sonykongara Posted November 6, 2018 Author Posted November 6, 2018 Global promotion of 5,000 Andhra Pradesh products on anvil Since the State government is keenly focusing on the Zero Budget Natural Farming (ZBNF), the PR and RD officials plan to zero in on the organic farm produce as well. Published: 05th November 2018 07:35 AM | Last Updated: 05th November 2018 07:35 AM | A+A A- By Jayanth P Express News Service VIJAYAWADA: Aimed at creating a sustainable rural economy that makes the gram panchayats self-sufficient, the Panchayat Raj and Rural Development (PR and RD) Department is mulling to take up brand promotion of rural products. The department plans to promote 5,000 products from all the 13 districts in the State, which can potentially become global brands. It will look at products such as Kondapalli toys, organic farm produce and others, which are not just unique, but also universal. Minister for Panchayat Raj and Rural Development Nara Lokesh, who proposed the concept after discussing with his think tank, said that the brand promotion helps create a sustainable and robust rural economy. “We recently had a discussion with consultants on how to create 5,000 rural brands. It can be coffee or farm produce. If we have to create sustainable rural economy, branding is important. This is where we tap the local Andhra brands,” Lokesh said. Citing the example of how Araku coffee has garnered global attention, the minister recalled that the State government worked with a social sector organisation which promoted the product, grown by tribals, in global cities such as Paris and London. “Another example is integration of Kondapalli toy-making and Anganwadi centres. This is not only cost effective, but will also promote local arts,” Lokesh added. Since the State government is keenly focusing on the Zero Budget Natural Farming (ZBNF), the PR and RD officials plan to zero in on the organic farm produce as well. However, the project may take some time to be rolled out as the officials said that it was still in the preliminary stage. “The minister has proposed the idea and it is still at conception stage. We will have to work on it,” Principal Secretary (PR and RD) KS Jawahar Reddy told TNIE.
sonykongara Posted January 18, 2019 Author Posted January 18, 2019 ఆన్‌లైన్‌లో డ్వాక్రా ఉత్పత్తులు15-01-2019 03:02:44 వినూత్న విధానానికి సెర్ప్ శ్రీకారం ‘ఈ మహిళ’ పేరిట పోర్టల్ తయారీ 2లక్షల గ్రూపులను చేర్చడమే లక్ష్యం కల్గుడి, టాటా ట్రస్ట్ తోడ్పాటు మనిషి తినే తిండి, ధరించే బట్ట, వినియోగించే ఫోన్.. ఇలా ప్రతీదీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో దొరుకుతోంది. మనిషి జీవితం ఆన్‌లైన్‌తో పెనవేసుకుపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని స్వయంశక్తి మహిళలు తయారుచేసే ఉత్పత్తులను కూడా ఆన్‌లైన్‌లో విక్రయించుకునే సౌలభ్యాన్ని ‘సెర్ప్’ అందిస్తోంది. విశాఖపట్నం, జనవరి 14(ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో స్వయంశక్తి సంఘాలు అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. పచ్చళ్లు, అప్పడాలు, పొడులు, వడియాల నుంచి చిరుధాన్యాల పిండిలు, తినుబండారాలు, అలంకరణ వస్తువులు, చీరలు, డ్రెస్‌లు, జాడీలు, కుండలు... ఇలా చాలా ఐటమ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. వీటిని విక్రయించుకునేందుకు ప్రభుత్వం ఏటా డ్వాక్రా బజార్లు నిర్వహిస్తోంది. అయితే ఈ బజార్‌లు వారం, పది రోజులే ఉంటాయి. మిగిలిన సమయాల్లో కొనుగోలుదారులు, స్వయంశక్తి సంఘాల మధ్య అనుసంధానం ఉండదు. ఈ నేపథ్యంలో స్వయంశక్తి సంఘాల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ అమ్మకాలకు ‘సెర్ప్’ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆలోచన చేసింది. హైదరాబాద్‌కు చెందిన కల్గుడి సంస్థ సహకారంతో ‘ఈ మహిళ’ పోర్టల్‌ను రూపొందించారు. ఇప్పటివరకు 200లకుపైగా స్వయంశక్తి సంఘాలు ఈ పోర్టల్ ద్వారా వస్తువులను విక్రయిస్తున్నాయి. భవిష్యత్‌లో 2లక్షల సంఘాలను ఈ పోర్టల్‌లోకి తీసుకురావాలనే లక్ష్యంగా సెర్ప్ పనిచేస్తోంది. విశాఖలో నిర్వహించిన డ్వాక్రా బజార్‌లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటుచేసి స్వయంశక్తి బృందాలకు ఆన్‌లైన్‌లో వస్తు విక్రయాలపై అవగాహన కల్పించారు. పక్కాగా ప్యాకింగ్ ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్‌లో అనుసరిస్తున్న విధంగానే ‘ఈ మహిళ’ పోర్టల్‌లో వస్తువుల వివరాలు అప్‌లోడ్ చేస్తున్నారు. ధర ఒక్కటే కాకుండా ఆ వస్తు వు తయారీకి వినియోగించే మెటీరియల్, తయారుచేసిన సంఘం వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ‘ఈ మహిళ’ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని తమకు నచ్చిన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకున్న వస్తువు సమాచారం ఉత్పత్తిదారుడికి అందుతుంది. సంబంధిత సంఘం నుంచి ఆ వస్తువు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రధాన కార్యాలయానికి చేరుతుంది. అక్కడ పక్కాగా ప్యాక్ చేసి కొరియర్ ద్వారా వినియోగదారుడికి చేరవేస్తారు. వినియోగదారుడు చెల్లించే మొత్తం సంబంధిత ఉత్పత్తిదారుని బ్యాంకు అకౌంట్‌కు జమ అవుతుంది. నాణ్యతపై అవగాహన ప్రస్తుతం ఎక్కువగా చెక్కబొమ్మలు, పచ్చళ్లు, వివిధ రకాల కారం పొడులు, పూతరేకులు, కాజాలు, ఆయుర్వేద ఉత్పత్తులు, దుస్తుల ఆర్డర్లు వస్తున్నాయి. కల్గుడి సంస్థ ఇప్పటికే దేశంలో 15 లక్షల మంది రైతులతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం స్వయంశక్తి సంఘాలు తయారుచేసిన ఉత్పత్తుల ఫొటోలు తీసి ‘ఈ మహిళ’ పోర్టల్‌కు అప్‌లోడ్ చేస్తోంది. భవిష్యత్తులో ‘ఈ పోర్టల్’ ద్వారా వ్యాపారాన్ని భారీగా విస్తరించనున్నట్టు కల్గుడి డైరెక్టర్ శ్రీనివాసచక్రవర్తి తెలిపారు. నాణ్యత, ప్యాకింగ్‌పై మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత నెల ఒకటో తేదీన పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సెర్ప్ ప్రతినిధి ఏలూరు రాము తెలిపారు.
sonykongara Posted January 18, 2019 Author Posted January 18, 2019 ఉత్పత్తులు భళీ.. అమ్మకాలేవీ! ఆన్‌లైన్‌లో జోరందుకోని డ్వాక్రా ఉత్పత్తుల విక్రయాలు 50 రోజుల్లో రూ.51 వేల అమ్మకాలే దృష్టి సారిస్తే మెరుగుపడే అవకాశం ఈనాడు డిజిటల్ - అమరావతి ఆకట్టుకునే కళాఖండాలు, అందాల కొయ్యబొమ్మలు, పసందైన పిండివంటలు, చవులూరించే ఊరగాయలు, రంగురంగుల చీరలు.. నాణ్యమైన డ్వాక్రా ఉత్పత్తుల్లో ఇవి మచ్చుకు కొన్నే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినా, ఆన్‌లైన్ అమ్మకాల్లో మాత్రం వీటికి ఆదరణ కరవైంది. జాతీయ, రాష్ట్రస్థాయి డ్వాక్రా బజార్లలో పెద్దఎత్తున అమ్ముడుపోతున్నా, ఆన్‌లైన్ ప్రచారం కల్పించడంలో అధికారులు విఫలమవడంతో అమ్మకాల్లో జోరు పెరగడం లేదు. డ్వాక్రాకు స్వయంగా 94 లక్షల మంది మహిళా సైన్యం ఉన్నా ఆ స్థాయిలో పురోగతి కనిపించటం లేదు. అమ్మకాలు ప్రారంభించిన 50 రోజుల్లో కేవలం 134 మందే డ్వాక్రా ఉత్పత్తుల కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఇప్పటివరకు జరిగిన అమ్మకాలూ రూ.51,547 మాత్రమే. అందుబాటులో 1024 ఉత్పత్తులు... రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.10 వేల ఆదాయాన్ని కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా స్వయం సహాయ సంఘాల ఉత్పత్తులకు ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 వేల రకాల ఉత్పత్తుల వరకు అమ్మకాలు చేపట్టవచ్చని గుర్తించిన అధికారులు కలగుడి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 2018 నవంబర్ చివరి వారం నుంచి అమ్మకాలు ప్రారంభించారు. మొదట్లో 650 ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచగా జనవరి నాటికి ఆ సంఖ్య 1024కు చేరింది. 108 డ్వాక్రా సంఘాల మహిళలు వీటిని తయారుచేస్తున్నారు. ఆహారపదార్థాల వైపే మొగ్గు ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లలోనూ ఒకే వ్యక్తి మూడు, నాలుగు సార్లు కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఒకే వస్తువును రెండు, మూడు పర్యాయాలు కొన్నవారూ ఉన్నారు. ఆహార పదార్థాలు ఎక్కువగా అమ్ముడుపోయాయి. నాణ్యత పరంగా ఢోకాలేదు. సమస్యల్లా ప్రచారలేమి, ఇతరత్రా జాగ్రత్తలు పాటించకపోవడమే. సమస్య: ఉన్నదున్నట్లు చెప్పకపోవటం కొన్ని వస్తువుల లభ్యతను ఉన్నదున్నట్లు ఆన్‌లైన్‌లో చెప్పడం లేదు. స్టాక్ లేకపోయినా ఉన్నట్లే చూపిస్తున్నారు. వస్తువులను ఎంపిక చేసుకున్న తర్వాత సమయం ఇస్తే పంపిస్తామని కొనుగోలుదారులకు చెబుతున్నారు. ఇది అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. పరిష్కారం: ఎప్పటికప్పుడు సైట్‌ను అప్‌డేట్ చేసి అందుబాటులోని ఉత్పత్తులనే అమ్మకాలకు ఉంచాలి. ఎక్కువ రకాలను ప్రదర్శిస్తూ వైవిధ్యం చూపిస్తే అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయంలో సగం రవాణాకే ఆర్డర్ ఇచ్చిన వస్తువును కొనుగోలుదారుల చెంతకు చేర్చేందుకు తపాలశాఖ, కొరియర్, ఇతరత్రా సేవలను వినియోగిస్తున్నారు. గ్రామాల్లో ఉండే ఉత్పత్తిదారులు ఆర్డర్‌ను పార్శిల్ చేసేందుకు మండల కేంద్రానికి రావాల్సి వస్తోంది. రవాణాకు రూ.20 నుంచి రూ.50 ఖర్చవుతోంది. కొన్ని రకాల వస్తువులపై వచ్చే ఆదాయంలో సగం మేర రవాణా ఖర్చులకే పోతోంది. సమయమూ వృథా అవుతోంది. పరిష్కారం: ఈ పరిస్థితిని అధిగమించేందుకు మండల వెలుగు కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలి. ఆకట్టుకోని ప్యాకింగ్ ఇంటిపట్టున ఉత్పత్తులను తయారుచేసే మహిళలు ఇప్పటి వరకు పరిసర ప్రాంతాల్లో అమ్మకాలకే పెద్దపీట వేస్తున్నారు. నాణ్యతపై నమ్మకం ఉన్న కొనుగోలుదారులు ప్యాకింగ్‌తో పనిలేకుండా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్ అమ్మకాల విషయానికి వచ్చేసరికి వస్తువులకు ప్యాకింగే ప్రధాన ఆకర్షణ. పాలకోవా, ఊరగాయలు, బొమ్మలు.. ఇలా వస్తువును బట్టి వేర్వేరు విధాలుగా ఆకట్టుకునేలా ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. డ్వాక్రా మహిళలకు ఇందులో పెద్దగా శిక్షణ ఇవ్వలేదు. ఫలితంగా వీరు చేసే ప్యాకింగ్ సాధారణ స్థాయిలోనే ఉంటోంది. పరిష్కారం: ప్యాకింగ్ మరింత మెరుగయ్యేలా శిక్షణ ఇప్పించాలి. లేదా మండల స్థాయిలో శిక్షణ పొందిన మహిళలతో ఎప్పటికప్పుడు వచ్చే ఆర్డర్లకు ప్యాకింగ్ చేయించే ఏర్పాటు ఉండాలి. యాప్ ఉన్నా ఉపయోగం లేదు ఆన్‌లైన్ అమ్మకాలు పెంచేందుకు అధికారులు ‘ఈ-మహిళ’ పేరుతో ప్రత్యేక యాప్‌ను తీసుకువచ్చారు. దీనిపైనా పెద్దగా ప్రచారం లేదు. సెర్ప్‌లోనే ట్యాబ్ కలిగిన సభ్యులు 30 వేల మంది వరకు ఉన్నారు. వీరికి కూడా పూర్తిగా యాప్ చేరలేదు. పరిష్కారం: ఈ యాప్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గ్రామస్థాయిలో జరిగే డ్వాక్రా సమావేశాల్లో దీనిపై చర్చించాలి. ఫేస్‌బుక్‌లో ప్రచారమూ అరకొరే ఆండ్రాయిడ్ చరవాణి ఉన్న ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్, యూట్యూబ్‌లను తరచూ చూస్తుంటారు. ఇలాంటి ఫోన్లు కలిగిన మహిళలు సెర్ప్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నా ప్రచారానికి వీటిని వినియోగిస్తున్న దాఖలాలు లేవు. ఇది కూడ అమ్మకాలు జోరు తగ్గడానికి కారణమవుతోంది. పరిష్కారం: పండగ వేళల్లో ఇలాంటి ప్రచారానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలి. సంక్రాంతి వేళ బొమ్మలు, చీరలు, పిండివంటలు, అప్పడాలు, తినుబండారాల కొనుగోళ్లు ఎక్కువ. ఈ సమయంలో ప్రచారాన్ని విస్తృతం చేయాలి. శివరాత్రి, ఉగాది, రంజాన్, తదితర పండగ వేళల్లో వినియోగానికి ఆసక్తి చూపే వాటిపైనా.. శీతాకాలం, వేసవి కాలాల్లో ప్రజలకు మేలుచేసే ఉత్పత్తులపైనా దృష్టిపెట్టి వాటిని చేరువ చేయాలి. ఎప్పటికప్పుడు కొనుగోళ్లపై రాయితీలను ప్రకటిస్తూ వాటిని ప్రజలకు చేరేలా చూడాలి.
sonykongara Posted January 18, 2019 Author Posted January 18, 2019 19 minutes ago, John said: First time choostunna link emi ayyindi
John Posted January 18, 2019 Posted January 18, 2019 1 hour ago, sonykongara said: emi ayyindi Em ledu annai ee site first time choostunna DB lo kooda eppudoo vedinattu ledu or I missed
sonykongara Posted January 18, 2019 Author Posted January 18, 2019 2 minutes ago, surendra.g said: what is link for site? payina unnadi chudandi inkosari
surendra.g Posted January 18, 2019 Posted January 18, 2019 26 minutes ago, sonykongara said: payina unnadi chudandi inkosari ?
sonykongara Posted January 18, 2019 Author Posted January 18, 2019 http://emahila.org/?gclid=EAIaIQobChMIqqr6rZP33wIViiQrCh2fHgOsEAAYASAAEgIjfPD_BwE
ramntr Posted January 18, 2019 Posted January 18, 2019 Emahila website ante, not at all catchy.. Dwacraonline, dwacrabazar ఇలా catchy ga vundevi పెట్టుకోక, Emahila అంటే online shopping portal అనే idea ne రాదు.. John 1
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now