Jump to content

Recommended Posts

Posted
చేనేతకు చేయూత
24-07-2018 02:27:03
 
636679960225322881.jpg
  • 60 వేల మందికి ఆదరణ
  • 70 వేల మగ్గాలకు మోటార్లు
  • చేనేత, జౌళిశాఖపై సమీక్షలో సీఎం ఆదేశం
  • యానిమేటర్లకు గౌరవ వేతనంపైనా సానుకూలత
  • ఇతర సంఘాలకు ‘పరిశీలన’ హామీ
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేనేత వర్గాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రెక్కాడితేకానీ డొక్కాడని నేతన్నకు రుణ విముక్తి కల్పించిన ఈ ప్రభుత్వంలో... అధునాతన యంత్రాలతోపాటు ముడిసరుకు పెట్టుబడి కోసం ‘ముద్ర’ రుణాలు దక్కేలా చర్యలు తీసుకోవాలని సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. ఆదరణ-2 కింద 60,497 మంది చేనేత కార్మికులను ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు 70వేల మంది చేనేత కార్మికులకు మోటరైజ్డ్‌ జాక్వార్డ్‌ లిఫ్టింగ్‌ మెకానిజం సదుపాయాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 14,180 మందికి రుణాల మంజూరు లక్ష్యంగా సీఎం నిర్దేశించారు. ఇప్పటికే వచ్చిన 5,465 మంది చేనేత కార్మికులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించాలని ఆదేశించారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న మరమగ్గాల్లో 3800 మగ్గాలను ఆధునీకరించేందుకు రూ.5.82 కోట్లు విడుదల చేసేందుకు సీఎం అంగీకరించారు. మరోవైపు, గ్రామ సమాఖ్యల సహాయకుల(యానిమేటర్ల)కు నెలకు రూ.3వేల గౌరవ వేతనం, యూనిఫాం ఇచ్చేలా చర్యలు తీసుకోవడానికీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ ప్రాక్టీ్‌సకు అనుమతించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయుష్‌ డాక్టర్లు సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై అధ్యయనం చేసి పరిశీలిస్తామని సీఎం చెప్పారు. మరోవైపు, ఇన్‌చార్జి సూపర్‌వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న తమను ఉన్నపళంగా తొలగించారని, తమను తిరిగి నియమించాలని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
 
ఎటూ తేల్చని అర్చకుల సమావేశం
అర్చకుల సమస్యలపై సోమవారం సచివాలయంలో సీఎం కార్యదర్శి సతీశ్‌చంద్ర ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ఎటూ తేల్చకుండానే ముగిసింది. అర్చకులకు వంశపారంపర్య హక్కు, కనీస వేతనం తదితర డిమాండ్లపై సమావేశంలో చర్చించారు. వాస్తవానికి సీఎం వద్ద ఈ సమావేశం జరగాల్సి ఉండగా, సమయం లేకపోవడంతో అధికారులే సమావేశం నిర్వహించారు. తుది నిర్ణయం సీఎం తీసుకోవాల్సి ఉన్నా ప్రాథమికంగా కూడా చర్చలు కొలిక్కి రాలేదని తెలిసింది. ఈ సమావేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేమూరి ఆనంద్‌సూర్య, సీఎంవో కార్యదర్శి గిరిజాశంకర్‌, దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌, కమిషనర్‌ అనురాధ పాల్గొన్నారు
  • 3 weeks later...
Posted
చేనేతకు చేయూత!
08-08-2018 02:14:47
 
636692912863114331.jpg
  • వర్షాకాలంలో నెలకు రూ. 4 వేల భృతి
  • 100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌
  • ఆరోగ్య బీమా పథకం పునరుద్ధరణ
  • సహకారేతర రంగంలోనూ రుణమాఫీ
  • చేనేతకు ప్రత్యేక కార్పొరేషన్‌ ప్రతిపాదన
  • నూలుపై సబ్సిడీ 30 శాతానికి పెంపు
  • డబ్బులు లేకున్నా... మనసుతో చేస్తున్నా!
  • చేనేత సదస్సులో చంద్రబాబు ప్రకటన
 
 
చీరాల, ఆగస్టు 7: చేనేతన్నలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. వారికి అన్ని విధాలా చేయూతనిస్తామని, వారి కుటుంబాల్లో కాంతులు నింపుతామని ప్రకటించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు మరిన్ని కొత్త పథకాలను ప్రకటించారు. చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని తెలిపారు. మంగళవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం సమీపంలోని ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి చేనేత సభలో చంద్రబాబు ప్రసంగించారు.
 
‘‘ప్రకృతి వైపరీత్యాల సమయంలో మగ్గం గుంటల్లోకి నీరు చేరి పని సాగక కార్మికులకు కుటుంబ పోషణ భారమవుతుంది. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇస్తున్నట్లు... వర్షాకాలంలో చేనేత కార్మికులకు 2 నెలలపాటు నెలకు రూ.4వేల చొప్పున భృతి చెల్లిస్తాం. వంద యూనిట్లలోపు విద్యుత్తును ఉచితంగా అందిస్తాం. నేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం’’ అని ప్రకటించారు. మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం నేత వస్త్రాలకు ఉన్న భౌగోళిక గుర్తింపు (జీఐ రిజిస్ట్రేషన్‌) చీరాల చేనేతకు కూడా వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
 
 
నూలుపై సబ్సిడీ, రిబేటు పెంపు
కేంద్రం చేనేతనూ జీఎస్టీ పరిధిలోకి తేవడంతో కార్మికులకు ఇబ్బంది కలుగుతోందని సీఎం చెప్పారు. దీనిని తప్పించేందుకు... నూలుపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రస్తుతం ఇస్తున్న ప్రత్యేక రాయితీని 20 నుంచి 30 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. ఇందుకు అదనంగా రూ.30 కోట్లు వ్యయమవుతుందని... రాష్ట్రంలోని 599 చేనేత సొసైటీలకు లబ్ధి కలుగుతుందని తెలిపారు. త్రిఫ్ట్‌ ఫండ్‌ ద్వారా 10వేల మందికి లబ్ధి చేకూర్చేందుకు అదనంగా రూ.10కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
 
సహకారేతర రంగంలో ఉన్న చేనేతల రుణాలను కూడా మాఫీ చేస్తామని ప్రకటించారు. అందుకు రూ.75 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చేనేతలు కోరుతున్న కార్పొరేషన్‌ ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తానని.. దాంతో సంబంధం లేకుండా... జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి, ఆదుకుంటామని ప్రకటించారు. ప్రగడ కోటయ్య స్ఫూర్తితో పనిచేస్తూ పేదలకు అండగా ఉంటామన్నారు. ‘‘ఇవన్నీ డబ్బులుండి కాదు... మనసు ఉండి చేస్తున్నాను’’ అని తెలిపారు.
 
 
వైఎస్‌ పాలనలో నిర్వీర్యం
రుగ్వేదం, ఉపనిషత్తుల్లో వివరించిన చేనేత విశిష్టతను, అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నేతన్నల నైపుణ్యాన్ని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించారు. ఎన్టీఆర్‌ చేనేతల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేశారన్నారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేతరంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. రెండువేల మంది ఆత్మహత్యలకు, ఆకలి చావులకు కారణమయ్యారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేనేతల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రుణమాఫీ, పింఛన్‌, పొదుపు నిధి, ముడి సరుకులపై సబ్సిడీ, కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు ఇస్తున్న శిక్షణ, ముద్ర రుణాల గురించి ప్రస్తావించారు. ప్రతి జిల్లాలో చేనేత బజార్లు ఏర్పాటు చేశామన్నారు. వాటి అభివృద్ధికి వివిధ రాష్ట్రాలు, దేశాల సంస్థలతో ఒప్పందాలు జరిగాయన్నారు.
 
సభకు అధ్యక్షత వహించిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ చేనేతలకు సంబంధించి పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. చేనేత నుంచి జౌళి శాఖను మినహాయించాలన్న ఒక్క ప్రతిపాదన మినహా మిగిలిన అన్ని అంశాలపై చంద్రబాబు సానుకూలత తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు ప్రసంగించారు. అంతకుముందు చేనేత ఉత్పత్తులకు సంబంధించి నవ్యాంధ్రలోని 13 జిల్లాల నుంచి తెచ్చిన చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను చంద్రబాబు సందర్శించారు.
  • 1 month later...
  • 2 months later...
Posted

నేతన్నకు ఆరోగ్య బీమా 

 

రాష్ట్రంలోని 90,765 చేనేత కుటుంబాలకు ఉచిత బీమా పథకం 
  రూ.20 వేల వరకూ ఔట్‌ పేషెంట్‌ సేవలు 
  చేనేత శాఖ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం

24ap-main2a_3.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి ప్రస్తుతం ఉచితంగా వైద్యసేవలు అందుతున్నప్పటికీ... చేనేత కుటుంబాలకు ఔట్‌ పేషెంట్‌ సేవల(ఓపీడీ)ను కూడా ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురానుంది. 2014 వరకూ కేంద్ర ప్రభుత్వం చేనేతల కోసం అమలుచేసిన ఆరోగ్య బీమా పథకాన్నే రాష్ట్ర ప్రభుత్వం   పునరుద్ధరించనుంది. దీనిలోభాగంగా గతంలో రూ.15 వేల వరకూ ఉచితంగా ఓపీ సేవలు పొందే వెసులుబాటు ఉండగా ఇప్పుడు దాన్ని రూ.20 వేలకు పెంచింది. కొత్తగా తీసుకురానున్న పథకానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా రాష్ట్రమే భరించనుంది. లబ్ధిదారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరంలేకుండా బీమా ప్రీమియం వ్యయాన్ని కూడా సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత శాఖ రూపొందించిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి నుంచి ఆమోదం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలుచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ-టెండర్ల విధానం ద్వారా బీమా కంపెనీలను ఎంపిక చేయనున్నారు.

పథకం విధివిధానాలవీ.. 
ఏటా రూ.20 వేల గరిష్ట పరిమితివరకూ ఓపీ వైద్యం పొందవచ్చు. 
పథకం అమలు కోసం ప్రజాసాధికార సర్వే ద్వారా 90,765 చేనేత కుటుంబాలను గుర్తించారు. 
అర్హులైన వారు చేనేత దానికి అనుబంధ పనులు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. 
తహసీల్దార్‌, ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కమిటీలు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాయి. 
ఎంపికైన కుటుంబాలకు ప్రత్యేక ఆరోగ్యకార్డులు జారీ చేస్తారు.

నిర్దేశించిన అర్హతలు 
నలుగురు సభ్యులున్న కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించి బీమా పథకాన్ని అమలు చేయనుంది. 
తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి 
80 ఏళ్ల వయసు వరకూ పథకం వర్తిస్తుంది

ఓపీ సేవలు ఎలాగంటే.. 
బీమా సంస్థ పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందాలి. 
పథకంలో చేరేనాటికి ఉన్న వ్యాధులతో పాటు కొత్త వ్యాధులకూ వైద్య సేవలు పొందొచ్చు. 
ఆయుర్వేద, యునానీ, హోమియోపతికి సంబంధించిన వైద్యం 
దంత, కంటి వైద్యం, కళ్లజోడు, ప్రసూతికి సంబంధించిన సేవలకూ అవకాశం ఉంటుంది.

వీటికి వర్తించదు.. 
హెచ్‌ఐవీ, కాస్మొటిక్‌ చికిత్సలు

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...