Jump to content

Lava Kusa


vk_hyd

Recommended Posts

Long one but very good collective information

*లవకుశ (29-03-1963)*

*లలితా ఫిలింస్ చరణదాసి అనే చిత్రాన్ని నిర్మించగా 20-12-1956 న విడుదలయ్యింది. ఈ చిత్ర నిర్మాత ఎ . శంకర రెడ్డి గారు, M.A.B.L . ఈ చిత్రం లో ఒక చిన్న సన్నివేశంలో అంజలీదేవి , ఎన్ టి రామారావు గార్లు సీతా రాములుగా కనిపించారు. ఆ దృశ్యం శంకర రెడ్డి గారి మదిలో ముద్ర వేసుకుని వీళ్ళిద్దరినీ సీతా రాములుగా పూర్తి స్థాయి సినిమా నిర్మిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.*

*సీతారాముల గాధ అనగానే శంకర రెడ్డిగారికి 1934 లో వచ్చిన లవకుశ చిత్రం మనస్సులో మెదిలింది. ఆ చిత్ర దర్శకులు సి పుల్లయ్యగారిని సంప్రదించారు. అప్పటివరకూ తెలుగులో పూర్తి కలర్ చిత్రం రాలేదు. అందుకని క్రొత్తదనం కోసం లవకుశ చిత్రాన్ని గేవా కలర్ లో చిత్రీకరణ చేయాలని శంకర రెడ్డి గారు, సి పుల్లయ్యగారు నిశ్చయించుకున్నారు.*

*కధ,మాటలు, కొన్ని పాటలు సదా శివ బ్రహ్మం గారు రచించగా సముద్రాల సీనియర్ కొన్ని పాటలు, పద్యాలు రచించారు. కొసరాజు గారు కూడా కొన్ని పాటలు రచించారు. సంగీతం ఘంటసాల.*

*1934 లో వచ్చిన లవకుశ నుంచి చిన్న చిన్న మార్పులు చేశారు. శ్రీ రాముడు స్వర్ణ సీతను తయారు చేయించి అశ్వమేధ యాగం చేయాలనుకున్నప్పుడు ఆ విషయం తెలిసిన ప్రజలు తమలో ఒకడు అన్నమాట పట్టుకునే కదా శ్రీ రాముడు సీతను అరణ్యవాసానికి పంపింది అని బాధపడి తాము అందరూ కలిసి ఇచ్చే బంగారంతో స్వర్ణ సీతను చేయించవలసిందిగా శ్రె రాముని కోరతారు. ఇది మూల ఘట్టంలో లేదు. ఇవాళ మనది ప్రజా ప్రభుత్వం. ప్రభుత్వరంగంలో ప్రజల బాధ్యత ఎలాంటిదో తెలియచేసినట్లుగా కూడా ఉంటుందని ఈ  మార్పు చేశారు.*

*లవకుశ చిత్ర నిర్మాణం చెన్నై లోని విజయా వాహినీ స్టూడియోలో 05-03-1958 న తొలి తెలుగు రంగుల చిత్రం గా ప్రారంభమయ్యింది.* 

*చిత్ర నిర్మాణం కొంత కాలం సాగింది. తరువాత ఆర్ధిక ఇబ్బందులవలన చిత్రీకరణ 3 సంవత్సరాలు ఆగిపోయింది. రాయవరం లో ఎం జి ఆర్ ఇంటికి ఎదురుగా ఉన్న తోటల్లో వేసిన వాల్మీకి ఆశ్రమం ఎండలకు, వానలకు రూపం మారిపోయింది. కుశ లవుల పాత్రలు ధరించిన పిల్లలు ఎదిగిపొయ్యారు.*

*అంతవరకూ చిత్రీకరణ చేసి ఎడిట్ చేసిన 8 వేల అడుగుల చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు చూపిస్తుంటే వారు వస్తున్నారు. చూస్తున్నారు తప్ప ఎవరూ ముందుకు రావటం లేదు. చివరగా  నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సుందర్లాల్ నహతా ఫైనాన్శ్ చేయటానికి ముందుకు వచ్చారుట.*

*దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయ్యింది. కాని దర్శకులు సి పుల్లయ్యగారి ఆరోగ్యం సరిగ్గా లేనందున  సెట్లో నిలబడటం, కూర్చోవడం కూడా కష్టమయ్యింది.*

*ప్రముఖ దర్శకులు బి ఎన్ రెడ్డి గారు తిన్నంగాచార్య అనే మహా కవి కుందమాల పేఉతో రాసిన సీత కధని కళాత్మకంగా సినిమాగా తీయాలనుకున్నారు. కాని అది నెరవేరలేదు. ఈ విషయం తెలుసుకున్న సి పుల్లయ్యగారి కుమారుడు సి ఎస్ రావు గారు బి ఎన్ రెడ్డి గారిని కలిసి లవకుశ చిత్రాన్ని పూర్తి చేయమన్నారు.*

*కాని బి ఎన్ రెడ్డి గారు "ఇది మీ నాన్నగారి సొత్తు. నువ్వే చిత్రాన్ని పూర్తి చెయ్యి" అన్నారు. దీనికి సి పుల్లయ్య గారు, సుందర్లాల్ నహతా గారు, ఎన్ టి ఆర్ సమర్ధించారు. మిగిలిన 12 వేల అడుగుల చిత్రాన్ని సి ఎస్ రావు గారు పూర్తి చేశారు.*

*ఈ చిత్రం గేవా కలర్. లైటింగ్ చాలా ఎక్కువ కావాలి. విపరీతమైన వేడి, ముఖము, శరీరము తట్టుకోలేనంత. క్లోజప్పులలో మరింత ఎక్కువ. అన్ని కష్టాలను భరించి, ఓర్చుకుని ఎంతో ఉత్సాహంగా నటీనటులు నటించి చిత్రానికి నిండుతనం చేకూర్చారు.*

*అలాగ అన్ని అవరోధాలను అధిగమించి 29-03-1963 న లవకుశ విడుదలయ్యింది. అఖండ విజయాన్ని సాధించింది. సుందర్లాల్ నహతా గారికి కనక వర్షం కురిపించింది. శంకర రెడ్డి గారికి కీరి దక్కింది.*

*ఈ చిత్రానికి అపూర్వ స్పందన లభించింది. ప్రజలు తీర్ధ యాత్రలకు ,పుణ్య క్షేత్రాలకు వెళ్ళినట్లు బండ్లు కట్టుకుని సినిమా చూశారు. అంజలీ దేవి, ఎన్ టి ఆర్ లను సీతా రాములుగా ప్రజలు కొలిచారు.*

*అన్ని దృశ్యాలలో ఒకే వయస్సులో లవకుశులు కనబడక పోయినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. చిత్రం లో మునిగిపోయి తన్మయులై చూశారు.* 

*ఆ రోజుల్లో కంప్యూటర్స్, గ్రాఫిక్స్ లేవు. ఉదాహరణకు చిత్రంలోని క్లైమాక్స్ లో భూమి విడిపోయి భూదేవి వచ్చి సీతాదేవిని తీసుకువెళ్ళే దృశ్యాలను చాలా కష్టపడి చిత్రీకరించారు. ఈ సన్నివేశం లో భూమి 3 భాగాలుగా విడిపోవడం చూపిస్తారు. ఒకటి అలానే ఉంటుంది. రెండు విడి పోతాయి. ఆ రెండు విడిపోయే భాగాలు, ఒకోటి వందకు పైగా ట్రాలీలమీద మట్టీ, గడ్డీ అమర్చారు. గాలి, ఎండుటాకులు ఎగిరే ఎఫెక్ట్ కోసం పెద్ద పెద్ద ప్రొఫెల్లర్స్ వాడారు. ఆ ప్రొఫెల్లర్స్ శబ్దంలో డైరెక్టర్ చెప్పేది వినబడదు. చిత్రీకరణ సమయంలో మట్టితో నిండిన ట్రాలీలను లాగేవారు. అలా కష్టపడి భూమి 3 భాగాలుగా విడిపోయినట్లు చూపారు.*

*చాయాగ్రాహకులు పి ఎల్ రాయ్ ఈ చిత్ర దృశ్యీకరణలో ప్రతీ ఫ్రేమును ఎంతో రసవత్తరంగా, అందంగా, అర్ధవంతంగా మనస్సుకు హత్తుకుపోయేలా చిత్రీకరించారు. రవికాంత్ నగాయిచ్ ప్రేక్షకులను ఉత్తేజపరిచేలా యారో ట్రిక్స్ చిత్రీకరించారు.*

*వాల్మీకి పాత్రధారి నాగయ్య గారు రావణు సంహరించి అనే పద్యం గానం చేస్తూ చిత్ర ప్రవేశం చేస్తారు. నాగయ్య గారిని చూస్తే వాల్మీకి మహర్షి ఇలాగే ఉండేవారనిపిస్తుంది.*

*సి ఎస్ రావుగారికి మహానటులుగా కనిపించిన వారు ముగ్గురే ముగ్గురు.. శివాజీ గణేశన్, ఎన్ టి రామారావు, సావిత్రి. కాని లవకుశ చిత్రం షూటింగులో నాగయ్యగారి నటనను చూసిన తర్వాత ఆ ముగ్గురితోపాటు నాగయ్యగారిని కూడా మహానటునిగా భావించినట్లు ఒక ఇంటర్వ్యూలో సి ఎస్ రావు గారు చెప్పారు.*

*ఈ చిత్రం 62 కేంద్రాలలో శత దినోత్సవం, 18 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొన్నదని, 75 వారాలు ప్రదర్శించబడ్డ తొలి తెలుగు చిత్రం గా ఘనతకెక్కిందని వార్తా పత్రికలలో వ్యాసాలు వచ్చాయి.* 

*ఈ చిత్రం ఏరియాలు , ఎ బి  సి డి వంటి సెంటర్ల తేడా లేకుండా రాశులు పోసినట్లుగా ధనాన్ని పోగులు చేసింది.*

*మారుమూల ప్రాంతాల జనం నాటు బళ్ళు కట్టుకుని చద్దన్నం మూటతో థియేటర్లకు తరలి వచ్చేవారు. అప్పట్లో అన్ని ఊళ్ళకూ బస్సు సదుపాయం ఉండేది కాదు. ఏ ఊరిలోనూ కరెంటు కూడా ఉండేది కాదు. అయినా ధైర్యం చేసి సినిమా చూసి లవకుశ సినిమాలోని పద్యాలు పాటలూ పాడుకుంటూ ఉత్సాహంగా ఇళ్ళకు వెళ్ళిపోయేవారు. ఏ పత్రిక తిరగేసినా లవకుశ చిత్రం గురించి ఆశ్చర్యకరమైన వార్తలతో నిండుకునేవి.*

*పత్రికలలో కలెక్షన్లు ప్రకటించిన తొలి దక్షిణాది చిత్రం గా 365 రోజులకుగాను కోటి రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం. నాటి 25 పైసలు, రూపాయి టికెట్లపై ఈ వసూళ్ళు సాధించడం గమనార్హం. ఈ నాటి రూపాయి విలువ ప్రకారం కొలమానం చేస్తే ఈ చిత్రం వసూళ్ళు నేటికీ రికార్డుగానే చెప్పుకోవాలి. ఆనాడు మన రాష్ట్ర జనాభా 3 కోట్లు అయితే సినిమాను చూసిన జనాభా 1.98 కోట్లమంది ఆదరించినట్లుగా ఆనాటి పత్రికా ప్రకటనలు చెబుతున్నాయి. ప్రతి కేంద్రం లోనూ ఆయా కేంద్రాల జనాభాకంటే 4 రెట్ల టికెట్లు అమ్ముడయ్యి అప్పటికీ ఇప్పటికీ కనీ వినీ ఎరుగని చరిత్ర సృష్టించింది లవకుశ.*

*ఉదాహరణకు 1-1-1964 తేదీన వరంగల్లు రాజరాజేశ్వరి థియేటర్ వారు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆ ఊరిలో లవకుశ చిత్రాన్ని 4,34,800 మంది చూసినట్లు ఆధారాలు చూపారు. మరి ఆ నాటి వరంగల్ జనాభా ఒక లక్ష మాత్రమే. ఆ ప్రకారం ఒకో ప్రేక్షకుడు ఎన్నెన్నిసార్లు లవకుశ చిత్రాన్ని చూడటం జరిగిందో ఊహించవలసిందే.* 

*కర్నాటకలో ఈ చిత్రం ఒకే థియేటర్లో 35 వారాలు ప్రదర్శించబడి  మళ్ళీ 1977, 1980 రిపీట్ రన్ గా విడుదలై మళ్ళీ శత దినోత్సవాలు జరుపుకుంది. ఇలా మూడుసార్లు ఓ చిత్రం బెంగళూర్ లో శత దినోత్సవం జరుపుకోవడం కన్నడ చిత్రాలకు కూడా సాధ్యం కాలేదు.*

*రిపీట్ రన్‌లలోని ప్రదర్శనలన్నీ కలిపితే వందకు పైగా కేంద్రాల్లో ఏడాది పైగా రన్‌ను నమోదు చేసిన సినిమా దేశంలో ఇదొక్కటే అవుతుంది. తమిళ వెర్షన్ సైతం ఘన విజయం సాధించి మధురైలో 40 వారాలు ఆడటం, హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా రజతోత్సవం జరుపుకోవడం ద్వారా దేశమంతటా నీరాజనాలు అందుకుంది. భారత సినీ చరిత్రలో ఒకే చిత్రం ద్వారా ఒకే హీరో మూడు భాషల్లో రెండు సార్లు విజయాలను సాధించడం (మొదట ‘పాతాళభైరవి’, తర్వాత ‘లవకుశ’) నాటికీ, నేటికీ ఒక్క ఎన్టీఆర్‌కే చెల్లింది.*

*ఆ ఏడాది జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి నుండి బహుమతి అందుకుంది. ఒకే సంవత్సరం ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘కర్ణన్’ (తమిళం) వంటి మూడు అవార్డు చిత్రాల్లో నటించినందుకు గాను రామారావు సైతం రాష్ట్రపతి నుంచి ప్రత్యేక బహుమతిని అందుకోవడం విశేషం.*

*ఇలా మూడు చిత్రాలకు కలిపి ఒకేసారి జాతీయ బహుమతిని ఇప్పటిదాకా మరే నటుడూ అందుకోలేదు.* 

*తెలుగులో మొదటి వర్ణ చిత్రమైన ‘లవకుశ’ విడుదలై యాభై ఏళ్లయినా ఇప్పటికీ థియేటర్ల ద్వారా, డీవీడీల ద్వారా, టీవీల ద్వారా, ఆడియో ద్వారా ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. ఈ విషయంలో ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’, ‘జగదేకవీరుని కథ’ చిత్రాలు మాత్రమే ‘లవకుశ’తో సరితూగుతాయి.*

*రామాయణం అంటే ఓ నీతి కథ. సమాజానికి మంచిని బోధించడానికి ఆదర్శప్రాయుడైన ఒక భర్త, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక అన్న, ఒక రాజు… వంటి పలు రకాల పాత్రల్ని చూపించిన గొప్ప కావ్యం. ప్రధానమైన ఉత్తర రామాయణ కథను నడిపిస్తూ పూర్వ రామాయణాన్ని చెబుతూ మొత్తం రామాయణాన్ని ఒక సినిమాగా అందించడం ‘లవకుశ’ ప్రత్యేకత. ఎలాంటి శృంగార భావనలకు చోటు కల్పించకుండా, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు ప్రాతినిథ్యం లేకుండా ఒక సినిమా తీయడం, అది అఖండ విజయాన్ని సాధించడం ఏ రకంగా చూసినా అపూర్వమైన చరిత్ర.*

*మూడు గంటల యాభై నిమిషాల నిడివి కలిగిన చిత్రంలో దాదాపు గంటా నలభై ఐదు నిమిషాల కాలం 36 పాటలు, పద్యాలతో ప్రేక్షకుల్ని రంజింపచేసిన ఘనత నిస్సందేహంగా సంగీత దర్శకుడు ఘంటసాలదే. ‘తెలుగునాట రామాలయం లేని ఊరు లేదు, ‘లవకుశ’ పాటలు మోగని గుడిలేదు, వాటిని వినని తెలుగువాడు లేడ’నేది ఒక నానుడిగా మారింది. ఇప్పటి వాణిజ్య పరిభాషలో ఇది రూ. వంద కోట్ల ఆడియో అని చెప్పాలి.*

నటీ నటులు: ఎన్ టి ఆర్ (శ్రీ రాముడు), వి నాగయ్య (వాల్మీకి), టి ఎల్ కాంతారావు (లక్ష్మణుడు), రమణా రెడ్డి (సదానందుడు), ధూళిపాళ (వశిష్టుడు), కె వి ఎస్ శర్మ (జనకుడు), సత్యనారాయణ (భరతుడు), శోభన్ బాబు (శత్రుఘ్నుడు), వి శివరాం (ఋష్యశృంగుడు),  కోటేశ్వర రావు (భద్రుడు), ఏ వి సుబ్బారావు (సేనాధిపతి), శివరాం కృష్ణయ్య (చాకలి పేరయ్య), విజయరావు (అర్జునుడు), శాండోకృష్ణ (హనుమంతుడు), అంజలీదేవి (సీత), కన్నాంబ (కౌసల్య), ఎస్ వరలక్ష్మి (భూదేవి), సంధ్య (శాంత), సూర్యాకాంతం (శార్వరి), లక్ష్మీ ప్రభ (కైకేయి), లక్ష్మి (సుమిత్ర), రాజేశ్వరి (ఊర్మిళ), భారతి (మాండవి), లక్ష్మి (శృతకీర్తి), అన్నపూర్ణమ్మ (చాకలి పేరమ్మ), నాగరాజు (లవుడు), సుబ్రహ్మణ్యం (కుశుడు), రేలంగి (వీరన్న), గిరిజ (లచ్చి), వాసంతి (చెలికత్తె), ఎల్ విజయలక్ష్మి (నాట్యకత్తె), రీటా (నాట్యకత్తె), సుకుమారి (నాట్యకత్తె)
నిర్మాత: ఎ శంకర రెడ్డి, దర్శకులు : సి పుల్లయ్య & సి ఎస్ రావు, కధ, మాటలు: సదాశివ బ్రహ్మం, 

పాటలు: సదాశివ బ్రహ్మం, సముద్రాల సీనియర్, కొసరాజు; 
సంగీతం: ఘంటసాల, నృత్యం : వెంపటి పెద్ద సత్యం; కళ : టి వి ఎస్ శర్మ
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: పి ఎల్ రాయ్; కెమెరామేన్ : పి విశ్వనాధ్ రాయ్, ట్రిక్ ఫొటోగ్రఫీ: రవికాంత్ నగాయిచ్
కలర్ స్పెషలిస్ట్; కె ఎస్ ఎన్ మూర్తి; డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీ: ఎ కృష్ణన్; రికార్డిట్: జి వి రమణ;
సాంగ్స్& రీ రికార్డింగ్: వి శివరాం; ఎడిటింగ్; సంజీవి;

గాయనీ గాయకులు: పి లీల, పి సుశీల; ఎస్ జానకి; ఏ పి కోమల; వైదేహి, సరోజిని, ఘంతసాల, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వర రావు, మల్లిక్, జె వి రాఘవులు, సౌమిత్రి

*కధా సంగ్రహము:*

*సుధా మధుర సమన్వితమనిన శ్రీ రామ కధ ఆసేతు శీతాచలం అందకూ తెలిసినదే. రామాయణమునదలి చివరి ఘట్టమే లవకుశుల చరిత్రము. రావణ సంహరానంతరం శ్రీ రాముడు సీతా దేవితో అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకోవటం, జన వాక్య పాలనకై శ్రీ రామచంద్రుడు గర్భవతి అయిన సీతా దేవిని పరిత్యజించడం, మహారణ్యంలో ఆమెకు వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఆశ్రయమివ్వటం, సీతా దేవికి అక్కడ లవకుశులు అనే ఇద్దరు కవల పిల్లలు జన్మిచటం, ఆ పిల్లలు వాల్మీకి మహర్షివద్ద  రామాయణం నేర్చుకోవటం, ప్రజా శ్రేయస్సుకొరకు శ్రీ రామ చంద్రుడు అశ్వమేధ యాగం ప్రరంభించటం, ఆ యజ్ఞాశ్వాన్ని లవకుశులు పట్టుకొవటం,  తత్ఫలితంగా తండ్రీ కుమారులకు ఘోర యుద్ధం జరగటం , సీత వచ్చి లవకుశులు శ్రీ రాముని కుమారులని చెప్పటం, సీతను ఆమె తల్లి భూదేవి తనలో ఐక్యం చేసుకోవటం - ఈ  ఘట్టాలన్నీ లవకుశ చిత్రంలో నేత్రపర్వం గా చిత్రీకరించబడ్డాయి.*

*ఆ బాలగోపాలాన్ని ఆకర్చిన ఈ చిత్రం నిత్య నూతనమైనది. దీని ఆకర్షణ ఎప్పటికీ తరిగిపోదు. అయితే ఈ చిత్రం ఇంత గొప్పగా రూపొందటానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి రాముడుగా ఎన్ టి ఆర్, సీతాదేవిగా అంజలీదేవి   ఆ పాత్రలకు చక్కగా అమిరారు. నిజంగా పూర్వకాలంలో సీతా రాములు ఇట్లాగే ఉండేవారేమో అనిపించేటంత గొప్పగా వీరు ఆ పాత్రలలో లీనమైపోయారు. ఈ రెండు పాత్రలూ చిత్రానికి విశిష్టను చేకూర్చినాయి.*

*రెండవది గేవా కలర్ లో చిత్రం నిర్మించబడటం. తెలుపు నలుపులలో కాకుండా రంగులలో చిత్రం నిర్మించటం వల్ల ఈ చిత్రం చూడటానికి ఎంతో మనోహరం గా ఉంది. ఈ సహజ రంగులలో సుందరమైన దృశ్యాలు మరింత సుందరంగా మనోజ్ణంగా కనిపించాయి.*

*మూడవది కళా దర్శకత్వం. ఈ చిత్రంలో ఉపయోగించబడిన బ్రహ్మాండమైన సెట్టింగుల రూప కల్పనలో కళా దర్శకుడు టీ వీ ఎస్ శర్మ చూపించిన నైపుణ్యం అద్వితీయంగా ఉంది. రంగులలో ఈ సెట్టింగులు దేదీప్యమానంగా ఉండి ఆనాటి అయోధ్యాపుర సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించుతూ మరపురాని ముద్ర వేశాయి.*

*లక్ష్మణుడు అన్నగారి ఆజ్ణ ప్రకారం సీతను అరణ్యంలో విడచిపెట్టిన ఘట్టం , రాముని మందిరం లో లవకుశులు రామాయణ గాధను గానం చేసే ఘట్టం, చివరగా రామునికి లవకుశులకు మధ్య వాగ్వివాద ఘట్టం చాలా గొప్పగా చిత్రీకరించారు. సీతను అడవిలో విడిచివెళ్ళే ఘట్టంలో అంజలి కాంతారావు ఉదాత్తమైన నటన చూపించారు. ఎప్పటికీ మరపురాని సన్నివేశం ఇది.*

*రాముని మందిరంలో రామాయణ గానం చేసి లవకుశులు శ్రీ రాముని చూసి ఆనందించారు. సీతా దేవిని కూడా చూసి తమ జన్మ ధన్యం చేసుకోవాలని ఆమెను చూపించమంటారు. ఆ ఘట్టంలో ఎన్ టి ఆర్ నటన చిరస్మరణీయమైనది. ఇదేవిధంగా యజ్ణాశ్వాన్ని పట్టుకున్న లవకుశులకు రామునికి మధ్య వాగ్వివాద ఘట్టంలో ఎన్ టి ఆర్, నాగరాజు (లవుడు), సుభ్రమణ్యం (కుశుడు) గొప్ప నటన చూపించారు.*

*వాల్మీకిగా నాగయ్య, వశిష్టుడుగా ధూళిపాళ, భరతుడుగా సత్యనారాయణ, శత్రుఘ్నుడుగా శోభన్ బాబు, చాకలి వీరన్న గా రేలంగి, కౌసల్యగా కన్నాంబ, భూదేవిగా ఎస్ వరలక్ష్మి, చాకలి లచ్చిగా గిరిజ తమ పాత్రలకు న్యాయం చేశారు.* 

*పాటలు పద్యాలు భావ గాంభీర్యంతో అద్భుతంగ ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలన్నిటిలోకి మేటిగా నిలచాయి.*

*ఈ చిత్రంలో సదానంద (రమణా రెడ్డి), శార్వరి (సూర్యాకాంతం) . వీరికి సంబంధించిన సన్నివేశాలు పూర్తిగా అనవసరం. చిత్రం స్థాయిని కొద్దిగా తగ్గించాయి. ఈ హాస్య సన్నివేశాలు లేకపోతే అసలు కధ మరింత వేగం గా నడిచి చిత్రం మరింత బిగువుగా ఆకర్షణీయం గా ఉండేది.*

*అపర శ్రీ రాముడిగా ఎన్ టి ఆర్ రూపం, అభినయం ఆంధ్ర దేశాన్ని సమ్మోహపరచింది. అతనికి సాటి మేవ్వరూ లేరని సర్వ ప్రేక్షక లోకం నిర్ద్వందంగా తీర్మానించింది. పాలనపై లోకాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రజా రాముడిగాను, భార్యపై అనురాగపూరిత ప్రేమాతిశయాన్ని వ్యక్తపరిచే సందర్భంలోనూ, భద్రుడు వచ్చి "ఏడాది లంకలో ఉన్న సీతను తెచ్చి ఏలుకుంటున్న వెర్రి రాముడు" అనే వాక్యాన్ని విన్న సందర్భంలో ప్రదర్శించే హావ భావాలను, అన్నదమ్ములతో సంప్రదించినప్పుడు పావనత్వం కన్నా పావనమైనది సీత అనే అభిప్రాయాన్ని వ్యక్తపరచినప్పుడూనూ, సీతను అరణ్యంలో విడిచి రమ్మన్న సందర్భంలోనూ, నిష్టుర వాక్యాలు పలికిన తల్లితో నాడుపితృ వాక్య పరిపాలనవలె నేడు మాతృ వాక్య పాలనతో నా సీఎతతో అడవులకు వెళతానమ్మా ఆనతీయమంటూ వేదనా భారాన్ని ప్రదర్శించినప్పుడూ, రఘు వంశ నాధుల కర్తవ్య బోధ చేసినప్పటి దృశ్యంలోనూ , అడవులపాలైన సీతను తల్చుకుని వ్యధా భరిత జీవితాన్ని గడిపే దుర్భర క్షణాల్లోనూ, అశ్వమేధ యాగం చేయడానికి రెండవ వివాహం చేసుకొమ్మని అక్క కోరినప్పుడు రాముడు వ్యక్త పరిచిన అభిప్రాయాలు ఎన్ టి ఆర్ నోటినుండి వెలువడినప్పటి దృశ్యంలోనూ, సీత విగ్రహం నుదుట తిలకం చూసి భావోద్రేకంతో విలపించు సమయంలోనూ , లవకుశులతో సంభాషణ, అనంతర యుద్ధ సన్నివేశం, ఆ సమయంలో అకస్మాత్తుగా సీతను చూచి నిశ్చేష్టుడైన సన్నివేశం, చివరిగా లవకుశులకు పట్టాభిషేకం చేసి, నిర్యాణం చెంది వైకుంఠాన్ని చేరి శ్రీ మహా విష్ణువులో ఐక్యం కావడం, ఇలా ప్రతి సందర్భంలోనూ మహా నటుడు ఎన్ టి ఆర్ ప్రదర్శించిన నట వైభవం ప్రేక్షకులను అనత లోకాలకు తీసుకుపోయి ఆనందపరవశులను చేసింది. రాముడు పేరు తలచుకున్నంతనే కేవలం ఎన్ టి రామారావు రూపం మనోనేత్రం పై కదలాడే ప్రభావపూరిత అద్భుతాభినయం ఈ చిత్రం లో ఆవిష్కరించారు ఎన్ టి ఆర్.*

1. నవరత్నోజ్వల , సదాశివబ్రహ్మం, ఘంటసాల, శంకరాభరణ రాగం
https://www.youtube.com/watch?v=asFUXACJja0

2. రామన్న రాముడూ, కొసరాజు, సుశీల - కె రాణి, మిశ్రహరి కాంభోజి రాగం. అయితే పాట మధ్యలో వచ్చే రెండు చరణాలు పేదతనము భూమి మీద ఉండబోదురా, న్యాయమ్ము పాలించి నడుపువాడురా చారుకేశి రాగం లో స్వరపర్చబడ్డాయి.
https://www.youtube.com/watch?v=LkV_ShNeTeo

3. సప్తాశ్వరధమారూఢం, తిల్లంగ్ రాగం
https://www.youtube.com/watch?v=EF8brZZwk6Q

4. విరిసే చల్లని వెన్నెల : ఈ పాటలో ముక్య నర్తకి గా నటించిన నటి పేరు సుకుమారి. మురారి సినిమాలో మహేష్ బాబు బామ్మగా వేశారు. మళయాళ సినిమా పరిశ్రమ ద్వారా పద్మశ్రీ అందుకున్నారు కూడా. లవకుశ 50 వసంతాలు పూర్తి చేసుకున్న రోజే 30-03-1963 న స్వర్గస్థులయ్యారు
సముద్రాల సీనియర్ రచన, ఎస్ జానకి బృందం, కల్యాణి రాగం
https://www.youtube.com/watch?v=ayjYQcOHQIE

5. రావణు సం హరించి, సదాశివబ్రహ్మం, ఘంటసాల, శుద్ధ ధన్యాసి రాగం
https://www.youtube.com/watch?v=9a8iqXOuH8I
  
6. వెయ్యర దెబ్బ, సదాశివబ్రహ్మం, ఘంటసాల - జిక్కి - బృందం, మిశ్ర ఝంఝాటి రాగం 
https://www.youtube.com/watch?v=U6btsQcgOtY

7. ఒల్లనోరి మామా నీ పిల్లని, సదాశివ బ్రహ్మం, ఘంటసాల - జిక్కి - జె వి రాఘవులు - కె రాణి, మిశ్ర ఝంఝట రాగం 
https://www.youtube.com/watch?v=lRPy0mGUkPA

8. ఏ మహనీయ సాధ్వి, సదాశివబ్రహ్మం, ఘంటసాల, మాండ్ రాగం
https://www.youtube.com/watch?v=BRm2KZ6Y1XA

9. ఏ నిమిషానికి ఏమి జరుగునో, కొసరాజు, ఘంటసాల, రాగ మాలిక (మాయామాళవగౌళ, వకుళాభరణ, కీరవాణి, చక్రవాకం) 
https://www.youtube.com/watch?v=ocHt0iAqTNo

10. ఇంతకు పూని వచ్చి, సదాశివబ్రహ్మం, ఘంటసాల, నటభైరవి రాగం
https://www.youtube.com/watch?v=dIYy-c4Wp-4
11. అపవాదదూషిత, కవికోకిల దువ్వూరి రామిరెడ్డి, సుశీల, మాండ్ రాగం
https://www.youtube.com/watch?v=msfBkYVQpFg

12. ప్రతి దిన మేను, సదాశివబ్రహ్మం, ఘంటసాల, నీలమణి రాగం
https://www.youtube.com/watch?v=2rCyHeCCvHA
13. రాజట రాజ ధర్మమట, సదాశివబ్రహ్మం, ఎస్ వరలక్ష్మి, హరికాంభోజి రాగం
https://www.youtube.com/watch?v=_wOgoHa_Dxc

14. కన్నులారగ తుదిసారి, సదాశివబ్రహ్మం, సుశీల, మిశ్ర శివరంజని రాగం
https://www.youtube.com/watch?v=u8HzBwrjOg8
15. ఇదె మన ఆశ్రమంబు, సదాశివబ్రహ్మం, ఘంటసాల, బేగడ రాగం
https://www.youtube.com/watch?v=FkYyRWZwFgM
16. ఎందుకే, , సదాశివబ్రహ్మం, పిథాపురం - కోమల, ఆనందభైరవి రాగం
https://www.youtube.com/watch?v=TxTqF_jP5_Q
17. జగదభి రాముడు, సముద్రాల సీనియర్, లీల - సుశీల - ఘంటసాల - మల్లిక్ - వైదేహి, దర్బారీ కానడ రాగ . 
https://www.youtube.com/watch?v=VLQSWLW2RgI
18. రామ కధను వినరయ్యా, సముద్రాల సీనియర్, లీల - సుశీల, హిందోళ రాగం
https://www.youtube.com/watch?v=fb8W-ot70Ag

19. ఊరకే కన్నీరునింప, సదాశివబ్రహ్మం, లీల - సుశీల, ఆభేరి రాగం
https://www.youtube.com/watch?v=pMOAwvagg4Y
20. వినుడు వినుడు, సముద్రాల సీనియర్, లీల - సుశీల, కీరవాణి రాగం
https://www.youtube.com/watch?v=k8qgmnhEA8E

21. శ్రీ రాముని చరితమును , సముద్రాల సీనియర్, లీల - సుశీల, మిశ్ర శివరంజని - రంజని - హంసానంది రాగాలు.
https://www.youtube.com/watch?v=Nu7HI43Dh7g
22. శ్రీ రాఘవం, లీల - సుశీల, హిందోళ రాగం
https://www.youtube.com/watch?v=v_8HWo0bPCk

23. రామ సుగుణ ధామ, సదాశివ బ్రహ్మం, లీల - సుశీల, భాగేశ్వరి రాగం
https://www.youtube.com/watch?v=glSlHZaCcZc

24. రంగారు బంగారు, కంకంటి పాప రాజు, ఘంటసాల, కల్యాణి రాగం
https://www.youtube.com/watch?v=yAePa6maW60

25. సందేహించకుమమ్మా, సముద్రాల సీనియర్, ఘంటసాల, హిందోళ రాగం
https://www.youtube.com/watch?v=Qco6ZKeuMGI
26. అశ్వమేధ యాగానికి , కొసరాజు, ఘంటసాల - మాధవపెద్ది - రాణి - రాఘవులు - సరొజిని, మధ్యమావతి - మోహన - ఆనంద భైరవి రాగాలు
https://www.youtube.com/watch?v=0lZj9MYdyfk

27. నవనాశ్వంబిది, సదాశివ బ్రహ్మం, సుశీల, భైరవి రాగం
https://www.youtube.com/watch?v=_xEfT0hjFJM
28. హ్రీం కారాసన, సుశీల, రంజని రాగం
https://www.youtube.com/watch?v=A6PxCM03hMM

29. ఇను డస్తాద్రికి, లీల, మోహన రాగం
https://www.youtube.com/watch?v=HXlnXe62mW4

30. కడగి నే , సుశీల, సిమ్హేంద్ర మధ్యమం
https://www.youtube.com/watch?v=XfAvskwaGWI
31. దక్కెను బాలకుండని, లీల , మధ్యమావతి రాగం
https://www.youtube.com/watch?v=uMxy2bvngjQ

32. తండ్రి పంపున నేగి , సదాశివ బ్రహ్మం, ఘంటసాల - లీల - సుశీల, మోహన - దర్బారీ కానడ - బిలహరి కేదారగౌళ - దేశ్ రాగాలు. 
https://www.youtube.com/watch?v=s3t4yORSuz0
33. లేరు కుశ లవుల సాటి, అముద్రాల సీనియర్, లీల - సుశీల, మోహన రాగం
https://www.youtube.com/watch?v=3vJoAdmSYVA

34. స్త్రీ బాల వృద్ధుల, సదా శివ బ్రహ్మం, ఘంటసాల - లీల - సుశీల, దర్బారీ కానడ - కాపి - సిమ్హేంద్ర మధ్యమ రాగాలు
https://www.youtube.com/watch?v=PuFs7jNVmQs
35. జయ జయ రాం, సదాశివ బ్రహ్మం, రాఘవులు - వైదేహి - కోమల - సౌమిత్రి, బసంత్ - భాగేశ్వరి రాగాలు
https://www.youtube.com/watch?v=4MAkmLEBD5M&index=15&list=PL9Rdy2T36cgh_DiV5v34Ylg5wkWAA_r9y

36. రామస్వామి పదాంబుజంబు , కంకంటి పాపరాజు, సుశీల, హంసానంది రాగం
https://www.youtube.com/watch?v=SUgQmblJhSQindex=19list=PLp3KB6WjrBmq60M6j5QTYLP3-e791eDo

Link to comment
Share on other sites

6 hours ago, NAGA_NTR said:

స్వర్ణ సీతాదేవి విగ్రహం రామాయణం లో ఉందా లేదా :thinking:

Ramayanam ante valmiki raasindi kada... ante Returning to kingdom varake untadi...

Link to comment
Share on other sites

3 hours ago, r_sk said:

Ramayanam ante valmiki raasindi kada... ante Returning to kingdom varake untadi...

OK

mari aa tarwata ghattalu evaru raasaru, upto lava kusa pattabhishekam n Rama Lakshmana Bharatha Sathrugnugulu vellipovadam ivi anni :thinking:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...