Jump to content

kutumba rao


sonykongara

Recommended Posts

2 minutes ago, AnnaGaru said:

also chala baga explain chestadu.....kakapote akkada jaffa batch kada so vallaki ekkadu

Vallu ettagu ekkinchukoru... But neutral people ki ardam aithe that is enough...Switzerland minister cbn gurinchi edo anadu ani egatali chesaru appudu... He explained it very well with figures 

Link to comment
Share on other sites

’రాజా ఆఫ్‌ కరప్షన్‌’పై బహిరంగ చర్చకు సిద్ధమా?
05-09-2018 02:41:16
 
  • ఈర్ష్యతోనే ఉండవల్లి విమర్శలు.. కుటుంబరావు ఆగ్రహం
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఈర్ష్యతో అమరావతి బాండ్ల అమ్మకంపైనా, సీఎం చంద్రబాబుపైనా హేళనగా మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. వైఎస్‌ హయాంలో జరిగిన అవినీతిపై 2009లో టీడీపీ ప్రచురించిన ’రాజా ఆఫ్‌ కరప్షన్‌’పై మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. మంగళవారం సచివాలయంలో కుటుంబరావు మాట్లాడారు. ‘అమరావతి బాండ్లు టాక్స్‌ ఫ్రీ బాండ్లు కావు. ఉండవల్లి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. వడ్డీ ఎక్కువ ఇస్తున్నామంటున్నారు. అది సరికాదు. రూ.2 వేల కోట్ల అమరావతి బాండ్లు ఇష్యూ అయిన తరువాత చాలా మందికి ఈర్ష్య, ద్వేషాలు పెరిగాయి. ఆ కారణంగానే అమరావతి బాండ్లపైనా, చంద్రబాబుపైనా విమర్శలు చేస్తున్నారు.మేం ఇచ్చిన వడ్డీ రేటు కన్నా తక్కువ వడ్డీ రేటుకు ఎవరూ తెచ్చినా అరేంజ్‌ ఫీజు ఇస్తాం’ అన్నారు.
 
రాష్ట్రప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల మేర అప్పు చేసిందని ఉండవల్లి ఆరోపిస్తున్నారని, ఉన్న అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే రుణాలు తీసుకోవలసి వస్తోందని చెప్పారు. సెబీ కింద గుర్తింపు పొందిన సంస్థలు బిడ్డింగ్‌లో కోట్‌ చేశాయని, బిడ్డింగ్‌ పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. యూసీలు ఏ విధంగా ఇస్తారో ఎంపీగా పని చేసిన ఉండవల్లికి తెలియనిది కాదని, నీతి ఆయోగ్‌ కూడా తామిచ్చిన యూసీలను ధ్రువీకరించిందని గుర్తుచేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి 10 అవార్డులు వచ్చాయని, పారదర్శకతకు ఇంత కంటే ఉదాహరణ ఏమి కావాలని ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...