Jump to content

AP Real Time Governance Center


sonykongara

Recommended Posts

ఆర్టీజీ.. ఓ అద్భుతం
23-06-2018 03:23:29
 
  • ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ప్రశంసలు
అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కారం నుంచి ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ వరకు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్టీజీ) అద్భుతంగా పనిచేస్తోందంటూ ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపించారు. సచివాలయంలోని ఆర్టీజీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులు అడ్రియన్‌ ఫోజార్డ్‌, తనూజ్‌ మాథూర్‌ సందర్శించారు. దీని పనితీరును ఆర్టీజీ సీఈవో ఎ.బాబు వారికి వివరించారు. ప్రజాసాధికార సర్వేతో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విస్తృత సమాచారం(గోల్డెన్‌ డేటా) సేకరించామని, దీని ఆధారంగానే వివిధ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, పథకాల అమలు జరుగుతోందని తెలిపారు.
 
24 గంటల కరెంట్‌, ఇంటింటికీ గ్యాస్‌, రాష్ట్రమంతా రోడ్లు, నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటివి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. ఫైబర్‌ నెట్‌ ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఇంటింటికీ ఇంటర్నెట్‌, డీటీహెచ్‌, టెలిఫోన్‌ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 3 లక్షల గృహాలకు కనెక్షన్లు ఇచ్చామని, 24 వేల కిలోమీటర్లు కేబుల్స్‌ వేయడం ద్వారా రాష్ట్రమంతటా ఫైబర్‌నెట్‌ సేవలు అందించనున్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా 74 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆర్టీజీ సెంటర్లు ఏర్పాటు చేసి సేవలు విస్తృతం చేయనున్నట్లు వివరించారు. ఇన్సిడెంట్‌ మానిటరింగ్‌ ద్వారా రాష్ట్రంలో జరిగే అనూహ్య సంఘటనలను గమనిస్తూ అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం ద్వారా నష్టనివారణ చర్యలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. వాతావరణశాఖ సహకారంతో వరదలు, పిడుగుల సమాచారాన్ని ప్రజలను అందజేసి అప్రమత్తం చేయడంలో ఆర్టీజీ కీలకపాత్ర వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా రియల్‌ టైమ్‌గవర్నెన్స్‌ అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల ప్రభుత్వ హైస్కూళ్లలో నిర్వహిస్తున్న వర్చువల్‌ క్లాస్‌రూములు, ప్రజల విజ్ఞప్తి మేరకు రాష్ట్రవ్యాప్తంగా రోజూ నాలుగు నుంచి 5వేల ఇళ్లలో నిర్వహిస్తున్న లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌.. వంటి వివరాలు తెలుసుకుని ప్రపంచబ్యాక్‌ ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై వారు స్పందిస్తూ.. కేవలం డేటా ఆధారంగా చేసుకుని ఆర్టీజీ అందిస్తున్న సేవలు నిరుపమానమని, ఈ తరహా పాలన అమలుచేసే అంశాన్ని తాము కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...
రియల్‌ టైం గవర్నెన్స్‌తో పరిపాలన పారదర్శకం!
11-08-2018 07:29:57
 
636695693969765118.jpg
  • ప్రజల అభిప్రాయాలను సేకరించి సీఎం డ్యాష్‌బోర్డులో నమోదు
  • గ్రామదర్శినిలో సమగ్ర సమాచారం చరవాణి యాప్‌లో నిక్షిప్తం
గుంటూరు: ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల్లో రియల్‌ టైం గవర్నెన్స్‌ సిస్టమ్‌(ఆర్‌టీజీఎస్‌) సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. గతంలో ఏ సమాచారం కావాలన్నా ఫైళ్లు తిరగేయడం, కంప్యూటర్లు ఓపెన్‌ చేసి ఆ డేటా ఎక్కడుందా అని శోధించడం చేసేవారు. అలాంటిది ఆర్‌టీజీఎస్‌ వినియోగం ప్రారంభంతో నేడు సెల్‌ఫోన్‌లో గ్రామస్థాయిలో ఏమి జరుగుతుందో ఇట్టే తెలిసిపోయే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వచ్చేవారం నుంచి గ్రామదర్శినికి వెళ్లనున్న నోడల్‌ అధికారులకు ఇప్పటికే మొబైల్‌యాప్‌ని డౌన్‌లోడింగ్‌ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే గురు, శుక్రవారాల్లో అధికారులు ఏ గ్రామాల దర్శనకు వెళ్లబోతున్నారో యాప్‌లో పేర్కొనాల్సిందిగా ఇప్పటికే ఎస్‌ఎంఎస్‌, నోటిఫికేషన్‌ అలర్టులు రావడం ప్రారంభించాయి.
 
పెన్షన్లు, రేషన్‌కార్డుల పంపిణీపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా పెన్షన్ల విషయంలో ప్రతీ నెలా పెద్దమొత్తంలో నగదు పంపిణీ చేస్తున్నా ఆశించిన సంతృప్తి ప్రజల నుంచి రావడం లేదు. దీనికి ఇటీవలే 1100 పరిష్కార వేదిక కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా పెన్షన్‌ డిస్‌బర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ల తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకటికి రెండు, మూడుసార్లు తిప్పించుకొంటున్నారని ఫిర్యాదు చేశారు. ఇదేవిధంగా జిల్లాలోని పలు గ్రామాల్లో రేషన్‌షాపులు సమ యానికి తెరవడం లేదని, నాసిరకమైన సరుకులు పంపిణీ చేస్తున్నారని, తూకంలో వ్యత్యాసం ఉంటోం దని ఫిర్యాదు చేశారు. ఇలా ప్రజలు తమ అభిప్రా యాలను కాల్‌ సెంటర్‌ ఫోన్‌కాల్స్‌కు తెలియ జేయడంతో వాటిని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. ఈ సమాచారం గ్రామదర్శినికి వెళ్లబోతున్న నోడల్‌ అధికారులకు అందుబాటులో ఉంచారు.
 
 
గుంటూరు జిల్లాలో 4 లక్షల 50 వేల 88 మంది పెన్షన్‌ పొందుతున్నా సంతృప్తిశాతం 50 నుంచి 60 మధ్యనే ఉంటోంది. ప్రత్యక్షంగా నగదు బదిలీ జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సంతృప్తి రాకపోతుండటంపై సీఎం చంద్రబాబు సీరి యస్‌గా ఉన్నారు. దీనిపై ఇప్పటికే నోడల్‌ ఆఫీసర్లకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ల పంపిణీలో లోపాలన్నింటిని సరిదిద్దాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండే అధికారినే డిస్‌ బర్స్‌మెంట్‌ అధికారిగా నియమించాలని ఆదేశించారు. పెన్షన్‌ తీసుకోవడానికి వచ్చిన వారు అరగంటకు మించి అక్కడ వేచి ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. రేషన్‌ పంపిణీలోనూ లోపాలను గుర్తిం చాలని ఆదేశించారు. నోడల్‌ ఆఫీసర్లు గ్రామదర్శిని యాప్‌లో లాగిన్‌ అయి సంబంధిత గ్రామంలో ప్రజల నుంచి అందిన ప్రతీ ఫిర్యాదుని పరిశీలించాలని, దీంతో కచ్చితంగా సంతృప్తి శాతం మెరుగుపడుతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
ఆర్టీజీఎస్‌కు హిటాచీ అవార్డులు
28ap-state8a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రియల్‌ టైం గవర్నెర్స్‌ సొసైటీ(ఆర్టీజీఎస్‌)కి హిటాచీ సంస్థ ఇచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్‌ అండ్‌ పీపుల్స్‌ ఛాయిస్‌, జ్యూరీ అవార్డులు దక్కాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుని ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డులు ఇచ్చినట్లు ఆర్టీజీఎస్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రజల ఫిర్యాదులు, సమస్యలను సులభంగా పరిష్కరించడంతో పాటు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల ప్రగతిని పర్యవేక్షిస్తోందని ఆర్టీజీఎస్‌కు హిటాచీ సంస్థ కితాబిచ్చింది. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ప్రత్యక్ష పర్యవేక్షణతో పాటు వాటిని పరిష్కరిస్తోందని పేర్కొంది. ప్రజలే ముందు(పీపుల్స్‌ ఫస్ట్‌) లక్ష్యంగా ఆర్టీజీఎస్‌ మెరుగైన సేవలు అందిస్తోందని ప్రశంసించింది. 360 డిగ్రీల అప్రోచ్‌తో పనిచేస్తూ మెరుగైన సేవలు అందించడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తోందంది. వాతావరణంలో మార్పులను ముందస్తుగా పసిగట్టే సాంకేతికతో సేవలు అందిస్తోందని వివరించింది. వివిధ మార్గాల ద్వారా సేకరించిన బిగ్‌ డేటాతో పారదర్శకతతో అనువైన నిర్ణయాలు తీసుకోవడం సులభంగా మారిందని అభిప్రాయపడింది. అమెరికాలోని శాన్‌డిగోలో హిటాచీ నెక్స్ట్‌-2018 అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఆర్టీజీఎస్‌ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌, సీఈవో ఏ.బాబు ఈ అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో ఆర్టీజీఎస్‌ సలహాదారు హరిప్రసాద్‌ కూడా ఉన్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
ఆర్టీజీ.. అవునండీ!
25-11-2018 02:57:22
 
636787114403231816.jpg
  • అలా ఫోన్‌ చేస్తే ఇలా స్పందన
  • అవినీతి నుంచి తితలీ దాకా
  • ప్రతి ఘట్టంలోనూ చురుకైన పాత్ర
  •  క్షేత్ర వాస్తవాలు ప్రభుత్వం చేతికి
  • రేపటితో ఏడాది ప్రస్థానం పూర్తి
  • ఇక జిల్లాల్లోనూ ఆర్టీజీ సెంటర్లు
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): తుఫాన్లప్పుడు సాధారణంగా టెలిఫోన్‌ టవర్లు, సిగ్నల్స్‌ దెబ్బతింటాయి. రోజుల తరబడి ఫోన్లు పనిచేయవు. రెండు జిల్లాల్లో తితలీ తుఫాను బీభత్సం సృష్టించిన.. ఒక రోజు వ్యవధిలోనే ఫోన్‌ కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించగలిగారు. ఈ అద్భుతం రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌తోనే (ఆర్టీజీ) సాధ్యమయింది. ఈ సెంటర్‌ నుంచి నేరుగా ఎయిర్‌టెల్‌ అధినేతకు చంద్రబాబుతో ఫోన్‌ చేయించి ఫోన్‌ సిగ్నల్స్‌ అప్‌ చేయించడంతో పరిస్థితి మెరుగయింది. తుఫాను బాధితులకు సాయం అందించడం అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. ఈ క్రమంలో ఒక్క రూపాయి కూడా దారిమళ్లకుండా చంద్రబాబు ప్రభుత్వం చేయగలిగింది. బాధితులకు పరిహారాన్ని బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయించి...వారి బ్యాంకు ఖాతాల వివరాలు ప్రభుత్వం సేకరించింది. అయితే అందులో పలు ఖాతాలకు సంబంధించి సమాచారం తప్పుగా నమోదైంది. ఆధార్‌ నంబర్‌ సాయంతో...వారి కచ్చితమైన ఖాతా నంబర్లు గుర్తించి కేవలం అర్హులకే పరిహారం ఇవ్వగలిగారు. ఇంత పక్కాగా వడపోయడం ఆర్టీజీతో సాధ్యమయింది. ఇలా ప్రభుత్వానికి అన్ని విషయాల్లో కన్ను, ముక్కు, చెవులుగా వ్యవహరించిన ఆర్టీజీ సోమవారంతో ఏడాది కాలం పూర్తిచేసుకొంది.
 
ఒక ఏడాది కాలంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌, 1100 కాల్‌ సెంటర్ల గురించి తెలియని వారు రాష్ట్రంలో లేరనే చెప్పాలి. కృష్ణా పుష్కరాల సమయంలో సీఎం చంద్రబాబు ఆలోచనల నుంచి ఆవిర్బవించిన వ్యవస్థ ఇది. ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి నేరుగా చెప్పుకోవడానికి ఒక వ్యవస్థ ఉందనే ధీమాను కల్పించింది. ఏడాదికాలంలో పలు విజయాలు సాధించిన ఆర్టీజీ దేశ, విదేశాల్లోని పలువురు ప్రశంసలు అందుకుంది. రాష్ట్రపతి నుంచి పొరుగు రాష్ట్రాల సీఎంల వరకు ఎవరొచ్చినా ఆర్టీజీ కేంద్రాన్ని సందర్శించి కితాబిచ్చినవారే. ఇప్పుడు అన్ని జిల్లాల్లోను ఆర్టీజీ కేంద్రాలను పెట్టనున్నారు. డిసెంబరు నాటికల్లా జిల్లా ఆర్టీజీ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
 
సంబంధాల వారధి
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 156 ప్రభుత్వ పథకాలపై ప్రజాభిప్రాయం ఏంటన్నది నిరంతరం ఆర్టీజీ సేకరిస్తుంది. ప్రతి పథకంపై ఎంత సంతృప్తి ఉంది, అసంతృప్తి ఎంత? ఎందుకుందనే వివరాలు చెప్తుంది. తద్వారా ఆయా పథకాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకు రేషన్‌ విషయంలో ఎంత సంతృప్తి ఉందన్న అంశంపై సర్వే చేసింది. ఇందులో 25శాతం మంది డీలర్లపై ప్రజల్లో అసంతృప్తి ఉందని తేలింది. ఈ సమాచారాన్ని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి రాజశేఖర్‌కు ఇచ్చారు. ఆయన సదరు 25 శాతం మంది డీలర్లను పిలిచి ప్రత్యేకంగా ఒక సదస్సు పెట్టారు. వారిని చైతన్యం చేశారు. ఆ తర్వాత ఆయా డీలర్ల పరిధిలోను సంతృప్తిశాతం పెరిగింది.
 
మరోవైపు రేషన్‌లో అక్రమాలు అరికట్టడం ద్వారా సుమారు రూ.1600కోట్లు ఆదా అయింది. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్‌ భరోసా ఫించన్లు తదితర కీలక పథకాలకు సాంకేతిక సహకారం ఆర్టీజీ అందించింది. ఇటీవల ప్రారంభించిన యువనేస్తం పథకంలో లక్షలమంది ఉన్నా..ఎక్కడా ఇబ్బంది లేకుండా సాంకేతిక తోడ్పాటు అందించడంలో తన పాత్ర పోషించింది. ఆర్టీజీలో భాగంగా ఉన్న 1100కాల్‌ సెంటర్‌లో రెండువేలమంది సిబ్బంది ఉన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, సమాచార సేకరణకు రోజుకు 30వేల కాల్స్‌ చేసే సామర్ధ్యం ఈ కాల్‌సెంటర్‌కు ఉంది. అదేవిధంగా 60వేల కాల్స్‌ స్వీకరిస్తారు. ఇప్పటివరకు అందిన ఫిర్యాదులు 1.69కోట్లు. పరిష్కరించినవి 73లక్షలు.
 
 సర్వే.. ఓ సాహసమే..
‘‘ఆర్టీజీ సర్వే శాతాలపై చాలామందికి అపనమ్మకాలున్నాయి. అయితే ఈ అభిప్రాయ సేకరణ సాహసంతో కూడింది. ఒక పథకం, ఒక సమస్యపై ప్రజాభిప్రాయం అడగాలంటే...దాన్ని క్షేత్రస్థాయిలో బాగా అమలుచేస్తేనే అడగగలం. ఒకవేళ తొలుత అసంతృప్తి వస్తే...ఆ తర్వాత అయినా దాన్ని ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరిస్తేనే అడగగలం. లేదంటే ప్రజలు విమర్శిస్తారు. అదే సమయంలో పనులు చేయకుండా, పథకాలు సక్రమంగా అమలుకాకుండా ఉన్నా...సంతృప్తిగానే ఉన్నాం అని చెప్పేంత అమాయకులు ప్రజలు కాదు. ఏడాదిక్రితం వందమందికి ఫోన్లు చేస్తే...9శాతం మంది మాత్రమే సమాధానం చెప్పేవారు. ఇప్పుడది 30శాతానికి చేరింది. ఆర్టీజీ నుంచి మేం సమాచారం, సాంకేతిక సహకారం మాత్రమే అందిస్తాం. ఆ సమాచారం ఆధారంగా పనిచేయాల్సింది మాత్రం సంబంధిత శాఖల ఉద్యోగులు. మేమిచ్చే సమాచారం ఉపయోగించుకున్నవాళ్లకు బాగానే ఉపయోగపడుతుంది. పలు విషయాల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఇది మార్గమైంది’’
- అహ్మద్‌బాబు, ఆర్టీజీ సీఈవో
Link to comment
Share on other sites

పాలనా సారథి.. పరిష్కార వారధి 
సమస్య ఏదైనా తక్షణ స్పందన లక్ష్యం 
ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరణ 
ఏడాదిలోనే అత్యంత కీలకంగా మారిన ఆర్టీజీఎస్‌ 
 ఈనాడు, అమరావతి 
24ap-story1b.jpg

ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో తెలుసుకుంటూ... సత్వరం పరిష్కరించేలా యంత్రాంగాన్ని సదా అప్రమత్తం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రియల్‌ టైం గవర్నెన్స్‌ వ్యవస్థ సోమవారానికి ఏడాది పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యమిస్తోందీ, ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఎక్కువగా ఆధారపడుతోందీ దీనిపైనే. విపత్తు సమయాల్లో ప్రజల్ని.. సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో కూడా దీనిది కీలక భూమిక. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, రిలయన్స్‌ సంస్థల అధినేత ముకేశ్‌ అంబానీ, హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌... ఇలా ప్రముఖులు ఎవరొచ్చినా ఆర్టీజీ కేంద్రం సందర్శన కూడా వారి పర్యటనలో భాగంగా ఉండడం ఇది ఎంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకుందో చెప్పకనే తెలియజెప్పే అంశం. జపాన్‌, అమెరికా, ఎస్తోనియా, జర్మనీ, భూటాన్‌, నేపాల్‌, బ్రిటన్‌, సింగపూర్‌ వంటి దేశాల ప్రతినిధులు ఆర్టీజీఎస్‌ను సందర్శించి ప్రశంసించారు. దీనికి ప్రతిష్ఠాత్మకమైన హిటాచీ పీపుల్‌ చాయిస్‌ పురస్కారం లభించింది.

ఆర్టీజీఎస్‌లో రెండు విభాగాలున్నాయి. మొదటిది పరిష్కార వేదిక. 
* ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 1100 కాల్‌సెంటర్‌ను పరిష్కార వేదిక అని పిలుస్తున్నారు. ఇది ఇబ్రహీంపట్నం వద్ద ఉంది. 2 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 
* 27 ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న 156 పథకాల్ని పరిష్కార వేదిక నిత్యం పర్యవేక్షిస్తూ, వాటి అమలు తీరుపై ప్రజాభిప్రాయం సేకరిస్తుంది. ప్రజల సంతృప్త స్థాయిని తెలుకుంటుంది. 
* కాల్‌ సెంటర్‌ నుంచి రోజుకి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా 20 నుంచి 25 లక్షల మందికి, సిబ్బంది ద్వారా 30 వేల మందికి కాల్స్‌ చేసే అవకాశం ఉంది. 60 వేల కాల్స్‌ స్వీకరించే సదుపాయం దీని సొంతం. 
* ఏడాది కాలంలో 51.12 కోట్ల ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, సిబ్బంది ద్వారా 1.43 కోట్ల కాల్స్‌ చేశారు. 
* ఇంతవరకు అందిన ఫిర్యాదులు: 1,69,76,311 
* పరిష్కరించినవి: 73,17,238 
* పరిశీలన పూర్తయినవి: 72,34,605 
* పరిశీలించాల్సినవి: 5,48,552 
* తిరస్కరించినవి: 18,75,908 
 పీపుల్‌ఫస్ట్‌, సీఎం కనెక్ట్‌ ఖైజాలా యాప్‌, ఎన్‌సీబీఎన్‌ మొబైల్‌ యాప్‌ వంటి... యాప్‌ల ద్వారాను ఫిర్యాదులు స్వీకరిస్తోంది.


ఆర్టీజీఎస్‌ రాష్ట్ర కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం.. 
24ap-story1a.jpg

ది సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనం ఉన్న అంతస్తులో ఉంది. 
* 62 అడుగుల పొడవైన వీడియోవాల్‌ ఉంది. 
* రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ‘ఇన్సిడెంట్‌ మానిటరింగ్‌, అలర్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ ద్వారా అక్కడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది. 
* రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలతో ఈ కేంద్రం అనుసంధానమై ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని ఇక్కడి నుంచి నిత్యం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంటారు. 
* అవేర్‌ (ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌) నిత్యం వాతావరణంలో మార్పులు పసిగడుతుంది. ప్రజల్ని, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. ఇటీవల తిత్లీ తుపాను సమాచార విషయంలో ఆర్టీజీఎస్‌ క్రియాశీలక పాత్ర పోషించింది.


ఆర్టీజీ సాంకేతిక సదుపాయం మాత్రమే

 ఏడాది కాలంలో ఆర్టీజీ ద్వారా అనేక విజయాలు సాధించాం. అన్ని సమస్యల్నీ ఆర్టీజీనే పరిష్కరించాలన్న ఆపోహ మా అధికారుల్లోనూ చాలా మందికి ఉంది. నిజానికి ఆర్టీజీఎస్‌ నేరుగా సమస్యల్ని పరిష్కరించదు. ఆర్టీజీఎస్‌ ఇచ్చిన సమాచారంతో క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఆయా శాఖల సిబ్బంది, అధికారులదే.

* బాబు.ఎ, సీఈఓ
Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఆర్టీజీఎస్‌.. అదరహో! 

 

తుపానుపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం 
కదలికలపై రైతులు, ప్రజలకు సూచనలు

17ap-story1a.jpg

పెథాయ్‌ తుపాను గమనాన్ని వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రం కచ్చితంగా అంచనా వేసింది. సుమారు 48 గంటలకు ముందుగా ఈ తుపాను ఇలా తీరం దాటుతుందని(పచ్చగీత మార్గంలో) అంచనా వేసింది. తీరం దాటడానికి ఒక రోజు ముందు(ఎరుపు గీత మార్గం) దాని గమనం ఇలా ఉంటుందని స్పష్టం చేసింది. చివరకు సోమవారం ఇదే మార్గంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ-యానాం మధ్యలో పెథాయ్‌ తుపాను తీరం దాటింది.

ఆర్టీజీఎస్‌... రియల్‌ టైం గవర్నెన్స్‌.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇది... ప్రభుత్వం ప్రతి పనిలోనూ దీనినే ఉపయోగించుకుంటోంది. సంక్షేమ ఫలాలు అందరికీ చేరుతున్నాయా? లేదా? ఫైళ్లు వేగంగా కదులుతున్నాయా? లేదా? ఇలా అన్ని పనుల్లోనూ ఎంతో కీలకంగా ఉన్న ఆర్టీజీఎస్‌ ఇప్పుడు తుపాను నాడినీ పట్టేసింది. పెథాయ్‌ అల్పపీడనం నుంచి పెను తుపానుగా మారి తీరం దాటేదాకా ఆర్టీజీఎస్‌ రాత్రింబవళ్లు సమీక్షించింది. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు అందిస్తూ అప్రమత్తం చేసింది. కోత యంత్రాలు, టార్పాలిన్లు కావాలని 1100 కాల్‌సెంటర్‌కు రైతుల నుంచి ఫోన్లు రావడంతో వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి గుంటూరుకు 13, కృష్ణాకు 20 యంత్రాలు పంపేలా చర్యలు తీసుకుంది. సహాయ చర్యల్లో భాగంగా ఆది, సోమవారాల్లో 10వేల టార్పాలిన్లు అందించగా.. మంగళవారం మరో 2వేలు ఇవ్వనున్నారు.

తుపాను కదలికలపై ఆర్టీజీ అంచనాలు 
ఇస్రోతో కుదిరిన ఒప్పందం మేరకు ఆర్టీజీఎస్‌లోని అవేర్‌ (ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌ ఫోర్‌ క్యాస్టింగ్‌) విభాగం తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అంచనాలు తయారు చేసింది. 
* 7న అల్పపీడనం ఏర్పడుతుందని సమాచారం. 
* 8న తుపానుగా మారే అవకాశం గుర్తింపు. 
* 11న మధ్య కోస్తాపై ప్రభావం ఉంటుందని సూచనలు.. సముద్రంలో అలల ఉద్థృతి పెరుగుతుందని హెచ్చరికలు. 
* 12న తుపాను అప్రమత్తతపై ఐవీఆర్‌ఎస్‌ ద్వారా 50వేల మంది మత్స్యకారులకు సమాచారం. 
* 14న ప్రభావిత ప్రాంతాల్లో కోత కొచ్చిన పంటలపై రైతులకు సూచనలు. 
* 14న తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలపై ప్రభావం ఉంటుందని అంచనా. 
* 16న అమలాపురం- తుని మధ్యలో తీరం దాటుతుందని అంచనా. 
* 17న యానాం, తుని మధ్య తీరం దాటుతుందని అంచనా. 
* 17 మధ్యాహ్నం.. యానాం- కాకినాడ మధ్య మధ్యాహ్నం 2  నుంచి 4 గంటల మధ్య తీరం దాటుతుందని సూచన. 
* సూచనలకు అనుగుణంగా 12.10 గంటలకు కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. 
* 3.10కి కాకినాడ- యానాం మధ్య తీరం దాటింది

ము³ందు నుంచి సన్నద్ధం చేస్తూ... 
* 1100 కాల్‌ సెంటర్‌ కీలకంగా వ్యవహరించింది. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వివిధ వర్గాలకు తుపాను హెచ్చరికలు పంపింది. 
* రవాణాశాఖ ద్వారా ప్రభావిత ప్రాంతాల్లోని వాహనాల నంబర్లు తీసుకుని యజమానులకు ఫోన్‌ చేసి బయట తిరగొద్దని సమాచారం. 
* గృహ నిర్మాణశాఖ నుంచి మట్టి ఇళ్లు, పూరిళ్ల వారికి ఫోన్‌ చేసి పునరావాస కేంద్రాలకు తరలాలని సూచించింది. 
* విద్యుత్తుశాఖను అప్రమత్తం చేసి.. సరఫరా నిలిపివేయించింది. 
* నేలకూలిన చెట్ల సమాచారాన్ని అందిస్తూ వెంటనే తొలగించేలా చేసింది.

తీరం దాటే సమయంలో.. 
* తీరం దాటే సమయంలో జాతీయ రహదారులు, రాష్ట్ర, గ్రామీణ రహదారులపై ట్రాఫిక్‌ లేకుండా ముందస్తు సూచన. 
* ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచన. 
* పునరావాస కేంద్రాల్లో ఉచిత ఆహారం అందుతుందో లేదో తనిఖీ.

ఆపదలో ఉన్న వారికి... 
* తూర్పుగోదావరి జిల్లా కొత్తపాలెంలో ఆరుగురు మత్స్యకారులతో ఉన్న పడవలో డీజిల్‌ అయిపోయింది. కోస్ట్‌గార్డు సిబ్బందితో మాట్లాడి వారితో మాట్లాడే ప్రయత్నం. 
* బీమిలి బీచ్‌లో  కొంతమంది ఫొటోలు దిగుతున్న దృశ్యాన్ని గుర్తించి  వారి వాహన నంబర్లు గుర్తించి పోలీసుల ద్వారా తరలింపు.

- ఈనాడు, అమరావతి

 

Link to comment
Share on other sites

ఆర్టీజీఎస్‌ ఎంతో ఆకట్టుకుంది

 

ట్విటర్‌లో భారత్‌లో నెదర్లాండ్స్‌ రాయబారి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్టీజీఎస్‌) తనను ఎంతగానో ఆకట్టుకుందని భారత్‌లో నెదర్లాండ్స్‌ రాయబారి మార్టెన్‌ వాన్‌ డెన్‌ బెర్గ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సంతోష రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజల నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాని ఆధారంగా పరిపాలన అందించడం తనకు ఎంతగానో నచ్చిందని వివరించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

N Chandrababu NaiduVerified account @ncbn 35m35 minutes ago

 
 

ఆర్టీజీఎస్ విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్న బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసలు ఎంతో సంతృప్తినిచ్చాయి. నేడు సచివాలయ సందర్శనకు వచ్చిన టోనీ ఆర్టీజీఎస్‌ వ్యవస్థ పనితీరుపై ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకోవడం చూస్తే మనం ఒక మంచిపని చేస్తే ప్రపంచమంతా తెలుస్తుందనిపించింది.

DwUsfgLX0AMMciE.jpg
DwUsfgOX0AEjJ6Y.jpg
DwUsfgPX4AQYKXY.jpg
DwUsfgNWwAIEQ8e.jpg
Link to comment
Share on other sites

I & PR Andhra Pradesh @IPR_AP 44m44 minutes ago

 
 

AndhraPradeshCM: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ భేటీ అయ్యారు. అనంతరం ఆర్టీజీఎస్‌ను సందర్శించారు. రియల్‌ టైం గవర్నెస్‌ పనితీరును పరిశీలించిన అనంతరం ఇటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని ప్రశంసించారు. #iprap

DwUp9LXW0AAtAX8.jpg
DwUp9LSXgAk4Xh8.jpg
DwUp9LUX4AALGuN.jpg
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...