Jump to content

Ashok Leyland to set up body building unit in Amaravati


Recommended Posts

అశోక్‌ లేలాండ్‌ భూమిపూజ
31-03-2018 07:10:38
 
636580770397628645.jpg
 • మల్లవల్లికే మణిహారం
 •  సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
(విజయవాడ): దేశీయ దిగ్గజ ఆటోమొబైల్‌ ‘అశోక్‌ లేల్యాండ్‌’ సంస్థతో.. నేడు మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో పారిశ్రామిక ఘంటిక మోగబోతోంది. రాజధాని ప్రాంతంలో పారిశ్రామిక జోన్‌గా మారిన గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం, మల్లవల్లి గ్రామం ఇప్పుడు మెగా ఇండస్ర్టియల్‌ హబ్‌గా మారుతోంది. మొత్తం 30.10 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి పరిచిన మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో 75 ఎకరాల విస్తీర్ణంలో దక్షిణ భారత దేశంలోనే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బస్‌ బాడీ బిల్డింగ్‌, ఛాసిస్‌ మేకింగ్‌ యూనిట్లు ఏర్పడబోతున్నాయి. కృష్ణా జిల్లాకు ఎప్పటి నుంచో బిగ్‌ ఇండస్ర్టీ రావాలని కోరుకుంటున్న ప్రజలకు నిజంగా ఇది శుభవార్తే! భారీ పరిశ్రమల కేటగిరిలో మొట్టమొదటిదిగా అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ నేడు మల్లవల్లిలో కాలుమోపుతోంది. రూ.13 కోట్లతో ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేసిన అశోక్‌ లేల్యాండ్‌ ఎంఓయూలో భాగంగా వేగంగా పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రూ.135 కోట్ల మేర పెట్టుబడులను ఈ సంస్థ పెడుతోంది. మొత్తం 2,295 మందికి స్థానికంగా ఉద్యోగాలు కల్పించే భారీ ఇండస్ర్టీ ఇదే కావటం గమనార్హం. అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ రాకతో మల్లవల్లికే ప్రత్యేక ఆకర్షణ వచ్చింది. మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌లో మొత్తం 962 ప్లాట్లు ఉన్నాయి.
 
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమలకు వీలుగా 500, 750, 1000, 1500, 2754, 3500, 4257, 19,000, 20,250 31,297, 75,581, 5,91,591 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లాట్లను వర్గీకరించటం జరిగింది. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల కోసం మల్లవల్లి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు 82.5 ఎకరాలు, నవ్యాంధ్ర ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు 11.5 ఎకరాలు, స్వర్ణాంధ్ర ఇండస్ర్టీస్‌ అసోసియేషన్కఉ 13.5 ఎకరాలు, మల్లవల్లి స్మాల్‌ మీడియం ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు 26.1 ఎకరాల చొప్పున మొత్తం 133 ఎకరాలను కేటాయించటం జరిగింది. మల్లవల్లి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌తో వాస్తవంగా 468 ఎకరాలకు ఏపీఐఐసీ ఎంవోయూ చేసుకోవటం జరిగింది. అలాగే ఏపీజే అబ్దుల్‌ కలాం అనే అసోసియేషన్‌తో మరో 60 ఎకరాలు ఇవ్వటానికి ఎంవోయూ జరిగింది. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌ ప్రాజెక్టు కింద మల్లవల్లి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌ రూ. 1100 కోట్ల పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించటానికి సిద్ధంగా ఉంది. డైరెక్ట్‌గా 10,500 మందికి ఉపాధి, పరోక్షంగా మరో 8 వేల మందికి ఉపాధి కల్పించటానికి సిద్ధమని హామీ ఇచ్చింది. ఇండస్ర్టీస్‌ అసోసియేషన్స్‌ అన్నీ కలిపి మొత్తం 400 పైచిలుకు పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చాయి. ముందుకు వచ్చిన అసోసియేషన్లకు తగిన భూములు ఏపీఐఐసీ కల్పించలేకపోవటానికి మల్లవల్లిపై ఉన్న డిమాండ్‌ అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఏపీఐఐసీ అధికారులు కూడా ల్యాండ్‌ కాస్ట్‌తో పాటు అంతర్గత రోడ్లు, వరదనీటి మళ్ళింపు కాల్వలు, అంతర్గత పవర్‌ సప్లై, అంతర్గత నీటి సరఫరా వంటి కోసం ఎకరానికి రూ.16.50 లక్షలు ఖర్చు చేసింది. అదే ధరకు పారిశ్రామికవేత్తలకు విక్రయిస్తోంది. కంటింజెన్సీస్‌, ప్రైస్‌ ఎస్కలేషన్‌, లేఅవుట్‌ అప్రూవ్‌- డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, ల్యాండ్‌ కన్వర్జెన్స్‌ ఛార్జీలు, ఎన్విరాన్‌మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌, అడ్మినిస్ర్టేషన్‌ ఛార్జీలు, వడ్డీలు కలిపి ఏపీ ఐఐసీ అధికారులు రూ.4.50 కోట్ల మేర ఖర్చు చేయటం జరిగింది. భారీ పరిశ్రమల శ్రేణిలో ముందుగా అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ ముందుకు రావటం గొప్ప విషయంగా భావించాల్సి ఉంది.
 
ఏర్పాట్లు పూర్తి
అశోక్‌ లేల్యాండ్‌ శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత మల్లవల్లిలో ఎన్టీఆర్‌ కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సెంట్రలైజ్డ్‌ ఎయిర్‌ కూలింగ్‌ వేదికను సిద్ధం చేవారు. వేదికను తీర్చిదిద్దారు. డిజిటల్‌ స్ర్కీన్‌ను ఏర్పాటు చేశారు. ఐదువందల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అశోక్‌ లేల్యాండ్‌ ఎండీ వినోద్‌ కే దాసరి వస్తున్నాయి. కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయబోయే పరిశ్రమకు సంబం ధించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వను న్నారు. ఏపీఐఐసీ అధికారులు రోడ్డు, హెలి ప్యాడ్‌ వంటి పనులు పూర్తి చేశారు. మల్లవల్లి లే అవుట్‌ డెమోను ప్రదర్శిం చను న్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ బాల య్యనాయుడు లక్ష్మీకాంతం ఏర్పాట్లను సమీక్షించారు. జేసీ విజయకృష్ణన్‌, నూజివీడు ఆర్డీవో సీహెచ్‌ రంగయ్య, డీఎస్పీ శ్రీని వాసరావు, తహసీల్దార్‌ కె.గోపాలకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు.
Link to post
Share on other sites
ఏపీలో అశోక్‌ లేలాండ్‌
31-03-2018 02:57:17
 
 • నేడు మల్లవల్లిలో భూమిపూజ..
 • రెండు దశల్లో 135కోట్ల పెట్టుబడి
అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఆటోమొబైల్‌ హబ్‌గా రూపుదిద్దుకునే దిశగా నవ్యాంధ్ర వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో దిగ్గజ సంస్థలైన ఇసుజు, కియ, హీరో వంటివి రాష్ట్రంలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు భారీ వాహనాల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ కూడా చేరనుంది. రాజధాని నగరం అమరావతికి సమీపంలోని మీర్జాపురంలోని మల్లవల్లి పారిశ్రామిక పార్కులో ఈ సంస్థ ప్లాంటు ఏర్పాటుకు శనివారం భూమిపూజ జరుగనుంది.
 
తొలిదశలో రూ.90కోట్లతో స్థాపించే ప్లాంటులో ప్రతిఏటా 2,400 వాహనాలను ఉత్పత్తి చేస్తారు. 12 నుంచి 14 నెలల్లో నిర్మించే ఈ ప్లాంటులో 1,065 మందికి ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా రూ.45కోట్లతో చేపట్టే రెండోదశ ప్లాంటులోనూ ఏటా 2,400 వాహనాలు తయారు చేస్తారు. దీనిలో 1,230మందికి ఉద్యోగాలు లభిస్తాయి. భూమిపూజ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కె. దాసరి తదితరులు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా, ఆటోమొబైల్‌ రంగంలో మరో మెగా సంస్థ భారత్‌ ఫోర్జ్‌ కూడా రాష్ట్రంలో రూ.1,400కోట్లతో క్లస్టర్‌ను ఏర్పాటు చేయనుంది. త్వరలోనే భూమిపూజను చేపట్టేందుకు భారత్‌ ఫోర్జ్‌ యాజమాన్యం సన్నద్ధమవుతోంది.
Link to post
Share on other sites
లేలాండ్‌ @ ఏపీ
01-04-2018 02:18:46
 
636581459274198973.jpg
 • చాసిస్‌ తయారీ ప్లాంటుకు సీఎం భూమిపూజ
 • ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీకీ అశోక్‌ లేలాండ్‌ సై
 • తొలి ప్లాంట్‌ మన గడ్డపైనే.. దుబాయ్‌ స్థాయిలో తయారీ
 • ఏపీకి సదర్‌లాండ్‌, నెట్‌మ్యాజిక్‌, డెస్క్‌ ఎరా!
 
అమరావతి(ఆంధ్రజ్యోతి): అతి భారీ వాహనాల తయారీకి పెట్టింది పేరయిన ‘అశోక్‌ లేలాండ్‌’ ..ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. శనివారం కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో తన ప్లాంటుకు ఘనంగా భూమిపూజ జరుపుకొంది. అదే వేదిక నుంచి.. ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీకి కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా తాము చేపడుతున్న ఈ వాహనాలను ఏపీ ప్రభుత్వం కోరితే, అందించడానికి సుముఖత వ్యక్తం చేసింది. అశోక్‌ లేలాండ్‌ చేసిన ఈ ప్రకటనను అక్కడికక్కడే సీఎం చంద్రబాబు స్వాగతించారు. త్వరలోనే దీనిపై ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని అశోక్‌ లేలాండ్‌ సీఎంవో, ఎండీ వినోద్‌ కే దాసరికి ఆ వేదిక నుంచే చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నూరుశాతం ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగమే తమ లక్ష్యమని ప్రకటించారు. అశోక్‌ లేలాండ్‌ ఏర్పాటుచేస్తున్న అత్యాధునిక చాసిస్‌ మేకింగ్‌ - బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌కు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. నాలుగు నెలల్లోగా ఈ ప్లాంటు దాకా రహదారి సౌకర్యం ఏర్పాటు చేయిస్తానన్న సీఎం, ఆరు నెలల్లో వాహనాలను అందుబాటులోకి తీసుకోవడం మొదలుపెట్టాలని లేలాండ్‌ యాజమాన్యానికి స్పష్టం చేశారు. ఈ ప్లాంటు కోసం ఉదారంగా ముందుకొచ్చి, భూములిచ్చిన రైతులకు ఈ సందర్భంగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
 
       ‘‘రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదు. విభజనచట్టంలో ఇచ్చిన హామీలనూ కేంద్రం నెరవేర్చలేదు. అయినా, సీఎంగా నేను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటిదాకా అనుక్షణం రైతన్నలు చేదోడువాదోడుగా నిలిచారు. రాజధాని నిర్మాణం మొదలు గన్నవరం విమానాశ్రయానికి ఔటర్‌ రింగ్‌రోడ్డు, రన్‌వే, కొత్త టెర్మినల్‌ అభివృద్ధి, పట్టిసీమ కాలువ, మల్లవల్లి పారిశ్రామికవాడ దాకా రైతులు భూములు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించారు. భూములు ఇవ్వకుండా అడ్డుకోవాలని కొంతమంది రాజకీయ నేతలు ప్రయత్నించినా, వారి మాటను వినలేదు. నాపై నమ్మకంతో రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారు’’ చంద్రబాబు అన్నారు.
 
         ‘రాష్ట్రంలో అశోక్‌ లేలాండ్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనతో వినోద్‌ కె దాసరి ముందుకొచ్చారు. తొందరగా ప్లాంటును స్థాపించాలనుకుంటే, తిరుపతిలో లేక శ్రీసిటీ సెజ్‌లో ప్లాంటును ఏర్పాటు చేయాలని నేను సూచించాను. అయితే.. తాను కృష్ణా జిల్లాకు చెందినవాడినని.. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వీలుగా మల్లవల్లిలోనే ప్లాంటును ఏర్పాటు చేస్తానని వినోద్‌ నాతో చెప్పారు. ఆయన మాటలు విని నేనెంతో సంతోషించాను’’ అని అంటూ.. వినోద్‌ను చంద్రబాబు అభినందించారు. మల్లవల్లి పార్కు లో లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని, అశోక్‌ లేలాండ్‌లోనే 2500 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
 
సీఎం చెప్పిన ‘వజ్రం’ కథ!
బ్రిటీష్‌ పాలకులు దేశాన్ని విడిచి, హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో భాగం అయ్యే సమయంలో కృష్ణాజిల్లా పరిటాల, మల్లవల్లిని విడిచిపెట్టేందుకు నిజాం నవాబు అంగీకరించలేదని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ‘‘మల్లవల్లిలో వజ్రాలు ఉండేవని నిజాం నవాబులు భావించారు. ఈ ప్రాంతాలను ఆయన తన ఆధీనంలో ఉంచుకోగా, స్థానిక ప్రజలు తిరగబడ్డారు. నిజాం సంస్థానం భారత్‌లో విలీనం జరిగినప్పుడు మల్లవల్లి గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. మల్లవల్లిలో వజ్రాల సంగతేమోగాని, ఇప్పుడు వజ్రం లాంటి అశోక్‌ లేలాండ్‌ వస్తోంద’’ని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
 
ప్రతి ఊరూ.. కాకులపాడు కావాలి
రాజధాని నిర్మాణం కోసం తానిచ్చిన పిలుపునకు తక్షణమే స్పందించిన కాకులపాడు రైతులను ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కాకులపాడు రైతులు విరాళంగా సమకూర్చిన రూ.2,66,000 చెక్కును కృష్ణాజిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సీఎంకు అందజేశారు. పాడి రైతులు, తాము అమ్మిన పాలలో ఒక లీటర్‌ పాలు డబ్బులను రూ.16 వేలను సీఎంకు అందించారు.
 
    ఎకరానికి బస్తా ధాన్యం చొప్పున కాకులపాడులోని రైతులందరూ రాజధాని నిర్మాణంకోసం విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారని ఆంజనేయులు.. సీఎంకు వివరించారు. ప్రతి ఊరు ఒక కాకులపాడు కావాలని సీఎం ఆకాంక్షించారు. ‘‘పట్టిసీమ నిర్మించటం వల్లే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమైంది. పంటలను సమృద్ధిగా పండించుకోగలుగుతున్నారు’’ అని చెప్పారు. విజయవాడకు చెందిన ఆదర్శ రైతు చలసాని సుబ్బారావు రూ.1,10,000 విరాళాన్ని అందించారు. గతంలోనూ రాజధానికి రూ.5 లక్షలు ఇవ్వడం గమనార్హం.
Link to post
Share on other sites
మల్లవల్లి నుంచే... ఎలక్ర్టిక్‌ బస్సులకు నాంది !
01-04-2018 06:50:09
 
636581622079066628.jpg
 • దుబాయ్‌ తర్వాత .. ఆ స్థాయిలో దేశంలోనే మొదటి ప్లాంట్‌
 •  6 నెలల్లో .. ఉత్పత్తి బయటకు తెస్తాం: వినోద్‌ కే దాసరి
 •  4 నెలల్లో రోడ్డు వేసి ఇస్తాం.. 6 నెలల్లో తప్పకుండా రావాలి : చంద్రబాబు
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ / హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌):ఎలక్ర్టిక్‌ కమర్షియల్‌ వాహనాల తయారీకేంద్రంగా మల్లవల్లి భాసిల్లబో తోంది. దుబాయ్‌ తరహా ఆధునిక పరిజ్ఞానం కలిగిన ‘ఛాసిస్‌ మేకింగ్‌- బస్‌బాడీ’ ప్లాంట్‌ను మల్లవల్లిలో దేశంలోనే మొదటిదిగా ఏర్పడబోతున్న శుభతరుణం లో.. చారిత్రక నేపథ్యం కలిగిన మల్లవల్లి కేంద్రంగా దేశంలోనే మొదటిగా ఎలక్ర్టిక్‌ వాహనాలను రూపొందించనున్నట్టు అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ సీఈవో, ఎండీ వినోద్‌ కే దాసరి ప్రకటించారు. మల్లవల్లి కేంద్రంగా ఎలక్ర్టిక్‌ వాహనాలను తీసుకువస్తున్నట్టు వినోద్‌ కే దాసరి ప్రకటించటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇంతకు ముందు ఈ వాహనాలను తీసుకు వస్తున్నట్టు అశోక్‌ లేల్యాండ్‌ ఎప్పుడూ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు. దీంతో ఎలక్ర్టిక్‌ వాహనాలను తీసుకువస్తున్నామని చెప్పగానే సీఎం సంతోషం వ్యక్తంచేశారు. ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగాన్ని నూరుశాతం అమలు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఉందని, దీనికి సంబంధించి ప్రత్యేక పాలసీని కూడా రూపొందించామని, అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రపంచంలో దుబాయ్‌లో మాత్రమే ఉన్న ఆధునిక సదుపాయాలతో కూడిన ఛాసిస్‌ మేకింగ్‌ - బస్‌ బాడీ ప్లాంట్‌ను దేశంలో తొలిసారిగా ఏర్పాటుచేస్తున్న విధానాన్ని, ప్లాంట్‌లో ఏర్పాట్ల గురించి దాసరి వివరించిన తీరు ముఖ్యమంత్రిని ఆకట్టుకుంది.
 
ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభం
అశోక్‌ లే ల్యాండ్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత ఆ సంస్థ ఎండీ మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు కమిట్‌మెంట్లు ఇచ్చారు. ప్రధాన రోడ్డును పూర్తిచేసి ఇస్తే.. ఆరునెలల్లోనే తాము ప్రోడక్టును విడుదల చేస్తామని, మళ్లీ మీ చేత ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. నాలుగు నెలల్లో భూ సేకరణ పనులన్నీ పూర్తిచేసి పూర్తి రోడ్డును అప్పగిస్తామని, 180 రోజుల్లో ఉత్పత్తిని తీసుకు రావటానికి సిద్ధంగా ఉండాలని, ఈ రోజు మార్చి 31.. తనతోపాటు అందరూ గుర్తుంచుకోవాలని, సరిగ్గా 180 రోజుల తర్వాత ప్రారంభించటానికి వస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. రెండవ కమిట్‌మెంట్‌గా.. వినోద్‌ కే దాసరి స్థానిక ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సామాజిక బాధ్యత కింద స్థానికంగా ఉండే ప్రాథమిక పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
 
 1.jpgఅమరావతి సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణాలు
మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌లో అశోక్‌ లే ల్యాండ్‌ సంస్థ ఏర్పాటుచేయబోయే ప్లాంట్‌లోని నిర్మాణాలను అమరావతి సంస్కృతి నేపథ్యంలో నిర్మించబోతున్నట్టు ఆ సంస్థ ఎండీ ప్రకటించారు. ఇదే సందర్భంలో ప్రధాన ప్లాంట్‌ పర్‌స్పెక్టివ్‌ వ్యూ డిజైన్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ సంస్థ నిర్మించబోయే అడ్మిన్‌ బిల్డింగ్‌ అమరావతి స్థూపాన్ని పోలి ఉండేలా... మధ్యలో స్థూపంతో నిర్మించబోయే అడ్మిన్‌ భవనం నమూనాను ప్రదర్శించారు. అలాగే క్యాంటిన్‌ను పూర్తిగా స్తూపాకారంలో నిర్మించే డిజైన్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. దీంతోపాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం నిర్మించబోయే బిల్డింగ్‌ నమూనాను కూడా ఆయన విడుదల చేశారు.
Link to post
Share on other sites
6 నెలల్లో లేలాండ్‌ బస్సు
ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల ఉత్పత్తి
  స్థానికులకే ఉద్యోగాలు
  ప్లాంటు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి
  మల్లవల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ
  ప్రజల మద్దతుంటే కొండనైనా ఢీకొడతానని వ్యాఖ్య
31ap-main5a.jpg

ఈనాడు-అమరావతి, హనుమాన్‌ జంక్షన్‌- న్యూస్‌టుడే: రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పుతున్న అశోక్‌లేలాండ్‌ ప్లాంటు నుంచి ఆరు నెలల్లోనే బస్సులు ఉత్పత్తి చేయనున్నారని, కియా కారు కంటే ముందే అశోక్‌లేలాండ్‌ బస్సు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కృష్ణా జిల్లా మల్లవల్లి ఆదర్శ పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేయనున్న అశోక్‌లేలాండ్‌ ప్లాంటుకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఇదేరోజు మల్లవల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్లాంటు ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆటోమొబైల్‌ రంగానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ రంగంలో దేశంలోనే రాష్ట్రం ఏడో స్థానంలో ఉందని తెలిపారు. పారిశ్రామిక పార్కులో అవసరమైన మౌలికసదుపాయాలను నాలుగైదు నెలల్లో కల్పిస్తామని హామీ ఇచ్చారు. అశోక్‌లేలాండ్‌ ప్లాంట్ల అన్నింటిలోకి ఈ ప్లాంటు అత్యంత ఆధునికంగా, ఉత్తమైనదిగా ఉండాలని సూచించారు. 2015లోనే ఆటోమొబైల్‌ విధానాన్ని తీసుకొచ్చామని, ఇప్పటికే రాష్ట్రంలో కియా, ఇసుజీ, హీరో, అపొలో టైర్స్‌లాంటి కంపెనీలు రావడంతో రాష్ట్రం ఆటోమొబైల్‌ హబ్‌గా తయారవుతోందని వెల్లడించారు. కృష్ణా జిల్లాకు చెందిన అశోక్‌లేలాండ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఇక్కడ పరిశ్రమ పెట్టడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పూర్తిగా ఎలక్ట్రికల్‌ వాహనాలనే వినియోగిస్తామని, అశోక్‌లేలాండ్‌ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్‌ వాహనాలనూ తీసుకుంటామని వెల్లడించారు. లేలాండ్‌ కంపెనీలో వచ్చే 5వేలు ఉద్యోగాలను స్థానికులకే ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్రకు సూచించారు. మల్లవల్లిలోని అటవీశాఖ భూమిని కొందరు రాజకీయనాయులు కబ్జాలు చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు కాపాడుకున్నారని, వాటిని పరిశ్రమలకు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇక్కడి రైతాంగం చూపిన చొరవ, సహకారం వల్లే పట్టిసీమ ఏడాదిలో పూర్తి చేయగలిగామన్నారు.

వజ్రం లాంటి పరిశ్రమ.. మల్లవల్లి ప్రాంతంలో గతంలో వజ్రాలు దొరికేవనే ప్రచారం ఉందని, ఇప్పుడు వజ్రం లాంటి పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని అశోక్‌లేలాండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కె.దాసరి వెల్లడించారు. ప్లాంటు నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే పూర్తి చేశామని, ఇక్కడ బస్సులతోపాటు ట్రక్కులు, ఎలక్ట్రిక్‌ బస్సులను ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. పరిశ్రమ నిర్మాణం కంటే ముందే సిబ్బంది కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఆరు నెలల్లో బస్సును రోడ్డుపైకి తీసుకువస్తామని, ఏడాదికి 4,800 బస్సులను ఉత్పత్తి చేస్తామని వివరించారు. ఈ కొత్త ప్లాంట్‌ దక్షిణ భారత, తూర్పు, పశ్చిమ భారత అవసరాలను తీర్చే రీతిలో ఉంటుందని వెల్లడించారు.

ఏ అంటే అమరావతి.. పి అంటే పోలవరం..
శనివారమే కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ... ప్రజలమద్దతుంటే రాష్ట్రాభివృద్ధి కోసం కొండనైనా ఢీకొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. మల్లవల్లి ప్రజలు అటవీభూముల పరిరక్షణకు బ్రిటిష్‌ పాలకులపై చూపిన తెగువ, చేసిన పోరాట స్ఫూర్తిని... ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చూపాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ‘‘ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం.. ఈ రెండిటినీ సాధించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ రెండింటినీ సాధించి తీరుతాం’’అని చంద్రబాబు అన్నారు. దేశంలోని కాంగ్రెసేతర పార్టీలను ఏకతాటి మీదకు తెచ్చేందుకు ఎన్టీఆర్‌ కృషి చేశారు. దాని ఫలితంగానే నేడు కేంద్రంలో కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కేవలం రాష్ట్రాభివృద్ధి కోసం భాజపాతో పొత్తు పెట్టుకున్నామని, వారి వల్ల 10-15 సీట్లు తెలుగుదేశం పార్టీకి తగ్గాయని చంద్రబాబు చెప్పారు. తనది ధర్మపోరాటమని, ప్రజల మద్దతు కావాలని కోరారు. ఈ పోరాటంలో గ్రామాలన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. మొన్నటి వరకూ తనతోనే ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు కొత్తపాట మొదలెట్టాడని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదన్నారు. ఆయన బాధ ఏంటనేది కూడా అర్థం కావడం లేదన్నారు.


క్షిపణులు మోసుకెళ్లే వాహనాలు ఉత్పత్తి చేస్తున్నాం
అశోక్‌లేలాండ్‌ ఎండీ వినోద్‌ కె.దాసరి

ఈనాడు, అమరావతి: రక్షణరంగంలో కీలకమైన క్షిపణులను(మిస్సైల్స్‌) మోసుకెళ్లే భారీ వాహనాలను అశోక్‌లేలాండ్‌ సంస్థ తయారు చేస్తోందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) వినోద్‌ కె.దాసరి వెల్లడించారు. సైన్యానికి అవసరమయ్యే అన్ని రకాల వాహనాలను తయారు చేస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక క్లస్టర్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఆయన ‘ఈనాడు- ఈటీవీ’తో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ సంస్థ కార్యకలాపాలు,  అభివృద్ధిపై ఆయన మాట్లాడారు.

70ఏళ్ల క్రితమే...  చెన్నైలో 70ఏళ్ల క్రితం మొదటిసారిగా తమ సంస్థ ఆటోమొబైల్‌ ప్లాంటును ప్రారంభించింది. ఇప్పుడు చెన్నై ఆటోమొబైల్‌ రంగానికి పేరుగాంచింది. మల్లవల్లి ప్లాంటు ద్వారా ఈ ప్రాంతానికి అలాంటి ఘనత దక్కుతుందని ఆశిస్తున్నాను. ఆటోమొబైల్‌ రంగంలో ఒక ఉత్పత్తి తయారు చేయాలంటే 10 మందికి ఉపాధి వస్తుంది.  ఇందులో వినియోగించే వస్తువులను ఇతరుల వద్ద కొనుగోలు చేయడం వల్ల ఈ ఉపాధి పెరుగుతుంది. ఈ తరహా ఉపాధి సాఫ్ట్‌వేర్‌లో రంగంలో కంటే ఆటోమొబైల్‌ రంగంలోని ఎక్కువ ఉంటుంది. బస్సుల తయారీ రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. సీఎన్‌జీ, లోపల సమాంతరంగా ఉండేవి, వెనుభాగంలో ఇంజిన్‌ ఉండే బస్సులు వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తున్నాయి.

ప్లాంటును మరింత విస్తరిస్తాం..
పరిస్థితులు, సమయాన్ని అనుసరించి బ్యాటరీ తయారీ రంగంలోకి రావడంపై ఆలోచిస్తాం. ఎలక్ట్రిక్‌ వాహనాలకు మూడు రకాల బ్యాటరీలను వినియోగిస్తున్నాం. మల్లవల్లి ప్లాంటులోనూ డిమాండ్‌ మేరకు ఉత్పత్తి చేస్తాం. ప్లాంటును మరింత విస్తరించాలని అనుకుంటున్నాం. ఇందుకు సంబంధించి పక్కనే ఉన్న భూమిని తమకు రిజర్వుగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరాం. మల్లవల్లిలాంటి ప్లాంట్లు తయారు కావడానికి సాధారణంగా 12-18నెలలు పడుతుంది. కానీ, ఇక్కడ ఆరు నెలల్లోనే మొదటి బస్సును తీసుకొస్తాం. పారిశ్రామిక పార్కులో రోడ్డు నిర్మాణం పూర్తయితే ఉత్పత్తి వస్తుంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించి విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చెన్నైలో చేస్తున్నాం.


Link to post
Share on other sites

Ashok Leyland plans to make batteries for electric vehicles

Ashok Leyland CEO and MD Vinod. K. Dasari.

Working on tech that can charge bus battery in five minutes

World’s fouth largest bus maker Ashok Leyland is planning to make batteries for electric vehicles. Currently, it is working on different technologies to make electric vehicles and transport more economic and efficient.

The Hinduja Group’s flagship company has dedicated a sizable research & development team with significant funding to work on the technologies, according to its CEO and MD Vinod K. Dasari.

Speaking to The Hindu on the sidelines of the foundation laying ceremony for the Rs. 340-crore bus-making plant at Mallavalli near Vijayawada, Mr. Dasari said, “We are already making all kinds of buses, including electric ones. Right now the batteries are procured from different firms from across the world. We are now working on various technologies to manufacture batteries. We hope to make them and compete with global players in the segment.”

Ashok Leyland was the successful bidder to supply and operate electric buses in Ahmedabad smart city project, in which the company is expected to run 40 buses. The bidder was finalised on the basis of lowest price per kilometre per passenger.

Three varieties

As per the information, the company is exploring three options for future electric vehicles. “One is a fast charging battery which can be ready in six hours, a flash charging one which can charge a bus in just five minutes and a swappable battery which can be quickly unloaded from the bus and replaced with a charged one,” he said.

The company is also working on the infrastructure needed to charge the buses or electric vehicles at bus stations and other important common transit points. Interestingly, all these technologies will be available for use within six to eight months, according to the CEO. However, the investment needed for the battery manufacturing plant will be anywhere from Rs. 100 crore to Rs. 1,000 crore depending on the capacity. “We have not yet taken any decision on the battery making plant and investment. But the technologies are under development,” added Mr. Dasari.

The bus-making plant at Mallavalli, the third one after the units in Rajasthan and Tamil Nadu, will be making 4,800 buses per annum in the first phase. The plant is scheduled to reach its full capacity and production in the coming one year. Electric vehicle manufacturing facility is also a part of the plant in Krishna district. The company also has a plan to double its production depending on the demand.

 
Link to post
Share on other sites
 • 3 weeks later...
ఏపీలో అశోక్‌ లేలాండ్‌ యూనిట్‌
రూ.200 కోట్ల పెట్టుబడులు
బస్సులు, ఇతర వాహనాల తయారీ
19BRK52A.jpg

చెన్నై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19) అశోక్‌లేలాండ్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందని, ఈ యూనిట్‌పై పేట్టే పెట్టుబడులతో కలిపి మొత్తం పెట్టుబడులు ఉంటాయని అశోక్‌ లేలాండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ దాసరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీలో బస్సులతోపాటు ట్రక్కులు, ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా తయారు చేస్తామని వివరించారు. కంపెనీకి చెందిన వినూత్న వాహనాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శించడానికి చెన్నైలో వార్షిక గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ 2018ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వినోద్‌  మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ కోసం సుమారు రూ.200 కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు. మేధో సంపత్తి కలిగిన లిఫ్ట్‌ టెక్నాలజీ కలిగిన 41 టన్నుల వాహనం సహా అనేక కొత్త వాహనాలను కంపెనీ అభివృద్ధి చేస్తోందని, ఎలక్ట్రిక్‌ వాహనాల అభివృద్ధిపై దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేశామన్నారు. కొత్త మార్కెట్లకు ఎగుమతి చేయడానికి లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవింగ్‌ సదుపాయంతో వాహనాలను తయారు చేయనుందని చెప్పారు.

Link to post
Share on other sites
ఈ ఏడాది అశోక్‌లేలాండ్‌ పెట్టుబడి రూ.1,000 కోట్లు
19-04-2018 02:14:03
 
636597029279846711.jpg
 • ఎపి ప్లాంట్‌ కోసం రూ.200 కోట్లు
చెన్నై: హిందుజా గ్రూప్‌లో ప్రధాన కంపెనీగా ఉన్న అశోక్‌లేలాండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో 1,000 కోట్ల రూపాయల మూలధన పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు అశోక్‌లేలాండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కె దాసరి తెలిపారు. ఈ ప్లాంట్‌లో కేవలం బస్సులేకాకుండా ట్రక్కులు, ఎలక్ర్టిక్‌ వాహనాలు తయారు చేయనున్నట్టు ఆయన చెప్పారు. వార్షిక గ్లోబల్‌ కన్ఫరెన్స్‌లో భాగంగా కంపెనీకి చెందిన పలు ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వినోద్‌ కె దాసరి విలేకరులతో మాట్లాడారు.
 
 
          గత ఏడాది ప్రపంచంలోనే తొలి ఇజిఆర్‌ ఆధారిత బిఎస్‌4 వెర్షన్‌ వాహనాలను విడుదల చేశామని, ఇది ఆదరణ పొందదని చాలా మంది చెప్పారన్నారు. అయితే అనేక మంది అభిప్రాయాలకు భిన్నంగా గత ఏడాది లక్షకు పైగా ఇజిఆర్‌ ట్రక్కులు, బస్సులను విక్రయించామని తెలిపారు. సరికొత్త ఇన్నోవేషన్‌తో కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నామని, వీటిలో పేటెంటెడ్‌ లిఫ్ట్‌ టెక్నాలజీతో కూడిన 41 టన్నుల వెహికిల్‌ కూడా ఉందన్నారు. మూలధన వ్యయంలో భాగంగా ఎలక్ర్టిక్‌ వాహనాల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. 1,000 కోట్ల రూపాయల్లో ఎక్కువ మొత్తం కంపెనీ సామర్థ్యాన్ని పెంచడానికే వినియోగించనున్నామని, ఉత్పత్తిని పెంచుకోవడానికి కొంత మొత్తమే కేటాయించనున్నామని చెప్పారు.
 
 
        ఎలక్ర్టిక్‌ వాహనాల వ్యాపారం కోసం ఇప్పటికే 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టామని తెలిపారు. చార్జింగ్‌ స్టేషన్లు, బ్యాటరీ వంటి అంశాలు ఇంకా ఇబ్బందికరంగానే ఉన్నాయన్నారు. రక్షణ వ్యాపారానికి సంబంధించి గత ఏడాదిలో 800 కోట్ల రూపాయల రాబడి నమోదైందని తెలిపారు.
Link to post
Share on other sites
 • 6 months later...
 • 3 months later...
 • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×
×
 • Create New...