Jump to content

Kumble - Kohli issue


NatuGadu

Recommended Posts

  • Replies 160
  • Created
  • Last Reply

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా కోచ్‌ అనిల్‌కుంబ్లే ఇక మాకొద్దని జట్టులోని 10 మంది ఆటగాళ్లు గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 20తో కోచ్‌గా అనిల్‌కుంబ్లే కాంట్రాక్ట్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తకోచ్‌ నియామకానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుత కోచ్‌గా ఇంటర్వ్యూకి నేరుగా హాజరయ్యే వెసులుబాటు ఉన్నప్పటికీ అనిల్‌కుంబ్లే కూడా కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కుంబ్లే కాంట్రాక్ట్‌ను పొడిగించవద్దని టీమిండియాలోని 10మంది క్రికెటర్లు బీసీసీఐని కోరుతున్నారట. జట్టు సభ్యులపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడని, అతడితో చాలా అసౌకర్యంగా ఉంటోందని కెప్టెన్‌ కోహ్లీ సహా కొందరు ఆటగాళ్లు గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

రవిశాస్త్రి తరువాత గత ఏడాది జులైలో టీమిండియా కోచ్‌గా కుంబ్లే బాధ్యతలు చేపట్టాడు. కుంబ్లే కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత భారతజట్టు తొలిసారిగా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సిరీస్‌నూ టీమిండియా కైవసం చేసుకుంటూ వచ్చింది. సాధారణంగా అయితే కుంబ్లే విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించడంతో ఆయన కాంట్రాక్ట్‌ను 2019 ప్రపంచకప్‌ వరకు పొడిగిస్తారని అంతా భావించారు. కానీ బీసీసీఐ కొత్త కోచ్‌ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, జట్టు మేనేజర్‌ ఎంవీ శ్రీధర్‌ ఇటీవల జట్టు సభ్యులతో మాట్లాడారు. క్రికెట్‌ సలహా మండలి సభ్యుడు గంగూలీ కూడా గతవారం టీమిండియా ఆటగాళ్లతో ప్రత్యేకంగా సమావేశమాయ్యరు.

 

టీమిండియా కోచ్‌ పదవికి మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్రసెహ్వాగ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ టామ్‌మూడీ, ఇంగ్లాండ్‌కి చెందిన రిచర్డ్‌ పైబస్‌, భారత మాజీ క్రికెటర్లు దొడ్డా గణేశ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ దరఖాస్తు చేసుకున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...