Jump to content

AP- Thunder alert system trial


Recommended Posts

అరగంటలో నెల్లూరు జిల్లాలో పిడుగు
 
 
636320190210518538.jpg
అమరావతి: ఆధునిక టెక్నాలజీతో ముందే సంభవించే విపత్తులను పసిగడుతున్నారు. క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడినపుడు వాటిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడి మెరుపులు వస్తాయి. ఆ చర్య జరుగుతున్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల్లో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. ఆ సమాచారం ఆధారంగా పిడుగుపాటును ముందే ఊహించగలుగుతారు. నెల్లూరు జిల్లా డక్కిలి, వెంకటగిరి మండలాల్లో మరో అరగంటలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణశాఖ వెల్లడించింది. దీంతో అధికార యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
Link to comment
Share on other sites

  • Replies 82
  • Created
  • Last Reply

Top Posters In This Topic

హమ్మయ్య.. పడ్డవన్నీ ప్రమాదం లేని పిడుగులే

15 రోజుల్లో 600 హెచ్చరికలు

త్వరలో యాప్‌ విడుదల

రాష్ట్రంలోని పరిజ్ఞానాన్ని పరిశీలించిన జార్ఖండ్‌

ఈనాడు - అమరావతి

3ap-story2a.jpg

పిడుగుపాటుని ముందుగానే గుర్తించే విధానం సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటి వరకూ 600 హెచ్చరికల్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ నుంచి జారీ అయ్యాయి. ఈ పిడుగుల తీవ్రతను విశ్లేషిస్తే ప్రమాదంలేనివిగానే గుర్తించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సాధికార సంస్థ ఆధ్వర్యంలో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పిడుగుపాటు 30 నిమిషాల ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థ పని చేస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన హెచ్చరికల్ని విశ్లేషించుకొంటే 95శాతం కచ్చితత్వం వచ్చిందని అధికార వర్గాలు చెప్పాయి. అమెరికాకు చెందిన ఎర్త్‌ నెట్‌వర్క్స్‌ నుంచి పిడుగుపాటుని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకొంది. 14చోట్ల పిడుగుపాటును ముందుగా పసిగట్టే సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఒక్కో సెన్సార్‌ వెయ్యి కి.మీ. పరిధిలో గుర్తిస్తుంది. పిడుగుపాటు ప్రమాద తీవ్రతను మెరుపుల్నిబట్టి గణిస్తున్నారు. నిమిషానికి 5 నుంచి 15 మెరుపులు ఉంటే ఎల్‌1, 15 నుంచి 25వరకూ ఉంటే ఎల్‌2గా గుర్తిస్తారు. ఎల్‌1 ప్రమాదం లేనివాటిగా, ఎల్‌2 ఒక మోస్తరు ప్రమాదంతో కూడుకున్నవని అధికారులు చెప్పారు. ఎల్‌3లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే పిడుగు ఏ తీవ్రతతో కూడుకున్నదో ముందుగా గుర్తించలేరు కాబట్టి అప్రమత్తం చేసే హెచ్చరికలు తప్పనిసరి. వెల్లూరు వైపు నుంచి వచ్చే వాతావరణ మార్పులు, కమ్ముకొనే మేఘాల మూలంగా చిత్తూరు, బెంగళూరు వైపు ఎక్కువగా పిడుగులుపడుతున్నాయనీ, అలాగే తెలంగాణ వైపు వచ్చే మేఘాల మూలంగా నంద్యాల అటవీ ప్రాంతంలోనూ, ఒడిశాలో వాతావరణ ప్రభావం ఉత్తరాంధ్రలోనూ పిడుగులుపడుతున్నాయని విపత్తుల నిర్వహణశాఖ వర్గాలు చెప్పాయి.

జార్ఖండ్‌లో ఎక్కువ: పిడుగుపాటు మూలంగా సంభవించే ప్రమాదాలు జార్ఖండ్‌లో ఎక్కువగా ఉంటున్నాయి. 2011 నుంచి పిడుగుపై ముందుగా హెచ్చరించేందుకు తీసుకోవల్సిన చర్యలపై కసరత్తుని అక్కడి ప్రభుత్వం చేస్తోంది. రాష్ట్రంలో అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు జార్ఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓ బృందం ఇటీవల కుంచనపల్లిలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి వచ్చింది. ఏపీ విపత్తుల నిర్వహణ అధికారులతో చర్చించారు. భారత వాతావరణ కేంద్రం, ఇస్రో, జాతీయ వాతావరణ సంబంధిత శాస్త్ర పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు పిడుగుపాటు హెచ్చరికల వ్యవస్థలపై సమీక్షించారు. పిడుగుపాటు హెచ్చరికల్ని తెలిపే యాప్‌ను సిద్ధం చేశారు. ఈ యాప్‌ను కూడా వివిధ దశల్లో పరిశీలించారు. సత్ఫలితాలను ఇవ్వడంతో త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయాలని నిర్ణయించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

విపత్తుపై ముందస్తు హెచ్చరిక!

సముద్ర ప్రాంత గ్రామాలకు సైరన్‌ వ్యవస్థ ఏర్పాటు

‘ఇన్‌కాయిస్‌’ సహకారం

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి సుదీర్ఘ తీరం ఉండటం ఎంత వరమో.. ఆ వెంబడే వచ్చే ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం కాస్త సవాల్‌తో కూడుకున్నదే. ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు తీరాన్ని ఆనుకొని ఉండే గ్రామాలను సునామీ, తుపాన్లు, అల్పపీడనాల గురించి ముందుగానే హెచ్చరించి, ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా హెచ్చరికల వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంలో భారత జాతీయ సముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్‌కాయిస్‌) సహకారం తీసుకోనున్నారు. ఇటీవలే ఇన్‌కాయిస్‌ శాస్త్రవేత్తలతో విపత్తుల నిర్వహణశాఖ చర్చించింది. కుంచనపల్లిలోని విపత్తుల నిర్వహణశాఖ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో సముద్రంలోని వాతావరణం గురించి ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం, హెచ్చరికలు అందించే సాంకేతికతను ఏర్పాటు చేయాలని ఇన్‌కాయిస్‌ను కోరారు. ఇప్పటికే ఇన్‌కాయిస్‌ మత్స్యశాఖకు వాతావరణం, అలల తీవ్రత గురించిన సమాచారాన్ని ఇస్తోంది.

సాంకేతికత సాయంతో.. ఇన్‌కాయిస్‌ ద్వారా సునామీ హెచ్చరికల వ్యవస్థని అందిపుచ్చుకోవడంతోపాటు, ఆ విపత్తు సమయంలో ఏ విధంగా అప్రమత్తమై వ్యవహరించాలనే అంశంపై తగిన సాంకేతికను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆకేంద్రం ఆధ్వర్యంలో 30 ఎలక్ట్రానిక్‌ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ తరహా బోర్డులు ప్రస్తుతం 15 చోట్ల ఉన్నా వాటితోపాటు మరో 15 ప్రాంతాల్లో ఆధునిక బోర్డులను ఇన్‌కాయిస్‌ ఏర్పాటు చేయనుంది.

ప్రతి జిల్లాలో ఓ గ్రామంలో.. సునామీ విషయంలో అప్రమత్తమయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి తగిన శిక్షణ ఇచ్చే మాక్‌ డ్రిల్‌ను ప్రతి జిల్లాలో ఓ తీర గ్రామంలో నిర్వహించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ భావిస్తోంది. పోలీస్‌, మెరైన్‌ పోలీస్‌, అగ్నిమాపక దశం, ఎస్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, మత్స్య... ఇలా పలు ప్రభుత్వ శాఖలతోపాటు స్థానికులకీ ఈ విషయంపై మాక్‌డ్రిల్‌ ద్వారా అవగాహన కల్పించనున్నారు.

అప్రమత్తం ఇలా...

* అల్పపీడనం, తుపాన్‌ సమయాల్లో ముందుగా హెచ్చరించడం.

* వాతావరణంలో అనూహ్య మార్పులొస్తే అప్రమత్తం చేసేందుకు తీర గ్రామాల్లో సైరన్‌ల ఏర్పాటు.

* కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి ఇందుకు సంబంధించిన హెచ్చరికలు.

* తీరం వెంబడి గుర్తించి ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు. వీటికి స్పీకర్లు, సైరన్లు అమర్చడం.

* ఏ ప్రాంతంలో విపత్తు రావచ్చో తెలియగానే సంబంధిత టవర్లను గుర్తించి కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచే ప్రజల్ని అప్రమత్తం చేయడం.

* టెలికాం ఆపరేటర్లతో చర్చించి ఆ ప్రాంత ప్రజల మొబైల్‌ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు, వాయిస్‌ మెసేజ్‌ల ద్వారా హెచ్చరికలు ఇచ్చేలా ఏర్పాటు చేయడం.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
పిడుగుపాటును పసిగట్టే ‘వజ్రపథ్‌’
05-07-2017 03:51:47
 
  • యాప్‌ను రూపొందించిన కుప్పం ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు
  • నేడు ఆవిష్కరించనున్న చంద్రబాబు
  • ఇస్రో-ఉన్నత విద్యా మండలి మధ్య ఎంవోయూ
  • ఏపీ స్పేస్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ఏర్పాటు
 
 
అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పిడుగుపాటును పసిగట్టేందుకు రూపొందించిన వజ్రపథ్‌ యాప్‌ను సీఎం చంద్రబాబు బుధవారం ఆవిష్కరించనున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఇస్రో, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో ఏపీ స్పేస్‌ ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. కాగా, ఇస్రో, బెంగళూరులోని ఓ స్టార్టప్‌ కంపెనీ సాయంతో చిత్తూరు జిల్లాలోని కుప్పం ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు ఈ యాప్‌ను రూపొందించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్‌ కాలేజీల సంయుక్త సహకారంతో ఈ యాప్‌ సేవలను వినియోగించుకోనున్నారు. ఇందుకు అవసరమైన సాంకేతికతను ఇస్రో, నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ అందించనున్నాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న యూనివర్సిటీలు, పలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పిడుగుపాటును గుర్తించి హెచ్చరికలు పంపే పరికరాలను అమరుస్తారు. పిడుగు పడే అవకాశం ఉండే వెంటనే ఆ సమాచారాన్ని వజ్రపథ్‌ యాప్‌ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

Vajrapaat app link https://play.google.com/store/apps/details?id=com.phonegap.weatherSOS

 

Sri NCBN launched the 'Vajrapaat App' making Andhra Pradesh the first State in the Country to have the "Proximity Lightning Alert" system in place. A team of five girl students of Kuppam Engineering college developed the app which alerts people about impending lightning strikes. The project was taken up by AP State Council of Higher Education (APSCHE) along with ISRO.

19780624_1735594716454112_59892351371690
19875643_1735594719787445_54939228758586
19665248_1735594936454090_27271441010439
19665373_1735594846454099_89327748409063
 
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 months later...
కృష్ణాజిల్లాలో పిడుగు పడే అవకాశం

636434220480732220.jpg


కృష్ణాజిల్లా: జిల్లాలో మైలవరం మండల పరిధిలో మరో 40 నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉందని విపత్తుశాఖ అధికారులు హెచ్చరిక చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Link to comment
Share on other sites

  • 5 months later...
కాసేపట్లో ప్రకాశం, కడప, అనంత జిల్లాల్లో పిడుగులు
30-03-2018 17:58:28
 
విజయవాడ: ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, కడప, అనంత జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం జిల్లా కంభం, దొనకొండ, గిద్దలూరు, పామూరు, బేస్తవారిపేట, ఎర్రగొండపాలెం, సీఎస్‌పురం, కనిగిరి, వెలిగొండ్ల మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే కడప జిల్లా పోరుమామిళ్ల, లక్కిరెడ్డిపల్లె, వీరబల్లె, గాలివీడు... అనంత జిల్లా కదిరి, తనకల్లు, నంబులిపులికుంట.. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమల, పీలేరు, మదనపల్లి, సోమాల మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
Link to comment
Share on other sites

30-15 minutes mundu phone ki SMS vastundi..

 

 NATIONAL DISASTER MANAGEMENT AUTHORITY OF INDIA asked all others states to follow what AP done on Thunder alert system

ANother fact is, CBN HUDHUD "how to prepare for future cyclone" report was used to do recommend disaster preparation projects&funds given to Gujarat coast by central Authority

kanisam CBN HUDHUD work ni appeciate cheyyakapoga a report vadukuni Gujarat  kooda money techukundi kani HUDHUD ki money ivvaledu...

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

  • 1 month later...
కృష్ణా జిల్లాకు పిడుగు హెచ్చరిక
03-05-2018 13:52:36
 
636609523604200346.jpg
కృష్ణా: కృష్ణా జిల్లాకు పిడుగు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మచీలిపట్నం, పెడన, గుడూరు, చల్లపల్లి, గుడ్లవల్లేరు, పామర్రు, మైలవరం, జి.కొండూరు, ఆగిరిపల్లి మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉదృతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.
Link to comment
Share on other sites

14 minutes ago, sonykongara said:
కృష్ణా జిల్లాకు పిడుగు హెచ్చరిక
03-05-2018 13:52:36
 
636609523604200346.jpg
కృష్ణా: కృష్ణా జిల్లాకు పిడుగు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మచీలిపట్నం, పెడన, గుడూరు, చల్లపల్లి, గుడ్లవల్లేరు, పామర్రు, మైలవరం, జి.కొండూరు, ఆగిరిపల్లి మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉదృతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

12 ki ivvalsina update idi now activity shifted to guntur and praksam

Link to comment
Share on other sites

  • 2 weeks later...
పిడుగుపాటుపై గ్రామాల్లో సైరన్లు!
15-05-2018 01:21:15
 
  • విద్యుత్‌పై 90% సంతృప్తి రావాలి
  • బోటు ప్రమాదాలపై దృష్టిపెట్టాలి: సీఎం
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): అరగంటలో పిడుగుపడుతుందంటే.. అది ఎక్కడ పడుతుందో చెప్పే పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. అమెరికాలోని ఒక కంపెనీతో చేసుకున్న ఒప్పందం ద్వారా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలో ఒక వ్యవస్థను దీనికోసం ఏర్పాటు చేశారు. పిడుగుపాటును ముందే చెప్పి ఫోన్‌ సందేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఆ సమయంలో ఫోన్‌ సిగ్నల్స్‌ పనిచేయకపోవడం, సందేశాలు చూసుకోకపోవడంతో ప్రజలు అప్రమత్తం కావడం లేదు. ఈ నేపథ్యంలో పిడుగుపాటుకు అరగంట ముందుగానే మోగేలా గ్రామాల్లో సైరన్లు మోగేలా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
 
 
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉపయోగిస్తున్న టెక్నాలజీకి ఈ సైరన్‌లను అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో 24గంటలు విద్యుత్‌ను అందిస్తున్నామని.. దీనిపై వినియోగదారుల్లో 90% సంతృప్తి రావాలని సూచించారు. ఈ-ప్రగతిపై చంద్రబాబు సోమవారం సమీక్షించారు. నందన్‌ నీలేకని కమిటీ 2012 నివేదిక ఆధారంగా ఈ-ప్రగతి మానవ వనరుల విధానం ఏర్పాటు చేస్తున్నామని ఐటీ సలహాదారు సత్యనారాయణ వివరించారు. ఈ-హైవే, ఈ-ప్రగతి పోర్టల్‌, యాప్‌ స్టోర్‌, ప్రధాన అంశాలుగా ఈ-ప్రగతి ఫ్లాట్‌ఫాం ఏర్పాటవుతుందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజా సాధికార సర్వే అనుసంధానంతో ఈ-ప్రగతి ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వీటికి సంబంధించి సమాచారం పంచుకోవడం, భద్రత వంటి విషయాలకు నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధ చేయాలన్నారు. ఇప్పటికే 10 వేల మంది ప్రజలు ఇటీవల విడుదల చేసిన ఎన్‌సీబీఎన్‌ యాప్‌ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో తాగునీటి సమస్యపై వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించామని తెలిపారు.
 
 
బోటు ప్రమాదాలపై..
ఇటీవల రాజమండ్రి నుంచి పాపికొండలకు వెళ్తున్న ఒక బోటులో మంటలు చెలరేగడం...ప్రాణ నష్టం లేకుండా అంతా బయటపడిన సంఘటనపై చంద్రబాబు సమీక్షించారు. బోటు ప్రమాదాలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. బోట్లు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో ఎక్కడెక్కడ బోటు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందో అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో కొందరు ఎక్సైజ్‌ ఉద్యోగులు కార్యాలయంలోనే మందు తాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

పిడుగుల తీవ్రతపై పరిశోధన అవసరం
15-05-2018 01:18:30
 
636619439108057117.jpg
  • ‘ఆంధ్రజ్యోతి’తో వాతావరణ నిపుణుడు భానుకుమార్‌
విశాఖపట్నం, మే 14(ఆంధ్రజ్యోతి): గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయని ఆంధ్ర విశ్వవిద్యాలయ వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యుడు ఓఎస్ ఆర్‌యూ భానుకుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి దేశంలో అనేక చోట్ల ఈదురుగాలులు, పిడుగులతో ప్రకృతి బీభత్సం పెరగడానికి ఇదే కారణమని ఆయన అన్నారు. ఇప్పటివరకు రుతుపవనాలపైనే వాతావరణ శాఖ, నిపుణులు దృష్టిసారించారని.. ఇక నుంచి పిడుగుల తీవ్రత పెరగడానికి గల కారణాలు కూడా అన్వేషించాలని అభిప్రాయపడ్డారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి భానుకుమార్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
 
ప్రీమాన్‌సూన్‌ సీజన్‌ అంటే?
ఏడాదిలో నాలుగు సీజన్‌లు ఉంటాయి. ప్రీమాన్‌సూన్‌, నైరుతి, ఈశాన్య రుతుపవనాలు, శీతాకాలం. రుతుపవనాల సీజన్‌లో దేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో దక్షిణాదిలో తుఫాన్‌లు సంభవిస్తాయి. ప్రీమాన్‌సూన్‌ సీజన్‌లో ఎండలు పెరిగి వాతావరణ అనిశ్చితి నెలకొంటుంది. మూడు నెలల ప్రీమాన్‌సూన్‌ సీజన్‌లో మార్చి, ఏప్రిల్‌తో పోల్చితే మే నెలలో థండర్‌ స్టార్మ్‌ (ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం) తీవ్రత ఎక్కువ. దేశంలోని అనేక ప్రాంతాలలో ఎండకు భూమి వేడెక్కింది. దీనికి సముద్రం నుంచి వీచే గాలులు తోడయ్యాయి. దాంతో వాతావరణ అనిశ్చితి నెలకొని క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించి థండర్‌ స్టార్మ్స్‌ సంభవిస్తాయి.
 
 
దేశంలో థండర్‌ స్టార్మ్‌ ప్రభావిత ప్రాంతాలేవీ?
ఈశాన్య భారతంలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు, ఉరుములు, పిడుగుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తూర్పు భారతంలోని పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, ఉత్తర బిహార్‌, యూపీలో కొంత భాగం, మహారాష్ట్రలో పశ్చిమ కనుమల ప్రాంతం, ఒడిశా, ఛత్తీస్ గఢ్‌, కోస్తా, తెలంగాణ, రాయలసీమ వంటి ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువ. కొండలున్నచోట క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరిస్తే రెండు, మూడు గంటల వ్యవధిలోనే పెను విధ్వంసం సృష్టిస్తాయి. వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ కారణంగా ఉత్తరాదిలో ఇసుక తుఫాన్‌లు, పెనుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఇక్కడ ఈదురుగాలులు, పిడుగుల తాడికి అధికమైంది. విచిత్రమేమిటంటే ప్రతి వేసవిలో వందల సంఖ్యలో వడగాడ్పుల మృతులు ఉంటారు అటువంటిది ఈ ఏడాది పిడుగులు, ఇసుక తుఫాన్‌ తీవ్రతకు పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. థండర్‌స్టార్మ్‌ తీవ్రతపై విస్తృత పరిశోధనలు అవసరం. దీనికి ఒక విభాగం ఏర్పాటు చేయాలి. లేదంటే భవిష్యతులో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
 
స్వల్పకాల వ్యవధిలో థండర్స్‌ తీవ్రత గుర్తించవచ్చు. అమెరికాలో నౌకాస్టింగ్‌ విధానం చాలా సంవత్సరాల క్రితమే అమలుచేస్తున్నారు. డాప్లర్‌ వెదర్‌ రాడార్లు ద్వారా తెలుసుకుని ప్రజలకు ముందస్తు సమాచారం పంపవచ్చు. పిడుగుల నుంచి రక్షణ కల్పించడం కొంతమేర కష్టమైన పనే. అయినా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో ముందుగా ప్రజల్ని అప్రమత్తం చేయగలం.
Link to comment
Share on other sites

పిడుగు పడినా కరెంటు పోదు!
15-05-2018 00:48:04
 
636619421690404228.jpg
కర్నూలు, మే 14(ఆంధ్రజ్యోతి): ఈదురుగాలులు వీచినా, పిడుగులు పడినా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేని విధంగా పంపిణీ వ్యవస్థలను నవీకరిస్తున్నామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ చెప్పారు. సోమవారం కర్నూలు జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ కేంద్రం, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్‌ వ్యవస్థ నవీకరణకు ప్రపంచబ్యాంకు రూ.4వేల కోట్లు విడుదల చేసిందన్నారు.
 
2014లో 22 మిలియన్ల విద్యుత్‌ కొరత ఉంటే 6 నెలల్లో అధిగమించామని, విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యం 9,529 మెగావాట్ల నుంచి 15,520 మెగావాట్లకు చేరి, 83 శాతం మెరుగుపడ్డామని చెప్పారు. ‘రాష్ట్ర విభజనకు ముందు ఎండాకాలమే కాదు.. వర్షాకాలంలో కూడా కరెంటు కష్టాలు ఉండేవి. ప్రస్తుతం మిగులు కరెంటుతో వివిధ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు నిరంతర విద్యుత్‌ అందిస్తున్నాం. 2022 నాటికి మరో 2,560 మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పత్తికి సమాయత్తమవుతున్నాం’ అని తెలిపారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...