Jump to content

V. V. Lakshminarayana(J.D)


sagar_tdp

Recommended Posts

జేడీ’ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ!
23-03-2018 02:40:34
 
636573696337111205.jpg
  • మహారాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు
  • రాజకీయాల్లోకి వస్తారని.. జనసేనలో చేరతారని ప్రచారం
  • టచ్‌లో బీజేపీ నేతలు?
అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నారా? జనసేనలో చేరబోతున్నారా? మహారాష్ట్రలో అడిషనల్‌ డీజీగా ఉన్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఈ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజకీయాల్లోకి వస్తున్నారని, జనసేనలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బీజేపీ నేతలు కూడా ఆయనతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన లక్ష్మీనారాయణ 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ)గా ఉన్న సమయంలో తెలుగు ప్రజలకు ఆయన సుపరిచయం.
 
వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం గనులు వంటి కేసుల దర్యాప్తునకు నేతృత్వం వహించడంతో బాగా పాపులర్‌ అయ్యారు. సీబీఐలో డిప్యూటేషన్‌ పూర్తయిన తర్వాత మహారష్ట్రకు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ విధులు నిర్వహిస్తున్నా.. ఏపీ, తెలంగాణలో పాఠశాలల మరమ్మతు పనులు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
 
ఆ సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎక్కడా ఈ అంశంపై మాట్లాడింది లేదు. ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేయడంతో ఆ ప్రచారం మళ్లీ జోరందుకుంది. పవన్‌ కల్యాణ్‌తో కలిసి రాజకీయ రంగంలో అడుగులు వేస్తారని ప్రచారం జరుగుతోంది. వీటిపై ఆయన స్పందించకపోయినా..ముందుగా తన దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం, ఆపై కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తాననడం ఊహాజనితమైనదిగా ఆయన కొట్టిపారేస్తున్నారు.
 
వస్తే టీడీపీకే మంచిది:కేశవ్‌
లక్ష్మీనారాయణ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినా.. ఏదైనా పార్టీలో చేరినా అది టీడీపీకే లాభమని ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. శాసనసభ లాబీలో స్పందిస్తూ.. గతంలో జయప్రకాశ్‌ వల్ల ప్రతిపక్షంలో ఉన్న తమకు నష్టం జరిగిందని.. ఇప్పుడు లక్ష్మీనారాయణ వల్ల ప్రతిపక్షాలకే నష్టమని వివరించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకు ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఎస్కేయూ ఉపకులపతి రాజీనామా 
 

ఎస్‌.కె.విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే:  శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్‌ రాజీనామా చేశారు. 2015 జూన్‌ 23న ప్రభుత్వం ఆయనను నియమించింది. సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ఈయనకు సమీప బంధువు. ఇటీవల ఆయన స్వచ్ఛంద విరమణకు దరఖాస్తు చేయడంతో ఆయనతో కలిసి నడిచే క్రమంలోనే తన పదవికి రాజీనామా చేశారు. 2018 జూన్‌ 22 వరకు ఆయన పదవీ కాలం ఉంది. రాజీనామా పత్రాన్ని ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు, ఉన్నత విద్య కార్యదర్శికి అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు అందులో పేర్కొన్నారు. జేడీ లక్ష్మీనారాయణ భవిష్యత్తులో తీసుకొనే నిర్ణయాలకు తన వంతు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుల సూచన మేరకు రాజీనామా చేసినట్లు రాజగోపాల్‌ చెప్పారు.

atp-top2a.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...