sonykongara Posted July 20, 2018 Author Posted July 20, 2018 ఇదో అద్భుతం ఒకే పోర్టల్.. ఎన్నో సేవలు వచ్చే ఏడాదిలోగా అన్నీ ఆన్‌లైన్‌లోనే మున్ముందు సర్కారు కనిపించేది సేవల్లోనే ‘ఈ-ప్రగతి కోర్’ ప్రాజెక్టు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి వెల్లడి ‘ఈ-ప్రగతి కోర్’ ప్రాజెక్టు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనాడు - అమరావతి అన్ని ప్రభుత్వశాఖల సేవలను ఒకే పోర్టల్ కిందకు తీసుకురావడం అత్యద్భుతమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వమనేది సేవల్లోనే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. సేవలతోనే ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటుందని వివరించారు. గురువారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌హాల్‌లో ఆయన ‘ఈ-ప్రగతి కోర్’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వివిధ రకాల సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి పోవాలని అన్నారు. ఈ-ప్రగతి పోర్టల్‌లో ప్రస్తుతం 20 సేవలు ప్రవేశపెట్టినా వచ్చే ఏడాదిలో మొత్తం సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. సృజనాత్మకతతో ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదని, ఇదో సుదీర్ఘ ప్రయాణమని అన్నారు. విజ్ఞాన ఆధార ఆర్థిక వ్యవస్థ(నాలెడ్జి ఎకానమీ)దే భవిష్యత్తు అని గుర్తించి, 20 ఏళ్ల క్రితమే ఐటీ రంగానికి బాటలు వేశానన్నారు. ఐటీలో విప్లవాన్ని చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రియల్ టైం గవర్నెన్స్‌తో పరిపాలన సాగిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. నాలుగేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి సాధిస్తూ విద్య, ఆరోగ్యం, ఐటీలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచామని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయంలో విప్లవాన్ని తీసుకొచ్చి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపామని, ఈ ఏడాది ఐదు లక్షల ఎకరాల్లో పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నామని వివరించారు. ఈ-ప్రగతి పోర్టల్ రూపకల్పన చేసి వేగవంతంగా తీసుకొచ్చిన బాలసుబ్రహ్మణ్యం బృందాన్ని అభినందిస్తున్నానని, ‘విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ గవర్నమెంట్’లో భాగంగా పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలూ ఆన్‌లైన్‌లో ఉంచామని ఆయన వివరించారు. ఈ-ప్రగతితో అవినీతి రహిత పరిపాలన సాకారమవుతుందని అన్నారు. వాయిస్‌తో సేవలు అందించే స్థాయికి చేరుకోవాలి: ఎలెక్సా, గూగుల్‌లను ఆదర్శంగా తీసుకొని వాయిస్‌తో ప్రజలకు సేవలు అందించే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే విధానంలో ఆధార్ వచ్చినట్లే భూధార్ తెస్తున్నామని, దీనివల్ల భూమిని షేర్ మార్కెట్లో బదిలీ చేసినట్లుగా చేయొచ్చని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు దెయ్యాలు తీసుకునేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని తెలిపారు. ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు నిధుల కేటాయింపులతోపాటు ఫలితాలు కూడా అంతే ముఖ్యమని, ఇందుకోసం ఆధునిక సాంకేతికతను అనుసంధానించడం ఎంతో అవసరమని అన్నారు. సమావేశంలో ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, ఈ-ప్రగతి సీఈవో బాలసుబ్రహ్మణ్యం ఈ-ప్రగతి ప్రాజెక్టు ప్రత్యేకతలను వివరించారు. సమావేశంలో ఫ్యూచర్ వరల్డ్ వ్యవస్థాపక సభ్యుడు నీల్ జాకబ్‌సన్, ఇరోపియన్ మాజీ సీఈవో డాక్టర్ తావి, మైక్రోసాఫ్టు భారత విభాగ మేనేజింగ్ డైరక్టర్ అనిల్ భన్సాలీ, పెగా ఇండియా భారత విభాగ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్‌రెడ్డి ఈదునూరి, ఈవై ఇండియా ప్రతినిధి పంకజ్ దాంధిరియా, పీపుల్ కేపిటల్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీనిరాజు, ఐటీశాఖ కార్యదర్శి విజయానంద్ తదితరులు ప్రసంగించారు. సమావేశంలో విద్య, పశుసంవర్ధక, వ్యవసాయ, స్త్రీ, శిశుసంక్షేమ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖల అధికారులు ఈ-ప్రగతి పోర్టల్ నుంచి ప్రజలు పొందే తమ శాఖల సేవల గురించి వివరించారు. జాబ్ మేళాలలో ఐటీ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన పలువురు విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియామక ఉత్తర్వులను అందజేసి అభినందించారు.
KaNTRhi Posted August 25, 2018 Posted August 25, 2018 1 hour ago, sonykongara said: @sonykongara bro epragati portal click chesthunte under construction ani vastundi.. link ivvara
sonykongara Posted August 25, 2018 Author Posted August 25, 2018 12 minutes ago, KaNTRhi said: @sonykongara bro epragati portal click chesthunte under construction ani vastundi.. link ivvara idea ledu bro chala pedda project uk company work chesthundi dini ki
sonykongara Posted August 25, 2018 Author Posted August 25, 2018 14 minutes ago, KaNTRhi said: @sonykongara bro epragati portal click chesthunte under construction ani vastundi.. link ivvara https://qa-myap.e-pragati.in/
KaNTRhi Posted August 25, 2018 Posted August 25, 2018 (edited) 23 minutes ago, sonykongara said: https://qa-myap.e-pragati.in/ Nirudyoga bruthi Direct link unte kooda ivvara.. not for me evaro thelisina vallu adigaru @sonykongara Edited August 25, 2018 by KaNTRhi
sonykongara Posted August 25, 2018 Author Posted August 25, 2018 16 minutes ago, KaNTRhi said: Nirudyoga bruthi Direct link unte kooda ivvara.. not for me evaro thelisina vallu adigaru @sonykongara https://www.jntufastupdates.com/ap-nirudyoga-bruthi-scheme-online-registration/
KaNTRhi Posted August 26, 2018 Posted August 26, 2018 17 hours ago, sonykongara said: https://www.jntufastupdates.com/ap-nirudyoga-bruthi-scheme-online-registration/ Link not working brother...
Yaswanth526 Posted September 29, 2018 Posted September 29, 2018 Several sectors will be linked with e-Pragati by October end Reviewing the progress of e-Pragati at Praja Vedika, the Chief Minister said that officials should concentrate on a futuristic approach to promote innovation and artificial intelligence among the youth. He said that all the government departments should be integrated under the e-Pragati portal to achieve 80% public satisfaction level for public services. The e-Pragati officials said that they have taken up linking of government services in different stages under Wave 1 to 4. The Primary and Education sectors come under Wave 1, Health under Wave 2, Industries and Rural Development under wave 3, and IT, Infrastructure, Production, e-CM, e-Cabinet, e-Office, e-Procurement, CFMS, HRMS, Law and Order under wave 4. They also said that several other sectors will be linked with e-Pragati by the end of October.
sonykongara Posted October 27, 2018 Author Posted October 27, 2018 ఇదేం ఈ-ప్రగతి?27-10-2018 02:53:47 నాలుగేళ్లు కష్టపడినా కొలిక్కి తేలేకపోయారు: సీఎం ఇకపై సీఎస్ సారథ్యం.. వెను వెంటనే జీవో జారీ అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకొచ్చే ఈ-ప్రగతి ప్రాజె క్టును నిర్వహిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తాను చేపట్టిన తొలి ప్రాజెక్టునే అత్యంత నిరాశాజనకంగా కొనసాగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ-ప్రగతి ప్రాజెక్టుపై జరిగిన చర్చలో ఆయన తన అసంతృప్తిని అడుగడుగునా బయటపెట్టారు. ఈ ప్రాజెక్టు పరిధిలోకి 268కి పైగా సేవలు అందుబాటులోకి వచ్చాయని ఈ-ప్రగతిలో భాగమయిన డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ మెంబర్ కన్వీనర్, రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం అనగా, సీఎం జోక్యం చేసుకున్నారు. ‘‘ఈ ప్రాజెక్టు చాలా నెమ్మదిగా నడుస్తోంది. ప్రాజెక్టును సమర్ధంగా చేపట్టేందుకు ఎన్ని ఏర్పాట్లుచేసినా మీరు నెమ్మదిగా నడిపిస్తున్నారు. మీరు చేయలేకపోతే చెప్పండి? నాలుగేళ్లు బాగా ఆలస్యం చేశారు. నేను ఇంత వరకు ఎందులోనూ విఫలం కాలేదు. కానీ ఈ విషయంలో మీరు విఫలమై నన్ను విఫలం చేస్తారేమోనన్న ఆందోళన ఉంది. ఎక్కడో లోపం ఉంది. దాన్ని కనిపెట్టి పరిష్కరించి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేస్తారా? లేదా చెప్పండి?. ఈ ప్రాజెక్టును మీరు ఎక్కడో సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో తేడా జరుగుతోంది?’’ అంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ ప్రభుత్వ శాఖ, మంత్రులు, అధికారులు ఈ-ప్రగతిని తప్పనిసరి అంశంగా తీసుకోవాలని, దీన్ని ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపట్ల క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ సీఎ్‌సను ఆదేశించారు. ఇకపై కీలక నిర్ణయాలు, సమావేశాలు సీఎస్ నేతృత్వంలో జరగాలని దిశానిర్దేశం చేశారు. ‘ఈ-ప్రగతి కమిటీకి సత్యనారాయణ స్థానంలో సీఎ్‌సను ఛైర్మన్‌గా నియమించండి. వెంటనే ఉత్తర్వులు ఇవ్వండి. ప్రతీ శాఖ ఇందులో భాగస్వామ్యం కావాలి. లేదంటే చర్యలు తప్పవు’’ అని సీఎం స్పష్టం చేశారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే దీనిపై జీవో విడుదల అయింది.
APDevFreak Posted November 30, 2018 Posted November 30, 2018 On 10/27/2018 at 4:21 AM, sonykongara said: ఇదేం ఈ-ప్రగతి?27-10-2018 02:53:47 నాలుగేళ్లు కష్టపడినా కొలిక్కి తేలేకపోయారు: సీఎం ఇకపై సీఎస్ సారథ్యం.. వెను వెంటనే జీవో జారీ అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకొచ్చే ఈ-ప్రగతి ప్రాజె క్టును నిర్వహిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తాను చేపట్టిన తొలి ప్రాజెక్టునే అత్యంత నిరాశాజనకంగా కొనసాగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ-ప్రగతి ప్రాజెక్టుపై జరిగిన చర్చలో ఆయన తన అసంతృప్తిని అడుగడుగునా బయటపెట్టారు. ఈ ప్రాజెక్టు పరిధిలోకి 268కి పైగా సేవలు అందుబాటులోకి వచ్చాయని ఈ-ప్రగతిలో భాగమయిన డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ మెంబర్ కన్వీనర్, రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం అనగా, సీఎం జోక్యం చేసుకున్నారు. ‘‘ఈ ప్రాజెక్టు చాలా నెమ్మదిగా నడుస్తోంది. ప్రాజెక్టును సమర్ధంగా చేపట్టేందుకు ఎన్ని ఏర్పాట్లుచేసినా మీరు నెమ్మదిగా నడిపిస్తున్నారు. మీరు చేయలేకపోతే చెప్పండి? నాలుగేళ్లు బాగా ఆలస్యం చేశారు. నేను ఇంత వరకు ఎందులోనూ విఫలం కాలేదు. కానీ ఈ విషయంలో మీరు విఫలమై నన్ను విఫలం చేస్తారేమోనన్న ఆందోళన ఉంది. ఎక్కడో లోపం ఉంది. దాన్ని కనిపెట్టి పరిష్కరించి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేస్తారా? లేదా చెప్పండి?. ఈ ప్రాజెక్టును మీరు ఎక్కడో సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో తేడా జరుగుతోంది?’’ అంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ ప్రభుత్వ శాఖ, మంత్రులు, అధికారులు ఈ-ప్రగతిని తప్పనిసరి అంశంగా తీసుకోవాలని, దీన్ని ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపట్ల క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ సీఎ్‌సను ఆదేశించారు. ఇకపై కీలక నిర్ణయాలు, సమావేశాలు సీఎస్ నేతృత్వంలో జరగాలని దిశానిర్దేశం చేశారు. ‘ఈ-ప్రగతి కమిటీకి సత్యనారాయణ స్థానంలో సీఎ్‌సను ఛైర్మన్‌గా నియమించండి. వెంటనే ఉత్తర్వులు ఇవ్వండి. ప్రతీ శాఖ ఇందులో భాగస్వామ్యం కావాలి. లేదంటే చర్యలు తప్పవు’’ అని సీఎం స్పష్టం చేశారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే దీనిపై జీవో విడుదల అయింది. Have been eagerly waiting for this...but disappointed.. These things happen when the officers don't understand the vision. Lokesh should have taken the full control over it.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now