Jump to content

గ్లాడియేటర్ రేంజ్‌లో శాతకర్ణి!!!!!


KING007

Recommended Posts

గ్లాడియేటర్ రేంజ్‌లో శాతకర్ణి
01-05-2016 21:16:20
635977341778374779.jpg
బాహుబలి...వాట్ నెక్స్ట్ అని అంతా అనుకుంటున్న తరుణంలోనే సైలెంట్‌గా యువరత్న బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. బాలయ్య నూరో చిత్రం ఇదే కావడం, చాలామందికి అంతగా తెలియని తెలుగు చారిత్రక ఇతివృత్తానే ఆయన ఎంచుకోవడం అందర్నీ ఆకర్షించింది. టైటిల్‌ ప్రకటనతోనే సంచలనం సృష్టించడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. టైటిల్ హిట్టయితే విడుదలకు ముందే సినిమా సగం హిట్టయినట్టు టాలీవుడ్ లెక్క. బాలయ్య లెక్క కూడా అదే. దాదాపు రెండేళ్లుగా అంటే 98వ సినిమా దగ్గర్నించే బాలయ్య ఈ కసరత్తు చేశారు. ఓరకంగా బాలయ్య వందో సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే మెగాస్టార్ 150వ చిత్రానికి కదలిక వచ్చిందనుకోవచ్చు. ఆ మాట అటుంచితే గౌతమీపుత్ర శాతకర్ణి ఎలా ఉండబోతోంది? ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోందని తాజా సమాచారం. గ్లాడియేటర్ తరహాలో ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా తీసేందుకు నిర్మాతలు గట్టిపట్టుదలతో ఉన్నారు. ఇంతేకాదు...హాలీవుడ్‌లో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెక్కుచెదరని అద్భుతమైన సినిమాలు చిత్రీకరించిన మెరాకోలోనే బాలయ్య చిత్రం షూటింగ్‌కు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. గ్లాడియేటర్, ఇన్సెప్షన్, ది మమ్మీ, మమ్మీ రిటర్న్స్, ప్రిన్స్ ఆఫ్ పెర్సియా వంటి క్లాసికల్ మూవీస్ మొరాకాలో తీసినవే. ఎన్నో హాలీవుడ్ సినిమాల్లోనే యుద్ధ సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే మొరాకోకు ఇప్పటికే నాలుగు టన్నుల యుద్ధ సామాగ్రిని షిప్పింగ్ ద్వారా తరలిస్తున్నట్టు చెబుతున్నారు. సుమారు వెయ్యి మంది స్థానిక జూనియర్ ఆర్టిస్టులను రోజువారీ వేతనం మీద తీసుకున్నారు. కేవలం యుద్ధ సన్నివేశాలకే పది కోట్లకు పైగా వెచ్చించబోతున్నట్టు సమాచారం. క్రిష్ సైతం ఇదో ప్రతిష్ఠాత్మక చిత్రంగా తీసుకున్నారు. 'కంచె' సినిమాకు పనిచేసిన అనుభవంతో 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లేందుకు పట్టుదలతో ఉన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి మరో గ్లాడియేటర్ కావచ్చు...కాకపోవచ్చు. కానీ ఆ రేంజ్‌కు తగ్గకుండా తీస్తే మాత్రం తెలుగుసినిమా ప్రతిష్ఠ మరో మెట్టెక్కుతుంది.

 

Link to comment
Share on other sites

Expectations vunte manchidhe kaani, but inko movie or gladiator range lanti comparisons anavasaram naa vuddhesham prakaram.

Very true. Anavasaram ga, high expectations penchatam authundi. Okavela expectations reach ayina, copy antaru.. Better to stay away.

 

I hope balayya kuda effort petti, stunts care theeskunte better..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...