Jump to content

Kakinada smart city


sonykongara

Recommended Posts

  • Replies 64
  • Created
  • Last Reply
తీర నగరి.. ఆకర్ష సిరి!
స్మార్ట్‌ వీధులు.. 22 చోట్ల ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌లు.. ఈట్‌ స్ట్రీట్‌..
రూ. వందల కోట్లతో ఆకర్షణీయ నగర అభివృద్ధికి ప్రణాళికలు
eag-top1a.jpg
రానున్న కాలంలో కాకినాడ రూపురేఖలు మారనున్నాయి. ఆకర్షణీయ నగరంగా మార్చేందుకు అధునాతన రీతిలో మౌలిక వసతుల కల్పనకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమైతే.. మరికొన్నింటకి శ్రీకారం చుట్టనున్నారు. ఇంకొన్ని కీలక ప్రాజెక్టులు ఆకృతుల తయారీ దశలో ఉన్నాయి. కొన్ని టెండర్ల దశకు చేరుకుంటున్నాయి. నిర్దేశిత గడువులోగా ఈ పనుల పూర్తికి కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కె.ఎస్‌.సి.సి.ఎల్‌) అధికారులు కలెక్టర్‌ పర్యవేక్షణలో కసరత్తు చేస్తున్నారు.
ఈనాడు, కాకినాడ
కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో రూ. 2,082.52 కోట్లతో స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనులకు ప్రణాళికలున్నాయి. ఇప్పటికే 22 పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగానే ఆహ్లాదకర వాతావరణంలో పునర్నిర్మించిన గాంధీ పార్కును ఈ మధ్యే ప్రారంభించారు.

వివేకానంద పార్కు ప్రారంభానికి ముస్తాబయింది. కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ పనులు దాదాపుగా కొలిక్కివచ్చాయి. కీలకమైన స్మార్ట్‌ వీధుల పనులతో పాటు మరికొన్నింటిపై అధికారులు దృష్టి సారించారు.

మరికొన్ని కీలక ప్రాజెక్టులు..
స్మార్ట్‌ సిటీలో భాగంగా కాకినాడలో మరికొన్ని కీలక ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నాయి. రూ.20 కోట్లతో గోదావరి కళాక్షేత్రం ఏర్పాటు చేయనున్నారు. రూ. 15కోట్లతో సైన్స్‌ సెంటర్‌, రూ. 50 కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, రూ. ఏడు కోట్లతో జగన్నాథపురం వద్ద బోట్ల తయారీ యార్డు, రూ. రెండు కోట్లతో నగర వాసులకు వివిధ రుచులు అందుబాటులో ఉండేలా ఈట్‌స్ట్రీట్‌ ఏర్పాటు చేయనున్నారు. రూ. రెండు కోట్లతో సౌర, ఎల్‌ఈడీ వీధి దీపాలు అందుబాటులోకి తేనున్నారు. స్థల సమస్య అధిగమిస్తే.. రూ.20 కోట్లుతో వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు ఏర్పాటుకు చిక్కులు వీడినట్లే.. రూ. 15 కోట్లతో విద్యుత్తు ఆధారిత రవాణా వ్యవస్థనూ అందుబాటులోకి తేనున్నారు.

త్వరగా అందుబాటులోకి..
కాకినాడ స్మార్ట్‌ సిటీలో నిర్దేశించిన ప్రాజెక్టులు త్వరగా అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2019 ఫిబ్రవరి నాటికి కీలకమైన పనులు పూర్తి చేయాలన్నది మా ముందున్న లక్ష్యం. ఇప్పటికే కొన్ని పనులు పూర్తవ్వగా, మరికొన్ని త్వరలో పూర్తికానున్నాయి. ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌లకు అవసరమైన సామగ్రి తెప్పిస్తున్నాం. గోదావరి కళాక్షేత్రం, సైన్స్‌ సెంటర్‌ల ఆకృతులు సిద్ధమవుతున్నాయి. కొన్ని సాంకేతిక అనుమతుల దశలో ఉన్నాయి.

-కె.రమేష్‌, ఎండీ, కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌
ప్రాజెక్టు: రహదారులు, ప్రధాన కూడళ్ల అభివృద్ధి
వెచ్చించనున్న మొత్తం: రూ. 100 కోట్లు
కాకినాడను ఆకర్షణీయ నగరంగా మార్చే క్రమంలో స్మార్ట్‌ వీధుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే నగరంలో అన్నిరకాల రహదారులు 725 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. కీలక రహదారులతో పాటు ఆయా ప్రధాన కూడళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ స్ట్రీట్‌ పనులు సర్పవరం కూడలి నుంచి బాలయోగి విగ్రహం వరకు కొనసాగుతున్నాయి.

ప్రాజెక్టు: స్కాడా నీటి సరఫరా పర్యవేక్షణ వ్యవస్థ
వెచ్చించనున్న మొత్తం: రూ. 120 కోట్లు
నగరంలో నీటి సరఫరా వ్యవస్థకు సాంకేతిక పరిజ్ఞానం జోడించి సమర్థంగా సరఫరా చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రతి ఇంటికి కొళాయిలు, మీటరింగ్‌ వ్యవస్థ ద్వారా బిల్లింగును ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానంలో నీటి చౌర్యానికి ఆస్కారం ఉండదు. లీకేజీలను గుర్తించి వృథాను అరికట్టే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఏపీఎండీపీ పథకం ద్వారా రూ. 300 కోట్లతో నగరంలో నీటిశుద్ధి కేంద్రాలు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, నూతన పైపులైన్లు ఏర్పాటు చేశారు. సెన్సార్‌తో కూడిన ఈ స్కాడా వ్యవస్థకు దీన్ని అనుసంధానం చేస్తారు.

ప్రాజెక్టు: ఓపెన్‌ ఎయిర్‌ జిమ్స్‌
వెచ్చించనున్న నిధులు: రూ. 3.40 కోట్లు
నగరంలో 22 ప్రాంతాల్లో ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గాంధీపార్కు, వివేకానంద పార్కుల్లో ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌ పరికరాలు ఏర్పాటు చేశారు. నగరంలో ఉదయం నడకకు అనువైన ప్రాంతాలు తక్కువ. దీంతో కళాశాల మైదానాలు, ఉద్యానాలను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో స్మార్ట్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తే నగరవాసులకు ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రాజెక్టు: భూగర్భ విద్యుత్తు వ్యవస్థ
వెచ్చించనున్న మొత్తం: రూ. 50 కోట్లు
ప్రస్తుతం వేలాడుతున్న విద్యుత్తు తీగలు.. విద్యుత్తు అంతరాయలు విసిగిస్తున్నాయి. స్మార్ట్‌ సిటీలో భాగంగా భూగర్భ విద్యుత్తు వ్యవస్థకు సన్నాహాలు చేస్తున్నారు. తొలిదశలో స్మార్ట్‌ స్ట్రీట్‌లో భాగంగా సర్పవరం - బాలయోగి విగ్రహం కూడలి వరకు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు విడతల వారీగా నిధులు వెచ్చించనున్నారు. తొలుత విశాఖలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు కాకినాడలోనూ ఏర్పాటవుతోంది. ఇది పూర్తయితే విపత్తుల సమయంలో అంతరాయాలకు ఆస్కారం ఉండదు.

ప్రాజెక్టు: మల్టీలెవల్‌ పార్కింగు వ్యవస్థ
వెచ్చించనున్న నిధులు: రూ.5కోట్లు
కాకినాడ నగరంలో పార్కింగ్‌ సౌకర్యాలు చాలా తక్కువ. ప్రధాన మార్గాల్లోని నడక దారుల్లో వాహనాలు నిలపాల్సి వస్తోంది. మెయిన్‌రోడ్డు, భానుగుడి కూడలి, బాలాజీ చెరువు ప్రాంతం, జగన్నాథపురం, సినిమా రోడ్డు, దేవాలయం వీధి, వార్ఫ్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. నిత్యం పలు జిల్లాల ప్రజల తాకిడి ఉండే జిల్లా సామాన్య ఆస్పత్రి, జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్దా  సమస్య ఉంది. స్మార్ట్‌ నిధులతో ప్రాథమికంగా జీజీహెచ్‌ ప్రాంతంలో బహుళస్థాయి పార్కింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తాజాగా కలెక్టర్‌ ప్రకటించారు. ప్రధాన కూడళ్ల పరిస్థితిపైనా దృష్టిపెడితే నగరంలో ట్రాఫిక్‌ చిక్కులు వీడుతాయి

 
 

 

scroll

 
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...