Jump to content

Recommended Posts

Posted
మరో మణిమకుటం
 
 
636368269881709098.jpg
  • మంగళగిరి ఐటీ పార్క్‌లో ‘పై డాటా’
  • నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
  • ఆసియాలోనే అతి పెద్ద టైర్‌ -4 కంపెనీ
  • రూ. 600 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం
  • రాజధానిలో ఐటీ హబ్‌కు మలి అడుగు
 
మంగళగిరి: ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంటున్న మంగళగిరిలో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీ పై డాటా సెంటర్‌ శుక్రవారం ప్రారంభానికి సిద్దమైంది. దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన టైర్‌-4 డాటా సెంటరుగా ఇది రికార్డులకెక్కనుంది. రాజధాని అమరావతిని ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా అమరావతితో పాటు మంగళగిరి, గన్నవరంలో ఐటీ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. వారం కిందటే మంగళగిరి ఐటీ పార్కులో పైకేర్‌ సెంటరును రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించారు. దాని తరువాత రెండో ఐటీ కంపెనీగా పై డాటా సెంటరు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు రూ.600 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటవుతున్న ఈ డాటా సెంటరును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభించనున్నారు. మంగళగిరి ఐటీ పార్కులోని 12వ నెంబరు ప్లాటులోని పదెకరాల విస్తీర్ణంలో పై డాటా సెంటరు తన కార్యకలాపాలను ఆరంభించబోతుంది. మొత్తం రెండు దశలుగా దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నామని...తొలిదశకింద ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన సముదాయాన్ని నిర్మించి కంపెనీని ప్రారంభిస్తున్నామని ఆ కంపెనీ చైర్మన్‌ అండ్‌ సీఈవో ముప్పనేని కళ్యాణ్‌ విలేకర్లకు వివరించారు. ప్రస్తుతానికి తమ ఈ కంపెనీ ద్వారా సుమారు 1,300 మందికి ఉద్యోగవకాశాలను కల్పించబోతున్నట్టు తెలిపారు. క్లౌడ్‌ ప్రొడక్ట్స్‌, క్లౌడ్‌ మేనేజ్‌డ్‌ సర్వీసులు, రిమోట్‌ సర్వీసులు, సెల్ఫ్‌ సర్వీసుల ప్రొవిజినింగ్‌ వంటి సేవలను ఈ కంపెనీ అందిస్తుందని వివరించారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం పది గంటలకు మంగళగిరి ఆటోనగర్‌ వెంబడి వున్న ఐటీ పార్కును చేరుకుంటారు. తొలుత ఆయన పై డాటా సెంటరు ఆవరణలో ఏర్పాటుచేసిన గణపతి మందిరంలో పూజలు చేసి మొక్కను నాటుతారు. అనంతరం పై డాటా భవన సముదాయాన్ని, సీఈఓ చాంబరును ప్రారంభిస్తారు. అనంతరం డాటా సెంటరు ప్రాంగణంలో ఉత్తరంగా ఏర్పాటుచేసిన సభా ప్రాంగణాన్ని చేరుకుని ప్రసంగిస్తారు.
 
ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పై డాటా సెంటరులో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టరు కోన శశిధర్‌, అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావుతో కలిసి గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యానికి కలెక్టరు తగు సూచనలిచ్చారు. కార్యక్రమంలో మంగళగిరి టీడీపి ఇన్‌చార్జి గంజి చిరంజీవి, సీఎం ముఖ్య భద్రతాధికారి జోషి, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, విద్యుత్‌శాఖ జిల్లా ఎస్‌ఈ భరత్‌రావు, మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, మునిసిపల్‌ కమిషనరు ఎన్వీ నాగేశ్వరరావు, తహసీల్దారు సంగా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 
పట్టిష్ట భద్రత ఏర్పాట్లు..
గుంటూరు: సీఎం పర్యటనకు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేసినట్లు అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయరావు తెలిపారు. మంగళగిరిలో సీఎం భద్రతపై అఽధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో బాంబ్‌ డిస్పోజల్‌ బృందాలు, పోలీస్‌ జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ప్రారంభోత్సవం ప్రాంతం, సభా స్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డిఎస్పీలు, 25 మంది సిఐలు, 45 మంది ఎస్‌ఐలు, 80 మంది ఎఎస్‌ఐ/హెచ్‌సిలు, 150 మంది కానిస్టేబుళ్లు, 60 మంది హోమ్‌గార్డులు, 6 ప్లటూన్‌ల ఎపిఎస్‌పి/ఎఆర్‌ బలగాలు రంగంలోకి దింపినట్లు తెలిపారు.
Posted
ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌!
28-07-2017 02:40:22
 
636368064500325333.jpg
  • నేడు పై డేటా కంపెనీకి శ్రీకారం.. 600 కోట్ల వ్యయంతో ఏర్పాటు
  • ఆసియాలోనే అతి పెద్ద టైర్‌ -4 కంపెనీ.. ప్రారంభించనున్న సీఎం
 
మంగళగిరి, జూలై 27: ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు నవ్యాంధ్ర వేదికకానుంది. ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంటున్న మంగళగిరిలో ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీ పై డేటా సెంటర్‌ను శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆసియాలోనే అతి పెద్దదైన టైర్‌-4 డేటా సెంటరుగా ఇది రికార్డులకెక్కనుంది. సుమారు రూ.600 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటవుతున్న మంగళగిరి ఐటీ పార్కులోని పదెకరాల విస్తీర్ణంలో పై డేటా సెంటరును ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రెండు దశలుగా దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన సముదాయాన్ని నిర్మించి కంపెనీని ప్రారంభిస్తున్నామని కంపెనీ చైర్మన్‌ అండ్‌ సీఈవో ముప్పనేని కల్యాణ్‌ విలేకరులకు వివరించారు.
 
దేశంలో ఎక్కడా లేనివిధంగా దీనిని నిర్మించామని, ఆసియా ఖండంలోనే తమది అతిపెద్ద డేటా కంపెనీగా నిలుస్తుందన్నారు. తొలి దశలో తమ కంపెనీ ద్వారా సుమారు 1300 మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. క్లౌడ్‌ ప్రాడక్ట్స్‌, క్లౌడ్‌ మేనేజ్‌డ్‌ సర్వీసులు, రిమోట్‌ సర్వీసులు, సెల్ఫ్‌ సర్వీసుల ప్రొవిజినింగ్‌ వంటి సేవలను ఈ కంపెనీ అందిస్తుందని వివరించారు. కాగా, ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పైడేటా సెంటరులో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టరు కోన శశిధర్‌, అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావుతో కలిసి గురువారం పరిశీలించారు.
 
డేటా ఎనలిటిక్స్‌లో విప్లవం
క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా ఎనలిటిక్స్‌కు సంబంధించిన పలు ప్రత్యేకతలు పైడేటా సొంతం. ఎవరైనా వ్యాపారావకాశాలను విస్తృతపర్చుకోవాలని భావిస్తే అవసరమైన సమాచారాన్ని ఈ సెంటర్‌ అందిస్తుంది. ఓ సంస్థ తన ఉత్పత్తిని మార్కెటింగ్‌ చేసుకోవడానికి అవకాశాలు తెలుసుకోవాలంటే దీనిని సంప్రదించవచ్చు. నిర్దేశిత ప్రాంతంలో ఉన్న జనాభా సంఖ్య.. వారి జీవనవిధానం.. అలవాట్లు వంటి వివరాలన్నీ ఈ సెంటర్‌ సదరు సంస్థకు అందిస్తుంది. ఈ సెంటర్‌లో తొలి దశలో 5వేల ర్యాక్‌లను ఏర్పాటు చేయగా, వాటిలో వెయ్యి ర్యాక్‌లను ప్రభుత్వ రంగ సంస్థలు ఉపయోగించుకోనున్నాయి. మిగిలిన వాటిని ప్రైవేటు సంస్థలు వినియోగించుకుంటాయి.
Posted

Will create atleast 2000 jobs good IT jobs.....................This is out an doubt a CBN achievement. Mangalagiri lo intha pedda DC yemi choosi pedataadu yevadu aiyina, that too leaving all tier 1 & tier 2 cities.............hats off to CBN

  • 8 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...