Jump to content

National Institute of Disaster Management ,Gannavaram


Recommended Posts

22న విపత్తుల నివారణ శిక్షణ కేంద్రానికి ఉప రాష్ట్రపతి శంకుస్థాపన

గన్నవరం, న్యూస్‌టుడే: కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో విపత్తుల నివారణకు ఉద్దేశించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం) సంస్థ నిర్మాణానికి ఈ నెల 22 ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీసులు పరిశీలించారు. కొండపావులూరులోని ఆర్‌ఎస్‌ నెంబరులో ప్రభుత్వం 36.76 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో శిక్షణ కేంద్రం, వసతి తదితరాలకు సంబంధించిన భవంతుల నిర్మాణ పనులను 22న ప్రారంభించనున్నారు. నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కార్పొరేషన్‌ వీటిని చేపడుతుంది. సంబంధిత ఏర్పాట్లను ఎన్‌ఐడీఎం ఈడీ అనిల్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు.

Link to post
Share on other sites
20 minutes ago, TDP888 said:

1500 crores capital construction lo 1000k ayaney ichadu.. He alotted max houses under housing schme to AP

his 1000 cr (for Vijayawada-Guntur under ground drainage) was in addition to 1500 cr given to capital.

Edited by swarnandhra
Link to post
Share on other sites
రేపు ఎన్‌ఐడీఎంకు శంకుస్థాపన
21-05-2018 09:36:03
 
636624921645379924.jpg
గన్నవరం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా కొండపావులూరులో రోడ్లకి రువైపులా శుభ్రంగా ఉంచాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి రోడ్డు మార్గాన వస్తారని గన్నవరం నుండి శంకుస్థాపన ప్రదేశం వరకూ ఆర్‌అండ్‌బీ రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. మండలంలోని కొండపావులూరు సర్వే నెంబర్‌ 6లో ఈ నెల 22న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ(ఎన్‌ఐడీఎం) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటుచేయడానికి 10 ఎకరాలు కేటాయించింది. రూ.36.76 కోట్ల వ్యయ అంచనాతో నిర్మించనున్నారు. శంకుస్థాపన పనులను ఆదివారం కలెక్టర్‌ లక్ష్మీకాంతం పరిశీలించారు. టెంట్‌లు ఏర్పాటు చేశారు. ప్రాంగణాన్ని, శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆర్డీవో చెరుకూరి రంగయ్యను ఆదేశించారు. డాగ్‌, బాంబ్‌ స్వ్కాడ్‌ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ డి.కాంతిరాణా టాటా ఏర్పాట్లను పరిశీలించారు. ఏసీపీ విజయభాస్కర్‌, సీఐ శ్రీధర్‌కుమార్‌ నుంచి వివరాలు తెలుసుకున్నారు. డీపీవో సుబ్రహ్మణ్యం, డీసీవో ఆనందబాబు, స్పెషల్‌ ఆఫీసర్‌ సుధాకర్‌, తహసీల్దార్‌ ఎం.మాధురి, ఎంపీడీవో వై.ఇందిరా ప్రియదర్శిని, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Link to post
Share on other sites
ప్రకృతి రక్షణ అందరి బాధ్యత
రుతువులు గతి తప్పడానికి మనుషులే కారణం
  జాతీయ విపత్తుల నిర్వహణ కేంద్రానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన
22ap-state4a.jpg

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కాలం, రుతువులు క్రమం తప్పుతున్నాయని, దీనికి కారణం మనుషులు రీతులు తప్పడమేనని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కొండపావులూరులో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ దక్షిణ భారత కేంద్రం నిర్మాణానికి వెంకయ్యనాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ సంస్థ రాష్ట్రానికో, దేశానికో సంబంధించినది కాదని, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుల శిక్షణ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ప్రకృతి విపత్తులపై అవగాహనతో సమర్థంగా ఎదుర్కోవడమే నిజమైన అభివృద్ధని పేర్కొన్నారు. ఈ సంస్థను 12 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని ఎంబీసీసీ సంస్థ హామీ ఇచ్చినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. కేవలం విపత్తుల నిర్వహణ శిక్షణ కేంద్రమే కాకుండా... 400 ఎకరాల్లో మరిన్ని సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో 15 ఎకరాల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐపీఎం) కార్యాలయం, 100 ఎకరాల్లో అమరావతి యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సెంటర్‌, 25 ఎకరాల్లో ఆయుర్వేద, నైపుణ్యాల అభివృద్ధి కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రాలకు ఆందోళన అనవసరం: 15వ ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు విడుదల చేయడంతో కొన్ని రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, వాటిలో ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయని వాదనలో నిజం లేదన్నారు. రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

అందరి అభివృద్ధి సాధ్యమే... దేశం ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నా.. సంపద మొత్తం కొందరు వ్యక్తులు, వ్యవస్థలకే పరిమితమవుతోందని వెంకయ్యనాయుడు అన్నారు. స్వావలంబన, స్వశక్తితోనే అందరి అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరు మండలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో మంగళవారం ఆయన బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తనకు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ మొదటి బిడ్డ అని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ...స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ యువ భారత్‌కు కేంద్ర బిందువుగా నిలుస్తూ ఆదర్శవంతమైన పాత్ర పోషిస్తుందన్నారు.

ఆర్‌.నారాయణమూర్తిని సన్మానించిన ఉపరాష్ట్రపతి: రైతు సమస్యలను కళ్లకు కట్టినట్టు చూపించేలా ‘అన్నదాతా సుఖీభవా’ చిత్రాన్ని తీసినా ఆర్‌.నారాయణమూర్తిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు. సామాజిక చిత్రాలు తీయడంలో నారాయణమూర్తి దిట్ట అని కొనియాడారు. ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో రైతు సంఘం నాయకులు ఉపరాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా రైతు సమస్యల పరిష్కారానికి సహకరించాలని రైతులు కోరారు.

Link to post
Share on other sites
బాబు చొరవతోనే.. ఏపీకి కేంద్ర సంస్థలు
23-05-2018 02:52:30
 
636626407516605606.jpg
 • నేను చెప్పడమే ఆలస్యం.. భూములు సిద్ధంచేసేవారు
 • దానివల్లే దక్షిణాదిలోనే తొలి విపత్తు సెంటర్‌ రాష్ట్రానికి: వెంకయ్య
విజయవాడ, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను కేంద్ర మంత్రిగా ఉండగా, రాష్ట్రానికి కేంద్ర సంస్థలు వచ్చేందుకు ఉన్న అవకాశాలను ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పేవాడిని. ఆయన చొరవ తీసుకొని, ఆ సంస్థల ఏర్పాటు కోసం భూములను కేటాయించేవారు. దానివల్లే ఇప్పుడు భారీ సంఖ్యలో కేంద్ర సంస్థలు ఏపీకి వస్తున్నాయి’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు(ఎన్‌ఐడీఎం) కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. సుదూర తీర ప్రాంతం కలిగి, ప్రకృతి విపత్తులను ఎక్కువగా ఎదుర్కొంటున్న ఏపీ అవసరాలనే కాకుండా, మొత్తంగా దేశ ప్రయోజనాలనూ ఈ సెంటర్‌ తీరుస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, విదేశీ పరిశోధకులు సైతం వచ్చి అధ్యయనం జరిపే స్థాయిలో ఏడాదిలోపే ‘ఎన్‌ఐడీఎం’ను సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొండపావులూరులో పది ఎకరాలను కేటాయించింది.
 
ఇక్కడ ఏర్పాటుచేసిన సభలో వెంకయ్య మాట్లాడుతూ.. కేంద్ర సంస్థల రాకతో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కేంద్రంగా కొండపావులూరు మారనున్నదని అన్నారు. ‘‘కొండపావులూరులో 400 ఎకరాలకు పైగా భూముల్లో అనేక కేంద్ర సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 25 ఎకరాలలో, ఆయుష్‌ 25 ఎకరాలలో, ఎన్‌ఐడీఎం 10 ఎకరాలలో, ఐఐపీఎం 15 ఎకరాలలో, అమరావతి యూనివర్శిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ 100 ఎకరాలలో, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ 25 ఎకరాలలో కొలువు తీరబోతున్నాయి’’ అని వెంకయ్య వివరించారు. నిజానికి, వెంకయ్య హయాంలోనే ఎన్‌డీఆర్‌ఎ్‌ఫకు శంకుస్థాపన జరిగింది. కానీ, ఇప్పటికీ సాకారం కాలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ, మరో 12 నెలల్లో పూర్తి అవుతుందన్నారు. ఏపీలో విపత్తు నిర్వహణ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం బలంగా ముందుకొచ్చిందన్నారు. 2014లో హుద్‌హుద్‌ తుఫాను రాష్ట్రానికి ఏ స్థాయిలో నష్టాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. కాగా, కొన్నేళ్ల క్రితం ప్రకృతి విపత్తులకు సంబంధించి దేశీయంగా బలమైన వ్యవస్థ లేదని, అత్యంత సాంకేతిక వ్యవస్థలను ఇప్పుడు భారతదేశం సొంతం చేసుకొన్నదని కేంద్ర విపత్తుల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి రజనీ సిబల్‌, మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ నారాయణరావు, ఎన్‌ఐడీఎం ఈడీ అనిల్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ సెక్రటరీ మన్మోహన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to post
Share on other sites
అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఎన్‌ఐడీఎం’
23-05-2018 07:18:13
 
636626566950673460.jpg
 • శంకుస్థాపన చేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
 • త్రీడీ ప్రాజెక్టు డెమో, డ్రాయింగ్స్‌, డి జైన్స్‌ పరిశీలన
 • ఎన్‌డీఆర్‌ఎఫ్‌ జాప్యంపై వెంకయ్య అసంతృప్తి
 • అభివృద్ధి కేంద్రంగా ‘కొండపావులూరు’
 • కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఇక్కడే!
 
విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామం లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐ డీఎం)కు మంగళవారం వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపావులూరులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ను పాతిక ఎకరాల్లో, ఆయుష్‌ను కూడా పాతిక ఎకరాలలో అభివృద్ధి చేయటం జరుగుతుందని తెలిపారు. పది ఎకరాల్లో ప్రస్తుత ఎన్‌ఐడీఎం, పదిహేను ఎకరాల్లో ఐఐపీం, వంద ఎకరాల్లో అమరావతి యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ , సెంట్రల్‌ స్కిల్‌ డెవల ప్‌మెంట్‌ సెంటర్‌ వంటివి మొత్తంగా 400 ఎకరాల్లో ఒకే ప్రాంతంలో ఏర్పటవుతున్నట్లు తెలిపారు.
 
కొండపావులూరులో తాను శంకు స్థాపన చేసిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిర్మాణపనులు జాప్యం కావటంపై వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిర్మాణ పనులు చేపడుతున్న సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్ల్యూడీ) తీరుపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వేదిక మీదనే సీసీడబ్ల్యూడీ వారు ఉన్నారా అని ప్రశ్నించారు. ఎవరూ లేకపోవటంతో వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి కార్యక్రమానికి వచ్చిన సెక్రటరీ రజనీ సిబల్‌నుద్దేశించి మాట్లాడుతూ, త్వరతిగతిన నిర్దేశించిన సమయంలోపే పనులు పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
 
శాస్ర్తోక్తంగా శంకుస్థాపన
కొండపావులూరులో ఎన్‌ఐడీఎం శంకు స్థాపన కార్యక్రమం ఎంతో శాస్ర్తోక్తంగా జరిగింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు యాగ క్రతువులో పాల్గొన్నారు. తర్వాత వేదిక దగ్గర ఏర్పాటు చేసిన ఎన్‌ఐడీఎం ప్రాజెక్టు త్రీడీ డెమోను పరిశీలించారు. ఎన్‌ఐడీఎం ఏర్పాటు చేయబోయే బిల్దింగ్స్‌, వాటి త్రీడీ డిజైన్లు పరిశీలించారు. వేదిక మీద ప్రత్యే కంగా ఏర్పాటుచేసిన రిమోట్‌ బటన్‌ను ప్రెస్‌ చేయటం ద్వారా శిలాఫలకాన్ని ఆవి ష్కరించారు. కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాల య్యనాయుడు లక్ష్మీకాంతం ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయించారు.
 
ప్రకృతి విపత్తులపై వెంకయ్య ఆవేదన
ప్రకృతితో సహవాసం చేసిన మానవాళి ఇప్పుడు అదే ప్రకృతి విపత్తులకు గురై , బాధి తులుగా మారటంపై వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని మనం ప్రేమించాలని, ప్రకృతి విషయంలో జాగ్త్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రకృతి విపత్తులకు సంబంధించి అధ్యయనం చేయటం, ముందస్తు హెచ్చరికలు చేయటంతో పాటు, ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి ? వంటి అనేక అంశాలను శా స్ర్తీయ, సాం కే తిక పరి జ్ఞానంతో పరి శీలిచి ఎన్‌డీఎం, ఎన్‌డీ ఆర్‌ ఎఫ్‌ లకు దిశా నిర్దే శం చేస్తు ందని అన్నారు. రాష్రా నికి ఈ ప్రాజెక్టు ద క్కటం అదృ ష్టమన్నారు.
 
 
అభివృద్ధి కేంద్రంగా కొండపావులూరు
‘రానున్న రోజుల్లో అభివృద్ధికి కేంద్రంగా కొండపావులూరు ప్రాంతం నిలవబోతోంది! కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థలన్నీ ఇక్కడే కొలువు దీరబోతున్నాయి. నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో అరడజను కేంద్ర సంస్థలు ఈ ప్రాంతంలో ఏర్పాటు కానుండటం మామూలు విషయం కాదు. కేంద్ర సంస్థలకు లేదనకుండా రాష్ట్ర ప్రభుత్వం భూములు సమకూర్చి పెట్టింది. దక్షిణ భారతదేశంలో మొదటిదిగా ఎన్‌ఐడీఎం ఏర్పాటుకు ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంది. పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును పన్నెండు నెలల్లోనే పూర్తిచేసి ప్రారంభోత్సవానికి నన్ను పిలుస్తానని నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌(ఎన్‌బీసీసీ) చెబుతోంది! ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎంలు రెండూ కూడా నిర్ణీత సమయంలో పూర్తి కావటానికి కేంద్ర అధికారులు చర్యలు తీసుకుంటారు. మళ్లీ మే 2019 నాటికి ప్రారంబోత్సవానికి ఇక్కడికి వస్తా’ అని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.
 
 
ఎన్‌ఐడీఎం డిజైన్స్‌ అద్భుతం
ఎన్‌ఐడీఎం స్వరూపం ఎలా ఉంటుందో త్రీడీ డెమోను ప్రాజెక్టు స్థలిలో ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రధాన పరిపాలన - శిక్షణా కేంద్రం, వివిధ రకాల రెసిడెన్షియల్‌ బిల్డింగ్స్‌, హోటల్‌ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు అత్యద్బుతంగా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఏర్పాటుచేస్తున్న ఎన్‌ఐడీఎం అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర విపత్తుల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొణకళ్ళ నారాయణరావులు మాట్లాడుతూ, 950 కిలోమీటర్ల సుదూర తీరప్రాంతం కలిగిన రాష్ర్టానికి ఈ ప్రాజెక్టు ఎంతో గర్వకారణమని, వెంకయ్యనాయుడి సహకారంతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
Link to post
Share on other sites
 • 1 month later...

* జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో పదెకరాల భూమి కేటాయింపు. ఇక్కడే రాష్ట్ర విపత్తు స్పందన సంస్థ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌) ఏర్పాటుకు పదెకరాల కేటాయింపు.

Link to post
Share on other sites
 • భూమి కేటాయింపు.
 •  నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఏర్పాటుకు కృష్ణా జిల్లా కొండపావులూరులో 10 ఎకరాల భూమి కేటాయింపు.
 •  స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో 10 ఎకరాలు కేటాయింపు.
Link to post
Share on other sites
 • 3 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×
×
 • Create New...