Jump to content

నేడే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ


Ramesh39

Recommended Posts

‘పట్టభద్రులు, ఉపాధ్యాయ’ కూడా.. 

ఉదయం 8 నుంచి ప్రారంభం

అమరావతి: మూడు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గాలతోపాటు మరో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ప్రధానంగా కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షం వైకాపా పోటాపోటీగా నిలిచాయి. ఓటర్లకు ప్రత్యేకంగా శిబిరాలను నిర్వహించి పోలింగ్‌కు గట్టి జాగ్రత్తల మధ్య వారిని తీసుకువచ్చాయి. కడప జిల్లాలో పోలింగ్‌ హోరాహోరీగా సాగిన నేపథ్యంలో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. వైకాపా కంచుకోటగా ఉన్న కడపలో పాగా వేసేందుకు అధికార తెదేపా ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విజయంపై రెండు పార్టీలవారు ఎవరికివారు లెక్కలేసుకుంటున్నారు. క్రాస్‌ ఓటింగ్‌తో తమకంటే తమకే లాభం జరగనుందంటూ రెండు పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తుండడంతో సోమవారం జరగనున్న ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కడపతోపాటు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో విజయంపైనా రెండు పార్టీలూ ఆశలు పెట్టుకున్నాయి.

మరోవైపు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కర్నూలు-కడప-అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గాలతోపాటు మరో రెండు ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కర్నూలు-కడప-చిత్తూరులోనూ సోమవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. కర్నూలు-కడప-అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గంలో అధికార తెదేపా, వైకాపా వేర్వేరు అభ్యర్థులకు మద్దతుగా నిలిచాయి. దీంతో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా మారింది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గంలో సిట్టింగ్‌ స్థానంగా పీడీఎఫ్‌, పట్టు సాధించాలని తెదేపా-భాజపా కూటమి పోటాపోటీగా నిలిచాయి. ఇక్కడ పీడీఎఫ్‌ అభ్యర్థి, తెదేపా-భాజపాల కూటమి తరఫున భాజపాకు చెందిన అభ్యర్థి పోటీలో ఉన్నారు. పోలింగ్‌ జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పాగావేసేందుకు తెదేపా గట్టి ప్రయత్నమే చేసిందని చెప్పొచ్చు.

ఉదయం నుంచే మొదలు 

ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలు ఏర్పాట్లు చేశాయి. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు ప్రారంభమవనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఫలితాలు సోమవారం పగలే వెలువడనున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదటి ప్రాధాన్యత, రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లను ప్రతీ అభ్యర్థి వారీగా లెక్కించాల్సి ఉంది. మరోవైపు ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల సంఖ్య కాస్త ఎక్కువ ఉండడమే ఇందుకు కారణం.

Link to comment
Share on other sites

ఎమ్మెల్సీ ఎన్నిల ఓట్ల లెక్కింపు ప్రారంభం

అమరావతి: రాష్ట్రంలోని మూడు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గాలతో పాటు మరో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల అధికార యంత్రాగాలు పటిష్ట ఏర్పాట్లు చేశాయి. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు సోమవారం పగలే వెలువడనున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మాత్రం అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Link to comment
Share on other sites

నెల్లూరు ఎమ్మెల్సీ తెదేపా కైవసం

నెల్లూరు: నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం తెదేపా కైవసం చేసుకుంది. తెదేపా అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి.. వైకాపా అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై 85 ఓట్ల తేడాతో గెలుపొందారు. వాకాటి నారాయణరెడ్డి 462 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డికి 377 ఓట్లు వచ్చాయి

Link to comment
Share on other sites

కడప: కడప స్థానిక సంస్థల ఎన్నికల స్థానాన్ని తెదేపా కైవసం చేసుకుంది. తెదేపా అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్‌ రవి)... వైకాపా అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు. ఓటింగ్‌ ప్రక్రియ పూర్తకాకముందే ఓటమి నిర్ధారణ కావడంతో వైకాపా శ్రేణులు ఓటింగ్‌ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో తెదేపాకు 433 ఓట్లు రాగా.. వైకాపాకు 399 ఓట్లు వచ్చాయి.

కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను తెదేపా, వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డాయి. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాయి. ఓట్ల లెక్కింపులో తొలుత వైకాపా అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగగా.. అనంతరం తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి క్రమంగా ఓట్లను పెంచుకుంటూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. చివరకు బీటెక్‌ రవి 33 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. వైకాపాకు మంచి పట్టున్న కడప జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవడంతో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Link to comment
Share on other sites

కర్నూలు ‘స్థానిక’ ఎమ్మెల్సీ తెదేపాదే 

20brk58a.jpg

కర్నూలు: కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై తెదేపా అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 56 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...