Jump to content

Water grid


Recommended Posts

  • Replies 164
  • Created
  • Last Reply

Top Posters In This Topic

1. మంత్రి లోకేష్ సారథ్యంలో భగీరథ యజ్ఞం - జలధార పధకం.

2. సంక్రాంతి నుంచి నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాలలో రూ.15 వేల కోట్లతో మొదలవుతున్న మొదటి దశ జలధార పనులు.

3. రాష్ట్రంలోని 48,363 నివాస ప్రాంతాలలోని ప్రతి ఇంటికి కొళాయి ద్వారా సురక్షిత తాగునీరు.

4. త్రాగునీటి సమస్య లేని పల్లెలే లక్ష్యంగా రూ.22,300 కోట్లతో వాటర్ గ్రిడ్.

5. 10 జిల్లాలకు పూర్తయిన టెండర్ల ప్రక్రియ, త్వరలో మరో మూడు జిల్లాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తికి చర్యలు.

6.ఎన్టీఆర్ సుజల ద్వారా బ్యాంకు ఎటిఎం మాదిరిగా నీటి ఏటీఎంలు పెట్టి స్వచ్ఛమైన నీరు అందిస్తున్న మంత్రి లోకేష్ ను దీవిస్తున్న ప్రజలు.

Edited by Yaswanth526
Link to comment
Share on other sites

  • 2 weeks later...
మాచర్లకు వరం బుగ్గవాగు 
 

రూ.80 కోట్లతో పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం 
న్యూస్‌టుడే, మాచర్ల

gnt-top1a_43.jpg

రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగు నీటిని అందించే నాగార్జునసాగర్‌ కుడి కాలువ మాచర్ల పట్టణం పక్క నుంచే ప్రవహిస్తున్నా నేటికీ మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. పురపాలక సంఘం ఆవిర్భవించి 36 ఏళ్లు గడుస్తున్నా రెండు రోజులకొకసారి కుళాయిల ద్వారా నీటిని అందించే దుర్భర పరిస్థితి కొనసాగుతోంది. ఇక వేసవి వస్తోందంటే తలెత్తే ఎద్దడిని తలచుకొని ప్రజలు ఆందోళన చెందాల్సిందే. ఇలాంటి గడ్డు పరిస్థితులకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం బ్యాంకుల రుణ సాయంతో సమస్య తీర్చేందుకు నడుంకట్టింది. ఏడాది పొడవునా కృష్ణా నది జలాలు నిల్వ ఉండే బుగ్గవాగు జలాశయం ద్వారా తాగు నీటిని అందించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం రూ.80.25 కోట్ల బ్యాంకు రుణం రాబట్టనుండగా మొదటి విడతగా రూ.50.43 కోట్లతో చేపట్టనున్న పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తి చేసింది.

ఎక్కడ నుంచి ఏఏ పనులు: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి 17 మైళ్ల దూరంలోని బుగ్గవాగు జలాశయంలో 3.05 టీఎంసీలు నిల్వ ఉంటుండగా ఇక్కడి నుంచే గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నీటి విడుదల జరుగుతుంటుంది. దీంతో ఏడాది పొడవునా నిల్వలు ఉండాల్సిందే. కాగా మాచర్ల పట్టణానికి 13.05 కి.మీ. దూరంలోనే ఈ జలాశయం ఉండగా దీని నుంచి నీటిని తరలించేందుకు జాక్‌వెల్‌ నిర్మాణం చేయనున్నారు. ప్రత్యేకంగా పైపులైను వేయడం ప్రారంభించి 7వ వార్డులోని రోప్‌లైన్‌ కాలనీ కొండ ప్రాంతం వరకు పనులు పూర్తి చేస్తారు. అక్కడే నీటిని శుద్ధిచేసే ఫిల్టర్‌ బెడ్లు నిర్మించనున్నారు. అదే సమయంలో పురపాలికలోనూ ప్రస్తుతం ఉన్న వాటిని విస్తరిస్తారు. ఈ రెండు ప్రాంతాలకు బుగ్గవాగు నుంచి నీటిని తీసుకువచ్చి శుద్ధి చేస్తారు. ఈ పనులు మొత్తం పూర్తికి తొలి విడతలో రూ.50.43 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం టెండర్లు పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే గుత్తేదార్లు పనులు ప్రారంభించనున్నారు.

అంతర్గత పైపులైన్లకు రూ.26.85 కోట్లు 
మాచర్లకు నీటిని తీసుకువచ్చిన తరువాత శుద్ధి చేసిన నీటిని ప్రతి ఇంటికీ సరఫరా చేసేందుకు అంతర్గత పైపులైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఫేజ్‌-2 కింద ఈ పనులు చేపడతారు. ఇందుకోసం రూ.26.85 కోట్లు వెచ్చించనున్నారు. పట్టణంలో ప్రస్తుత జనాభా 65 వేలుకాగా ఇప్పటికే 6870 వరకు కుళాయిలు ఉన్నాయి. వీటితోపాటు కొత్తగా 4800లకు నీటిని ఈ పథకంలో భాగంగా ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం పథకం ద్వారా 2025 వరకు పెరగనున్న జనాభాను అంచనా వేసి నీటి సరఫరా చేయబోతున్నారు. ప్రతి ఒక్కరికీ 100- 120 లీటర్లు ప్రతిరోజూ ఇచ్చేలా గణాంకాలు వేశారు. ఇందుకోసం పట్టణంలో 78 కి.మీ. మేర అంతర్గత పైపులైన్లు వేయనున్నారు. పురపాలిక, రోప్‌లైన్‌ కాలనీ, పీడబ్ల్యూడీ కాలనీలో ఉన్న 11 లక్షల లీటర్ల జల భాండాగారం ద్వారా నీటిని సరఫరా చేస్తారు. పట్టణం మొత్తానికి కుళాయిల ద్వారా నీటిని అందించనున్నారు. మరోవైపు పట్టణం నుంచి నెహ్రూనగర్‌ వైపు పైపులైన్‌ ఏర్పాటుకు ఎప్పటి నుంచో రైల్వేశాఖ అనుమతుల కోసం ఇబ్బందులు ఉండేవి. వీటిని పురపాలిక అధికారులు అధిగమించారు. రైల్వేశాఖకు చెల్లించాల్సిన నగదును చెల్లించారు. త్వరలోనే అనుమతులు రానున్నాయి.

Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...