sonykongara Posted June 24, 2017 Share Posted June 24, 2017 మెర్సి కిల్లింగ్ నుంచి బయటపడి.. చావుని జయించిన ఈ చిన్నారి గుర్తుందా? ఆంధ్రజ్యోతి: జ్ఞానసాయి గుర్తుందా మీకు? సరిగ్గా ఏడాది క్రితం వార్తలో వ్యక్తిగా నిలిచింది ఆ చిన్నారి. అంతేకాదు.. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఈ చిన్నారి కోలుకోవాలని ఆకాంక్షించారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న 9నెలల చిన్నారిని బతికించుకునే స్థోమత లేదంటూ అప్పట్లో పాప తల్లిదండ్రులు మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని కోర్టుని కోరారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆ తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి తెలియజేసింది. కేవలం డబ్బు లేకపోవడం ఓ చిన్నారి పాలిట ఎలా శాపమైందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఫలితంగా ఏపీ సీఎం చంద్రబాబు మొదలు.. యంత్రాంగం మొత్తం స్పందించింది. చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో సుమారు 6నెలల క్రితం జ్ఞానసాయికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత తిరుపతి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో జ్ఞానసాయి మొదటి పుట్టిన రోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఆ చిన్నారి కోలుకోవాలని ఎంతో మంది ఆకాంక్షించారు. మీరందించిన సాయంతో పాప హ్యాపీగా.. క్షేమంగా ఉంది చూడండి అంటూ పాపతో ఏబీఎన్ స్టూడియోకు చిత్తూరు నుంచి వచ్చారు. Link to comment Share on other sites More sharing options...
hari2999 Posted June 24, 2017 Share Posted June 24, 2017 god bless you Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted June 24, 2017 Author Share Posted June 24, 2017 http://www.andhrajyothy.com/artical?SID=430275 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted June 24, 2017 Author Share Posted June 24, 2017 బీఎన్లో కథనాల వల్లే పాపను కాపాడగలిగాం: కామినేని24-06-2017 10:27:35 అమరావతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాల వల్లే చిన్నారి జ్ఞానసాయిని కాపాడగలిగామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ... జ్ఞానసాయి పరిస్థితిని ఏబీఎన్ వెలుగులోకి తీసుకువచ్చారని, ఇందుకు వారికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఇలాంటి వాటిని మీడియా వెలుగులోకి తీసుకురావాలన్నారు. అలాగే చిన్నారి జ్ఞానసాయిని కాపాడే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం అని మంత్రి పేర్కొన్నారు Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted June 24, 2017 Share Posted June 24, 2017 god bless you Link to comment Share on other sites More sharing options...
KING007 Posted June 24, 2017 Share Posted June 24, 2017 god bless you Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.