Jump to content

బాలయ్య బాబు అతనికి బోనస్ ఇవ్వబోతున్నాడా..?


Ramesh39

Recommended Posts

బాలయ్య బాబు అతనికి బోనస్ ఇవ్వబోతున్నాడా..?  Updated : 15-Jan-2019 : 11:52
 
 
636831506943356224.jpg
నందమూరి నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్‌లో ఇటీవలే మన ముందుకొచ్చిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. తన తండ్రి బయోపిక్‌ని రూపొందించాలనే సంకల్పంతో రెండు భాగాలుగా ఈ సినిమాను బాలయ్య బాబే స్వయంగా తన సొంత బ్యానర్‌పై నిర్మించారు. ‘‘కథానాయకుడు, మహానాయకుడు’’ అనే రెండు భాగాలుగా నిర్మిస్తూ.. దర్శకత్వ బాధ్యతలను క్రిష్‌కి అప్పగించారు బాలయ్య. అయితే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవటంతో చిత్రయూనిట్ అంతా ఆనందోత్సాహాల్లో మునిగితేలుతోంది.
 
 
కాగా.. ఇంతటి ఘన విజయం సాధించటంలో డైరెక్టర్ క్రిష్ చొరవే ఎక్కువగా ఉందని బాలయ్య అంటున్నారట. ఈ మేరకు అతనికి అదనపు పారితోషికం ఇచ్చేనందుకు బాలయ్య సిద్ధమయ్యారని తెలుస్తోంది. నిజానికి రెండు భాగాలకు కలిపి ఇదివరకే క్రిష్‌కి పారితోషికం అందిందట. కానీ షూటింగ్ సమయంలో క్రిష్ డెడికేషన్ చూసి ఇంప్రెస్స్ అయిన బాలకృష్ణ.. ఆయన్ను మరింత ఖుషీ చేసేందుకు బోనస్ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు.
Link to comment
Share on other sites

Cricket lo pujara elago Tfi directors lo Krish alaga...t20's ki alavatu padda kurra fans ki pujara elagite nachado Krish movies kuda alage but they are the real deal...traditional cricket lovers ki and meaningful movies like chese vallaki ilanti vallu entho avasaram..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...