Jump to content

Nokia........welcome back :)


srinelluri

Recommended Posts

13brk110a.jpg

దిల్లీ: వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోకియా బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లోకి వచ్చేశాయి. దిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఆండ్రాయిడ్‌ ఫోన్లను హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ విడుదల చేసింది. నోకియా 6 ధర రూ. 14,999. జులై 14 నుంచి ప్రముఖ ఈ-కామర్స్‌ పోర్టల్‌ అమెజాన్‌లో ఈ ఫోన్‌ అమ్మకాలు జరగనున్నాయి.

నోకియా 5 మొబైల్‌ ధర రూ. 12,899. జులై 7 నుంచి ఆఫ్‌లైన్‌ స్టోర్లలోఈ ఫోన్‌ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ తెలిపింది. ఇక ఈ మూడు మోడళ్లలో నోకియా 3 కాస్త చౌకైనది. దీని ధర రూ. 9,499. జూన్‌ 16 నుంచి ఈ ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

బేసిక్‌ ఫోన్లలో ఒకప్పుడు మొబైల్‌ రంగాన్ని శాసించిన నోకియా.. ఆ తర్వాత ఆండ్రాయిడ్‌ దెబ్బకు చతికిలపడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ బ్రాండ్‌ పేరును ఇటీవల హెచ్‌ఎండీ గ్లోబల్‌ సొంతం చేసుకుని సరికొత్త ఫోన్లను రూపొందించింది. ఈ ఏడాది మొదట్లో బార్సిలోనాలో జరిగిన ఎండబ్ల్యూసీలో నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఫోన్లను ఆవిష్కరించింది. ఇటీవలే నోకియా 3310 పేరుతో ఐకానిక్‌ ఫీచర్‌ ఫోన్‌ను కూడా హెచ్‌ఎండీ గ్లోబల్‌ భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

నోకియా 6 ఫీచర్లు 

* 5.5 అంగుళాల డిస్‌ప్లే 

* ఆండ్రాయిడ్‌ 7 నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 

* 3జీబీ ర్యామ్‌ 

* 32జీబీ అంతర్గత మెమొరీ 

* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం 

* 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా 

* ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ సదుపాయం

నోకియా 5 ఫీచర్లు 

* 5.2 అంగుళాల డిస్‌ప్లే 

* ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 

* 2జీబీ ర్యామ్‌ 

* 16జీబీ అంతర్గత మెమొరీ 

* 13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా 

* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం 

* ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ సదుపాయం

నోకియా 3 ఫీచర్లు 

* 5 అంగుళాల డిస్‌ప్లే 

* ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 

* 2జీబీ ర్యామ్‌ 

* 16జీబీ అంతర్గత మెమొరీ 

* 8 మెగాపిక్సెల్‌తో ముందు, వెనుక కెమెరాలు 

* 2650 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

 
 
 
 
Link to comment
Share on other sites

ee nokia phones ni vada lekkunam :kick: battery worst ga vuntunnai ... MI phones better antunnaru ..

 

2013 nunchi lumia series vaduthunna worst oo worst .. :wall:

 

saraina apps dorakav

This time apps problem vundadu le bcz it is coming with Android not windows

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...