Jump to content

Special Focus on Industrial Sector by AP


APDevFreak

Recommended Posts

CBN srama ni ye rakama ga naakistunnaro chudandi...

మల్లవల్లికి బై..బై!
01-01-2018 02:12:35
 
636503695539269954.jpg
  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన లేనట్టే
  • వెనుదిరుగుతున్న హైదరాబాద్‌ పారిశ్రామికవేత్తలు
  • పరిశ్రమల స్థాపనకు 450 ఎంఎస్‌ఎంఈల ఒప్పందం
  • రెండేళ్లుగా ఎంఎస్‌ఎంఈలకు జరగని భూకేటాయింపులు
అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మల్లవల్లి ఇన్నోవేటివ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో పరిశ్రమల స్థాపన ఇప్పట్లో కార్యరూపం దాల్చేలా లేదు. ఇక్కడ చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ ఎంఈ)లను ఏర్పాటు చేసేందుకు ముంకొచ్చిన హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు పునరాలోచనలో పడ్డారు. అధికారుల తీరుతో విసిగి వేసారిన వీరు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
 
విశాఖలో 2016, 2017లో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుల్లో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నిర్వహిస్తున్న పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వారిలో 425 మంది పరిశ్రమల శాఖ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థలతో మల్లవల్లి పారిశ్రామిక పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారు.
 
 
ఒప్పందాలు చేసుకుని రెండేళ్లు గడుస్తున్నా భూకేటాయింపులు జరగకపోవడంతో విసుగు చెంది, పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలన్న యోచనకు వారు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని సీఎం చంద్రబాబు దేశవిదేశాల్లోని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
 
ఆయన పిలుపునకు స్పందించి హైదరాబాద్‌కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. 450 సూక్ష్మ, చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చారు. తమకు భూమి కేటాయిస్తే తక్షణమే కార్యకలాపాలను ప్రారంభిస్తామని, రూ.1100 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని చెప్పారు. వాస్తవానికి ఈ ఒప్పందాల కాలపరిమితి ఏడాది మాత్రమే. ఈలోగానే పరిశ్రమలను స్థాపించడం.. కార్యకలాపాలను చేపట్టడం జరిగిపోవాలి. కానీ అలా జరగలేదు.
 
 
పరిశ్రమల యాజమాన్యాలు మల్లవల్లి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌, నవ్యాంధ్రా ఇండస్ట్రియల్‌ ఆసోసియేషన్‌, స్వర్ణాంధ్ర ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌, మల్లవల్లి స్మాల్‌ అండ్‌ మీడియం ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌ పేరిట సంఘాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ అసోసియేషన్ల పరిధిలోని పారిశ్రామికవేత్తలకు మల్లవల్లి ఇన్నోవేటివ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భూములు కేటాయించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ)కు పరిశ్రమల శాఖ అప్పగించింది. మల్లవల్లిలో ఎకరాకు రూ.16.50 లక్షల చొప్పున ధరను నిర్ణయించి కేటాయించాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. అప్పటి నుంచే పారిశ్రామికవేత్తలకు కష్టాలు మొదలయ్యాయి.
 
 
అప్పటిదాకా ఎకరా రూ.36 నుంచి 42 లక్షల దాకా ఉన్న భూముల ధరలు అమాంతం తగ్గడంతో డిమాండ్‌ బాగా పెరిగింది. గత రెండేళ్లుగా తమ కార్ల టైర్లు అరిగిపోయేలా హైదరాబాద్‌ నుంచి అమరావతికి.. అమరావతి నుంచి హైదరాబాద్‌కు ఎంఎస్ ఎంఈలు తిరిగారు. వీరికి 133 ఎకరాలను మాత్రమే కేటాయిస్తామని ఏపీఐఐసీ తొలుత చెప్పింది. తాజాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. ఒక్కో సంస్థకు 500 గజాలు మాత్రమే ఇస్తామని చెబుతోంది. పరిస్థితిని మంత్రి ఎన్‌.అమర్నాథ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇక తిరిగే ఓపిక తమకు లేదంటూ హైదరాబాద్‌ శివారు ప్రాంత ఎంఎ్‌సఎంఈలు భావించి, మల్లవల్లి ఆలోచనకు గుడ్‌బై చెప్పాలన్న నిర్ణయానికి వచ్చాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...