Jump to content

Nellore Politics


Recommended Posts

  • Replies 219
  • Created
  • Last Reply
1 minute ago, sagarkurapati said:

Asala nellore lo tdp ki scope ledha emiti antha ycp lo ke pothunnaru

Scope undhi brahamdamga beeda valani pakaki tapinchi kavali varaki valani limit chesi city lo Muslim ki ticket ichi narayana poti cheyakunda backend activities chesi sullurpeta gudur kovur canididates ni Maristhe bagane untai results Nellore balam lekapoyina ego unna leaders ekkuva somireddy adala inkokarini piki ranivaru daniki thodu kula pichi beeda undane unnadu 

Link to comment
Share on other sites

2 minutes ago, bnalluri said:

Scope undhi brahamdamga beeda valani pakaki tapinchi kavali varaki valani limit chesi city lo Muslim ki ticket ichi narayana poti cheyakunda backend activities chesi sullurpeta gudur kovur canididates ni Maristhe bagane untai results Nellore balam lekapoyina ego unna leaders ekkuva somireddy adala inkokarini piki ranivaru daniki thodu kula pichi beeda undane unnadu 

somi sudda dandaga,mayor aziz ki nellore city seat isthe pothundi

Link to comment
Share on other sites

ఆనం టీడీపీలో పోగొట్టుకున్నదేమిటి.. వైసీపీలో పొందేది ఏంటి ?
06-09-2018 09:52:17
 
636718243369432703.jpg
  • సరికొత్త సవాళ్లు!
  • జగన్‌ పార్టీలో ఆనం పాత్ర ఏంటి..?
  • టీడీపీలో పోగొట్టుకున్నదేమిటి.. వైసీపీలో పొందేది ఏంటి...?
  • జిల్లాలో పట్టు సాధిస్తారా.. నియోజకవర్గానికే పరిమితమా?
  • రామనారాయణ చేరికతోనే అసంతృప్తి
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎట్టకేలకు ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆ పార్టీలో ఆయన పాత్ర ఏమిటి.. పరిధి ఎంత..? అనే చర్చ మొదలయ్యింది. జిల్లా రాజకీయాలపై బలమైన ముద్ర వేసిన కుటుంబాల్లో ఆనం కుటుంబం ఒకటి. నాలుగున్నరేళ్ల క్రితం వరకు ఈ కుటుంబం రాజకీయంగా ఓ వెలుగు వెలిగింది. అలాంటి కుటుంబం కొంతకాలంగా రాజకీయ ఒడుదుడులకు గురై చివరికి వైసీపీ గూటికి చేరింది. ఇక్కడ ఆనం కుటుంబ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది చర్చనీయాంశమైంది. పార్టీ మారాలనే ఉద్దేశం మనసులో పడిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టిన రామనారాయణ టీడీపీలో పోగొట్టుకున్నదేమిటీ.. వైసీపీలో పొందేది ఏమిటి..? అనే కోణంలో పరిశీలిస్తే ఆనం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుందే మోనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖానిస్తున్నారు. ఏమైనా ఆనం సరికొత్త సవాళ్లను ఎదుర్కొనబోతు న్నారని వారంటున్నారు.
 
 
జిల్లాను శాసించారు..
కాంగ్రెస్‌ హయాంలో ఆనం కుటుంబం జిల్లాను శాసించింద నడంలో అతిశయోక్తి లేదు. జిల్లా లో ఏ ముఖ్యమైన పనైనా ఆ కుటుంబ అనుమతి లేనిదే జరిగేది కాదు. ఏ ఉన్నతాధికారి జిల్లాలో పనిచేయాలన్నా, బదిలీపై వెళ్లాలన్నా ఆనం సోదరుల అనుమతి ఉండాల్సిందే. జిల్లాలోని పలు నియోజకవ ర్గాల్లో వీరి ఆధిపత్యం కొనసాగింది. నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో ఆనం వివేకానందరెడ్డి మాటే శాసనం. ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాల్లో సైతం వీరికి బలమైన వర్గం ఉండేది. పనుల విషయంలో ఆ నియోజకవర్గాల్లో కూడా వీరి ప్రభావం కనిపించేది.
 
తెలుగుదేశంలో పెద్దల్లా..
కాంగ్రెస్‌ పతనంతో అనివార్యంగా టీడీపీలోకి వచ్చిన ఆనం కుటుంబానికి ఆ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయినా గౌవరంలో మాత్రం తక్కువ చేయలేదు. రామనారాయణరెడ్డిని పార్టీ జనరల్‌ సెక్రటరీని చేసింది. పార్టీలోకి చేరిన వెంటనే గత ఎన్నికల్లో అప్పటి వరకు ఇన్‌చార్జిగా ఉన్న కన్నబాబును పక్కన పెట్టి రామనారాయణరెడ్డికి ఆత్మకూరు బాధ్యతలు అప్పగించారు. అన్ని కార్యక్రమాల్లోనూ వీరి స్థాయికి తగిన రీతిలో గౌరవించింది. వివేకానందరెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురైతే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు చెన్నైకి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. అయినా తెలుగుదేశంలో మర్యాద దక్కలేదని విమర్శిస్తూ పార్టీని వదిలిపెట్టారు.
 
 
వైసీపీలో ఎలా..
వైసీపీ తీర్థం పుచ్చుకున్న రామనారాయణరెడ్డికి అక్కడ ఎలాంటి గౌరవం దక్కబోతోందనే విషయం ఇప్పుడు చర్చగా మారింది. ఇప్పటివరకైతే ఆయనకు వైసీపీలో అనుకున్నంత గౌరవం ఏమి దక్కలేదు. పార్టీలో చేరినా ఏ నియోజక వర్గం కేటాయించారో ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
 
 
స్వంత జనం కలిసి రాలేదు
ఆయన పార్టీలోకి చేరినా ఆయన మనుషులుగా గుర్తింపు పొంది కొన్ని ఓట్లను ప్రభావితం చేయ గలిగే నాయకులు ఎవరూ ఆనం వెంట వైసీపీ లోకి వెళ్లలేదు. ఉదాహరణకు డీసీసీబీ చైర్మన్‌ ధనుంజయరెడ్డి, చెన్ను బాలకృష్ణారెడ్డి, నెల్లూరు సిటీకి చెందిన పుట్టా రామకృష్ణారెడ్డి తదితరు లెవరూ వైసీపీలో చేరలేదు. అంతేకాక తమ్ముడు ఆనం జయకుమార్‌రెడ్డి టీడీపీలోనే ఉన్నారు. వివే కానందరెడ్డి పెద్ద కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి వైసీపీలో చేరలేదు. కొంత మంది ఆత్మకూరు నియో జకవర్గ నాయకులు, సొంత కుటుంబంలోని కొంత మంది సభ్యులతో వైసీపీలో చేరాల్సి వచ్చింది.
 
 
షరతులకు లోబడే చెలిమి
ఆనం చేరిక సందర్భంగా వెంట వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన ఆధిపత్యాన్ని, పెద్దరికాన్ని గౌరవిస్తారనే నమ్మకం లేదు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌, రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిలతో ఆనం కుటుంబానికి మొన్నటి వరకు మంచి సంబంధాలు లేవు. గతంతో వీరు ఆనం కుటుంబంపై తిరుగుబాటు చేసి నాయకులుగా ఎదిగారు. ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఆనం కుటుంబానికి, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత పరిధులకు లోబడే ఉంటుందనడంలో సందేహం లేదు. వీరి అభీష్టాలకు వ్యతిరేకంగా సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో రామనారాయణరెడ్డి వేలు పెడితే వీరు మౌనంగా భరించే పరిస్థితిలేదు.
 
 
కాకాణితో కూడా..
ఇక సర్వేపల్లె ఎమ్మె ల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డితో కూడా ఆనం కుటుంబానికి మంచి సంబంధాలు లేవు. ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్న వీరిద్దరు ఆ తరువాత కాలంలో బద్ధ విరోధులుగా మారారు. ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రయోజనాల దృష్ట్యా పాత విషయాలను మరచిపోయారే కాని, ఆయన నియోజకవర్గంలో ఆనం వర్గం వేలు పెడితే సహించే సహనం గోవర్థనరెడ్డికి లేదు. ఇక కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కు మార్‌ రెడ్డికి ఆనం కుటుంబానికి ఇప్పటి వరకు శతృత్వమూ లేదు, మిత్రు త్వమూ లేదు. ఈయన పార్టీ ఆదేశాలతో ఆనం చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు తప్ప ఆయనపై ప్రత్యేకమైన అభిమానం ఏమిలేదు.
 
 
ఆదిలోనే హంసపాదు..
జిల్లా వైసీపీలో బలంగా ఉన్న మేకపాటి వర్గం ఆనం చేరికను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఆనం చేరిక కార్యక్రమానికి మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే గౌతంరెడ్డి, తమ్ము డు చంద్రశేఖర్‌రెడ్డిలు హాజరు కాకపోగా మేకపాటి వర్గంగా ముద్రపడ్డ సూళ్లూరుపేట, గూడూరు ఇన్‌చార్జిలు సైతం రాజమోహన్‌ రెడ్డిని కాదని ఆనం నాయకత్వాన్ని స్వాగతించే పరిస్థితి లేదు.
 
 
ఆ నియోజకవర్గానికే పరిమితమా..
ప్రస్తుత పరిస్థితిని చూస్తే వైసీపీలో ఆనం ప్రభావం కేవలం తనకు కేటాయించే నియోజకవర్గానికే పరిమితం అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఒకవేళ అంతా అనుకున్నట్లు వెంకటగిరి నియోజవకవర్గం కేటాయిస్తే...దీనిపై పూర్తి స్థాయిలో పట్టుకు శ్రమించక తప్పదు. ఈ టిక్కెట్టుపై ఆశపెట్టుకున్న జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆనం చేరిక కార్యక్రమానికి, మంగళవారం విశాఖలో జరిగిన తిరుపతి పార్లమెంట్‌ ఇన్‌చార్జిల సమావేశానికి హాజరుకాలేదు. భవిష్యత్తులో ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
 
ఇదే నియోజకవర్గం నుంచి ఈ నెల 8వ తేదీన నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి వైసీపీలో చేరుతున్నారు. ఆయన బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన నాయకుడే. నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కావాలని కోరుకునే స్థాయి కలిగిన నాయకుడు. సొంత పార్టీలో ఇంత మందితో సర్దుకుపోవడం రామనారాయణరెడ్డికి పెను సవాల్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. ఇవన్నీ విశ్లేషిస్తే వైసీపీలో చేరిక వల్ల ఆనం రామనారాయణరెడ్డికి కొత్తగా పొందే ప్రయోజనంపై రాజకీయ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఈ సవాళ్లను ఆనం ఎలా అధిగమించబోతున్నారో వేచిచూడాల్సిందే.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
సస్పెన్స్‌కు తెర.. ఆనం విషయంలో అక్షర సత్యమైన ఆంధ్రజ్యోతి కథనం
21-09-2018 15:45:26
 
636731415235808995.jpg
  • వెంకటగిరి వైసీపీ ఇన్‌చార్జిగా ఆనం
  • అక్షర సత్యమైన ఆంధ్రజ్యోతి కథనం
  • తిరుగుబాటుకు బొమ్మిరెడ్డి సన్నద్ధం?
  • నేదురుమల్లి ఎలా స్పందిస్తారో..!?
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో (వైసీపీ) ఆనం రామనారాయణరెడ్డి పాత్ర ఏంటి!?. ఆయన ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారు!?. అనుకున్న నియోజకవర్గం నుంచే బరిలో దిగుతారా!? ఇలా కొంతకాలంగా కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. ఆనంను వెంకటగిరి వైసీపీ ఇన్‌చార్జిగా నియమిస్తూ గురువారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఆనం స్థానం ఖరారు కావడంతో ఆత్మకూరు నియోజకవర్గంలో స్పష్టత వచ్చిన ట్లయింది. ఈ పరిణామా లనంతరం వెంకటగిరి టికెట్‌ తనకే వస్తుందని గంపెడాశలు పెట్టుకున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఇప్పుడెలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబంగా గుర్తింపు పొందిన ఆనం కుటుంబం రాజకీయ మనుగడపై ఐదు నెలలు గా కొనసాగిన సస్పెన్స్‌ గురువారం రాత్రి తొలగిపోయింది. రామనారాయణరెడ్డి విషయంలో ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమయ్యింది. తెలుగుదేశం పార్టీని వదిలిపెడుతారా, లేదా అనే విషయంలో కొంత కాలం సస్పెన్స్‌ కొనసాగింది. నెల రోజుల క్రితం ఆ విషయంలో స్పష్టత వచ్చింది. అందరూ అనుకున్నట్లే ఆయన వైసీపీలో చేరారు. ఆ తరువాత ఆనం రామనారాయణరెడ్డికి ఏ నియోజకవర్గం కేటాయిస్తారు, ఎక్క డి నుంచి పోటీ చేయబోతున్నారనే విషయమై సస్పెన్స్‌ కొనసాగింది.
 
ఆత్మకూరు నియోజకవర్గం కేటాయిస్తారని, వెంకటగిరి కేటాయిస్తారని, నెల్లూరు పార్లమెంట్‌కు పోటీ చేస్తారని ఇలా రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు చెలరేగాయి. ఈ ఎన్నిక ల్లో మేకపాటి కుటుంబానికి మూడు కాదు, రెండే అనే ప్రచా రం ఊపందుకుంది. ఒక అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం మాత్రమే ఆ కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావించాయి. అయితే ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి కేటాయించడంతో మేకపాటి కుటుంబ ప్రాతినిధ్యం విషయం లో జరిగిన ప్రచారం ఒట్టిదని తేలిపోయింది. ఆత్మకూరు వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతం రెడ్డి, పార్లమెంట్‌కు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు పోటీ చేయనున్నట్లు స్పష్టమైంది.
 
 
వారెలా స్పందిస్తారో..!!
వెంకటగిరి టికెట్టుపై ఆశలు పెట్టుకొని నాలుగేళ్లపాటు ఇన్‌చార్జిగా వ్యవహరించిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఈ పరిణామంపై ఎలా స్పందిస్తారో అనే విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిన రోజునే బొమ్మిరెడ్డికి పరిస్థితి అర్థమయింది. అయినా జగన్‌ అన్యాయం చేయరనే నమ్మకంతో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన నియోజకవర్గ ఇన్‌చార్జిల సమావేశానికి బొమ్మిరెడ్డికి ఆహ్వానం అందకపోవడం, పైగా ఆ సమావేశానికి రావాల్సిన అవసరం లేదని చెప్పడంతో బొమ్మిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంకటగిరి ఇన్‌చార్జిగా ఆనం రామనారాయణరెడ్డిని నియమిస్తారనే సంకేతాలు అందడంతో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా చెన్నైలో గడుపుతున్నారు. ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో బొమ్మిరెడ్డి ఎలా స్పందిస్తారో, రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో వేచి చూడాల్సిందే.
 
 
ఇటీవలే పార్టీలో చేరిన నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి సైతం వెంకటగిరి టిక్కెట్టును ఆశించారు. ఆయన తన మనసులోని మాటను పార్టీ నాయకుల ద్వారా అధిష్టానానికి తెలియజేసినట్లు సమాచారం. నేదురుమల్లి వర్గం కూడా బొమ్మిరెడ్డిని పక్కన పెట్టి కొత్త వారికి టిక్కెట్టు ఇచ్చే క్రమంలో తమ నాయకుడు నేదురుమల్లి పేరును కూడా పరిశీలనలోకి తీసుకోవాలన్న డిమాండ్‌ను కేంద్ర పార్టీకి విన్నవించింది. అయితే ఇప్పుడు వెంకటగిరి ఇన్‌చార్జిగా ఆనం రామనారాయణరెడ్డిని ప్రకటించిన క్రమంలో నేదురుమల్లి వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Link to comment
Share on other sites

నెల్లూరులో వైకాపాకు షాక్‌

123130YSRCP-NELLORE.JPG

నెల్లూరు : వైకాపాకు నెల్లూరు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌, వైకాపా నేత బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలను మరొకరికి అప్పగించడంతో బొమ్మిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ వైఖరి వల్లే మనస్తాపం చెంది పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు.

తనకు జరిగిన అవమానం ఇంకెవరికీ జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బొమ్మిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో పోటీకి రూ.50 కోట్లు కావాలి.. అంత డబ్బు నువ్వు పెట్టగలవా? అని జగన్‌ తనను అడిగినట్లు బొమ్మిరెడ్డి తెలిపారు.

Link to comment
Share on other sites

చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్న వైసీపీ మాజీ నేత!
25-09-2018 12:34:03
 
636734756444891445.jpg
  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన నేతకు టీడీపీ నేతల ఆహ్వానం
  • బొమ్మిరెడ్డి వైపు టీడీపీ చూపు
  • పరామర్శల పేరుతో నేతల సంప్రదింపులు
  • సీఎం విదేశీ పర్యటన తర్వాత కొలిక్కి..
  • అనుకూలిస్తే ఆ రెండు నియోజకవర్గాలకు మంచిదే!
నెల్లూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీ ముఖ్యనేతలంతా బొమ్మిరెడ్డితో సంప్రదింపులు జరుపుతూ టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. అయితే బొమ్మిరెడ్డి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం విదేశీ పర్యటన ముగించుకొని అమరావతి చేరిన తరువాత బొమ్మిరెడ్డి విషయంలో క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వైసీపీ నుంచి బయటకు వచ్చిన బొమ్మిరెడ్డిని చేజార్చుకోకూడదని జిల్లా టీడీపీ ప్రయత్నిస్తోంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన బొమ్మిరెడ్డి కుటుంబాన్ని పార్టీలోకి ఆకర్షించడం ద్వారా ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆత్మకూరులో గెలుపు అవకాశాలు మెరుగుపడుతాయని అంచనా వేస్తున్నారు. బొమ్మిరెడ్డి తండ్రి సుందరరామిరెడ్డి ఆత్మకూరు నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాదు.. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలతోపాటు నాయకులతో కూడా ఈ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి.
 
ముఖ్యంగా కొమ్మి లక్ష్మయ్య నాయుడు, బొల్లినేని కుటుంబాలతో రాఘవేంద్రరెడ్డి కుటుంబాలకు సత్సంబంధాలు ఉన్నాయి. బొమ్మిరెడ్డిని పార్టీలో కలుపుకుంటే ఆత్మకూరులో పార్టీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందని టీడీపీ అంచనా. బొల్లినేని, కొమ్మి, బొమ్మిరెడ్డి, కన్నబాబు, డీసీసీబీ చైర్మన్‌ ధనంజయరెడ్డిల కాంబినేషన్‌ హిట్‌ అవుతుందని ఆ పార్టీ జిల్లా నేతలు భావిస్తున్నారు. ఈయన చేరికవల్ల వెంకటగిరి నియోజకవర్గంలో సైతం టీడీపీకి లాభం చేకూరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మంత్రులతో సహా జిల్లా పరిధిలోని ముఖ్య నాయకులంతా బొమ్మిరెడ్డిని పరామర్శ పేరుతో పలకరిస్తూ, మెల్లగా తమ మనసులో మాట చెబుతున్నారు.
 
 
సీఎం వచ్చాకే..
అయితే రాఘవేంద్రరెడ్డి మాత్రం టీడీపీలో చేరే విషయమై వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశంలో తనకు దక్కే స్థానం, గౌరవం గురించి సీఎం నుంచి స్పష్టమైన హామీ లభిస్తే ఈయన పార్టీ మారే అవకాశం లేకపోలేదు. సీఎం విదేశీ పర్యటన ముగించుకొని అమరావతి చేరిన తరువాత జిల్లా నేతలు బొమ్మిరెడ్డి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈయన సేవలు పార్టీకి ఎలా ఉపయోగించుకోవాలి, రాజకీయంగా ఆయనకు ఎలాంటి లబ్ధి చేకూర్చాలి అనే అంశాలపై జిల్లా నేతలతో చర్చించిన తరువాత చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లా పార్టీ ముఖ్య నాయకుల్లో అత్యధికులు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో బొమ్మిరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Link to comment
Share on other sites

వరికి వారు.. వైకాపా తీరు!
ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు
nlr-top2a.jpg

నెల్లూరు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైకాపాకు ఇంటి పోరు పెరుగుతోంది. పార్టీలో టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య పెరుగుతోంది. పార్టీకి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా పోరు తప్పటం లేదు. పార్టీలో వర్గపోరు మరింత తీవ్రం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా పార్టీని సమన్వయం చేసే నేతలు ఒక్కరూ లేరు. ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మూడు వర్గాలుగా ఉన్న పార్టీలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేరికతో నాలుగో వర్గం తయారైంది. ఇప్పటికే వర్గపోరుతో సతమతం అవుతున్న పార్టీకి కొత్త తలనొప్పి వచ్చింది. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమస్యలు మరింత ఇరకాటంలో పడేలా చేస్తున్నాయి. జిల్లాలో వైకాపా పరిస్థితి మెరుగుగా ఉందన్న మాటలు కాస్తా తెదేపా నుంచి బలమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందన్న పరిస్థితికి వచ్చింది. కనీసం అయిదారు నియోజకవర్గాల్లో వర్గ పోరు కారణంగా పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడనుంది.

ఆరు చోట్ల పరిస్థితి తారుమారు
కొద్ది రోజుల వరకు వైకాపాలో ఉన్న జడ్పీ ఛైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పార్టీని వీడారు. ఆయన ప్రభావం కనీసం రెండు నియోజకవర్గాలపై ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయన పార్టీని వీడేప్పటికి వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. నియోజకవర్గంలో ఆయనకు కొంత పట్టు ఉంది. ఇది పార్టీకి ఇబ్బందిగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఆత్మకూరు నగరంతో పాటు.. గ్రామీణ ప్రాంతంలో కూడా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంగా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడటం వల్ల రెండు నియోజకవర్గాలపై కొంత ప్రభావం చూపనుంది. ఆత్మకూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో గెలుపు సాధించటం వెనుక పనిచేసిన మూడు వర్గాలు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది పార్టీకి ప్రతికూలంగా మారనుంది. గత ఎన్నికల్లో వైకాపాలో ఉన్న కొమ్మి లక్ష్మయ్యనాయుడు, బొమ్మిరెడ్డి దాదాపు పార్టీకి దూరంగా ఉంటున్నారు. బొల్లినేని కృష్ణయ్య కూడా గత ఎన్నికల్లో వైకాపాకు సహకరించారు. ప్రస్తుత ఎన్నికల్లో మూడు వర్గాలు వైకాపా నుంచి దూరమయ్యాయి. దీంతో రానున్న ఎన్నికల్లో పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది.

కావలి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మూడుముక్కలాటగా ఉంది. పార్టీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఇదే స్థానం నుంచి రెండు బలమైన వర్గాలు కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. టిక్కెట్టు దక్కకుంటే పార్టీని వీడే అవకాశం ఉందని సమాచారం. ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి మధ్య పార్టీ మూడుగా విడిపోయింది. ఇందులో ఎవరికి టిక్కెట్టు దక్కినా మిగిలిన వాళ్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రతాప్‌కుమార్‌రెడ్డి మళ్లీ పోటీ చేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు.

గూడూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మేరిగ మురళికి అవకాశం ఇచ్చేది లేదని పార్టీ అధినేత తేల్చిచెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం. దీంతో ఆయన ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఇదే స్థానం నుంచి ఒక ప్రధాన పార్టీలో ముఖ్య నేతగా ఉన్న వ్యక్తిని బరిలో దింపాలని చేసిన ప్రయత్నాలు వికటించాయి. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పార్టీలో చేరాలన్న షరతు విధించటంతో ప్రస్తుతానికి ఆలోచన వాయిదా పడింది. అక్కడి నుంచి ఎవరిని బరిలో దింపాలనే దానిపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

వెంకటగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన కొమ్మి లక్ష్మయ్య నాయుడు ప్రసుత్తం పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు వెంకటగిరి, ఉదయగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో బలమైన వర్గం ఉంది. పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవటం కూడా భారీగా పార్టీ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. పార్టీలో ప్రాధాన్యత తగ్గటంతో ఆయన పార్టీని వీడాలని భావిస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో పార్టీని నియంత్రించే నాయకుడు ఎవరూ కనిపించటం లేదు. మేకపాటి వర్గం.. ఆనం వర్గం.. పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్థన్‌రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎవరికి వారే అన్నట్లుంది పరిస్థితి.

Link to comment
Share on other sites

చంద్రబాబు నిర్ణయంతో వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కు ఈసారి పరాభవం తప్పదా?
30-09-2018 13:00:53
 
636739092519202779.jpg
  • నెల్లూరు సిటీ నుంచి బరిలో మంత్రి నారాయణ
  • చంద్రబాబు ఆదేశం.. సర్వేల ఆధారంగా సీఎం నిర్ణయం
  • సర్వేలన్నీ నారాయణకే అనుకూలం
  • పార్లమెంట్‌ సీటును గెలిపించే బాధ్యత అప్పగింత
  • రంగంలోకి దిగిన పొంగూరు
  • అభివృద్ధి మంత్రంతో జనం మధ్యకు..
  • వారంలో ఐదు రోజుల పాటు నెల్లూరులోనే మకాం
  • రూరల్‌ నుంచి మేయర్‌ అజీజ్‌ ?
నెల్లూరు జిల్లాలో విజయ కేతనం ఎగరేయడానికి తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. గత ఎన్నికలకు భిన్నమైన ఫలితాలు సాధించడానికి గట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఆ క్రమంలోనే నెల్లూరు నగరం నుంచి మంత్రి నారాయణను బరిలోకి దింపుతోంది. ‘మీరే సమర్థులు.. నెల్లూరు సిటీ నుంచి పోటీకి సిద్ధం కండి’ అని సీఎం చంద్రబాబు మంత్రి నారాయణకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. నెల్లూరు సిటీతో పాటు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోతోపాటు ఎంపీ సీటును గెలిపించే బాధ్యతను నారాయణ భుజస్కంధాలపై సీఎం మోపారు. దీంతో మంత్రి రంగంలోకి దిగారు. అభివృద్ధి మంత్రంతో జనంలోకి చొచ్చుకుపోవడానికి ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. వారంలో ఐదు రోజుల పాటు నెల్లూరులోనే తిష్ఠ వేసి నగరంతోపాటు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం క్రియాశీల పాత్ర పోషించనున్నారు.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నాలుగున్నరేళ్ల కాలంగా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భూగర్భ డ్రైనేజీ, తాగునీటి వసతి, నగర సుందరీకరణ, ఎన్టీఆర్‌ గృహ సముదాయం కింద వేలాది మందికి అధునాతన పద్ధతులతో నిర్మించిన పక్కా గృహాలు, నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో కోట్లాది రూపాయలతో మౌలిక వసతుల కల్పన, అంగన్‌వాడీ కేంద్రాల్లో పలు సౌకర్యాలు, పక్కా రోడ్ల నిర్మాణాలు, శ్మశానాల సుందరీకరణ ఇలా మున్సిపల్‌ శాఖ మంత్రి హోదాలో మంత్రి నారాయణ నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాల పరిధిలో పనులు చేయిస్తున్నారు. ఈ పనులన్నింటికి కర్త, కర్మ, క్రియగా మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారు. ప్రతి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి నారాయణ పోటీ చేస్తారని ప్రజలు అంచనా వేస్తున్నారు. చివరికి ప్రజల అంచనాలే నిజమయ్యాయి. ‘నెల్లూరు సిటీ నుంచి మీరే పోటీ చేయాలి, సిద్ధం కండి’.. అని సీఎం నుంచి మంత్రికి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
 
 
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, జరుగుతున్న అభివృద్ధిపై ప్రజా స్పందన, అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది..? తదితర ప్రశ్నలతో తెలుగుదేశం పార్టీ నాలుగు సర్వేలు నిర్వహించినట్లు తెలిసింది. వీటన్నింటిలో మంత్రి నారాయణే బలమైన అభ్యర్థి అని, సమర్థులని, ఆయనే పోటీ చేస్తే బావుంటుందని అత్యధికులు సమాధానం ఇచ్చారు. సామాజికంగా, ఆర్థింకంగా బలంగా ఉన్న నారాయణ అయితేనే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో నారాయణ పోటీ చేయబోతున్నారనే అభిప్రాయానికి ప్రజలు ఎప్పుడో రావడం, ఆశావహుల్లో ఆయనకే విజయావకాశాలు మెండుగా ఉంటాయని, ఆయన అయితేనే పార్టీలో వర్గాలకు అతీతంగా నాయకులంతా కలిసి పనిచేస్తారని సర్వేల్లో తేలింది.
 
 
టీడీపీ నిర్వహించిన నాలుగు సర్వేల్లో జనాభిప్రాయాల ఆధారంగా అధినేత చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఎన్నికల్లో పార్టీకి నారాయణ అవసరం చాలా ఉంది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా ఆయన అవసరం ఉంది. విద్యాసంస్థల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్‌ కలిగిన నారాయణ 2014 ఎన్నికల్లో సైతం కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో కూడా ఈయన సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని అధిష్ఠానం భావించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది, లేనిది ఆయన అభీష్టానికే వదిలేసింది. అయితే సర్వేలన్నీ నారాయణకు అనుకూలంగా రావడం, ఆయన పోటీ చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు బలంగా నమ్ముతుండటంతో మరొకరిని బరిలోకి దింపడం ఇష్టం లేక సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
 
 
పార్లమెంట్‌ బాధ్యత కూడా..
నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ పోటీ చేయడం ద్వారా పార్లమెంట్‌ స్థానంలోనూ విజయావకాశాలు మెరుగుపడతాయని అధిష్ఠానం భావిస్తోంది. నెల్లూరు పార్లమెంట్‌ సీటుతో పాటు సెగ్మెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపు బాధ్యతను నారాయణకు అప్పగించినట్లు సమాచారం. అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీని సమన్వయపరుచుకోవడం, పటిష్టపరచడం, వనరులను సమీకరించడం, గెలుపు వ్యూహాలను అమలు చేసే బాధ్యతలను చంద్రబాబు మంత్రికి అప్పగించినట్లు తెలిసింది. ‘నెల్లూరు పార్లమెంట్‌తో సహా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలిచి తీరాలి, ఆ బాధ్యతలను మీకు అప్పగిస్తున్నాను’..అని చంద్రబాబు పొంగూరుకు దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం.
 
 
ఇక నుంచి నెల్లూరుకే పరిమితం
టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంతో మంత్రి నారాయణ తదనుగుణంగా తన షెడ్యూల్లో మార్పులు చేసుకుంటున్నారు. ఇక వారంలో ఐదు రోజుల పాటు నెల్లూరులోనే గడపాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గం, పార్లమెంట్‌ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ యుద్ధప్రాతిపదికన వారి సమస్యలను పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. ముఖ్యంగా వేల కోట్ల రూపాయల వ్యయంతో సిటీ, రూరల్‌ నియోజకవర్గాల పరిధిలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల మరమ్మ తులు, పార్కుల సుందరీకరణ తదితర పనులను డిసెంబర్‌ ఆఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
 
రూరల్‌ నుంచి మేయర్‌ అజీజ్‌ ?
నెల్లూరు రూరల్‌ నుంచి మేయర్‌ అజీజ్‌ను బరిలోకి దించాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అజీజ్‌ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. మంత్రి నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని పక్షంలో సిటీ అభ్యర్థిగా అజీజ్‌కే ఎక్కువ అవకాశాలు ఉండేవి. అయితే నారాయణనే బరిలోకి దించాలని అధిష్ఠానం నిర్ణయించుకున్న క్రమంలో అజీజ్‌కు ఆ అవకాశం చేజారిపోయింది. అయితే నెల్లూరు నగర పరిధిలో అంతర్భాగమైన రూరల్‌ నియోజకవర్గం నుంచి మేయర్‌ను బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉండటం, మేయర్‌గా అజీజ్‌కు ప్రజలతో మంచి పరిచయాలు ఉండటం తదితర కారణాల దృష్ట్యా ఆయన్ను అభ్యర్థిగా బరిలోకి దించితే సిటీ,రూరల్‌ నియోజకవర్గాల పరిధిలోని మెజారిటీ సామాజికవర్గాలకు చెందిన ప్రతినిధులను బరిలోకి దించినట్లు అవుతుందని, పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాలపై ఈ ప్రభావం కనిపిస్తుందని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

ఏపీలో మారిన రాజకీయం.. వైసీపీకి కంచుకోట లాంటి జిల్లాలో ఈసారి టీడీపీదే హవానా..!
01-10-2018 14:09:35
 
636739997743107033.jpg
  • నెల్లూరు జిల్లాలో పట్టు బిగిస్తున్న టీడీపీ
  • రెండుచోట్ల మినహా మిగతా వాటిల్లో క్లారిటీ
  • జిల్లా పార్టీ, ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా పరిస్థితిపై ఆరా
  • ఆశావహులకు అధిష్ఠానం బుజ్జగింపు
  • బలం పుంజుకునే దిశగా ‘దేశం’
నెల్లూరు నగర నియోజకవర్గంలో గందరగోళం. ఆత్మకూరులో నాయకత్వ సంక్షోభం. కోవూరులో అసమ్మతి జ్వాలలు. వెంకటగిరిలో ఆధిపత్యపోరు. పార్లమెంట్‌ అభ్యర్థి విషయంలో అస్పష్టత. దీంతో టీడీపీ శ్రేణుల్లో స్తబ్దత. సరిగ్గా రెండు నెలల క్రితం వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇది. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఉనికే ప్రశ్నార్థకంగా మారిందని విశ్లేషకులు అంచనా వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అభ్యర్థుల ఎంపిక, జిల్లా నేతల సఖ్యత, అధిష్ఠానం ప్రత్యక్ష జోక్యంతో పార్టీ పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాపై పట్టు సాధించే దిశగా దూసుకుపోతున్నట్లు పరిశీలకు భావిస్తున్నారు. రెండు సెగ్మెంట్లలో తప్ప మిగతా ఎనిమిదింట్లో అభ్యర్థుల విషయం క్లారిటీ వచ్చింది. జిల్లా పార్టీ, ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం ద్వారా ఎప్పటికప్పడు మార్పులు చేసుకుంటూ పోతున్నది. ఆశావహులను అధిష్ఠానం బుజ్జగిస్తున్నది. ఈ క్రమంలో మరో రెండు నెలల్లో బాగా బలం పుంజుకునే దిశగా దూసుకుపోతున్నది.
 
నెల్లూరు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అభ్యర్థులను ముందే ప్రకటిస్తే తప్ప జిల్లాలో గెలుపు అవకాశాలను మెరుగుపరచుకోవడం సాధ్యం కాదని జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర ఏడాది క్రితం పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించారు. గత ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించారు. దీంతో తక్కువ ఓట్లతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని రవిచంద్ర సీఎంకు వివరించారు. ప్రతిపక్ష పార్టీలో అభ్యర్థుల విషయంలో ఇప్పటికే క్లారిటీ ఉందని, కనీసం ఆరు నెలలకు ముందే మనం అభ్యర్థులను ఖరారు చేస్తే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని బీద వివరించారు. అలాగే చేద్దామని మాట ఇచ్చిన చంద్రబాబు ఆరు నెలలకు ముందు నుంచే అభ్యర్థుల ఎంపికపై రహస్యంగా కసరత్తు ప్రారంభించారు. పలు రకాల సర్వేలతో నాయకుల బలాబలాలు అంచనా వేసుకున్నారు. జిల్లా పార్టీకి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలకు మరో ఆరు నెలలు గడువు ఉండగానే మెజారిటీ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. నెల్లూరు రూరల్‌, సూళ్లూరుపేట నియోజకవర్గాలు మినహా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో, నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చారు. జి ల్లా ఇన్‌చార్జి మంత్రి, ఇతర మంత్రుల ద్వారా ఆ అభ్యర్థులకు సమాచారం అందించి వర్క్‌అవుట్‌ చేసుకోమని ఆదేశిస్తున్నారు.
 
 
బలహీనం అనుకున్న చోట పెరిగిన బలం
అభ్యర్థుల ఖరారు విషయంలో అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయాల ప్రభావంతో ఇంత కాలం పార్టీ బలహీనంగా కనిపించిన నియోజకవర్గాల్లో అనూహ్యంగా బలపడింది. జిల్లా నాయకులంతా నెల్లూరులోనే కాపురం ఉంటున్నా సిటీ నియోజకవర్గం అభ్యర్థి ఎవరు అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో పార్టీ నిస్తేజంగా మారింది. క్యాడర్‌లో ఉత్సాహం తగ్గింది. ప్రతిపక్ష పార్టీ దూకుడే ప్రధానంగా కనిపిస్తూ వచ్చింది. అయితే మంత్రి నారాయణను అభ్యర్థిగా బరిలోకి దించాలని అధిష్ఠానం నిర్ణయించుకున్న తరువాత పార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సిటీ నియోజక వర్గం లక్ష్యంగా పార్టీ కార్యకలాపాలు, ఎన్నికల వ్యూహాలు ఊపందుకున్నాయి. నారాయణ టీడీపీ అభ్యర్థి అనే ప్రచారంతో సిటీ నియోజకవర్గం జిల్లా ప్రజల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. రాబోయే ఎన్నికల ఫలితాలపై కొత్త విశ్లేషణలు, అంచనాలు ఊపందుకున్నాయి.
 
 
ఆత్మకూరు విషయంలోనూ..
ఆత్మకూరు నియోజకవర్గం విషయంలోనూ ఇదే జరిగింది. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిన క్రమంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనుకు న్నారు. అయితే అధిష్ఠానం వ్యూహాత్మకంగా బొల్లినేని కృ ష్ణయ్యను రంగంలోకి దింపడంతో పరిస్థితి మారింది. ఇక్కడ గెలుపు లక్ష్యంగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కొత్త శక్తులను సమీకరించుకుంటోంది. దీంతో హోరాహోరీ పోటీ జరిగే నియోజక వర్గాల్లో ఆత్మకూరు ఒకటిగా మారింది.
 
 
పెళ్లకూరు, కన్నబాబులతో చర్చలు
పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి కోవూరు టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారు. పార్టీని కాపాడుకోవడానికి ఏళ్ల తరబడి కష్టపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన సమీకరణల్లో భాగంగా గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు దక్కలేదు. ఈ ఎన్నికల్లో అయినా అవకాశం కల్పించాలని గట్టిగా కోరుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాలంలో పార్టీని కాపాడుకోవడానికి శక్తికి మించి శ్రమించిన తనకు టిక్కెట్టు ఇవ్వకపోగా, కనీస గుర్తింపు కూడా ఇవ్వడం లేదనే ఆవేదనతో ఈయన కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. జడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వరరెడ్డికి ఎమ్మెల్యేకి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో కన్నబాబు పార్టీ కోసం కష్టపడ్డారు. అధిష్ఠానం చివరి నిమిషంలో ఆదేశిస్తే గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఆనం రామనారాయణరెడ్డి పార్టీలోకి వచ్చే వరకు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆనం రాకతో పక్కన పెట్టేసినా అధిష్ఠానం నిర్ణయాన్ని స్వాగతించారు. ఇప్పుడు ఆనం మారిన క్రమంలో ఇకనైనా తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ కోసం ఈ ముగ్గురు పడిన కష్టాన్ని, వీరికున్న బలాన్ని, వీరు ఎదురు తిరిగితే కలిగే నష్టాన్ని జిల్లా పార్టీ, ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా ఆరా తీసిన అధిష్ఠానం వీరిపై ప్రత్యేక దృష్టి సారించింది. వారం రోజుల్లో అధినేత చంద్రబాబు వీరిని రాజధానికి పిలిపించుకొని మాట్లాడనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
 
వెంకటగిరిలో సర్దుబాట్లు
వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు దాదాపుగా సద్దుమణిగింది. అధిష్ఠానం వర్గం నుంచి వచ్చిన దూతలు, జిల్లా పార్టీ అగ్రనాయకులు వీరి మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలిసింది. చాలా కాలం తరువాత ఇటీవల ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌లు ఇద్దరు కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం దీనికి బలం చేకూర్చుతోంది.
 
 
అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డితో సైతం అధిష్ఠానం చర్చలు జరిపినట్లు, ఆయన కు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇలా జిల్లా వ్యాప్తంగా అసంతృప్తితో ఉన్న క్రియాశీల నాయకులను అధిష్ఠానమే నేరుగా గుర్తిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా దూతలను ఏర్పాటు చేసి అసంతృప్తి వాదులతో మాట్లాడుతోంది.
 
 
పట్టు బిగిస్తున్న అధిష్ఠానం
ఒకవైపు బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించే వ్యూహంతో పాటు కొత్త శక్తులను కూడదీసుకునే పనిలో అధిష్ఠానం నిమగ్నమయ్యింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి పావులు కదుపుతోంది. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడును పార్టీలో క్రియాశీలం చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. బొమ్మిరెడ్డి, కొమ్మిల కలయిక ఉదయగిరిలో పార్టీ గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తాయని అధిష్ఠానం భావిస్తోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఓటర్లను ప్రభావితం చేయగలిగే ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలోకి తీసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టింది. వరుసబెట్టి జరుగుతున్న ఈ పరిణామాలు గమనిస్తుంటే తెలుగుదేశం పార్టీ జిల్లాపై పట్టు బిగిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

CBN emi urike "just" tough fight kosam dimpaledu Narayana ni.....Nellore lo YCp strong kani recent groups and muslims ni kelukudu turned favour.....WIth strong candidate in-place that anti will get boost....

20%+ voting undi muslims di akkada.......It is Nari&abdulaziz mutual co-operation plan...iddaru gelustaru chudandi....balija&muslim&kamma voting is highest there if you see numbers.....kotamreddy happy ga bettings adukovachu....

 

https://www.ap7am.com/lv-277715-nellore-muslim-ysrcp-leaders-express-anger-at-ys-jagan-for-not-caring-them.html

 

Link to comment
Share on other sites

మేకపాటి ప్రకటనతో వైసీపీలో కలవరం.. కంచుకోటకు బీటలు పడుతున్నాయా..?
13-10-2018 12:54:09
 
636750321533998334.jpg
కావలి, నెల్లూరు: కావలి నియోజకవర్గ వైసీపీలో మూడుముక్కలాట కొనసాగుతోంది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డిలు ఎవరికివారు టికెట్‌ వేటలో ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి గెలుపునకు మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి, వంటేరు అహర్నిశలు కృషి చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో కేడర్‌లో పట్టు నిలుకునేందుకు సెప్టెంబరులో కావలిలో జరిగిన వైసీపీ బూత్‌ కన్వీనర్ల సమావేశంలో కావలి నుంచి తిరిగి ఎమ్మెల్యేగా రామిరెడ్డి పోటీ చేస్తారని తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రకటించారు.
 
తదుపరి కొన్ని రోజులకు కావలి నియోజకవర్గం ఎవరి జాగీరు.. కాదని ఎవరికీ పేటెంట్‌ హక్కులేదని తానూ, విష్ణువర్ధన్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నామని వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ప్రకటించారు. అలాగే కావలి నుంచి ఎమ్మెల్యేగా తాను పోటీ చేయడం తథ్యమని, లండన్‌ పర్యటన అనంతరం కార్యచరణ రూపొందిస్తామని కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ముగ్గురు నేతలకు నియోజకవర్గంపై కొంత పట్టు ఉంది.
 
అనుచరుల సస్పెన్షన్‌తో..
జగన్‌ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు జగన్‌ పాదయాత్రకు రావాలని విష్ణువర్ధన్‌రెడ్డిని వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు ఆహ్వానించారు. తొలుత తన అనుచరులపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగిస్తేనే తాను పాదయాత్రలో పాల్గొంటానని, అప్పటి వరకు రానని విష్ణు చెప్పారు. విష్ణువర్ధన్‌ రెడ్డికి వైఎస్‌ కుటుంబంతో మంచి అనుబంధం ఉండటంతో ఆయన కొంతకాలానికి పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచారు. దీంతో పార్టీ తరఫున టికెట్‌ కోసం విష్ణువర్ధన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆయనకే టికెట్‌ వస్తుందని పార్టీలో ఆయన అనుచరులతోపాటు వైసీపీల ముఖ్యనేతలంతా ప్రచారం చేపట్టారు. దీంతో ఆందోళన చెందిన ఎమ్మెల్యే రామిరెడ్డి సెప్టెంబరులో కావలిలో జరిగిన బూత్‌ కన్వీనర్ల సమావేశంలో టికెట్‌ తనకే ఇస్తారని గతంలో జగన్‌ కూడా ఈ విషయం తనకు చెప్పారని ప్రకటించారు.
 
ఈ ప్రకటనతో మరలా విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డిలు కొంత ఆగ్రహానికి గురయ్యారు. వంటేరు కావలిలో పత్రికా విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి కావలి ఎవరికీ జాగీర్‌ కాదని కావలి టికెట్‌పై ఎవరికీ పేటెంట్‌ హక్కు లేదని తానూ, విష్ణువర్ధన్‌ రెడ్డి కూడా పోటీలో ఉన్నామని ప్రకటించారు. ఆ తదుపరి రెండు రోజులకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అల్లూరులో మీడియా ముందుకు వచ్చి తాను కావలి నుంచి పోటీ చేస్తున్నానని ప్రస్తుతం లండన్‌ పర్యటనకు వెళ్తున్నానని అక్కడి నుంచి వచ్చిన తరువాత కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
 
వేమిరెడ్డి మంతనాలు
అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అల్లూరులోని విష్ణువర్ధన్‌ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనతో మంతనాలు జరిపి సర్దుబాటుచేసే ప్రయత్నాలు చేపట్టారు. విష్ణువర్ధన్‌ రెడ్డి లండన్‌ వెళ్ళి వచ్చిన తరువాత కావలి నుంచి పోటీకి కార్యచరణ ప్రకటిస్తానని చెప్పడంతో ఆయన వచ్చేలోపే ఆయన అనుచరులు ముగ్గురు నేతలపై సస్పన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు వారం రోజుల కిందట ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం కావలి నుంచి ఈ ముగ్గురు నేతలు పోటీకి సిద్ధమై ఎవరికి వారుగా ప్రయత్నిస్తుండటంతో కావలి వైసీపీలో మూడుముక్కలాట కొనసాగుతోంది.
 
ముగ్గు రు నేతలు కలసి పనిచేస్తే తప్ప నియోజకవర్గంలో వైసీపీకి గెలుపు అంత సులభంగా లేదు. రామిరెడ్డికి సహకరించేందుకు విష్ణు సుముఖంగా లేరు. ఒక వేళ విష్ణు టికెట్‌ తెచ్చుకుంటే ఆయనకు ప్రతా్‌పకుమార్‌రెడ్డి సహకరించే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యం లో ఈ ముగ్గురిని కాదని వీరికి అనుకూలమైన కొత్త నేతకు టికెట్‌ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే విష్ణువర్ధన్‌ రెడ్డి లండన్‌ నుంచి శనివారం రానుండటంతో ఆయన వచ్చిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
 
 
మేకపాటి ప్రకటనతో..
గత నెలలో జరిగిన వైసీపీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి కావలి నుంచి మరలా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించడంతో విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులకు ఆగ్రహం కల్పించింది. దీంతో విష్ణు వర్గీయులు మేకపాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పత్రికాముఖంగా విమర్శలు గుప్పించారు. దీంతో కావలిలో రామిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గాలుగా రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఇద్దరితో సఖ్యతగా కొంతకాలం కొనసాగుతూ వచ్చారు. గ్రూపు రాజకీయాల్లో భాగంగా విష్ణువర్ధన్‌రెడ్డి వర్గానికి చెందిన బాలకృష్ణంరాజు, వై.శేఖర్‌రెడ్డి, పి. రత్తయ్యలను పార్టీ నుంచి ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డి సస్పెండ్‌ చేయించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు పెరిగాయి.
Link to comment
Share on other sites

సీపీ కంచుకోటలో బీజేపీకి వింత పరిస్థితి
13-10-2018 12:57:46
 
636750323549002447.jpg
నెల్లూరు: బీజేపీ పునాదులపై జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడి సొంత జిల్లా నెల్లూరులో ఆ పార్టీ పరిస్థితి నామమాత్రంగా మారింది. రాబోయే ఎన్నికల్లో జిల్లా పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను వెదుకులాడుకునే స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పార్టీకి అభిమానులు, సానుభూతి పరులు, సంప్రదాయ ఓటర్లు ఉన్నా... వారిలో కమలం గుర్తుకు ఓటు వేయాలనే కాంక్షను కలిగించే నాయకత్వం లేని దయనీయ స్థితి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే నాలుగున్నరేళ్ల అధికారంలో నెల్లూరుకు చెందిన ఆ పార్టీ నాయకుడు ఒక రు దేశ అత్యున్నత పదవికి ఎంపికయ్యారనే ఆనం దం తప్ప మరే విధంగానూ పార్టీ బలపడలేదు. అప్పటికి ఇప్పటికి ఉన్న ఆ ముగ్గురు నాయకులే మిగిలారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికి పలుమార్లు నెల్లూరు పర్యటించారనే గొప్పే కానీ ఆ పర్యటనల వల్ల పార్టీ కొత్తగా బలపడిందంటూ ఏమీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
 
 
ప్రస్తుతం దయనీయం
జిల్లాలో బీజేపీకి ఘనచరిత్ర ఉన్నా కాలక్రమంలో గణనీయంగా తగ్గిపోయింది. నెల్లూరు బీజేపీకి వెం కయ్య నాయుడు ఎంత బలమో అంతే బలహీనతగా పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీకి ఆయ న సారథ్యం వహిస్తున్న రోజుల్లో కూడా ఆయన సొంత జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వం తయారు కాలేదు. తాజాగా గత మూడు ఎన్నికల్లో నెల్లూ రు సిటీ, రూరల్‌ నుంచి మూడు పర్యాయాలు టీడీ పీ పొత్తుతో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసినా నియోజకవర్గాలపై పట్టు సాధించలేకపోయారు. గూడూ రు డివిజన్‌ పరిధిలో ప్రభావం చూపగలిగే స్థాయి కలిగిన నాయకుడు నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరిపోయారు. రాబోయే ఎన్నికల్లో జిల్లా పరిధిలోని పది అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కొరత ఇప్పటికీ వెం టాడుతోంది.
 
ఎన్నికలప్పుడు ఉన్న ముగ్గురు నలుగురు నాయకులే ఇప్పటికీ మిగిలారు. వీరు తప్ప ప్రజల్లో అంతో ఇంతో గుర్తింపు కలిగిన నాయకులను ఆకర్షించుకోవడంలో, కొత్త నాయకులను తయారు చేసుకోవడంలో పార్టీ విఫలమయ్యింది. భారం మొత్తం మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశంపై వేసి ఆ పార్టీ పొత్తుతో పబ్బం గడుపుకోవాలనే చూశారే తప్ప స్వతంత్రంగా ఎదగాలనే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. చివరికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సైతం ప్రచారం చేసుకోలేని నైరాశ్యంలో కూరుకుపోయారు. ఇప్పుడు పొత్తులు వికటించి స్వతంత్రంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న సమయంలో అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు.
 
నేడు జిల్లాకు కన్నా రాక
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శనివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 7.30 గం టలకు సింహపురి వైద్యశాల వెనుక భాగంలో బీజేపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
 
 
గతం ఘనం
కేంద్రంలో అధికారం అందనంత దూరంగా ఉన్న రోజుల్లోనే నెల్లూరు జిల్లాలో బీజేపీ బలంగా కనిపించింది. ఈ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేసిన నాయకులు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. వెంకయ్యనాయుడు ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకున్నారు. ఆత్మకూరు నుంచి పోటీ చేసిన కర్నాట ఆంజనేయరెడ్డి గెలుపు అంచుల వరకు వెళ్లారు. నెల్లూరులో ఆర్‌ఎ్‌సఎస్‌ కేడర్‌ బలంగా ఉంది. ఈ పార్టీ నేతృత్వంలో గత 20 ఏళ్లుగా జయభారత్‌ ఆసు పత్రి ప్రజలకు సేవలందిస్తోంది. గూడూరు, కావలి, నెల్లూరు తదితర నియోజకవర్గాల్లో బీజేపీకి ఓటు బ్యాంకు ఉంది. ఈ పార్టీ నుంచే ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతీయ స్థాయికి ఎదిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.
 
 
పర్యటనలతో ప్రయోజనమేమి..!?
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికి పలు సార్లు నెల్లూరు జిల్లా పర్యటించారు. అయితే ఈ పర్యటనల వల్ల కలిగిన ప్రయోజనం ఏమి లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తల సమావేశాలు ఒక్కటే సరిపోదనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీకి ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ సమర్థులను ఎంపిక చేసి బరిలోకి దింపగలిగితే కొన్ని సీట్లలో అయినా బీజేపీ గట్టి పోటీదారుగా మారుతుంది. రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగే నాయకులను అన్వేషించే పనికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పార్టీ అభిమానులు కోరుతున్నారు. అభ్యర్థుల ఎంపిక ద్వారా పార్టీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, అలాకాక కార్యాలయాల ప్రారంభోత్సవాలు, జెండా ఆవిష్కరణలతో సరిపెట్టుకుంటే ఉపయోగం ఉండదని బీజేపీ అభిమానులు అంటున్నారు. ఇకనైనా రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా అడుగులు వేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకొంటున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...