారాన్నిబట్టి పరిస్థితి అంత ఆశావహంగా లేదని తెలుస్తోంది.
 
‘హ్యాం’, ఈపీసీ.. పేరేదైనా ఫలితమొక్కటే..!
ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం నిబంధనల ప్రకారం రాజధాని లోని మొత్తం 14ఎల్పీఎస్‌ జోన్లను 3 సంవత్సరాల్లో అత్యుత్త మ మౌలిక వసతులతో అభివృద్ధి పరచాల్సివుంది. భూగర్భ యుటిలిటీ లైన్లు, ప్రపంచస్థాయి రహదారులు ఇత్యాది సదుపాయాలను కల్పించాల్సి ఉ న్నందున ఈ జోన్ల డెవలప్‌ మెంట్‌కు ఒక్కొక్క దానికి వందల కోట్ల రూపాయలు అవస రమని అంచనా వేశా రు. వీటిల్లోని 2 జోన్లు - నెంబర్‌ 8 (ఉండవ ల్లి), నెంబర్‌ 11 (పెను మాక)లలో వందలాది ఎకరాలను సేకరించాల్సి ఉన్నందున వాటిని మిన హాయించి, మిగిలిన 12 జోన్లకు టెండర్లు పిలవాల ని నిర్ణయించారు. అయితే నిధుల కొరత నివారణతో పాటు పనులు వేగంగా జరి గేలా చూడాలనే ఉద్దేశంతో సీఆర్డీయే ఈ జోన్ల అభివృ ద్ధిని వివిధ పద్ధతుల్లో చేయా లని నిర్ణయించింది.
 
అందులో భాగంగా పలు జోన్లకు ‘ఈపీసీ (ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌) విధానంలో టెండర్లు పిలిచిన సీఆర్డీయే.. 5 జోన్ల (4, 5, 9, 12, 12ఏ)ను మాత్రం ‘హ్యాం’ విధానం లో అభివృద్ధి పరచాలని భావించిం ది. ఈపీసీ విధానంలో ప్రాజెక్ట్‌ మొత్తం అంచనా వ్యయాన్ని సీఆర్డీయేనే భరించాల్సివుండగా, టెండర్ల ప్రక్రియలో విలక్షణ మైనదిగా పేర్కొంటున్న ‘హ్యాం’ లో మాత్రం 40శాతం సీఆర్డీ యే భరిస్తే, మిగిలిన 60 శాతం కాంట్రాక్ట్‌ సంస్థే సమకూర్చుకోవాల్సి ఉంటుం ది. అవి పెట్టిన పెట్టుబడిని 15 సంవత్సరాల్లో బ్యాంకు వడ్డీ కంటే 3 శాతం ఎక్కువతో కలిపి, సీఆర్డీ యే తిరిగి చెల్లిస్తుంది. ఈ విధానాన్ని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌.హెచ్‌.ఎ.ఐ.) ఇప్ప టికే అమలుపరుస్తూ సత్ఫలితాలను సాధి స్తుండడాన్ని ఈ సం దర్భంగా సీఆర్డీయే పరిగణనలోకి తీసు కుంది.
 
అందులో భాగంగా ఈ జోన్లకు గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది జన వరి మధ్య ‘హ్యాం’ విధా నంలో బిడ్లను ఆహ్వానించగా, 5 జోన్లకు కలిపి ఒక్కటంటే ఒక్క బిడ్‌ మాత్రమే (జోన్‌ 4కు) దాఖలైంది! మిగిలిన 4 జోన్లకు ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు! దీంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి, ఆయన ఆదేశాలతో వాటితోపాటు 9 ఏ జోన్‌ను కూడా కలిపి మొత్తం 6 ఎల్పీఎస్‌ జోన్లకు గతంలో పిలిచిన వాటి మాదిరిగానే ఈపీసీ విధానంలోనే సీఆర్డీయే టెండర్లు పిలిచింది. దీనికైనా ఆశించిన స్పందన లభించగలదని ఆ సంస్థ భావించగా, తద్భిన్నంగా జరిగినట్లు సమాచారం!
 
టెండర్ల స్వీకరణ గడువు పూర్తయిన 4 (అంచనా వ్యయం రూ.595.20 కోట్లు), 5 (రూ.1716.83 కోట్లు), 9 (రూ.1558.33 కోట్లు), 12 ఏ (రూ.1196.23 కోట్లు) ఎల్పీఎస్‌ జోన్లకు లభించిన స్పందన పూజ్యమని, ఈ నెల 24, 25 తేదీల్లో టెండర్ల స్వీకరణ గడువు ముగిసిన 9 ఏ (రూ.1059.25 కోట్లు), 12 (రూ.1644.56 కోట్లు) జోన్ల విషయమేమిటన్నది తేలాల్సివుందని తెలిసింది. అయితే ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే ఈ 2 జోన్ల పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉండబోదన్నది అధికారుల అభిప్రాయమని తెలుస్తోంది.
 
ఆర్థికంగా లాభదాయకం కాదనే(నా)..?
రాజధాని గ్రామాల రైతులు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి టెండర్ల ప్రక్రియపై ప్రముఖ కంపెనీల నిరాసక్తతకు ఆ పనులు ఏమాత్రం లాభదాయకం కాదని అవి భావిస్తుండడమే కారణమని వినవస్తోంది. రహదారులు, భవంతులు, ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇత్యాది ప్రాజెక్టుల మాదిరిగా జోన్ల పనుల్లో లాభాలు అంతగా ఉండవని, పైగా వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్లు కూడా వచ్చే అవకాశం ఉందని సంస్థల అభిప్రాయమని సమాచారం. అందువల్లనే ఎల్పీఎస్‌ జోన్ల డెవలప్‌మెంట్‌కు ఏవో కొద్ది కంపెనీలు తప్పితే చాలావరకు దూరంగా ఉంటున్నాయని తెలుస్తోంది. అయితే.. ఈ గడ్డు పరిస్థితిని అధిగమించేం దుకు సీఆర్డీయే ఏం చర్యలు తీసుకుంటుందో మరి.

రాజధానిలో రవాణా అనుసంధానం..!
26-07-2018 07:25:08
 
636681867080664780.jpg
  • అమరావతిలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సదుపాయాలు
  • రాజధానిలో రోడ్డు రవాణా వ్యవస్థకు ప్రతిపాదనలు
  • బస్‌ టెర్మినల్స్‌ కోసం.. ఏడీసీతో సంప్రదింపులు
  • విజయవాడ జోన్‌ పరిధిలో 60శాతం నష్టం తగ్గుదల
  • అంతర్గత సామర్ధ్యం... ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది
  • పెరుగుతున్న డీజిల్‌ ధరలు.. సంస్థ లాభాలపై ప్రభావితం
  • విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.రామకృష్ణ
 
విజయవాడ: ‘అమరావతి రాజధానిలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన సదుపాయాలు ఇప్పుడే కల్పించాలి! రాజధాని ప్రాంతం అభివృద్ధి చెండటానికి, విస్తరించటానికి రవాణా అనుసంధానం జరగాలి! ట్రాన్స్‌పోర్ట్‌ సదుపాయం ముందుగా ఏర్పడాలి ! ఈ దిశగా సంస్థ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి.నష్టాలను గణనీయంగా తగ్గించుకుంటున్నాం.. డీజిల్‌ ధరాఘాతం ఇబ్బంది పెడుతున్నా.. అంతర్గత సామర్ధ్యాన్ని పెంపొందించుకుంటున్నాం. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించటానికి కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నాం.
 
సంస్థ కోసం కష్టపడుతున్న ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నాం. పదవీ విరమణ చెందిన రోజూ బెనిఫిట్లు అన్నీ తీసుకునే సంప్రదాయాన్ని తీసుకువచ్చాం’ అని విజయవాడ జోన్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) ఎ.రామకృష్ణ తెలిపారు. నూతన ఆర్థిక సంవత్సరం 2018-19లో మొదటి త్రైమాసిక ఫలితాలను పురస్కరించుకుని గణనీయంగా నష్టాలను తగ్గించుకున్న సందర్భంగా ఆంధ్రజ్యోతికి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు అంశాలకు సంబంధించి కీలకమైన వివరాలను వెల్లడించారు.
 
రాజధాని ప్రాంతంలో రవాణా ఆపరేషన్స్‌పై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ?
రామకృష్ణ: రాజధాని ప్రాంతంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. రాజధానికి గతంలో 14 సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం మరో నాలుగు సర్వీసులను పెంచాం. మొత్తం ప్రతిరోజూ 18 సర్వీసులు రాజధానికి నడుస్తున్నాయి. వెలగపూడి సెక్రటేరియట్‌కు కూడా బస్సులు నడుపుతున్నాం.
 
అమరావతిలో రోడ్డురవాణా వ్యవస్థ ప్రణాళికలు ఏమయ్యాయి?
రామకృష్ణ: రాజధాని ప్రాంతానికి సంబంధించి ప్రణాళికలు ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో రోడ్డురవా ణా వ్యవస్థ ముందుగా ఏర్పడితేనే బాగుంటుంది. రవాణావ్యవస్థ ఉండటం వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. దానివల్ల అభివృద్ధి వేగవంతమవుతుంది. కనెక్టివిటీ లేనప్పుడు కొంత ఇబ్బంది వస్తుంది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు కు సంబంధించి చూస్తే ఎంత త్వరగా మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. అంతగా ప్రజల రాకపోకలకు అనువుగా ఉంటుంది. అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొ రేషన్‌ (ఏడీసీ)తో దీనికి సంబంధించి యాజమాన్యం చర్చలు జరుపుతోంది. మేమనుకునేది ఏమంటే.. ముందు బస్‌ టెర్మినల్స్‌ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. బస్‌ టెర్మినల్స్‌ ఏర్పాటు ద్వారా రోడ్డు రవాణా సదుపాయాలు విస్తృతమవుతాయి.
 
రాజధాని ప్రాంతంలో బ్యాటరీ బస్సులు ఎప్పుడు నడుస్తాయి?
రామకృష్ణ: బ్యాటరీ బస్సులకు సంబంధించిన ఆలోచనలు అయితే జరుగుతున్నాయి. ఇవి టెక్నికల్‌, మెకానికల్‌కు సంబంధించినవి. వీటికి సంబంధించి ఆర్టీసీ టెక్నికల్‌ ఈడీ (ఈ) అధ్యయనం చేస్తున్నారు.
 
సంస్థలో హై ఎండ్‌ శ్రేణిలో కొత్త బస్సుల అవసరం ఉంది కదా ?
రామకృష్ణ: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకోసం హై ఎండ్‌ శ్రేణిలో కొత్త బస్సుల వైపు సంస్థ చూస్తోంది. ఇటీవల 18 కొత్త బస్సులను ప్రవేశపెట్టాం. విజయవాడ జోన్‌ పరిధిలో వెన్నెల స్లీపర్‌లు 7, అమరా వతి బస్సులు 29, గరుడ ప్లస్‌లు 6, గరుడలు 35, ఇంద్ర 37, సూపర్‌ లగ్జరీ బస్సులు 447 ఉన్నాయి. మరిన్ని అధునాతన బస్సులను ప్రవేశ పెట్టడానికి సంస్థ సిద్ధంగా ఉంది.
 
విజయవాడ జోన్‌ ఆర్థి క పరిస్థితి ఎలా ఉంది ?
రామకృష్ణ: విజయవాడ జోన్‌ ఆర్థిక పరిస్థితి గణనీ యంగా మెరుగు పడింది. గత ఆర్థిక సంవత్సరం రూ. 312 కోట్ల ఆదాయాన్ని సాధిస్తే.. కిం దటి ఆర్థిక సంవత్సరంలో రూ. 315కోట్ల ఆదాయాన్ని సాధించాం. రూ.3కోట్ల మేర అదనంగా ఆదాయం సాధించాం. ఆపరేషనల్‌గా ఎలాంటి నష్టంలేదు. పర్సన ల్‌ కాస్ట్‌ వ్యయం పెరగటం వల్ల ఓవరాల్‌గా నష్టాలు కనిపిస్తున్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం జూన్‌ మాసాంతానికి రూ. 13.06 కోట్ల నష్టాలు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ మాసాంతానికి రూ.8.17కోట్ల నష్టాలకే పరిమి తమయ్యాయి. అంటే రూ.4.88 కోట్లమే ర నష్టాలను తగ్గించుకున్నాం. జోన్‌ పరిధిలో రీజియన్ల వారీగాచూస్తే.. విజయవాడ రీజియన్‌ (కృష్ణా)లో రూ.1.10 కోట్లుగా ఉన్న నష్టాలను రూ.19 లక్షలకు తగ్గించాం. పశ్చిమగోదావరి రీజియన్‌లో రూ. 4.27 కోట్లుగా ఉన్న నష్టాలను రూ.2.53 కోట్లకు తగ్గిం చాం. గుంటూరు రీజియన్‌లో రూ.2.20 కోట్లుగా ఉన్న నష్టాలు రూ.10.20 కోట్లకు పెరిగాయి.
 
పర్సనల్‌ కాస్ట్‌ పెరగటానికి ప్రధాన కారణం ఏమిటి ?
రామకృష్ణ: డీజిల్‌ ప్రధానం గా సంస్థకు భారంగా మారిం ది. పెరుగుతున్న డీజిల్‌ ధరలు ఆర్టీసీ లాభాలను చవిచూడకుండా చేస్తున్నా యి. ఆక్యుపెన్సీ రేషియో గతంతో పోల్చుకుంటే 73శాతం నుంచి 75శాతానికి పెరిగింది. విజయవాడ జోన్‌ పరిధిలో గతేడాది బస్సులు 10.43 కోట్ల కిలోమీటర్లు తిరిగాయి. రూ. 91కోట్ల మేర డీజిల్‌కు వెచ్చించాం. ప్రస్తుతం చూస్తే 10.28 కోట్ల కిలోమీటర్లు బస్సులు తిరగగా రూ. 104.68 కోట్ల వ్యయం అయింది. దీనిని బట్టి చూస్తే రూ. 13.29 కోట్లు ఆదనంగా డీజిల్‌పై వ్యయం పెరిగింది. ఈ భారం పడకుండా ఉంటే సంస్థ రూ.13 కోట్ల లాభాల్లో ఉండేది.
 
గుంటూరు రీజియన్‌లో నష్టాలు పెరగటానికి కారణమేమిటి ?
రామకృష్ణ: గుంటూరు రీజయన్‌లో నష్టాలు పెరగటానికి ప్రధానంగా ఒక సమస్య ఉంది. ప్రకాశం జిల్లా నుంచి బస్సులన్నీ గుంటూరుకే వస్తుంటాయి. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల బస్సులన్నీ కూడా గుంటూరు వెళ్ళాల్సిందే. ఇతర ప్రాంతాల బస్సుల ఆపరేషన్‌ గుంటూరుపై ప్రభావం చూపిస్తోంది. అందువల్లనే నష్టాలు పెరిగాయని గుర్తించాం. మా దృష్టి అంతా గుంటూరు మీదనే ఉంది.
 
ఆర్టీసీలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు ఏమిటి ?
రామకృష్ణ: ఉద్యోగ, కార్మికుల సమస్యలను ప్రాధా న్యతగా తీసుకోవటం జరుగుతోంది. సంస్థ ఎండీ సురేం ద్రబాబు కార్మికులకు సంబంధించి పెద్దపీట వేస్తున్నా రు. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా పదవీ విరమణ చెందిన కార్మికులకు అన్నిరకాల బెనిఫిట్లు అందజేస్తున్నాం. పదవీ విరమణ చేసిన ఉద్యోగి ప్రశాం తంగా జీవించాలన్న ఆలోచనతో ఎండీ దీనికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్‌ నుంచి ఏ నెలకు ఆ నెల పదవీ విరమ ణ చెందిన వారికి గ్రాట్యుటీ, పీఎఫ్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫి ట్స్‌ వంటివి ఇస్తున్నాం. ఉద్యోగులకు సులభంగా సెలవు లు మంజూరుచేస్తున్నాం. ఉద్యోగుల గ్రీవెన్స్‌ నిర్వహి స్తున్నాం. ప్రయాణికుల గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నాం.
Link to comment
Share on other sites

సీఎంను కలిసిన నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు
27-07-2018 06:00:54
 
636682680541498957.jpg
అమరావతి: రాజధానిలో నిర్మించే వివిధ ప్రతిష్ఠాత్మక భవంతుల డిజైన్లపై సీఎం చంద్రబాబు, మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ సంస్థకు చెందిన నిపుణుల మధ్య మరోసారి చర్చలు జరిగాయి. సచివాలయంలో గురువారం జరిగిన ఈ భేటీలో అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమైన ఐదు టవర్ల సచివాలయ సముదాయంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

సీడ్‌యాక్సిస్‌ రోడ్డుపై నేడు అభిప్రాయ సేకరణ
27-07-2018 08:09:04
 
తాడేపల్లి: తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి నుంచి అమరావతి రాజధాని నగరానికి నిర్మించబోయే సీడ్‌యాక్సిస్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఈ నెల 27న సాయంత్రం 4 గంటలకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్‌ పద్మనాభుడు ఓ ప్రకటనలో తెలిపారు. సాంఘిక, ఆర్థిక, సర్వే నివేదికల్లోని అంశాలపై జరిగే సదస్సులో రైతులు, నివాసితులు తమ అభిప్రాయాలను తెలియపరచాలన్నారు.
Link to comment
Share on other sites

ఏపీ అసెంబ్లీ ఇలా ఉండబోతోంది: కోడెల
27-07-2018 15:48:53
 
636683033326607107.jpg
 
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతన అసెంబ్లీ కోసం టవర్ ఆకృతిలో ఉన్న డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావుతో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో శాశ్వత అసెంబ్లీ భవనాల డిజైన్లపై తుది రూపు తీసుకొచ్చేందుకు కసరత్తు చేశారు. చివరకు టవర్‌ ఆకృతిలో ఉన్న అసెంబ్లీ డిజైన్‌ను సీఎం ఫైనల్ చేశారు.
 
ఈ సందర్భంగా కోడెల మాట్లాడారు. శాశ్వత చట్ట సభల డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో చర్చించినట్లు కోడెల తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సిబ్బందికి కావాల్సిన వసతిపై కూడా చర్చించినట్లు చెప్పారు. పూర్తిస్థాయి డిజైన్లపై పలు మార్పులు సూచించినట్లు వెల్లడించారు. అందం, ఆకర్షణే కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఐదు అంతస్థుల్లో అసెంబ్లీ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. సెల్లార్‌లో సర్వీసులు, ఫస్ట్ ఫ్లోర్‌లో అసెంబ్లీ, కౌన్సిల్ హాల్ ఉంటాయన్నారు. రెండో అంతస్థులో మంత్రుల లాంజ్‌లు, మూడో ఫ్లోర్‌లో ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ జరగని సమయంలో పర్యాటకులకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. 250 మీటర్ల ఎత్తులో టవర్ వస్తుందన్నారు. లిఫ్ట్‌ల ద్వారా టవర్‌పైకి వెళ్లి నగర అందాలు వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.
Link to comment
Share on other sites

ఐదు అంతస్తుల్లో అసెంబ్లీ
కోడెల
04195727BRK114-KODELA.JPG

అమరావతి: శాశ్వత చట్ట సభల ఆకృతులపై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఆవరణలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సిబ్బందికి కావాల్సిన వసతులపై వారితో చర్చించారు. పూర్తిస్థాయి ఆకృతులపై పలు మార్పులు సూచించారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందం, ఆకర్షణే కాకుండా భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఐదు అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మాణం జరుగనున్నట్లు వెల్లడించారు. సెల్లార్‌లో సర్వీసులు, మొదటి అంతస్తులో అసెంబ్లీ, కౌన్సిల్ హాల్, రెండో అంతస్తులో మంత్రుల లాంజ్‌లు, మూడో అంతస్తులో ప్రభుత్వ కార్యకలాపాలు కోసం నిర్మాణం జరగనున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ జరగని సమయంలో పర్యాటకులకు అనుమతి ఉంటుందన్నారు. 250 మీటర్ల ఎత్తులో టవర్ వస్తుందని, లిఫ్ట్‌ల ద్వారా టవర్ పైకి వెళ్లి నగర అందాలు వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఆగస్టు నెలాఖరుకు తుది ఆకృతులు సిద్ధమవుతాయన్నారు.

Link to comment
Share on other sites

ప్రపంచ బ్యాంక్‌ రుణంపై రెండు నెలల్లో స్పష్టత?
28-07-2018 07:57:04
 
636683614240652469.jpg
  • ఈలోగా అప్రైజల్‌ రిపోర్ట్‌ను సిద్ధం చేయనున్న ‘బ్యాంక్‌’ అధికారులు
అమరావతి: రాజధానిలోని ప్రాధాన్య రహదారులు, వరద నియంత్రణ పథకాల నిర్మాణానికి సీఆర్డీయే కోరిన విధంగా రుణమివ్వాలా, వద్దా అనే విషయంపై ప్రపంచ బ్యాంక్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ నెల ప్రథమార్ధంలో అమెరికాలో సమావేశమవనున్న ఆ బ్యాంక్‌ డైరెక్టర్లు అమరావతికి రుణ ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించిన అనంతరం ఏ సంగతీ తేలనున్నట్లు తెలుస్తోంది. మరొకపక్క.. రాజధానికి నిధులు ఎంతో అవసరమైన ప్రస్తుత తరుణంలో ప్రపంచ బ్యాంక్‌ రుణం ఎంత త్వరగా అందితే అంత మంచిదన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత కొన్ని రోజులుగా ఈ రుణ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు భోగట్టా. రుణం కోరుతూ సీఆర్డీయే తనకు ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత అది ప్రస్తావించిన ప్రాజెక్టులు, వాటి వల్ల ప్రభావితులయ్యే వివిధ వర్గాల ప్రజలకు కల్పించే పునరావాసం- సహాయక చర్యలు, ఆయా ప్రాంతాల్లో పర్యావరణ, సామాజిక, ఆర్ధికపరంగా చోటు చేసుకోబోయే పర్యవసానాలు ఇత్యాది అంశాల గురించి తెలుసుకునేందుకు ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధి బృందాలు గత కొంతకాలంగా అమరావతిలో పలుమార్లు పర్యటించడం తెలిసిందే.
 
ఇదే కోవలో ఈ నెల 23వ తేదీ నుంచి 26 వరకు నాలుగు రోజులపాటు ఈ బ్యాంక్‌ టీం మరొక పర్యాయం అమరావతిలో విస్తృతంగా పర్యటించింది. ఇందులో భాగంగా ఆ బృంద సభ్యులు సీఆర్డీయే ఉన్నతాఽధికారులతో విపులంగా చర్చించారు. క్షేత్రస్థాయికి వెళ్లి కూడా వచ్చారు. అందులో భాగంగా తమను రుణం ఇవ్వాల్సిందిగా కోరిన ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశాల్లో పర్యటించారు, అక్కడి వివిధ వర్గాల వారితో చర్చించారు. ఆయా ప్రాజెక్టుల వల్ల పర్యావరణం, పరిసరాల్లోని ప్రజల జీవనోపాధులు ఏమేర ప్రభావితమవుతాయన్న అంశానికి ప్రాధాన్యమిచ్చారు. ప్రతినిధి బృందాల పరిశీలనా కార్యక్రమాలు తాజా పర్యటనతో ఒక కొలిక్కి వచ్చినట్టేనని భావిస్తున్నారు. తమ పరిశీలనలో తేలిన విషయాలన్నింటినీ పొందుపరుస్తూ ఇంకొన్ని వారాల్లోనే అవి ‘అప్రైజల్‌ రిపోర్ట్‌’ను సిద్ధం చేస్తాయని సమాచారం.
 
రుణ మంజూరు ప్రక్రియలో అత్యంత ప్రధానమైన ఈ నివేదికను ఆ తర్వాత కొన్ని రోజులకే సమావేశం కానున్న ప్రపంచ బ్యాంక్‌ డైరెక్టర్లు అధ్యయనం చేసి, రాజధానికి రుణం ఇవ్వవచ్చునో, లేదో అనే విషయంపై ఒక నిర్ణయానికి వస్తారని భోగట్టా. ఒకవేళ ఇవ్వాలని గనుక నిర్ణయం తీసుకుంటే సీఆర్డీయే అడిగిన దాదాపు రూ.6800 కోట్లను రెండు విడతలుగా, సమాన మొత్తాలుగా ప్రపంచ బ్యాంక్‌ ఇవ్వనుందని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

ఐదంతస్తుల ఐకానిక్‌ అసెంబ్లీ
28-07-2018 03:47:38
 
636683464577803836.jpg
  • 250 మీటర్ల ఎత్తులో టవర్‌: స్పీకర్‌
  • నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో భేటీ
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యుత్తమమైన ఐకానిక్‌ అసెంబ్లీగా ఐదు అంతస్తుల్లో చట్టసభల భవనాన్ని నిర్మించనున్నట్లు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. శుక్రవారం వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో శాశ్వత చట్టసభల ఆకృతులపై నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులతో స్పీకర్‌ భేటీ అయ్యారు. సమావేశం అనంతరం సభాపతి విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ భవన నిర్మాణంలో భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సెల్లార్‌లో సర్వీసులు, మొదటి అంతస్తులో అసెంబ్లీ, కౌన్సిల్‌ హాళ్లు, రెండో అంతస్తులో మంత్రుల లాంజ్‌లు, మూడో అంతస్తులో ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మాణం జరగనున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ జరగని సమయంలో పర్యాటకులను అనుమతిస్తామన్నారు. 250 మీట్లర్ల ఎత్తులో టవర్‌ వస్తుందని, లిప్ట్‌లద్వారా టవర్‌ పైకి వెళ్లి అమరావతి నగర అందాలను వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు స్పీకర్‌ పేర్కొన్నారు. ఆగస్టులో శాశ్వత అ సెంబ్లీ భవన నిర్మాణపనులు చేపట్టనున్నట్లు నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధి తెలిపారు.
Link to comment
Share on other sites

శాసనసభ ఆకృతి దాదాపుగా ఖరారు 
స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర శాసనసభ శాశ్వత భవన ఆకృతిని దాదాపు ఖరారు చేసినట్లు సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. సింగపూర్‌కు చెందిన నార్మన్‌ఫోస్టర్‌ ప్రతినిధులతో శుక్రవారం వెలగపూడిలో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ నిర్మాణ ఆకృతి ఎలా ఉండాలన్న దానిపై ఓ అవగాహనకు వచ్చాం. నిర్మాణం దేశంలోనే విశిష్టంగా ఉండే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మొదటి అంతస్తులో శాసనసభ, శాసనమండలి, రెండో అంతస్తులో అధికారుల కార్యాలయాలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర హోదాల్లో ఉన్న వారికి తగినట్లుగా అన్ని రకాల సౌకర్యాలు, మూడో అంతస్తు నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన పర్యాటకం వంటి శాఖల కార్యకలాపాలు కొనసాగుతాయి.’ అని వివరించారు. నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. నిర్మాణ పనులను ఆగస్టు నుంచి చేపట్టాలనుకుంటున్నామని, నిర్మాణాల కాలవ్యవధిపై ప్రభుత్వంతో సంప్రదించాల్సి ఉందన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన అనంతరం త్వరలోనే ఖరారు చేస్తామని సభాపతి కోడెల శివప్రసాద్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...