Jump to content

వెంకీ సీన్ లో కూడా పవన్ ‘అదో టైపు’ యాక్టింగే!


ntr_king

Recommended Posts

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్ళు తెరవాల్సిన ఆసన్నమైనట్లుగా కనపడుతోంది. తానేం చేసిన సినీ ప్రేక్షకులు, అభిమానులు చూసేస్తారని భ్రమలో ఉంటే గనుక, అది తప్పని ఇప్పటికే “అజ్ఞాతవాసి” నిరూపించింది, నిరూపిస్తోంది కూడా! ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి మొదలైన టాక్ తో భయపడిన చిత్ర యూనిట్, ప్లాన్ బిలో భాగంగా విక్టరీ వెంకటేష్ రోల్ ను కలిపారు. అయితే ఈ ‘ప్లాన్ బి’ కూడా దారుణంగా బెడిసి కొట్టిందని, సదరు సన్నివేశం చూసిన వారంతా మండిపడుతున్నారు. త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్ లతో ఉన్న స్నేహంతో వెంకటేష్ ఈ సన్నివేశంలో నటించి ఉండవచ్చు గానీ, ఇటు కధకు గానీ, లేదంటే సినిమాకు గానీ ఏ విధంగానూ దోహదం లేని సన్నివేశంగా ప్రేక్షకులు తేల్చేస్తున్నారు. కనీసం ఈ సీన్ అయినా బాగోకపోదా అంటూ వెళ్ళిన ప్రేక్షకులకు, మరోసారి పవన్ కళ్యాణ్ ‘అదో టైపు’ నటనతో విరక్తి కలిగించారు. ఈ సినిమాలో 50 శాతంకు పైగా సన్నివేశాలలో తన ‘అదో టైపు’ నటవిశ్వరూపాన్ని ప్రదర్శించిన పవన్, తన స్నేహితుడు వెంకటేష్ తో చేసిన సన్నివేశంలో కూడా అదే తరహా నటనను చూపించడంతో అభిమానులు మరోసారి త్రివిక్రమ్, పవన్ లపై మండిపడుతున్నారు. ఇంతోటి సన్నివేశాలను మళ్ళీ సినిమాకు జోడించడం ఎందుకు? ఈ ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ ఏదో సరికొత్తగా ఉంటుందని భావిస్తే… పవన్ మరోసారి తన హావభావాలతో పిచ్చెక్కించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ ను ఒక టైపు యాక్టర్ గా విమర్శకులు మరియు ప్రత్యర్ధి హీరోల అభిమానులు కీర్తిస్తుండగా, వారికి మరింత అవకాశాలను కల్పించే విధంగా పవన్ సన్నివేశాలు జోడించడం విస్తుగోలిపే అంశం. ఈ సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ తో నిజానికి ఈ సన్నివేశాలు జోడించకపోయి ఉంటే త్రివిక్రమ్ పై కాసింత గౌరవం ఉండేదేమో! కానీ రిజల్ట్ తెలిసిన తర్వాత కూడా అదే తరహా సీన్స్ ను జోడించడం అంటే రిపీట్ ఆడియన్స్ కు మరింత మంట పెట్టడమే కదా!
 

Link to comment
Share on other sites

7 minutes ago, vinayak said:

TRIVIKRAM edo plan B ready chesadu anta

Mottam cinema 4 hours vachindi anta,Edit sarigga cheyyaledu anta,migtha mukkalu evo unnayi kaluputadu antaaaaa:D

Ippati daaka 3v ne dobbutunnaru, ika full version este, whole unit, Prod. and vaalla families ni kuda vestukuntaru ani cheppandi :P

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...