Jump to content

Ramayapatnam port?


Recommended Posts

ఏపీకి దుగరాజపట్నం లేనట్లే!
ఆగిన నౌకాశ్రయ నిర్మాణ ప్రతిపాదన

ఈనాడు, విశాఖపట్నం: నెల్లూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించతలపెట్టిన దుగరాజపట్నం నౌకాశ్రయ నిర్మాణ ప్రతిపాదన నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టు లాభదాయకం కాదని నౌకాశ్రయ రంగం, సలహా సంస్థల నిపుణుల అధ్యయనంలో తేలినందున ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దుగరాజపట్నం వద్ద భారీ నౌకాశ్రయం నిర్మాణానికి కేంద్రం గతంలో హామీనిచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. ఇందుకోసం కేంద్రం రూ.5,500 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. ఆ నౌకాశ్రయం లాభదాయకతపై అధ్యయనం చేయించగా ఏ మాత్రం ప్రయోజనం కాదని తేలింది. దుగరాజపట్నం నౌకాశ్రయ నిర్మాణంపై తొలుత రైట్స్‌ సంస్థ ప్రాధమిక అధ్యయనం చేసింది. ఆ తరువాత ‘ఇ అండ్‌ వై’ సంస్థ మరింత లోతుగా పరిశీలించింది. అనంతరం కేంద్రం మెకిన్సే, ఎ.ఇ.కాం అనే సలహా సంస్థలతో అధ్యయనం చేయించింది. ప్రతిపాదిత తీరం వద్ద నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసినా నిష్ఫలమేనని అందరూ తేల్చారు. ఒక పక్క పులికాట్‌ సరస్సు ఉన్నందున నౌకాశ్రయం ఉన్నప్పటికీ పరిసరాల్లో పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు. పర్యావరణ అనుమతులు రావడం కూడా దుర్లభమే. మరోపక్క శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం ఉండడంతో నౌకాశ్రయ కార్యకలాపాలు నిరంతరాయంగా నిర్వహించడానికి అడ్డంకులు ఎదురవుతాయి. దుగరాజపట్నం నౌకాశ్రయం నిర్మించాలని భావిస్తున్న ప్రాంతానికి ఉత్తరంగా కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే కృష్ణపట్నం నౌకాశ్రయం ఉంది. 18 మీటర్ల డ్రాఫ్ట్‌తో భారీ నౌకలు వచ్చే సదుపాయాలతో ఆ నౌకాశ్రయం విజయవంతంగా నడుస్తోంది. దీని నుంచి వచ్చే పోటీని తట్టుకోవడం కూడా కష్టమే. దుగరాజపట్నం నౌకాశ్రయాన్ని ప్రధాన రైల్వే లైన్‌తో అనుసంధానించాలంటే 40 కిలోమీటర్ల రైల్వేలైను నిర్మించాలి. దీంతోపాటు ఆ నౌకాశ్రయాన్ని జాతీయ రహదారితో అనుసంధానించడం కూడా భారీ వ్యయంతో కూడుకున్నది. ఆయా కారణాలన్నింటి నేపథ్యంలో కేంద్రం ఇచ్చే రూ.5,500 కోట్లు బూడిదలో పోసిన పన్నీరవుతుందని నీతిఆయోగ్‌ ఉన్నతాధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో కేంద్రం దుగరాజపట్నం నౌకాశ్రయ నిర్మాణానికి బదులు అంతే విలువైన మరో నౌకాశ్రయం గాని, మరో ఇతర ప్రాజెక్టునుగాని ఎంపిక చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

Link to comment
Share on other sites

Guest Urban Legend

prakasan batch ipppudu gatiiga vanpic,ramayapatnam port edo okdani kosam mi nayakulani otthidicheyandi ,cbn meda kuda leda,,,,,,,,,

Link to comment
Share on other sites

  • 3 weeks later...
రామాయపట్నం పోర్టు ఎప్పుడు?
 
 
636318009356325977.jpg
సముద్రతీరంతో పాటుగా విలువైన ఖనిజ సంపద, జాతీయ రైలు మార్గం, జాతీయ రహదారి కలిగి సహజ వనరులతో అలరారుతున్న ప్రకాశం జిల్లా తరచూ కరువుకు బలిఅవుతూ ఉపాధి అవకాశాలు లేక వెనుకబడిన జిల్లాగా మిగిలిపోవడానికి 5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యమే కారణం. రామాయపట్నంలో భారీ నౌకాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని కార్యోన్ముఖం చేయాలి. కొన్ని వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగి రాష్ట్ర, కేంద్ర ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వగల రామాయపట్నం పోర్టు సీమాంధ్ర భాగ్య ప్రదాత కాగలదు.
 
 
అంతిమంగా నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి సాంకేతికంగా, పర్యావరణపరంగా అనుకూలమైన ప్రాంతం కాదని, ఆర్థికంగానూ లాభదాయకం కాదని నీతిఆయోగ్‌ తేల్చి చెప్పింది. పులికాట్‌ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం (Bird sanctuary), మడ అడవులు సమీపంలో ఉండడంతో అక్కడ పోర్టు వచ్చినా పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు. ప్రతి సంవత్సరం 70 నుంచి 80 కోట్లు అదనపు ఖర్చు చేసి డ్రెడ్జింగ్‌ చేస్తేనే గానీ భారీ నౌకల లంగరుకు అనుకూలం కాకపోవడం, అంతేకాక శ్రీహరికోట రాకెట్‌ కేంద్ర అంతరిక్ష ప్రయోగాల సమయంలో పోర్టు కార్యకలాపాలు నిలుపుదల చేయవలసి ఉంటుంది. దుగ్గరాజపట్నానికి దక్షిణం వైపు కేవలం 30 కి.మీల దూరంలోనే ప్రైవేటు రంగంలో కృష్ణపట్నం పోర్టు విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. 60 కి.మీ. పరిధి వరకు కృష్ణపట్నం పోర్టుకు పోటీగా వ్యాపార లావాదేవీలను నిషేధించే విధంగా ప్రభుత్వంతో కృష్ణపట్నం కంపెనీకి వ్యాపార ఒప్పందం ఉంది. ఇక ఉత్తరం వైపు తమిళనాడులో చెన్నై, ఎన్నోర్‌, కట్టుపల్లి పోర్టులు. మొత్తం 4 పోర్టులు చుట్టూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇంకా దుగ్గరాజపట్నానికి ప్రధాన రైలు మార్గంతో అనుసంధానిస్తూ 42 కి.మీ. నూతన రైలు మార్గం నిర్మించవలసి వుంటుంది. 800 కోట్ల రూపాయల వ్యయంతో 42 కి.మీ. 4 లైన్ల రహదారి నిర్మించి జాతీయ రహదారితో అనుసంధానించాలి.
 
2013లో నాటి యూపీఏ–2 ప్రభుత్వం తూర్పు తీరంలో రెండు భారీ ఓడరేవులను మంజూరు చేసింది. ఒకటి పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ వద్ద కాగా, రెండవది 150 టన్నుల సామర్థ్యంతో, రూ. 17,165 కోట్ల అంచనా వ్యయంతో 74:26 శాతం కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని దుగ్గరాజపట్నం పోర్టు. ఈ పోర్టు రూ. 6,031 కోట్ల అంచనాతో మొదటి దశ 2018 నాటికి పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014, షెడ్యూల్‌ – 13, సెక్షన్‌ – 93లో పేర్కొన్నారు. సాగర్‌, దుగ్గరాజపట్నం పోర్టులు రెండు కేబినెట్‌ ఆమోదం కూడా పొందాయి. విశాఖపట్నం పోర్టు ట్రస్టు అమెరికన్‌ కన్సల్టెన్సీ ద్వారా చేసి టెక్నో–ఎకనామిక్‌ అధ్యయనం ఆధారంగా నీతి ఆయోగ్‌ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం దుగ్గరాజపట్నం ప్రాజెక్టును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిస్తూ, ఈ ప్రాజెక్టు ప్రస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అంతే విలువైన మరో ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం పంపినట్లు తెలుస్తోంది.
 
కేంద్రం మంజూరు చేసిన రెండు భారీ ఓడరేవులలో ఆంధ్రప్రదేశ్‌లోని దుగ్గరాజపట్నం పోర్టు ఈ స్థితిలో ఉండగా, పశ్చిమబెంగాల్‌లో సాగర్‌ పోర్టు పనులు రూ. 515 కోట్లతో మొదటి దశ పనులు అప్రతిహతంగా ముందుకు సాగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కోల్‌కతా పోర్టు ట్రస్టు – పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం 74:26 భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న ఈ సాగర్‌ పోర్టును ప్రధాన రైల్వే మార్గంతో అనుసంధానించే విధంగా 1822 కోట్ల రూపాయలతో రోడ్‌ కం రైలు బ్రిడ్జి ప్రతిపాదన దశ దాటి డీపీఆర్‌ (detailed project report) తయారయి పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఎన్‌హెచ్‌–17ను అనుసంధానిస్తూ 4 లైన్ల రహదారిని వెడల్పు చేయ నిశ్చయించారు. 2019 నాటికి ఈ పోర్టును ప్రారంభించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. విశాఖపట్నం పోర్టు ట్రస్టు (వీపీటీ) ఉన్నతస్థాయి సలహా సంఘం శాస్ర్తీయ అంచనాలతో దేశంలోనే ప్రకాశం జిల్లాలో రామాయంపేట భారీ పోర్టు నిర్మాణానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా సిఫార్సు చేసింది. ఎంతోకాలంగా నిపుణులు, ప్రజాసంఘాలు దుగ్గరాజపట్నం అనువైనది కాదని రామాయపట్నం ప్రతిపాదనను పరిశీలించమని చేసిన డిమాండ్‌ను గత యూపీఏ ప్రభుత్వం పెడచెవిన పెట్టి రాజకీయ వత్తిడికే మొగ్గుచూపింది.
 
విభజన చట్టంలో ఈ ప్రాజెక్టును పేర్కొన్నందున నేటి కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించి చివరకు ఆర్థికంగా లాభదాయం కాదని ఇక్కడ పోర్టు ప్రతిపాదన ఉపసంహరించింది.
 
ఇది ఇలా ఉండగా రైల్‌ ఇండియా టెక్నికల్‌, ఎకనామిక్‌ సర్వీసెస్‌ (రైట్స్‌) సంస్థ రామాయపట్నంపై అధ్యయనం చేసి భారీ పోర్టు నిర్మాణానికి అనువైన ప్రదేశంగా భావించింది. సముద్రతీరం నుంచి కేవలం 10 కి.మీ.ల పరిధిలోనే 20 మీటర్ల సముద్రంలో తునుకల్లి జాతీయ రహదారికి ప్రధాన రైలుమార్గానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో పోర్టు ఉంటుంది. అధిక రవాణా ఖర్చులు భరిస్తూ ఈ ప్రాంతంలో లభ్యమవుతున్న గ్రానైట్‌ రాయి తదితర ఉత్పత్తులు చెన్నై, కృష్ణపట్నం ఓడరేవుల ద్వారా చైనా, జపాన్‌ సహా మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. పదివేల ఎకరాల విస్తీర్ణంలో పోర్టుతో పాటు షిప్‌ బిల్డింగ్‌, బ్రేకింగ్‌, అనుబంధ నౌకా విభాగాలతో వేలాది ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఇక్కడ కొత్తగా అనేక పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎగుమతులు, దిగుమతులు వృద్ధి చెంది పోర్టు కారణంగా పరిశ్రమలు, పరిశ్రమల ద్వారా పోర్టు పరస‍్పర ప్రయోజనకరంగా అభివృద్ధి చెందగలవు. పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఉన్న అనేక అవకాశాలు వచ్చే 5–10 సంవత్సరాలలో మరింతగా వృద్ధి చెందుతాయి. గ్రానైట్‌, పొగాకు, పత్తి, ఉప్పు (salt), ఆక్వా, ఇనుప ఖనిజం ఈ పోర్టు ద్వారా ఎగుమతులు జరుగుతాయి.
 
రామాయపట్నం ప్రాంతంలో నేషనల్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జోన్‌ (NMIZ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామని మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా అధికారులు ఇప్పటికే కనిగిరి, కందుకూరు ప్రాంతాలలోనూ లింగ‍సముద్రం, వలేటివారి పాలెం మండలాలలోనూ పారిశ్రామిక నడవా (ఇండస్ర్టియల్‌ కారిడార్‌) ఏర్పాటుకు లభ్యమయ్యే ప్రభుత్వ, ఎసైన్డ్‌, అటవీ భూములను గుర్తించడం జరిగింది. మూడు వేల నుంచి ఐదువేల హెక్టార్ల భూమి సేకరించి ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఐఐసీ)కి అప్పగించే లక్ష్యంతో ఉన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం వెలుగొండ ప్రాజెక్టు నీటిని కేటాయించే ఉద్దేశంతో ఉన్నారు.
 
దుగ్గరాజపట్నం పోర్టుతో పోల్చినప్పుడు రామాయపట్నం పోర్టుకు అయ్యే నిర్మాణ వ్యయం 780 కోట్ల రూపాయలు తక్కువగా ఉంటుందని రైట్స్‌ సంస్థ అభిప్రాయపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులు ప్రస్తుతం 125 మిలియన్‌ టన్నుల వరకు ఎగుమతులు, దిగుమతులు నిర్వహిస్తున్నాయి. ఇందులో విశాఖ, గంగవరం పోర్టు ద్వారా 85 శాతం, 15 శాతం కాకినాడ పోర్టు ద్వారా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 974 కి.మీ.ల తీరప్రాంతం ఉండడంతో గుజరాత్‌ తరహాలో అభివృద్ధి పథంలో పయనించగలదు. మరొకపక్క ప్రైవేటు పెట్టుబడుల ద్వారా డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (DBFOT) విధానంలో దేశంలో నూతన పోర్టుల ఏర్పాటుకు మారిటైం బోర్డు ప్రణాళికలను రూపొందిస్తున్నది. భారత్‌లో 1.16 బిలియన్‌ టన్నుల కార్గో సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచే విధంగా కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ ప్రణాళికా లక్ష్యలను పెట్టుకొన్నది. 2050 కలల రాజధానిపై ఊహలపల్లకిలో విహరింపచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సత్వరం రాష్ర్టానికి మేలు చేసే, ఉద్యోగాల కల్పన చేసే ప్రాజెక్టుల సాకారానికి సమయం వెచ్చించాలి.
 
సముద్రతీరంతో పాటుగా విలువైన ఖనిజ సంపద, జాతీయ రైలు మార్గం, జాతీయ రహదారి కలిగి సహజ వనరులతో అలరారుతున్న ప్రకాశం జిల్లా తరచూ కరువుకు బలిఅవుతూ ఉపాధి అవకాశాలు లేక వెనుకబడిన జిల్లాగా మిగిలిపోవడానికి 5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యమే కారణం. ఇంక ఏమాత్రం కాలహరణం చేయకుండా ఏపీ అసెంబ్లీలో రామాయపట్నంలో భారీ నౌకాశ్రయ నిర్మాణానికి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కార్యోన్ముఖం చేయాలి. కొన్ని వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగి రాష్ట్ర, కేంద్ర ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వగల రామాయపట్నం పోర్టు సీమాంధ్ర భాగ్య ప్రదాత కాగలదు.
అవధానుల హరి 
 
 
 
Link to comment
Share on other sites

రామాయపట్నం పోర్టు కోసం కృషి చేస్తా

భూగర్భ డ్రెయినేజీకి ప్రతిపాదనలు పంపండి

పౌరసన్మాన సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు

pks-gen1a.jpg

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రతి నగరంలో సౌకర్యాలు మెరుగుపరచుకోవాలి, అభివృద్ధి ధ్యేయంగా పని చేయాలి. 25 సంవత్సరాలకు పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. నగరంలోని ఏ-1 కన్వెన్షన్‌ హాలులో గురువారం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అధ్యక్షతన జరిగిన పౌరసన్మాన సభలో వెంకయ్య మాట్లాడారు. పురపాలక, నగరపాలసంస్థలు మౌలిక వసతులకు పెద్దపీట వేయాలన్నారు. మంత్రి వచ్చిన రోజు రోడ్లు వూడ్చి బ్లీచింగ్‌ చల్లితే సరిపోదు. నిరంతరం ప్రజల కోసం ఆ పనులు చేయాలన్నారు. కమిషనర్లు ఉదయం 5.30 కల్లా వీధుల్లో ఉండాలని, ప్రజలే లేచేసరికి వీధులు శుభ్రంగా ఉండాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఒంగోలుకు అవార్డు వచ్చినందుకు అధికారులను అభినందిస్తూ అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చేసిన విజ్ఞప్తులపై స్పందిస్తూ ఒంగోలులో భూగర్భ మురుగు కాలువల ఏర్పాటుకు సమగ్ర అంచనాలతో రాష్ట్రప్రభుత్వం ద్వారా నివేదిక పంపితే నిధులు మంజూరు చేస్తామన్నారు. రామాయపట్నం పోర్టు విషయం తన మనసులో ఉందని, త్వరలో సర్వే చేయించి పోర్టు మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నడకుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ వస్తుందని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, అవసరమైన సహకారం కేంద్రం అందిస్తుందన్నారు. రాష్ట్రానికి ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అన్ని జిల్లాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి కొన్ని సూచనలు చేయగా వాటిపై స్పందిస్తూ లక్ష జనాభా ఉన్న పట్టణాలకు అమృత్‌ నిధులు ఇస్తున్నామని, నగర పంచాయతీలకు కూడా నిధులు కేటాయించడానికి ఆర్థికశాఖ మంత్రితో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో మాదిరిగానే ఒంగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించాలని కేంద్రమంత్రిని కోరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ హరిబాబు మాట్లాడుతూ కొమ్మమూరు, బకింగ్‌హాం కాలువ ద్వారా జలరవాణాకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. సభలో ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, బత్తిన నరసింహారావు, దారా సాంబయ్యలు మాట్లాడారు. తెదేపా నాయకులు కరణం వెంకటేష్‌, దామచర్ల సత్య, ఏఎంసీ ఛైర్మన్‌ ఎస్‌.రాంబాబు, డెయిరీ ఛైర్మన్‌ చల్లాశ్రీను, బీఎన్‌ విజయకుమార్‌, భాజపా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, కమిషనర్‌ వెంకటకృష్ణ, ఆర్డీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వేదపండితుల ఆశీర్వచనాలతో వెంకయ్యనాయుడుకు పౌరసన్మానం చేశారు.

Link to comment
Share on other sites

chala teda undi ga

 

yes, for trucks that transport goods to and from port. But for a ship coming from 3000 km away it is pretty much same distance. So, advantage truckers, no loss for the ships. by the way, Ramayapatnam is mid point between Nellore and Ongole. It is almost southern tip of Prakasam dist.

Link to comment
Share on other sites

Ramayapatnam isthene better as Prakasam is most backward district in South Andhr, but only thing to note is all congress/ysrcp Jaffa leaders purchased lands around ramayapatnam including daggubati puradeswari ani news vachhindi in 2014.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...