Jump to content

Andhra vallu hyderabad lo asthulu unte ammukovatam manchidi


Recommended Posts

12 minutes ago, Compaq said:

@sonykongara ignore bro,.. I understand his earlier message was with different voice,.. just keep going

Endi Sir mi problem 

What’s your problem with my different voice ? My opinion is same but not to fight with sonykongara or anyone 

memu not to drag ani decide ayyaka why this conflict messages ?

Link to comment
Share on other sites

  • Replies 218
  • Created
  • Last Reply

8f05cf87-7b33-47d8-92e2-5065dbfcc103

 

 

7715bf0e-2860-44bc-875d-4b8275cfe33d

 

 

వాడి గుణం గుడిసేటిది. ఆంద్రాబాదీలు వాడి కోసం వాడి హైదరాబాద్ కోసం ఎంత చించుకున్నా  అన్నీ బూడిదలో పోసిన పన్నీరే 

 

Link to comment
Share on other sites

మొన్న - విడిపోయి అన్నదమ్ముల లాగా కలిసి ఎదుగుదాం. అందరూ సేఫ్ 

నిన్న -  పెద్ద తలకాయలు, రాజకీయ నాయకులే  కదా రిస్క్ లో ఉన్నది. మనం సేఫ్ 

ఈరోజు - ఆంధ్రా లో పని చేసే అధికారులు 

రేపు - ??  (ఏపీ హై కోర్ట్ జడ్జెస్ అనుకుంటున్న)

 

Next in line : River tribunal board members, Polavaram authority, Contractors who work on AP Projects, Companies who want to expand business in AP but are headquartered in Hyderabad.

Link to comment
Share on other sites

DB kabatti janam control lo untunnaru. But twitter is brutal :lol2:

"వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటానికి వాళ్ళు మారారు, వాళ్ళ మాటలు విని మా ఆస్తులు ఆ తెలంగాణ ఎదవలకి XXగెట్టమంటారా బాబు"

 

Link to comment
Share on other sites

7 minutes ago, AbbaiG said:

DB kabatti janam control lo untunnaru. But twitter is brutal :lol2:

"వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటానికి వాళ్ళు మారారు, వాళ్ళ మాటలు విని మా ఆస్తులు ఆ తెలంగాణ ఎదవలకి XXగెట్టమంటారా బాబు"

 

ikkada babu ante evaru . 

Link to comment
Share on other sites

1 minute ago, ravindras said:

ikkada babu ante evaru . 

When i asked an aged Person regarding the party change of Dasari Brothers n will you vote to them?

His Reply was ? to me:
"వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటానికి వాళ్ళు మారారు, వాళ్ళ మాటలు విని మా ఆస్తులు ఆ తెలంగాణ ఎదవలకి ట్టమంటారా బాబు"

This is the situation in AP!
#APwithCBN

Link to comment
Share on other sites

హైదరాబాద్‌ ఆంధ్రుల్లో ఆందోళన
24-03-2019 09:12:21
 
హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రుల్లో ఆందోళన మొదలైంది. ప్రముఖులు, పారిశ్రామికవేత్తలపై తెలంగాణ రాష్ట్రం పెద్దల ఒత్తిడి పెరిగుతోంది. తెలుగుదేశం పార్టీకి విరాళాలివ్వొద్దని ఆదేశిస్తూ... వైసీపీకి మద్దతివ్వాలని హెచ్చరించడంపై ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు ఆందోళన చెందుతున్నారు. బలవంతపు సమావేశాలు, పార్టీ మార్పిళ్లు జరుగుతున్నాయి.
Link to comment
Share on other sites

కొత్త విపత్తు!
24-03-2019 03:30:42
 
636889950401003176.jpg
  • సీమాంధ్రులపై ‘పొరుగు పెద్దల’ ఖడ్గం.. ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు హెచ్చరికలు
  • టీడీపీకి విరాళాలు ఇవ్వొద్దని ఆదేశాలు
  • వైసీపీకే మద్దతు పలకాలని స్పష్టీకరణ
  • బలవంతపు భేటీలు, పార్టీ మార్పిళ్లు
  • స్వరాజకీయం కోసం సీమాంధ్రులతో చెలగాటం
  • ఉద్యమ సమయంలోనూ ఇలా లేదు
  • చెన్నై, బెంగళూరులోనూ ఇదే జరిగితే?
  • స్వీయ ఉనికి, అస్థిత్వానికి అర్థమెక్కడ?
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘‘మీరు... టీడీపీకి విరాళాలు ఇవ్వద్దు. ఏ విధంగానూ మద్దతు ప్రకటించవద్దు!’... పారిశ్రామిక వేత్తలను పిలిచి మరీ హెచ్చరికలు!
 
‘మీరు లోట్‌సపాండ్‌కు వెళ్లి జగన్‌ను కలవండి. పార్టీలో చేరండి’... సినీ ప్రముఖులకు పొలిటికల్‌ పెద్దల ‘డైరెక్షన్‌’!
 
ఇది... హైదరాబాద్‌ కేంద్రంగా సీమాంధ్ర పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు ఎదుర్కొంటున్న కొత్త విపత్తు!...
 
హైదరాబాద్‌... లక్షలాది మందికి కలల నగరం! పరిశ్రమలు, ఉపాధి, వినోదం, వ్యాపారం... ఇలా అనేక రంగాల్లో దూసుకుపోయిన భాగ్యనగరం! దేశంలోని అన్ని రాష్ట్రాల వారికీ ఇదో గమ్యస్థానం! ఆరు దశాబ్దాల పాటు రాజధానిగా ఉన్న నేపథ్యంలో... తెలుగు వారంతా ఇది మాది అనుకున్న నగరం! సీమాంధ్రలోని ప్రతి ఇంటికీ హైదరాబాద్‌తో ఏదో ఒక అనుబంధం ఉంటుంది.
 
సినిమా, ఆతిథ్యం, ఫార్మా, పరిశ్రమలు, పెద్దస్థాయి వ్యాపారాలు... ఇలా అనేక రంగాల్లో సీమాంధ్రులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జోరుగా, హోరుగా సాగిన సమయంలోనూ హైదరాబాద్‌లోని సీమాంధ్రులపై దాడులు జరగలేదు. చిన్నచిన్న కాలనీల్లోనో, రోడ్లపై అనుకోకుండా జరిగిన సంఘటనల్లో చిన్నపాటి వ్యాఖ్యలు వినిపించడం మినహాయిస్తే... బహిరంగంగా శత్రుత్వం రాజుకున్న దాఖలాలు లేవు. రాజకీయ నాయకుల ప్రసంగాల్లో ‘ఆంధ్రోళ్ల’పై పరుష వ్యాఖ్యలు వినిపించినప్పటికీ... ఇరుప్రాంతాల ప్రజలు వీటిని ‘రాజకీయం-భావోద్వేగ’ కోణంలోనే చూశారు! వెరసి... సీమాంధ్రుల్లో బీభత్సమైన అభద్రతాభావం నెలకొన్న ఉదంతాలు కనిపించలేదు. కానీ... తెలంగాణ వచ్చిన ఐదేళ్ల తర్వాత ఇప్పుడు... సీమాంధ్ర ప్రముఖుల్లో ఆందోళన మొదలైంది. రాజకీయ లక్ష్యాలను చేరుకునేందుకు... టీడీపీ నేతలు, ఏపీ ఉన్నతాధికారులతోపాటు సీమాంధ్రకు చెందిన పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులను లోబరుచుకునే ప్రక్రియ మొదలుపెట్టడమే దీనికి కారణం.
 
ఇలా ఎన్నడూ లేదే...
ఆరు దశాబ్దాలు ఉమ్మడి రాజధాని కాబట్టి హైదరాబాద్‌లో... చారిత్రక కారణాలు, సామీప్యత, అవకాశాలరీత్యా చెన్నై, బెంగళూరులోనూ పెద్దసంఖ్యలో సీమాంధ్రులు పరిశ్రమలు స్థాపించారు. వ్యాపారాలు చేస్తున్నారు. ‘సర్దుకుపోదాం. సాఫీగా సాగుదాం’ అనే వైఖరితో స్థానికులతో కలిసి పోవడమే సీమాంధ్రుల వైఖరి. చెన్నై 1953 నుంచే మనది కాదు. బెంగళూరు పూర్తిగా మరో రాష్ట్రం. హైదరాబాద్‌ అలా కాదు. ఐదేళ్ల కిందటి వరకూ అదే సీమాంధ్రకూ రాజధాని. అది... ఆరు దశాబ్దాల బంధం. ‘మన హైదరాబాద్‌’ అనే భావన బలంగా ఉంది.
 
ఇప్పుడు అక్కడే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే ఎలా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాన్ని... తమిళనాడు, బెంగళూరులో ఉన్న వారు కూడా అనుసరిస్తే ఏం జరుగుతుంది? ‘మీరు ఫలానా పార్టీ వాళ్లకు నిధులు ఇవ్వండి. వారికే మద్దతు ఇవ్వండి. ఇతరులకు ఇవ్వొద్దు. లేదంటే, ఇక్కడ మీ వ్యాపారాలు, వ్యవహారాలకు ఇబ్బందులు తప్పవు’ అని హెచ్చరికలు జారీ చేస్తే పరిస్థితి ఏమిటి? ఇలాగైతే స్వీయ ఉనికి, అస్తిత్వం రాజకీయ అధికారం ఉన్నవారి చేతుల్లోకే వెళతాయి!
 
ఒకరి కోసం మరొకరిపై గురి!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది. కేడర్‌ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఆ సమయంలో సహజంగానే టీఆర్‌ఎస్‌, టీడీపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు నడిచాయి! అదంతా ఎన్నికలకే పరిమితం అని అంతా అనుకున్నారు. కానీ, కేసీఆర్‌ ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ప్రకటన చేశారు. బరాబర్‌ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామన్నారు. వైసీపీకి బహిరంగ మద్దతు ఇవ్వడంద్వారా చంద్రబాబును దెబ్బతీయడమే ఈ ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ అని అంతా భావించారు. కానీ... సీమాంధ్ర నేతలు, పారిశామ్రిక వేత్తలు, సినీ ప్రముఖుల ఆస్తులను అస్త్రంగా చేసుకుని తెరవెనుక తతంగం నడిపిస్తారని ఎవరూ ఊహించలేదు. ‘‘చంద్రబాబు ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ రోజైనా మళ్లీ తెలంగాణలో రాజకీయం చేయగలరు! ఆ అవకాశాలు తగ్గించాలి.
 
జగన్‌ ఆస్తులూ, కేసులూ అన్నీ హైదరాబాద్‌ కేంద్రంగానే ఉన్నాయి. ఆయన టీఆర్‌ఎస్‌ చేతి నుంచి జారిపోలేరు. ఏపీలో మనం చెప్పినట్లు వినే ప్రభుత్వం ఉంటే... తెలంగాణలోనూ రాజకీయంగా వెలిగిపోవచ్చు. ఇదే టీఆర్‌ఎస్‌ వ్యూహం. అందుకే... వైసీపీకి అన్ని రకాలుగా సహకరిస్తోంది. ఈ వ్యూహంలో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే... సీమాంధ్ర భవిష్యత్తుకే ముప్పు. హైదరాబాద్‌లోని పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు మరింత అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. స్వరాష్ట్రంలో బలమైన ప్రభుత్వముంటేనే సీమాంధ్రులు ఎక్కడున్నప్పటికీ ఆత్మగౌరవం నిలుస్తుంది’ అని టీడీపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.
 
టీడీపీకి విరాళాలు ఇవ్వొద్దు!
పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు తమ రాజకీయ ఆసక్తుల మేరకు పార్టీలకు విరాళాలిస్తుంటారు. ఎందుకైనా మంచిదని రెండు ప్రధాన పార్టీలకూ నిధి సమకూర్చే వారూ ఉంటారు. అయితే... ఈసారి హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ పెద్దలు కొత్త ట్రెండ్‌ మొదలుపెట్టారు. ‘టీడీపీకి ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికల విరాళాలు ఇవ్వొద్దు. ఆర్థికంగా వైసీపీకి మాత్రమే సహకరించండి’ అని ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమ పరిశ్రమలు, ఆస్తులు, వ్యాపారాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉండటంతో కిమ్మనకుండా ‘తల ఊపి’ వచ్చేశారు.
 
 
వెళ్లండి... జగన్‌ను కలవండి!
సినిమా వాళ్లకూ, తెలుగుదేశానికీ మధ్య బలమైన బంధం ఉంది. ఎన్టీఆర్‌ ప్రారంభించిన పార్టీ కావడం, మొదటి నుంచీ సినిమా వాళ్లకూ అవకాశాలు ఇవ్వడం దీనికి కారణం. సినీ పరిశ్రమ ఎన్టీఆర్‌ హయాంలోనే హైదరాబాద్‌కు వచ్చింది. సినీ ప్రముఖుల్లో అత్యధికులు సీమాంధ్రులే! ఇప్పుడు వారిపైనా రాజకీయ పడగ కదలాడుతోంది. ‘సినీ పరిశ్రమకు చెందిన వారు వైసీపీ వెంట ఉన్నారు’ అనే సంకేతాలు పంపేందు కు రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు. తనమానాన తాను సినిమాలు, సంబంధిత వ్యవహారాలు చూసుకుంటున్న ఒక సినీ ప్రముఖుడిని... ‘ఒకసారి లోట్‌సపాండ్‌కు వెళ్లి జగన్‌ను కలిసి రండి’ అని తెలంగాణ నాయకుడొకరు ఆదేశించారు.
 
గతంలో అదే ప్రముఖుడికి చెందిన ఒక ఫంక్షన్‌ హాలుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ‘కూల్చివేతల’ పేరిట హల్‌చల్‌ చేసింది. ఆయన లోట్‌సపాండ్‌కు వెళ్లి, జగన్‌ను కలిసి వచ్చారు. ఇక... హైదరాబాద్‌లో ఉన్న పాతతరం ప్రముఖ నటి తెలుగుదేశంలో ఉన్నప్పటికీ, క్రియాశీలకంగా లేరు. ‘మీరు వైసీపీలో చేరండి’ అంటూ ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఆమె జగన్‌ను కలిసి... వైసీపీ కండువా కప్పుకొన్నారు. వైసీపీలో ఆమె పాత్రపై ఎలాంటి స్పష్టత లేదు. ఎన్నడూ లేని విధంగా సినీ రంగానికి చెందిన చిన్నా పెద్దా నటులు, ప్రముఖులు వరుసగా వైసీపీలో చేరుతుండటం గమనార్హం!
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...