Jump to content

Kakinada smart city


sonykongara

Recommended Posts

  • Replies 64
  • Created
  • Last Reply
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...
తూర్పున పర్యాటక శోభ 
eag-brk7a.jpg

సర్పవరం జంక్షన్‌, న్యూస్‌టుడే: జిల్లాను పర్యాటకానికి ముఖద్వారంగా తీర్చిదిద్దుతామని అనేక సందార్భల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. పర్యాటకాభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో రూ.69 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిని మంగళవారం తిరుపతి నుంచి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆన్‌లైన్‌లో ప్రారంభించనున్నారు. కాకినాడ గ్రామీణం మండలం సూర్యారావుపేటలోని ఎన్టీఆర్‌ బీచ్‌ పార్క్‌తో పాటు హోప్‌ ఐలాండ్‌, కోరింగ, పాశర్లపూడి, ఆదుర్రు, కోటిపల్లి, యానం ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేశారు. ఎన్టీఆర్‌ బీచ్‌ను రూ.46 కోట్లతో 50 ఎకరాల్లో తీర్చిదిద్దారు. వివిధ ప్రత్యేక ఏర్పాట్లతోపాటు, ఉద్యానాలను ఏర్పాటు చేశారు.ఆరు ప్రాంతాల్లో రూ.7 కోట్లతో వాణిజ్య సముదాయాలను నిర్మించారు. రూ.3.5 కోట్లతో లేజర్‌ షోను ఏర్పాటు చేస్తున్నారు.  నీ కోరింగ అభయారణ్యంలో రూ.8.46 కోట్లతో పర్యాటకుల సమాచార కేంద్రంలో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. నీ పాశర్లపూడిలో రూ.2.68 కోట్లతో టూరిస్ట్‌ టెర్మినల్‌, తదితర సౌకర్యాలు కల్పించారు. నీ ఆదుర్రులో రూ.5.08 కోట్లతో, యానాంలో రూ.57 లక్షలు, కోటిపల్లిలో 2.14 కోట్లతో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు.

Link to comment
Share on other sites

అందాల నగరం.. ఆకర్షణీయం
అందుబాటులోకి రానున్న కమాండ్‌ కంట్రోల్‌   కమ్యూనికేషన్‌ కేంద్రం
       నగరవాసులకు సులభతరం కానున్న సేవలు
eag-sty1a.jpg

నగరంలో ఏ చోటకు వెళ్లినా వైఫై సదుపాయం... ట్రాఫిక్‌ జామ్‌ సమస్య తలెత్తితే క్షణాల్లో పరిష్కరించేలా చర్యలు... అత్యవసర సమయాల్లో నగరవాసులను అప్రమత్తం చేసే మైకులు... కాలుష్య ఉద్గారాలను గుర్తించేందుకు సెన్సార్లు.. నగరంలో ఎటువంటి సమస్య తలెత్తినా అధికారుల దృష్టికి తెచ్చేలా ఫోన్లు... తదితర సేవలు కొద్ది రోజుల వ్యవధిలో కాకినాడ నగరంలో అందుబాటులోకి రానున్నాయి. ఆకర్షణీయ నగరాభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ సేవలు అందించేందుకు సిద్ధమైంది.

న్యూస్‌టుడే, కాకినాడ నగరం

కాకినాడను కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ఆకర్షణీయ నగరం(స్మార్ట్‌సిటీ)గా ఎంపిక చేసింది. ఆ దిశగా నగరానికి సౌకర్యాలు నెమ్మదిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆకర్షణీయ నగరాభివృద్ధి పనుల్లో భాగంగా రూ.94.89 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌(సీసీసీ) త్వరలో అందుబాటులోకి రానుంది.

15 విభాగాల పని ఓచోట
పౌర సేవల్లో భాగంగా 15 విభాగాల పనిని ఒకచోట నుంచే పర్యవేక్షించేందుకు ‘కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేశారు. రాజాట్యాంకు(కొళాయి చెరువు) ఆవరణలో కేంద్రాన్ని సిద్ధం చేశారు. ఆయా విభాగాల సేవలను పర్యవేక్షించేందుకు నగరం నలుమూలల్లో 600 కెమెరాలు.. 652 స్మార్ట్‌ లైట్లు... 110 సెన్సార్లు.. 12 స్మార్ట్‌ పోల్స్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా ‘లోరా టెక్నాలజీ’తో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్మార్ట్‌ పార్కింగ్‌ సదుపాయం
ఆకర్షణీయ అభివృద్ధిలో భాగంగా స్మార్ట్‌ పార్కింగ్‌ అందుబాటులోకి రానుంది. రెండు పెద్ద, వంద చిన్న స్మార్ట్‌ పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి చోటా సెన్సార్లుంటాయి. స్మార్ట్‌ఫోన్‌ సాయంతోనే వాహనం నిలిపేందుకు ముందుగానే స్థలాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే పార్కింగ్‌ రుసుము చెల్లించాలి. ఈ ప్రదేశాల్లో సిబ్బంది ఎవరు ఉండరు. కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ నుంచే పర్యవేక్షిస్తారు.

సీసీ కెమెరాల డేటా కేంద్రంలో నిక్షిప్తం
నగరంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చిత్రీకరించిన డేటాను కొన్నేళ్లపాటు నిక్షిప్తం(స్టోర్‌) చేసే సదుపాయం ఉంది. డేటా రికవరీ సెంటర్‌లో దీన్ని భద్రంగా ఉంచుతారు. సీసీ నిఘాలో ‘ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌’ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంది. వాహనానికి నంబరు ప్లేట్‌ అనుమానాస్పదంగా ఉన్నా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా.. సీసీ కెమెరాల్లో ఉన్న ఏఎన్‌పీఆర్‌ సిస్టమ్‌ సదరు వాహన నంబరు, దానిపై ఉన్న వ్యక్తిని స్పష్టంగా పసిగడుతుంది. వందల సంఖ్యలో ఉన్న వాహనాల్లో దేన్నైనా సరే జూమ్‌చేసి చూస్తే సదరు వాహన వివరాలు, దానిపై ఉన్న వ్యక్తులను గుర్తించవచ్చు. రెడ్‌లైట్‌ వయోలేషన్‌ చేసే వాహన చోదకులను గుర్తించేలా అయిదు ప్రధాన కూడళ్లలో ఏర్పాట్లు చేశారు. మరో నాలుగు ప్రధాన కూడళ్లలో అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

డిజిటల్‌ తెరలు
పిడుగులు, వర్షం తదితర సమాచారాన్ని కూడళ్లలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ తెరల ద్వారా తెలియజేస్తారు. నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి, నీటి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలు, విద్యుత్తు బిల్లుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీసీ డ్యాష్‌ బోర్డులో డిస్‌ప్లే చేస్తారు. తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి కూడా నగర ప్రజలు సేవల వివరాలు తెలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.

పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ
నగరంలో 14 పారిశుద్ధ్య సర్కిళ్ల పరిధిలో 850 మంది వరకూ కార్మికులు పనిచేస్తున్నారు. సిబ్బంది ఎక్కడ
పనిచేస్తున్నారు.. వాహనాలు ఏ ప్రాంతంలో తిరుగుతున్నాయి.. చెత్త ఎక్కడ పేరుకుపోతుంది... వంటివి కేంద్రం నుంచి పర్యవేక్షించవచ్చు. ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాల్లో 110 సెన్సార్లు ఏర్పాటు చేశారు. డంపింగ్‌యార్డుకు చెత్త తరలించే 50 వాహనాలకు ‘ఆటోమేటిక్‌ వెహికల్‌ లోకేటర్‌ సిస్టమ్‌’ను ఏర్పాటు చేశారు.

650 స్మార్ట్‌లైట్లు..
నగరంలో ప్రధాన కూడళ్లు, వీధుల్లో 650 స్మార్ట్‌ లైట్లు(దీపాలు) ఏర్పాటు చేశారు. ఇవి అత్యంత వెలుతురు ఇస్తాయి. సందర్భాన్ని అనుగుణంగా సీసీసీ నుంచే ఈ దీపాల వెలుగును పెంచుకోవచ్చు.. తగ్గించుకోవచ్చు. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. ఇంటిలిజెంట్‌ పేరుతో ఉన్న ఈ స్మార్ట్‌లైట్లకు సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. ట్రాఫిక్‌కు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటి కాంతిని తగ్గించుకోవచ్చు.

పౌర సేవల్లో కీలకపాత్ర
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన సీసీసీ వ్యవస్థ సాంకేతికత సాయంతో పౌరులకు సత్వర సేవలు అందిస్తుంది. ప్రజల రక్షణ, భద్రతలో ఈ సేవలు ప్రాధాన పాత్ర పోషిస్తాయి. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రత్యేక శ్రద్ధతో పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. తొందరలోనే సీసీసీ వినియోగంలోకి రానుంది.

-కె.రమేష్‌, కమిషనర్‌, నగరపాలక సంస్థ

ఒకచోట నుంచే పర్యవేక్షణ
నగరంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలుసుకునేందుకు ప్రధాన కూడళ్లు, వీధుల్లో 600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ పోలీసు వ్యవస్థ మాత్రమే ఉపయోగిస్తున్న ఈ సీసీ కెమెరాలను నగర పాలక, సేవల అమలు తీరును పర్యవేక్షించేందుకు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేసింది. ఈ సీసీ కెమెరాల ద్వారా నగరంలో ప్రధాన కూడళ్లల్లో ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు. ఆయా కూడళ్లలో వాహనాలు అడ్డుగా ఉన్నా తోపుడు బండ్లు, పశువులు ట్రాఫిక్‌కు అవరోధం కలిగించినా వెంటనే కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ నుంచే మైకుల ద్వారా సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ఇందుకు ప్రధాన కూడళ్లలో మైకులను ఏర్పాటు చేశారు.

స్మార్ట్‌ పోల్స్‌..
నగరంలో ‘లోరా టెక్నాలజీ’తో స్మార్ట్‌ పోల్స్‌ను ఏర్పాటు చేశారు. మొదటి సారిగా ఈ వ్యవస్థను ఫ్రాన్స్‌ రాజధాని ప్యారీస్‌లో ఏర్పాటు చేశారు. మన దేశంలో తొలిసారిగా ఈ వ్యవస్థను 2007లో జంషెడ్‌పూర్‌లో వినియోగంలోకి తెచ్చారు. రాష్ట్రంలో తొలిసారిగా కాకినాడలో దీన్ని అమలు చేస్తున్నారు. 15 మీటర్ల ఎత్తులో 12 చోట్ల ఈ స్మార్ట్‌ పోల్స్‌ను ఏర్పాటుచేశారు. వీటికి పర్యావరణ పరికరాలు, వైఫై సెన్సార్లను అమర్చారు. వీటి ద్వారా నగరంలో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వస్తుంది. కాలుష్య ఉద్గారాలను గుర్తించగలుగుతారు. పిడుగులు, వర్షం, తదితర విపత్తుల వివరాలను స్మార్ట్‌ పోల్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు. లోరా టెక్నాలజీ ద్వారా 20 కి.మీ. వరకూ సిగ్నల్స్‌ పనిచేస్తాయి. స్మార్ట్‌లైట్‌ సెన్సార్లను కూడా ఈ స్తంభాలకే ఏర్పాటు చేశారు. అత్యవసర మైక్‌లు, కాల్స్‌ బాక్స్‌లు, డిస్‌ప్లే బోర్డులు అన్నీ స్మార్ట్‌ పోల్స్‌ ఆధారంగానే పనిచేస్తాయి.

అత్యవసర కాల్‌ బాక్స్‌లు..
ప్రమాదకర పరిస్థితుల్లో 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం ఇస్తాం. ఒకవేళ ఆ నంబరు పనిచేయకపోతే ఇబ్బంది పడకతప్పదు. ఈ నేపథ్యంలో ఆకర్షణీయ నగరంలో అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా అత్యవసర కాల్‌ బాక్స్‌లను 25 చోట్ల ఏర్పాటు చేశారు. ఇవి సౌరశక్తి సాయంతో 24 గంటలూ పనిచేస్తాయి. బాక్స్‌పై ఉన్న రెడ్‌ బటన్‌ నొక్కగానే సీసీసీకి కాల్‌ వెళుతుంది. సీసీసీలో సిబ్బంది బాధితుడ్ని వీడియోలో చూస్తూనే వివరాలను నమోదు చేసుకుంటారు. వెంటనే అప్రమత్తమై ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకు చేరవేస్తారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...