Jump to content

ArcelorMittal SteelPlant


sonykongara

Recommended Posts

: ఉత్తరాంధ్రకు మరో వరం!

ఉమ్మడి విశాఖ జిల్లా మెడలో మరో మణిహారం చేరనుంది. దేశీయ ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిట్టల్‌.. జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్స్‌ (ఏఎం/ఎన్‌ఎస్‌) జాయింట్‌ వెంచర్‌ కంపెనీ రెండు దశల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తోంది.

Updated : 31 Oct 2024 07:08 IST
 
 
 
 
 
 

అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీలు ప్లాంట్‌
మొదటి దశలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు
20 వేల మందికి ఉపాధి
రెండో దశలో మరో రూ.70 వేల కోట్లు
ఎన్‌ఎండీసీ నుంచి ముడి ఖనిజం
క్యాప్టివ్‌ విధానంలో మరో పోర్టు అభివృద్ధి
పెట్టుబడుల ప్రతిపాదనపై ప్రభుత్వంతో సంస్థ సంప్రదింపులు 
ఈనాడు - అమరావతి

AP301024main1a.jpg

ఉమ్మడి విశాఖ జిల్లా మెడలో మరో మణిహారం చేరనుంది. దేశీయ ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిట్టల్‌.. జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్స్‌ (ఏఎం/ఎన్‌ఎస్‌) జాయింట్‌ వెంచర్‌ కంపెనీ రెండు దశల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తోంది. మొదటి దశలో రూ.70 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. రాష్ట్ర చరిత్రలోనే ఇది భారీ పెట్టుబడి 

అవుతుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి (రాజయ్యపేట) దగ్గర ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (ఐఎస్‌పీ) ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది. పరిశ్రమ మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరికి పూర్తి చేసి.. ఉత్పత్తిలోకి తీసుకురానున్నట్లు అందులో తెలిపింది. సంస్థ ప్రతినిధులు, అధికారుల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. స్టీల్‌ ప్లాంట్‌తో పాటు క్యాప్టివ్‌ అవసరాల కోసం పోర్టు, రైల్‌ యార్డు నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు కోరింది. జగన్‌ ప్రభుత్వ విధ్వంసక పాలనలో గత ఐదేళ్లలో పెట్టుబడుల కోసం నిరీక్షణే మిగిలింది. రాష్ట్రం వైపు కన్నెత్తి చూసేందుకు పారిశ్రామికవేత్తలు హడలిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో వస్తున్నారు.

73 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి

మొదటి దశలో 7.3 మిలియన్‌ మెట్రిక్‌ (ఎంఎటీపీఏ) వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో స్టీలు ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్లాంట్‌ నిర్మాణ సమయంలో మరో 25 వేల మందికి, తర్వాత కార్యకలాపాలు, నిర్వహణ కోసం సుమారు 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని సంస్థ ప్రతిపాదించింది. దీంతోపాటు రెండో దశ ప్లాంట్‌ నిర్మాణ సమయంలో అంతే మొత్తం లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపింది.  

అనకాపల్లి బల్క్‌డ్రగ్‌ పార్కు కోసం ప్రతిపాదించిన 2,200 ఎకరాలను మొదటి దశ ప్లాంట్‌ నిర్మాణానికి వినియోగించుకునే అవకాశం ఉందని, దీనివల్ల భూసేకరణ పనుల జాప్యం లేకుండా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించడానికి అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. టౌన్‌షిప్‌ అభివృద్ధి కోసం మరో 440 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. రెండో దశలో 10.5 ఎంఎటీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ నిర్మాణానికి మొదటి దశ ప్లాంట్‌కు అనుకుని ఉన్న మరో 3,800 ఎకరాలను కేటాయించాలని ప్రతిపాదించింది. ఒకేచోట 20 నుంచి 24 ఎంఎంటీపీఏ ఉత్పత్తి సామర్థ్యమున్న ఉక్కు కర్మాగారం దేశంలోనే మొదటిదవుతుందని పేర్కొంది. క్యాప్టివ్‌ అవసరాల కోసం పోర్టు నిర్మాణానికి ప్లాంట్‌కు సమీపంలో 3 వేల మీటర్ల పొడవు సముద్ర తీర ప్రాంతాన్ని కేటాయించాలని కోరింది. 

భవిష్యత్తులోనూ ముడి ఖనిజానికి ఢోకా లేదు

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ఎండీసీకి కేటాయించిన గనుల నుంచి ప్లాంట్‌కు అవసరమైన ముడి ఖనిజాన్ని తీసుకోనున్నట్లు సంస్థ తెలిపింది. ఆ సంస్థ దగ్గర ప్రస్తుతం ఏటా 17.5 మిలియన్‌ టన్నుల ముడి ఖనిజం నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. దీంతోపాటు భవిష్యత్తు అవసరాలకు సరిపడా ముడి ఖనిజాన్ని తవ్వేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించిందని తెలిపింది. ‘ఛత్తీస్‌గఢ్‌లోని గనుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ప్రసుత్తం 46 ఎంటీలుగా ఉంది. దీన్ని 2029 నాటికి 96 ఎంఎంటీపీఏకు పెంచాలని ఎన్‌ఎండీసీ లక్ష్యం. గనుల విస్తరణకు రూ.50 వేల కోట్లను సంస్థ ఖర్చు చేయబోతోంది. ఆ సంస్థ ఉత్పత్తి చేసే ముడి ఖనిజాన్ని విశాఖలోని ప్లాంట్‌ ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు ఏఎం/ఎన్‌ఎస్, ఎన్‌ఎండీసీ, ఏపీఐఐసీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల అందరికీ ప్రయోజనం చేకూరుతుంది’ అని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది. 

మరో ఉక్కు నగరం 

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రంలో అంతర్గత ఆస్తుల అభివృద్ధికి అవకాశం ఉంటుంది. కర్మాగారంలో పనిచేసే ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారితో కలిపి పరిశ్రమకు చుట్టుపక్కల 60 వేల నుంచి 80 వేల మంది నివసించే అవకాశం ఉందని.. క్రమేణా జంషెడ్‌పూర్, భిలాయ్, బొకారో, విశాఖపట్నం తరహాలో మరో ఉక్కు నగరం అభివృద్ధికి అనువైన వాతావరణం ఏర్పడుతుందని సంస్థ ప్రతిపాదనల్లో తెలిపింది. దీంతో పాటు వివిధ అనుబంధ కంపెనీలు, పరిశ్రమకు అనుసంధానంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెట్టే పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది.

రాష్ట్రంలో మిట్టల్‌ గ్రూప్‌ పెట్టుబడులు

ఏఎం/ఎన్‌ఎస్‌ భాగస్వామ్య సంస్థ విశాఖలో 8 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో పెల్లెట్ల తయారీ కర్మాగారాన్ని నిర్వహిస్తోంది. ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 11 ఎంటీపీఏకు పెంచేందుకు విస్తరణ పనులకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తోంది. కర్నూలు జిల్లాలో గ్రీన్‌కో గ్రూపు భాగస్వామ్యంతో 975 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణంలో రూ.4,600 కోట్లు పెట్టుబడి పెట్టింది.


అక్కడే పరిశ్రమ ఏర్పాటు.. ఎందుకంటే?

  • అనకాపల్లి జిల్లా రాజయ్యపేట దగ్గర ఇండస్ట్రియల్‌ పార్కుల్లో పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూములు సిద్ధంగా ఉన్నాయి. భూసేకరణకు వేచి చూడకుండా వెంటనే మొదటి దశ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టి.. 2029 జనవరికల్లా పూర్తి చేయొచ్చు. 
  • ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ముడి ఖనిజాన్ని స్లర్రీ పైపులైను ద్వారా విశాఖ ప్లాంట్‌కు   తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తయారు చేసిన పెలెట్లను ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌లోకి నేరుగా పంపే వెసులుబాటు కలుగుతుంది.
Link to comment
Share on other sites

Andhra News: ‘ఆర్సెలార్‌ ఉక్కు’ పెట్టుబడులపై నేడు ప్రకటన?

ఉక్కు దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిట్టల్‌.. జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్స్‌ (ఏంఎ/ఎన్‌ఎస్‌) కంపెనీలు సంయుక్తంగా ఉమ్మడి విశాఖలోని అనకాపల్లి దగ్గర ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్‌ స్టీలు ప్లాంట్‌(ఐఎస్‌పీ)కు సంబంధించి మొదటి దశలో పెట్టే రూ.70 వేల కోట్ల పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Updated : 02 Nov 2024 07:34 IST
 
 
 
 
 
 

జనవరిలో శంకుస్థాపనకు ప్రణాళిక
సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నేడు సమావేశం
ఆ తర్వాత ఉమ్మడిగా ప్రకటించే అవకాశం

021124brk124197320a.jpg

ఈనాడు, అమరావతి: ఉక్కు దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిట్టల్‌.. జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్స్‌ (ఏంఎ/ఎన్‌ఎస్‌) కంపెనీలు సంయుక్తంగా ఉమ్మడి విశాఖలోని అనకాపల్లి దగ్గర ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్‌ స్టీలు ప్లాంట్‌(ఐఎస్‌పీ)కు సంబంధించి మొదటి దశలో పెట్టే రూ.70 వేల కోట్ల పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భారీ పెట్టుబడులను అమరావతి నుంచి కాకుండా.. అదే ప్రాంతం నుంచి ప్రకటించడం వల్ల ప్రాధాన్యత కల్పించినట్లవుతుందని సీఎం భావించినట్లు తెలిసింది. రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పలు సంక్షేమ కార్యక్రమాల్లో శుక్రవారం పాల్గొన్నారు. రాత్రికి అక్కడే బస చేసి.. శనివారం విశాఖ చేరుకుని అభివృద్ధి పనులపై సమీక్షించే అవకాశం  ఉందని తెలిసింది. 

జనవరిలో శంకుస్థాపన

ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి వచ్చే ఏడాది జనవరిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. పరిశ్రమకు అవసరమైన భూముల కేటాయింపు విషయంపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి దగ్గర బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీ కోసం కేటాయించిన 2 వేల ఎకరాల్లో కొంతభాగంతోపాటు.. విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా నక్కపల్లి పార్కు ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూములను ఉక్కు పరిశ్రమ కోసం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సుమారు 5 వేల ఎకరాలను కేటాయించనున్నట్లు తెలిసింది. ఐఎస్‌పీ మొదటి దశ పూర్తైతే సుమారు 20 వేల మందికి ఉపాధి లభించనుంది. అనుబంధ పరిశ్రమల ద్వారా భారీగా ఉపాధి లభిస్తుందని పరిశ్రమలశాఖ అధికారులు పేర్కొంటున్నారు.  

రాష్ట్రానికి ఆర్సెలార్‌ రావడం వెనుక సుదీర్ఘ కసరత్తు

పొరుగు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలార్‌ సంస్థ దాదాపు నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపుల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఈ దశలో సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టింది. సంస్థ ప్రతినిధులు సీఎంతో నేరుగా సమావేశమయ్యేలా చూసేందుకు పరిశ్రమలశాఖ, ఏపీఐఐసీ అధికారులతో కూడిన బృందం కీలకంగా పనిచేసింది. ప్రోత్సాహకాలపై  సంస్థ ప్రతినిధులతో సుదీర్ఘంగా ప్రభుత్వం చర్చించింది. నెల రోజుల వ్యవధిలోనే సంస్థ ప్రతినిధులతో సీఎం నేరుగా సమావేశమయ్యారు. రెండురోజులకోసారి సంస్థతో  అధికారులు సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు.. ప్రతిపాదించిన భూములను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలార్‌ సంస్థ అంగీకరించినట్లు తెలిసింది. 


కియా వచ్చిన తరహాలో

కియా కార్ల తయారీ పరిశ్రమను రాష్ట్రానికి తెచ్చేందుకు 2014-19 మధ్య అప్పటి తెదేపా ప్రభుత్వం ఏ విధంగా కృషి చేసిందో ఇప్పుడూ అదే తరహాలో ఆర్సెలార్‌ ఉక్కు పరిశ్రమ రాష్ట్రానికి వచ్చేలా చేసేందుకు కూటమి ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. అప్పట్లో కియా కూడా మహారాష్ట్రలో తన యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు దాదాపు నిర్ణయం తీసుకుంది. ఆ దశలో సీఎం చంద్రబాబు నేరుగా సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, ఆ పరిశ్రమ రాష్ట్రానికి రావడం వెనుక కీలకంగా నిలిచారు. ఇదే విధంగా ఇప్పుడు కూడా చంద్రబాబు కసరత్తు చేశారు.

 
Link to comment
Share on other sites

 

నక్కపల్లిలో మిత్తల్‌ ఉక్కు పరిశ్రమ

‘మేం అధికారంలోకి వచ్చాక పెద్దపెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. మొన్ననే మిత్తల్‌ కలిశారు. రూ.70 వేల కోట్లతో నక్కపల్లి దగ్గర ఉక్కు పరిశ్రమ పెడతామని ముందుకొచ్చారు. అది ఏర్పాటైతే అక్కడ ఒక పెద్ద నగరమే వస్తుంది. మిగతాచోట్ల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ వస్తున్నాం. 175 నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చుతున్నాం. కర్నూలు జిల్లాలో 300 ఎకరాల్లో డ్రోన్‌ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ఈ డ్రోన్లను వినియోగించే పని డ్వాక్రా మహిళలకు అప్పగిస్తాం. సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతలు కనిపించకూడదని  ఆ శాఖ మంత్రిని ఆదేశించాం. వారు నిజంగా చేశారో లేదో డ్రోన్ల ద్వారా పరిశీలిస్తాం. మా మిత్రుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సిమెంటు రోడ్డు లేని గ్రామాలు ఉండకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. రూ.4,500 కోట్లతో జనవరి నాటికి గ్రామాల్లో 30 వేల పనులు పూర్తి చేయనున్నాం’ అని చెప్పారు.

https://x.com/TimesNow/status/1852981325252493448

Link to comment
Share on other sites

అందరి చూపు.. నక్కపల్లి వైపు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా నక్కపల్లి మండలంలోని విశాఖ-చైన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో (వీసీఐసీ) పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. 

Updated : 04 Nov 2024 05:53 IST
 
 
 
 
 
 

మిత్తల్‌ స్టీల్‌ కర్మాగారం ఏర్పాటుపై సీఎం ప్రకటన
న్యూస్‌టుడే, నక్కపల్లి

vsp03112024-4a.jpg

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా నక్కపల్లి మండలంలోని విశాఖ-చైన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో (వీసీఐసీ) పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. 

ఈ నేపథ్యంలో ఇక్కడ మిత్తల్‌ యాజమాన్యం భారీ స్టీల్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా శనివారం నాటి పరవాడ పర్యటనలో ప్రకటించారు. దీంతో పారిశ్రామిక పటంలో నక్కపల్లి ముఖచిత్రం మారనుందని పారిశ్రామిక నిపుణులు  పేర్కొంటున్నారు.


vsp03112024-4b.jpg

క్కపల్లి మండలం పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం 2010లో అడుగులు మొదలయ్యాయి. ఈ క్రమంలో భూసేకరణ మొదలు పెట్టారు. 2014 వరకు ఇది అరకొరగానే సాగింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. నిర్వాసితుల ఆందోళనలకు తెరదించుతూ మెరుగైన పరిహారం ప్రకటించారు. ఆ మేరకు 90 శాతం వరకు చెల్లింపులు పూర్తి చేయించారు. తద్వారా 4500 ఎకరాలను పరిశ్రమలకు సేకరించారు. దీంతో పాటు 1,150 ఎకరాలను స్టార్టప్‌ ఏరియా కోసం సిద్ధం చేశారు. ఈ లోగా వైకాపా అధికారంలోకి వచ్చింది. జగన్‌ ఏలుబడిలో ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అంతా భావించగా, పరిస్థితి తారుమారైంది. పరిశ్రమల సంగతి దేవుడెరుగు..కనీసం నిర్వాసితులకు పునరావాసం, ఇందులో మిగిలిన ఇతర సమస్యలనైనా పరిష్కరించలేకపోయారు. ఫలితంగా గత అయిదేళ్లు ఎక్కడిగొంగళి అక్కడే అన్న చందాన మారింది. దీంతో ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత, నిరుద్యోగులు నిర్వేదంలో మునిగిపోయారు.

vsp03112024-4c.jpg

పరిశ్రమలకోసం నక్కపల్లి మండలంలో సేకరించిన భూములు 


80 వేల మందికి ఉపాధి అవకాశాలు

అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం..కూటమి అధికారంలోకి రాగానే పరిశ్రమల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. గతంలో సేకరించిన భూములను పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం గా ఉంచాలని అధికార యంత్రాంగానికి ఆదేశించగా, గడిచిన నాలుగు నెలలుగా అధికారులు ఇదే పనిమీద ఉన్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు, నిర్వాసితుల పునరావాసానికి అవసరమైన స్థలాన్ని చూస్తున్నారు. తాజాగా తొలుత ఆర్సెలార్‌ మిత్తల్‌ సుమారు రూ. 70 వేల కోట్లతో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఇందుకు తొలిదశలో 2,200 ఎకరాల భూమి కావాలని, అదేవిధంగా తొలిదశ నిర్మాణం 2029కు పూర్తి కానున్నట్లు వివరిస్తూ మిత్తల్‌ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ఈ ప్రాంతవాసుల్లో విస్తృత చర్చ జరగ్గా, తాజాగా సీఎం సైతం బహిరంగంగా ఇదే విషయమై స్పష్టత ఇవ్వడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు జరిగితే, ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 80 వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా దీనికి ప్రధాని మోదీ త్వరలోనే శంకుస్థాపన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 

vsp03112024-4d.jpg

 ఇటీవల భూసేకరణ ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్, జేసీ 

  • ఇప్పటికే ఈ రాజయ్యపేట ప్రాంతంలో హెటెరో ఫార్మా ఉంది. దీని ద్వారా 10 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే ఇక్కడ పారిశ్రామికంగా ఓ రకమైన గుర్తింపు ఉంది. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు అడుగులు పడితే కచ్చితంగా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. 
  • భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. పరవాడ, అచ్యుతాపురం తరహాలోనే భారీ పారిశ్రామికవాడగా మారనుంది. ఇప్పటికే నక్కపల్లిలో ఏపీఐఐసీ సబ్‌జోనల్‌ కార్యాలయాన్ని నక్కపల్లిలో ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులు ఇక్కడే ఉంటూ పురోగతి నివేదికలు తయారు చేస్తున్నారు. ఇక్కడ భూములిచ్చిన రైతాంగం మిగులు సమస్యలు పరిష్కరించి వీలైనంత వేగంగా పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన చేయించాలని అధికారులు నిమగ్నమై ఉన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...