Jump to content

Recommended Posts

రఘు రామ కృష్ణం రాజు గారు తెగ నచ్చేసారు

ఆయనను చుస్తే 

ఒక మామయ్య నో
ఇంటిలో బాబాయ్ నో చూస్తున్నట్టు ఉంది

గోదావరి సహజ యాస
కాసింత సృజనత్మకత కల బోత 

సూటిగా చెప్పే మాట
తన ప్రతి మాట తో ప్రజల వెంట

బోర్ కొడితే
ఆయన ఫోటో చూస్తూ ఉంటా

ఉత్సాహము రావాలి అంటే ఆయన 
వీడియోలు చూస్తా

ఈ రాష్ట్రం ను కాపాడటానికి దేముడు బహు మిక్కిలి తో తయారు చేసిన మరో బ్రహ్మస్త్రం రఘు రామ కృష్ణం రాజు గారు .

రాష్ట్రం అంధకారంలో ఉంటే
అన్నీ వ్యవస్థలు కునారిల్లితే
తనకు తాను ఒక ఆయుధం గా
పాశుపతాస్త్రం గా సగటు జీవి చేతిలో
విల్లంబులా RRR వేసే బాణాలు

గురి తప్పక తగులుతున్నాయి

తెలుగు తనానికి
తెలుగు ఆత్మ గౌరవనికి
తెలుగు నుడికారానికి
తెలుగు భాష కు
అంధ్రుల హక్కుల పోరాటానికి
సామాన్యుల కొసం ఆయన ఎత్తే నిత్య సమస్యలకు
మొక్కవొనీ ఆ పోరాటానికి
రాజీలేని ఆయన ధైర్యానికి
ఆ అజరామర దీక్ష కు

లాల్ సలాం 

మరో సీతారామరాజు నీ
మరో Cesar Chavez ను
మరో Julian Assange ను
మరో మానసి ప్రధాన్ ను
మరో హరీష్ అయ్యర్ ను

కలగలిపి తెలుగు తల్లి ఆంధ్రుల కొసం ఈ అపురూప  వజ్రయుధం పంపిందా?

మన కనీస హక్కులు హరణం కాకుండా RRR ను సామాన్యుని కి అండ గా పంపిందా అనిపిస్తోంది

రఘు రామ రాజు ఈ రాష్ట్ర సంపద
ఆయన మన గుండెలో నిలిచే నిలువెత్తు అజాను బహుడు

ఎత్తులో కాదు సుమీ
వినే మనస్సులో
ధైర్యం గా ఎత్తే సమస్య లో
గొంతు లేని వారికి కంఠం గా

ఆయన ఇప్పుడు ఒక ఎంపీ గానో
ఒక రాజకీయ నాయకుడు గానో కనిపించటం లేదు

నిత్యం పేదవాడి పక్క నుండి వేసే ప్రశ్న గా
సదా మధ్య తరగతి ప్రజల అండగా
అణగారిన వర్గాలకు అండ గా
తన గొంతు మన గొంతు గా
తన శక్తి తెలుగు శక్తి గా
తన యుక్తి అంధ్రుల కష్టాలకు ముక్తి గా
ప్రత్యర్థుల కుయుక్తి నీ తునాతునకలు చేసే శక్తి గా 

మన రోజు వారి జీవితం లో
ఒక్క సారి అయినా రోజూ RRR ను తలచుకోవటం గర్వంగా ఫీల్ అవుతా


ఎక్కడ రాజకీయ పార్టీలు ఫెయిల్ అయ్యాయో

ఎక్కడ నాయకులు ఫెయిల్ అయ్యారో

ఎక్కడ పోలీసులు చేష్టలుడిగి నిమ్మిత్త మాతృలు అయ్యారో

ఎక్కడ కోర్టులు సుప్త చేతనావస్థ లోకి వెళ్లి పోయాయో

ఎక్కడ పత్రికలు భయపడి నిజం రాయటం మానేశాయో

ఎక్కడ టీవీ లు భయపడి తప్పు ఒప్పు గా చూపటం మొదలెట్టారో

ఎక్కడ మేధావులు ప్రాణాలకు భయపడి మౌనం అయ్యారో 

ఎక్కడ ప్రాధమిక హక్కులుకు భంగం అయ్యాయో

ఎక్కడ ప్రజలు అలసి, అన్నీ దారులు మూసుకొని పోయాయో

అక్కడ రఘు రామ రాజు గారు మొదలు పెడతారు

నిశీది లో కాంతి పుంజం రఘు రామ కృష్ణం రాజు
అంతులేని అప్రజాశ్వమ్య 
చీకటి గుహలో వెలుగు రేఖ రఘు రామ కృష్ణం రాజు


రఘు రామ కృష్ణం రాజు తెలుగు వాడి ఆస్తి
తెలుగు తనానికి ప్రతికి
6 కోట్ల మంది అంధ్రుల శక్తి 

దేముడు ఆయనకు ఆయురారోగ్యాలతో మెండుగా శక్తి ఇవ్వాలి

మా శక్తి కూడా ఆయన శక్తి గా మారాలి
మా ఆయుష్షు కూడా ఆయన ఆయుష్షు గా మారాలి

నేను అన్నది ఇక్కడ అప్రస్తుతం
ఆయన చేతిలో స్వాంతన చేకూరె
మనం లో మరో తెలుగు వాడు కు మేలు జరిగితే చాలు

నా పూజలో నివుంటావ్
నా కష్టం లో నివుంటావ్
నేను ఒక్కడిగా మిగిలినా, అయినా నా కొసం నీ గళం ఎత్తుతావ్

నీ ఋణం ఎలా ఈ జన్మలో తీర్చుకునేది
దేముడు ను నిన్ను చల్లగా చూడాలి అని కోరుకోవటం తప్ప?

థాంక్ యు గాడ్
కృతజ్ఞతలు తెలుగు తల్లీ 
మాకు రఘు రామ కృష్ణం గారిని ఇచ్చినందుకు
కాస్త ఆలస్యం అయినా
రాయి ఏదో
రత్నం ఏదో తెలియ చెప్పినందుకు

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...