Jump to content

TDP MLA Candidates List


Recommended Posts

ఆ ఆరు స్థానాలపై ఆచితూచి.. ఎవరికి ఇవ్వాలన్న సందిగ్ధంతోనే పెండింగ్‌

తెలుగుదేశం పార్టీ ఇంకా ఆరు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్‌ స్థానాలున్నాయి.

Updated : 23 Mar 2024 10:16 IST
 
 
 
 
 
 

తెదేపా అసెంబ్లీ టికెట్ల వ్యవహారం

230324brk124057040a.jpg

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఇంకా ఆరు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్‌ స్థానాలున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు భీమిలి టికెట్‌ కేటాయించాలని అడుగుతున్నారు. చంద్రబాబు ఆయనను చీపురుపల్లి వెళ్లాలని చెబుతున్నారు. నిర్ణయం ఎటూ తేలకపోవడంతో ఈ రెండుచోట్లా అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో పడింది. తాజాగా శ్రీకాకుళం బదులుగా ఎచ్చెర్లను భాజపాకు కేటాయించడంతో... మరో మాజీమంత్రి కళా వెంకటరావు చీపురుపల్లి టికెట్‌ అడుగుతున్నారు. చీపురుపల్లికి ఆయన పేరూ పరిశీలనలో ఉంది. మరోపక్క నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో... అక్కడ తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న బంగార్రాజు పేరును భీమిలికి పార్టీ అధినాయకత్వం పరిశీలించింది. ఆయా స్థానాల అంశం గంటా, కళా వెంకటరావు, బంగార్రాజుల మధ్య తిరుగుతుండటంతో నిర్ణయం పెండింగ్‌లో పడింది.

  • విజయనగరం లోక్‌సభ స్థానాన్ని భాజపా నుంచి తీసుకుని రాజంపేట ఇచ్చే అంశం తెదేపా పరిశీలనలో ఉంది. అదే జరిగితే విజయనగరం లోక్‌సభ స్థానానికి కళా వెంకటరావు పేరు పరిశీలించే అవకాశముంది.
  • ప్రకాశం జిల్లా దర్శి టికెట్‌ ఇస్తే పార్టీలోకి వస్తానని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చెబుతున్నారు. కానీ ఆయనపై పార్టీలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. దర్శి నుంచి శిద్దా కోడలి పేరు పరిశీలనలో ఉంది.
  • కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ స్థానానికి వీరభద్రగౌడ్‌తో పాటు వైకుంఠం మల్లికార్జున, ఆయన సోదరుడి భార్య జ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
  • అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్‌ ఇస్తామన్న ప్రతిపాదనతో... జగన్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం పదవికి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో పాటు, యాదవ సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడి పేరూ పరిశీలిస్తున్నారు. గుమ్మనూరుకే ఎక్కువ అవకాశాలున్నట్టు సమాచారం.
  • అనంతపురం అర్బన్‌ టికెట్‌కి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో పాటు, మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు.
  • అన్నమయ్య జిల్లా రాజంపేట టికెట్‌ కోసం చెంగల్రాయుడు, జగన్మోహన్‌రాజు పోటీ పడుతున్నారు.
Link to comment
Share on other sites

విజయనగరం ఎంపీ టికెట్ రఘురామకు ఇస్తారంటూ ప్రచారం ఎంపీగా కాకుంటే ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ..? - ఈ వారంలో రఘురామ పోటీపై స్పష్టత

Link to comment
Share on other sites

TDP: తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పోటీ చేయనున్న 10 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో తెలుగుదేశం పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది.

Updated : 27 Mar 2024 21:16 IST
 
 
 
 
 
 

124059984_27tdp-1a.jpg

మరావతి: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పోటీ చేయనున్న 10 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో తెలుగుదేశం పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. భాజపా, జనసేనతో పొత్తులో భాగంగా తెదేపాకు 144 అసెంబ్లీ స్థానాలు కేటాయించగా.. 139 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం ప్రకటించిన మొదటి జాబితా అభ్యర్థుల్లో పి.గన్నవరం, అనపర్తి, అరకు స్థానాలను జనసేన, భాజపాకు సర్దు బాటు చేశారు.దీంతో ఇంకా.. చీపురుపల్లి, పాడేరు, భీమిలి, దర్శి, రాజంపేట, ఆలూరు, అనంతపురం, గుంతకల్లు స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. 

పొత్తులో భాగంగా జనసేనకు 21 స్థానాలు కేటాయించగా.. ఇప్పటి వరకు  18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. రెండ్రోజుల్లో ఫైనల్‌ చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలతో చెప్పినట్టు సమాచారం.

Link to comment
Share on other sites

4 లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెదేపా 

విజయనగరం తెదేపా ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడు 
చీపురుపల్లి-కళా వెంకట్రావు, భీమిలి  గంటా శ్రీనివాసరావు 
పాడేరువెంకటరమేశ్‌ నాయుడు, దర్శి గొట్టిపాటి లక్ష్మి
రాజంపేట  సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు - వీరభద్ర గౌడ్‌
గుంతకల్లు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్‌

అనంతపురం అర్బన్‌ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌
  
కదిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్‌

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...