Jump to content

'AP Purse' e-wallet mobile app


sonykongara

Recommended Posts

ఏపీ పర్స్‌ మొబైల్‌ వ్యాలెట్‌ ప్రారంభం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ పర్స్‌ మొబైల్‌ వ్యాలెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఏపీ పర్స్‌ మొబైల్‌ వ్యాలెట్‌ ప్రారంభించినట్లు చెప్పారు. మొబైల్‌ యాప్‌ ద్వారా బ్యాంకు సేవలన్నీ వినియోగించుకోవచ్చని తెలిపారు. ఏపీ పర్స్‌ మొబైల్‌ ఆన్‌ చేయగానే 23 సంస్థలు కనిపిస్తాయి, వాటిలో దేన్నైనా ఎంచుకుని సేవలు వినియోగించుకోవచ్చని వివరించారు. మొబైల్‌ వ్యాలెట్‌ ద్వారా విడతల వారీగా నగదు బదిలీ చేసుకోవచ్చని సూచించారు.

Link to comment
Share on other sites

ఏపీ పర్స్‌ రెడీ
 
636166733004670308.jpg
  • 13 బ్యాంకులు, 10 యాప్‌లు సంధానం
  • సులభం.. సురక్షితం.. సునాయాసం
  • ఈ తరహా యాప్‌ ప్రపంచంలోనే ప్రథమం
  • డౌన్‌లోడ్‌ చేయిస్తే ప్రోత్సాహకాలు: సీఎం
  • యాప్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు
 
అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నగదురహిత లావాదేవీల దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు ‘ఏపీ పర్స్‌’ మొబైల్‌ యాప్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మంగళవారం విజయవాడ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ యాప్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ యాప్‌ ప్రచారం కోసం పనిచేసేవారిని ‘మార్పు నేస్తం’గా పిలుస్తామన్నారు. ఏపీ పర్స్‌లో 13 బ్యాంకులు, 10 మొబైల్‌ యాప్‌లు ఉంటాయని.. మరో ఆరు మొబైల్‌ యాప్‌లు చేరే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా సులభంగా.. సురక్షితంగా.. సునాయాసంగా నగదు రహిత లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపారు. ఏపీ పర్స్‌ను ఎవరైనా తమకు తెలిసినవారి ఫోనలో డౌనలోడ్‌ చేయిస్తే రూ.15 ప్రోత్సాహకంగా అందిస్తామన్నారు. నెలకు ఏడు నగదు రహిత లావాదేవీలు చేయిస్తే రూ.20 ఇస్తామని.. మొత్తంగా రూ.35 అందిస్తామన్నారు.
 
అదేవిధంగా ఏపీ పర్స్‌లో ఉన్న బ్యాంకర్లు, మొబైల్‌ యాప్‌లు విడిగా సుమారు రూ.15 వరకు ప్రోత్సాహకంగా అందజేస్తాయన్నారు. మొత్తం మీద యాప్‌ డౌన్‌లోడ్లకు రూ.50లు వరకు అందుతుంది. ప్రజలకు.. డిజిటల్‌, ఫైనాన్షియల్‌ అక్షరాస్యత కల్పించేందుకు యువత ముందుకు రావాలన్నారు. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా దీనిపై పనిచేయాలన్నారు. తద్వారా వారికి నెలకు రూ.4 - 5వేల ఆదాయంతోపాటు, కమ్యూనికేషన నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. గ్రామాలకు గ్రామాలను డిజిటల్‌గా మార్చాలని యువతకు సీఎం పిలుపునిచ్చారు. ఆ గ్రామంలోని వ్యక్తులను మార్చినందుకు ఇచ్చే ప్రోత్సాహంతో పాటు.. గ్రామం మొత్తం మారినందుకు అదనపు ప్రోత్సాహం ఇస్తామన్నారు.
 
రెండువేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.15 వేలు, 2-5వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.25 వేలు, 5-10వేల మధ్య జనాభా ఉన్న గ్రామాలకు రూ.50వేలు, 10వేల పైన ఉన్న జనాభాకు లక్ష రూపాయలు ప్రోత్సాహకం ఇస్తామన్నారు. ఇలాంటి యాప్‌ను రూపొందించడం ప్రపంచంలోనే ప్రథమం అని సీఎం తెలిపారు. ప్రతిరోజు నగదు ఎంతుందన్న అంశంపై సమీక్షలు నిర్వహిస్తున్నానని...మంగళవారం ఉదయానికి రూ.2040 కోట్లు బ్యాంకుల్లో ఉందన్నారు. శుక్రవారానికి చిన్ననోట్లు, వచ్చేవారం రూ.500నోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.
 
రూ.10 వేల నగదు ఇస్తే వెంగళరావు కేసు పెట్టారు
ఒకప్పుడు కంప్యూటర్ల వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ తన వద్దకే వచ్చి కొందరు ఫిర్యాదు చేశారని...ఇప్పుడు వారే కంప్యూటర్‌తో సౌలభ్యం పెరిగిందని అంటున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు బ్యాంకు అంటే నగదు లావాదేవీలేనని, తర్వాత చెక్‌లు వచ్చాయని, ఇప్పుడు మొబైల్‌తో నడుస్తుందన్నారు. తెదేపా పెట్టిన కొత్తలో ఒక పనికి రూ.30వేలు ఇవ్వాల్సి వస్తే...చెక్‌ ఇవ్వకుండా నగదు ఇచ్చామని, దీంతో అప్పటి సీఎం వెంగళరావు కేసు పెట్టించారన్నారు.
 
ఏపీ పర్స్‌ డౌనలోడ్‌ ఇలా
గూగుల్‌ ప్లే స్టోర్‌కు వెళ్లి ఏపీపర్స్‌ను డౌనలోడ్‌ చేసుకోవచ్చు. డౌనలోడ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయగానే మీ పేరు, సెల్‌ఫోన నెంబరు అడుగుతుంది. అవి ఎంటర్‌ చేయగానే...మీ ఫోన నెంబరకు ఒక ఓటీపీ నెంబరు వస్తుంది. ఆ నెంబరును ఎంటర్‌ చేస్తే డౌనలోడ్‌ అవుతుంది. ఓపెన చేస్తే అందులో సేవలందించే 13 బ్యాంకులు, 10 మొబైల్‌ యాప్‌లు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చినదాన్ని ఎంచుకుని ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
Link to comment
Share on other sites

ఏ.పి పర్స్‌ యాప్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి

 

 
 

 

 

ap-purse-1.jpg

పెద్ద నోట్ల రద్దు తర్వాత, దేశమంతా చిల్లర కష్టాల్లో మునిగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం చిల్లర కష్టాల నుంచి ఎలా బయటపడాలనే ఆలోచనలు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ను నగదు రహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టిన మొదటి ప్రయత్నం ఏపి పర్స్ యాప్. విజయవాడలో ఏపీ పర్స్‌ మొబైల్‌ వ్యాలెట్‌ను ఆవిష్కరించారు చంద్రబాబు ఈ 'ఏపి పర్స్‌' యాప్‌తో మీ ఫోనే మీ బ్యాంక్‌ కానుంది. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా బ్యాంకు సేవలన్నీ వినియోగించుకోవచ్చు.

‘ఏపి పర్స్‌’యాప్‌లో 23 బ్యాంకులు, మరో 10 మొబైల్ వాలెట్లు ఉంటాయ. త్వరలో మరో ఆరు మొబైల్‌ యాప్‌లు చేరుస్తారు. ‘సులభం, సురక్షితం, సునాయసం’ పేరుతో ‘ఏపీ పర్స్‌’ యాప్‌ ప్రమోషన్‌ చేయనున్నారు.

ఈ యాప్‌ను విస్తృత వినియోగంలోకి తేవడానికి (చేంజ్‌ ఏజెంట్‌) 'మార్పు నేస్తం' అనే పేరుతో కొంత మందిని నియమిస్తున్నట్లు చంద్రబాబు వివరిచారు. ఖాతాదారులు చేసే లావాదేవీల్లో వీరికి కమిషన్‌ ఇస్తామని చెప్పారు. ఏపీ పర్స్‌ను ఎవరైనా తమకు తెలిసినవారి ఫోనలో డౌనలోడ్‌ చేయిస్తే రూ.15 ప్రోత్సాహకంగా ఇస్తారు. నెలకు ఏడు నగదు రహిత లావాదేవీలు చేయిస్తే రూ.20 ఇస్తారు. అదేవిధంగా ఏపీ పర్స్‌లో ఉన్న బ్యాంకర్ల మొబైల్‌ యాప్‌లు విడిగా సుమారు రూ.15 వరకు ప్రోత్సాహకంగా అందజేస్తాయన్నారు. మొత్తంగా, ఒక వ్యక్తికి మీరు, ఈ యాప్ వాడకం తెలిపి, వాళ్ళ చేత లావాదేవీలు చేపిస్తే, మీరు రూ.50 వరకు సంపాదించవచ్చు.

అయితే, ఈ యప్ మిగతా బ్యాంకులు, వాలెట్ల కి ఇంటర్ఫేస్ గానే ఉంది. ఈ యప్ ద్వారా, పేమెంట్స కూడా జరిగే అవకాసం ఉంటే బాగుంటుంది అని, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారు అంటున్నారు.

ఏపి పర్స్‌ యాప్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి

1. గూగుల్‌ ప్లే స్టోర్‌కు వెళ్లి ఏపి పర్స్‌ను డౌనలోడ్‌ చేసుకోవాలి

https://play.google.com/store/apps/details?id=com.fastlane.appurse

ap-purse-2.jpg

2. తరువాత భాష సెలెక్ట్ చేసుకోవాలి . ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు సెలెక్ట్ చెయ్యవచ్చు

ap-purse-3.jpg

3. తరువాత మీ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి... మీ పేరు, సెల్‌ఫోన నెంబరు అడుగుతుంది.

ap-purse-4.jpg

4. అవి ఎంటర్‌ చేయగానే...మీ ఫోన నెంబరకు ఒక ఓటీపీ నెంబరు వస్తుంది. ఆ నెంబరును ఎంటర్‌ చేస్తే యప్ లోకి ఎంటర్ అవుతారు

ap-purse-5.jpg

5. ఓపెన చేస్తే అందులో సేవలందించే 13 బ్యాంకులు, 10 మొబైల్‌ యాప్‌లు కనిపిస్తాయి.

వాటిలో మీకు నచ్చినదాన్నికావలసిన దాన్ని ఎంచుకుని ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

ap-purse-6.jpg

ఏపి పర్స్‌ లో, ఈ 10 మొబైల్ వాలెట్లు ఉంటాయ.

Mobikwik

A Wallet

P ICICI Bank

Freecharge

Jio Money

Paytm

Speed Pay

Vodafone m-pesa

Chillr

Airtel Money

ఏపి పర్స్‌ లో, ఈ బ్యాంకు యాప్స్ ఉంటాయ.

SBI

HDFC

Axis

Bank of India

IDBI

Syndicate Bank

Punjab National Bank

ICICI

Canara Bank

Bank of Baroda

Union Bank of India

Andhra Bank

And Many More will be Added Shortly

Link to comment
Share on other sites

క్యాష్ లెస్ జమానా వైపు ఖజానా పరుగులు తీస్తున్న సమయంలో గ్రౌండ్ లెవెల్ నుంచి మార్పులు వస్తున్నాయ్ ఏపీలో! షాపులు,షాపింగ్ మాల్సూ కాదు… ఆఖరికి రైతు బజార్లలో కూడా క్యాష్ లెస్ లావాదేవీలు మొదలైయ్యాయ్.
మొదట రాజధానితో మొదలుపెట్టి… మరో రెండు వారాల్లో రాష్ట్రమంతా విస్తరించేందుకు సన్నాహాలు సాగుతున్నాయ్. ఇంతకీ ఏం జరుగుతోందో… ఎలా జరుగుతోందా తెలుసా ?

విజయవాడలో బిజీయెస్ట్ రైతు బజార్ స్వరాజ్ మైదానంలోది ! ఉదయం సాయంత్రం కిటకిటలాడిపోతుంది. పది కాళేశ్వర్రావు మార్కెట్లు అక్కడే ఉన్నట్టుగా కనిపించే సందర్భాలు చాలానే ఉంటాయ్. అలాంటి రైతు బజార్ పెద్ద నోట్ల రద్దు తర్వాత పల్చబడిపోయింది. వెలవెలబోయింది. ఏం చేయాలి… ఎలా చేయాలి అని ఆలోచించిన అధికారులు కొత్త సిస్టమ్ ని రైతు బజార్ కి తెచ్చారు. ఇటు కొనేవాళ్లకి ఇబ్బంది అనే మాత్రమే కాదు… అమ్ముకునేవాళ్లకి సౌకర్యం కూడా ఉండాలనే స్వైపింగ్ మెషీన్లు దిగాయ్ రైతుబజార్ లో ! ఒకేసారి నలభై యంత్రాలు రంగంలోకి దింపారు. రైతు మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్నవాళ్లందరికీ బ్యాంకుల్లో అక్కౌంట్లు తెరిచారు.

ఇంకేముంది… 70, 90, 150 ఎంత పెట్టి కూరగాయలు కొన్నా… కార్డుతో వాడుకునే వీలు కల్గిందిప్పుడు !
నిజానికి రైతు బజార్లో కూరలు అమ్ముతున్నవాళ్లలో చాలామందికి కార్డు వాడకం ఎలాగో తెలియదు. డబ్బులు అక్కౌంట్లో పడుతున్నాయో లేదో అర్థం కాదు. కానీ వాళ్లలో భరోసా కల్పించేందుకు వాలంటీర్ల సాయం తీసుకున్నారు. సాయంత్రానికి వాళ్ల అక్కౌంట్ స్టేట్ మెంట్ పట్టుకొచ్చి చూపించారు. ఇదిగో ఇదీ నువ్ చేసిన వ్యాపారం అనేసరికి వాళ్ల కళ్లల్లో వెలుగు కనిపించింది. ఇదోరకంగా పైలెట్ ప్రాజెక్ట్ ! ఇక్కడ క్లిక్ అయ్యింది కాబట్టి బెజవాడలో ఉన్న మిగతా నాల్గు రైతు బజార్లలో కూడా మొదలవుతోంది త్వరలో !

అటు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఆలోచన. రైతు బజార్లలోనే కార్డు లావాదేవీలు వచ్చాయంటే ఇక మిగతా చోట్ల కూడా చొచ్చుకువస్తున్నట్టే లెక్క ! అక్కౌంట్లున్న ప్రతి ఒక్కరికీ ఏటీఎం కార్డు ఉంటోంది కాబట్టి ఇపుడు అయితే ఏటీఎం – లేదంటే పేటీఎంతో ఏపీ గట్టెక్కుతున్నట్టుగా ఉంది కరెన్సీ కష్టాల నుంచి !

Link to comment
Share on other sites

Agree, oka sari reviews choodandi.................it is just linking the e-wallets apps in market. Adhi yedho direct ga Paytm and free charge yeh install chesukunta kada

 

Don't know who guides and who suggests them, but nowadays users are far more advanced than developers( atleast from govt org side).

 

 

Ippatiki vacchi okka bank lo kuda utilities payment section lo AP name undadhu...............on all banks and cards only HYD is listed. Except power bill of some discoms, nothing is online in AP. Water tax, property tax etc nothing is online

 

We have to concentrate on them first and then promote these kind of apps. 

 

Where to use and how to use,  specific vendors like paytm and freecharge are aggressively promoting.  we don't need to bother much. But we have to make our services payable online!

Link to comment
Share on other sites

వ్యాలెట్... ఆల్ ది బెస్ట్
 
636172232628002026.jpg
స్మార్ట్‌ ఫోన్‌లో ఉంటే ఈజీ
సులభతరం కానున్న లావాదేవీలు
నగదు, కార్డు రహిత డీలింగ్స్‌కు ఉపయుక్తం
పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌

అవగాహనతో ఊపందుకున్న వినియోగం
 
నగదు రహిత లావాదేవీలు...ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే ప్రధాన చర్చనీయాంశం. నోట్ల రద్దు ప్రభావంతో నగదు కొరత సమస్య ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. దీంతో నగదు రహిత లావాదేవీలపట్ల సహజంగానే ఆకర్షణ పెరిగింది. అవసరం కూడా ఏర్పడింది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు తప్పనిసరిగా నగదు రహిత లావాదేవీలకు మారాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లోపించడం, అవగాహన తక్కువగా ఉండడం సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో వ్యాలెట్‌లు, వాటి ఉపయుక్తంపై ప్రజలు అవగాహన ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉంది.

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి): వ్యాలెట్‌...ఇప్పుడు కాస్త అవగాహన ఉన్న వారి నోట్లో నలుగుతున్న పదం. పెద్దనోట్ల రద్దు తర్వాత వీటి వినియోగం ఎక్కువైంది. కొన్ని బ్యాంకులు, ఇతర సంస్థలు రూపొందించిన వ్యాలెట్‌ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నగరంలో ఊపందుకున్నాయి. ఇంకా కొన్ని వర్గాలకు చెందిన ప్రజలు నగదు రహిత లావాదేవీల వైపు మళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల వ్యాలెట్‌లను వినియోగించడం ద్వారా సులువుగా తమ వ్యాపారాలను చేసుకునేందుకు అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయా వ్యాలెట్‌ల ద్వారా చిన్న చిన్న కొనుగోళ్లకు అవసరమైన మొత్తాలను కూడా అకౌంట్‌లోకి పంపించుకునే అవకాశముందంటున్నారు. వ్యాలెట్ల వినియోగం, వాటి ద్వారా అకౌంట్లలోకి డబ్బును బదిలీ చేయడం ఎలా? ఆయా వ్యాలెట్ల వినియోగం వల్ల వినియోగదారుడికి, కొనుగోలుదారుడికి కలిగే ఉపయోగాలు, ఆయా సంస్థలు అందిస్తున్న కొన్ని రకాల ఆఫర్లపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

 
ఇవీ వ్యాలెట్‌లు
స్మార్ట్‌ ఫోన ఉన్న ప్రతి ఒక్కరి సెల్‌ఫోనలో వివిధ రకాల వ్యాలెట్‌లు దర్శనమిస్తుంటాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా వ్యాపార అవసరాల కోసం వ్యాలెట్‌లు రూపొందించుకుంటే ఇప్పుడి ప్పుడే కొన్ని బ్యాంకులు కూడా వ్యాలెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిలో ప్రధానంగా పేటీఎం, మొబిక్విక్‌, ఫ్రీచార్జ్‌, ఎయిర్‌టెల్‌ మనీ, జియో మనీ, మోమియా, పే యూ మనీ, సిర్టస్‌, స్టేట్‌ బ్యాంక్‌ బడ్డీ, సిటీ మాస్టర్‌ ప్లాన, ఐసీఐసీఐ పాకెట్స్‌, హెచడీఎఫ్‌సీ చిల్లర్‌, లైమ్‌తో ప్రభుత్వం రూపొందించిన ఏపీ పర్సు వంటి వ్యాలెట్‌లో దేశంలో విరివిగా వినియోగిస్తున్నారు. నగరంలో మాత్రం పేటీఎం, ఎయిర్‌ టెల్‌ మనీ, స్టేట్‌ బ్యాంక్‌ బడ్డీ వ్యాలెట్‌లు ఉన్నాయి. ఆయా వ్యాలెట్‌లను విని యోగించడం ద్వారా నగదు రహిత లావా దేవీల దిశగా సాగేందుకు అవకాశం ఉంది.
 
మినీ బ్యాంక్‌గా మొబైల్‌
వ్యాలెట్‌ ఉంటే మినీ బ్యాంక్‌ ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో దాదాపు ఇరవైకి పైగా వ్యాలెట్‌లు అందుబాటులో ఉన్నా యి. వ్యాలెట్‌లు వినియోగిస్తే నగదు, కార్డులు కూడా అవసరం ఉండదు. మన అవసరాల మేరకు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంది. సెల్‌ఫోన తోడుంటే అన్నిరకాల వస్తు వులను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆయా వ్యాలెట్‌ల ద్వారా ఇతరుల అకౌంట్లలోకి నగదు బదిలీ చేసుకోవచ్చు. ఆయా వ్యాలెట్‌ల ద్వారా రెండు రకాలుగా మార్కెట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆనలైన కొనుగోళ్లతోపాటు అక్కడికక్కడే నగదు బదిలీ చేసే అవకాశం వీటివల్ల ఉంది. ఉదాహరణకు ఆనలైనలో నచ్చిన వస్తువును కొనుగోలుచేసి వ్యాలెట్‌ ద్వారా పేమెంట్‌ చేయొచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక షాపునకు వెళ్లి అక్కడ కొనుగోలుచేసిన వస్తువు ధరకు సరిపడేనగదును అక్కడికక్కడే అమ్మకందారుడి వ్యాలెట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు.

ముందుగా రిజిస్ట్రేషన్
ఏదైనా వ్యాలెట్‌ను వినియోగించాలంటే ముందుగా రిజిస్టర్‌ కావాలి. ఆయా వ్యాలెట్‌ అప్లికేషన డౌనలోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డౌనలోడ్‌ చేసుకున్న అప్లికేషన ఓపెన చేసిన వెంటనే రిజిస్టర్‌, లాగిన అన్న రెండు ఆప్షనలు కనిపిస్తాయి. మొదట రిజిస్టర్‌ కావాలి. రిజిస్టర్‌పై క్లిక్‌ చేయగానే ఫోన నంబర్‌గాని, ఈమెయిల్‌తో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. కొన్ని వ్యాలెట్‌లు రెండింటినీ అడుగుతుంది. ఇలా చేయగానే వ్యాలెట్‌ల్లో అకౌంట్‌ క్రియేట్‌ అవుతుంది. అకౌంట్‌ క్రియేట్‌ కాగానే బ్యాలెన్స జీరోగా చూపిస్తుంది. వ్యాలెట్‌లోకి బ్యాలెన్స అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆయా వ్యాలెట్‌ల స్థాయిని బట్టి ఒకేసారి రూ.20 వేల వరకు లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. వ్యాలెట్‌లోని యాడ్‌ టూ మనీ ఆప్షన్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. యాడ్‌ టూ మనీ అని కొట్టగానే మన దగ్గర ఉన్న డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ల్లోని ఏదో ఒకదాని వివరాలు అడుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఏడ్‌ మనీ ఆప్షనను పూర్తి చేసుకోవచ్చు.

 
వ్యాలెట్‌తో కొనుగోళ్లు ఈజీ
ఆయా వ్యాలెట్‌ల ద్వారా నగదు రహిత లావాదేవీలను చేసుకోవచ్చు. సాధారణంగా కొనుగోళ్లు సందర్భంలో మనం నగదు, డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తుంటాము. వ్యాలెట్‌లో క్యాష్‌ ఉంటే వీటి అవసరం ఇక ఉండదు. ఆనలైనలో, బయట మార్కెట్‌లో కూడా కొనుగోళ్లు చేసుకోవచ్చు. మార్కెట్‌లో ఏదైనా వస్తువు కొన్నప్పుడు సదరు వ్యక్తికి ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో వ్యాలెట్‌ ద్వారా అవతలి వారి వ్యాలెట్‌కు నగదును బదిలీ చేసుకోవచ్చు. కొనుగోళ్లు పూర్తయిన తర్వాత సెండ్‌, రిసీవ్‌ అన్న ఆప్షనలు వ్యాలెట్‌లో కనిపిస్తాయి. ఆయా ఆప్షనల ద్వారా లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. మన ఫోన నంబర్‌ను సదరు అమ్మకందారుడికి చెప్పడమో, అతని నంబర్‌ను తీసుకునో క్రయ విక్రయాలు పూర్తి చేసుకోవచ్చు. అవతలి వ్యక్తికి సంబంధించిన వ్యాలెట్‌ నంబర్‌ కొట్టగానే ఓటీపీ వస్తుంది.
 
దాన్ని ఎంటర్‌ చేయడంతోపాటు ఎంతమొత్తం చెల్లించాలో దాన్ని ఎంటర్‌ చేస్తే సదరు వ్యక్తి వ్యాలెట్‌లో ఆ మొత్తం జమవుతుంది. ఈ విధంగా ఒకరి వ్యాలెట్‌ నుంచి మరొకరి వ్యాలెట్‌కు నగదు బదిలీ చేసుకోవడం వల్ల చేతిలో డబ్బులు లేకున్నా ఎంచక్కా క్రయవిక్రయాలు పూర్తి చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఓ చిన్న తిరకాసు ఉంది. ఒక సంస్థకు చెందిన వ్యాలెట్‌ నుంచి వేరే సంస్థకు చెందిన వ్యాలెట్లలోకి మొత్తాన్ని పంపించడం సాధ్యం కాదు. ఉదాహరణకు స్టేట్‌ బ్యాంక్‌ బడ్డీ వ్యాలెట్‌ ఉన్న వ్యక్తి స్టేట్‌ బ్యాంక్‌ బడ్డీ వ్యాలెట్‌ ఉన్న వ్యక్తికి మాత్రమే నగదు బదిలీ చేసే వీలుంటుంది. కానీ పేటీఎం వ్యాలెట్‌కు నగదు బదిలీ చేసే అవకాశం లేదు.
 
స్మార్ట్‌ ఫోన్‌తో లావాదేవీలన్నీ...
స్మార్ట్‌ ఫోన వినియోగం పెరిగిన తర్వాత లావాదేవీలన్నీ ఆనలైనలోనే జరుగుతున్నాయి. మనీ వ్యాలెట్‌లు వచ్చిన తర్వాత వాటి విస్తృతి మరింత పెరిగింది. వ్యాలెట్‌లు ఉంటే చిన్నపాటి బ్యాంక్‌ మన చేతిలో ఉన్నట్లే అన్న అభిప్రాయం నెలకొంది. టీ తాగడం నుంచి ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసుకోవడం వరకు ఫోన్‌లో ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన వ్యాలెట్‌ ఉంటే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల వ్యాలెట్‌లను ఒకే దగ్గరకు చేరుస్తూ ఏపీ పర్సును తీసుకువచ్చింది. దీనివల్ల కూడా వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నా. మరికొద్ది రోజుల్లో మార్కెట్‌లోని ప్రతి దుకా ణం వద్ద కూడా వ్యాలెట్‌లు కనిపిస్తాయి. ఇప్పటికే కూరగాయలు, టీ దుకాణాల్లో కూడా వ్యాలెట్‌లు వెలిశాయి. ప్రజలంతా వ్యాలెట్‌లను వినియోగించడం మొదలుపెడితే వారికి కూడా కొన్ని రకాల ప్రయోజనాలు సమకూరుతాయని చెప్పొచ్చు. - పి.జగదీష్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ఎన్నో ఉపయోగాలు
వ్యాలెట్‌లు వినియో గించడం వల్ల వినియోగ దారునికి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. నగదు, కార్డు లేకుండా క్రయవిక్రయాలు చేసుకోవచ్చు. ఆయా వ్యాలెట్‌లలోకి క్యాష్‌ లోడ్‌ చేసేటప్పుడు ఐదు నుంచి పది శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను ఆయా సంస్థలు ప్రకటిస్తున్నాయి. వీటితోపాటు పండగ రోజుల్లో క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్‌ ఆఫర్లను సంస్థలు అందజేస్తున్నాయి. అయితే వ్యాలెట్‌ల వినియోగంపై ప్రజల్లో కొన్ని రకాల అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయడంతోపాటు వాటి వినియోగానికి సంబంధించి అవగాహన కలిగిస్తే మరింత మంది వీటివైపు వస్తారని నిపుణులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...