Jump to content

‘ఎన్టీఆర్‌’పై తుఫాన్ ఎఫెక్ట్


sonykongara

Recommended Posts

‘ఎన్టీఆర్‌’పై తుఫాన్ ఎఫెక్ట్ Updated : 17-Dec-2018 : 10:25
 
 
636806391473305912.jpg
నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితకథను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాత్రల కోసం ప్రముఖ తారాగణాన్ని తీసుకోవడం విశేషం. విద్యాబాలన్, రానా దగ్గుబాటి, నందమూరి కల్యాణ్ రామ్, సుమంత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
ఈ సినిమా ఆడియో వేడుకను ఎన్టీఆర్ జన్మస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఈ నెల 21న నిర్వహిస్తున్నామంటూ ఇప్పటికే చిత్రబృందం అనౌన్స్ చేసేసింది. అయితే ఈ వేడుకను వాయిదా వేసినట్టు బాలకృష్ణ మిత్రుడు బొర్రా గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘నిమ్మకూరు వేదికగా ఈనెల 21న నిర్వహించ తలపెట్టిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఆడియో వేడుక పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా రద్దయింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తాం’ అని గాంధీ వెల్లడించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...