Jump to content

Govt. General Hospital, Guntur


sonykongara

Recommended Posts

  • Replies 101
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 3 weeks later...
గుంటూరులో రూ.16.50 కోట్లతో క్యాన్సర్‌ నూతనవార్డు
 
గుంటూరు (మెడికల్‌): గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో ఈ నెల 21న క్యాన్సర్‌ నూతన వార్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్‌, క్యాన్సర్‌ వైద్య విభాగాధిపతి డాక్టర్‌ డీఎస్‌ రాజునాయుడు తెలిపారు. ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ నాట్కో ఆర్థిక వితరణతో రూ.16.50 కోట్ల వ్యయంతో ఈ నూతన వార్డు నిర్మిస్తున్నారు. ఆదివారం ఉదయం 9.49 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, నాట్కో ట్రస్ట్‌ అధినేత నన్నపనేని వెంకయ్య చౌదరి, కలెక్టర్‌ కోన శశిధర్‌ తదితరులు పాల్గొంటారు. నిర్మాణ పనులు ప్రారంభించిన ఏడాదిలోపు వార్డును రోగులకు అందుబాట్లోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. నూతన వార్డు అందుబాట్లోకి వచ్చాక క్యాన్సర్‌ వైద్య చికిత్సల్లో వినియోగించే అత్యాధునిక లీనియల్‌ యాక్సిలరేటర్‌ పరికరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసేందుకు హామీ ఇచ్చింది. ఈ పరికరం విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని వైద్యవర్గాలు తెలిపాయి. ఇవి అందుబాట్లోకి వస్తే రోగులకు మెరుగైన వైద్యసేవలు లభిస్తాయి.
 
జింకానా, రోటరీ క్లబ్‌ భారీ విరాళం..
రోటరీ క్లబ్‌ ఇంటర్నేషన్, గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (జింకానా) సంయుక్తంగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రికి భారీ విరాళం అందజేశాయి. రెండు రోజుల కిందట జీజీహెచలో జరిగిన కార్యక్రమంలో సుమారు రూ.కోటి విలువైన వైద్య పరికరా లను విరాళంగా ప్రభుత్వాస్పత్రికి అందజేశారు. ఇందులో ఆరు వెంటిలేటర్లు, పది మల్టీ ఛానల్‌ మానిటర్లు, డిజిటల్‌ మొబైల్‌ ఎక్స్‌రే యూనిట్‌ ఉన్నాయి. ఎక్యూట్‌ మెడికల్‌ కేర్‌ వార్డులో రెండు వెంటిలేటర్లు, అత్యవసర వైద్య విభాగంలో రెండు వెంటిలేటర్లు, క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో మరో రెండు వె ంటిలేటర్లను ఏర్పాటు చేశారు. డిజిటల్‌ మొబైల్‌ ఎక్స్‌రేను క్యాజువాల్టీలో ఏర్పాటు చేశారు.
Link to comment
Share on other sites

కనికట్టు కుదరదిక!

100 కెమెరాలతో పర్యవేక్షణ

కెమెరాలకు ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్‌ అనుసంధానం

వైద్యులకు ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు

కలెక్టర్‌ ఛాంబర్‌ నుంచే వైద్యసేవలు తిలకించేలా

ఎన్‌ఐసీ కేంద్రంతో జీజీహెచ్‌ అనుసంధానం

ఈనాడు-గుంటూరు

gnt-top2a.jpg

కోస్తా జిల్లాల ఆరోగ్య వరప్రదాయినిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో అందించే వైద్యసేవలు మొదలుకుని వైద్యులు, సిబ్బంది రాకపోకల దాకా ప్రతిదీ ఇకమీదట ఆన్‌లైన్‌లో పర్యవేక్షించడానికి రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి జాతీయ సమాచార కేంద్రం (నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌: ఎన్‌ఐసీ) తోడ్పాటును అందించనుంది. ఈమేరకు ఎన్‌ఐసీ అధికారులు ఇప్పటికే జీజీహెచ్‌ను సందర్శించి కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ కేంద్రంతో అనుసంధానించే పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఏం జరుగుతోందనేది అక్కడ ఉండే వైద్యులు, సిబ్బంది, వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు మినహా రెండో కంటికి తెలియటం లేదు. దీంతో చాలా మంది వైద్యులు, సిబ్బంది అసలు ఆసుపత్రికి ఎప్పుడు వచ్చిపోతున్నారో కూడా కనీసం ఆసుపత్రి పర్యవేక్షణాధికారికి తెలియని పరిస్థితి. దీన్ని అధిగమించడానికి ఆసుపత్రి పాలనను పూర్తిగా సాంకేతిక బాట పట్టించబోతున్నారు. దీనికి సంబంధించిన పనులను ఎన్‌ఐసీకి అప్పగించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ హోదాలో జిల్లా పాలనాధికారి కోన శశిధర్‌ వారం రోజుల క్రితం జీజీహెచ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పట్లో ఆయన ఆసుప్రతిలో పలు విభాగాలను పరిశీలించారు. అందుతున్న వైద్యసేవల గురించి ఆరాతీశారు. అనంత‌రం రెండు గంటలకు పైగా వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిపై తనకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. గుండెమార్పిడి.. మోకీలు మార్పిడి వంటి ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలకు కేంద్రబిందువుగా మారి దేశంలోనే ప్రముఖ ఆసుప్రతిగా పేరుగడించిన ఈ ఆసుపత్రికి తిరిగి పూర్వవైభవం తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడ పనిచేసే ప్రతి వైద్యునిపై ఉందని విధుల నిర్వహణను ఆషామాషీగా తీసుకోవద్దని, చాలా మంది వైద్యులు మొక్కుబడిగా విధులకు హాజరవుతున్నారని దీన్ని చక్కదిద్దుకోవాలని అన్నారు. ఇకమీదట ఆసుపత్రిలో నిత్యం జరిగే వైద్యసేవలను తన ఛాంబర్‌ నుంచే వీక్షించేలా ఎన్‌ఐసీ కేంద్రంతో అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. నాడు అన్న మాటలను ఆచరణలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఎన్‌ఐసీ కేంద్రం అధికారులతో ఈపనులను సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకువచ్చేలా నిత్యం దీనిపై సమీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని కొన్ని విభాగాలను ఎన్‌ఐసీతో అనుసంధానం చేసి ట్రయల్‌రన్‌ చూశారు. ఇది సక్సెస్‌ అయిందని దీంతో ఆసుపత్రిలోని ఇన్‌, అవుట్‌ గోయింగ్‌ ద్వారాలు మొదలుకుని ప్రతి వార్డులో కి వైద్యులు, రోగులు ప్రవేశించే దగ్గరి నుంచి వారిని వైద్యులు పరి¬శీలించే దాకా ప్రతి వార్డును అనుసంధానిస్తున్నారు. ఈ పర్యవేక్షణ అంతా శాటిలైట్‌ విధానంలో సర్వర్‌ ద్వారా సాధ్యపడుతుందని అధికారులు వెల్లడించారు.

నిఘా నీడలో.. : ప్రస్తుతం ఆసుపత్రిలో 40 సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటి ద్వారా ఆసుపత్రి ప్రాంగణం మొత్తాన్ని పర్యవేక్షించటం సాధ్యపడటం లేదు. వాటిని 100కు పెంచి ప్రతి అనువు నిఘా కెమెరాలో నిక్షిప్తమయ్యేలా అత్యాధునిక కెమెరాలను బిగించబోతున్నారు. ఈ కెమెరాలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ నంబరు(ఆర్‌ఎఫ్‌ఐడీ) చిప్‌లను అమర్చుతారు. దీంతో ఎవరు ఏ సమయంలో బయటకు వెళ్లింది.. తిరిగి ఎప్పుడు వచ్చింది ప్రతిదీ నమోదవుతుంది.

ప్రస్తుతం సాధారణ కెమెరాలే ఉన్నాయి. కొన్ని సందర్భల్లో అవి పనిచేయకుండా నిలుపుదల చేసి కొందరు వైద్యులు ఆసుపత్రి ప్రాంగణం నుంచి సులభంగా బయటకు వెళ్లిపోతున్నారు. ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్‌ కెమెరాలకు అనుసంధానం చేస్తే ఏ దృశ్యాన్నీ తొలగించడం కుదరదు. ప్రతిదీ వాటిలో నమోదవుతుంది. శస్త్రచికిత్స థియేటర్లు.. ప్రసూతి, కాన్పుల వార్డు వంటివి మినహా అభ్యంతరం లేని అన్ని వార్డుల్లో సీసీ కెమెరాలకు ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్‌ అమర్చాలని నిర్ణయించారు. తాజా ఏర్పాట్లతో ఆసుపత్రి పర్యవేక్షణ ఇకమీదట పూర్తిగా నిఘా నీడలోకి రాబోతుంది. ఆసుపత్రి ప్రాంగణం మొత్తాన్ని వీడియో కెమెరాలతో చిత్రీకరించబోతున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో పేదోడి వైద్యానికి జీజీహెచ్‌ కేంద్ర బిందువుగా మారింది. అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడ లభ్యమవుతాయని రాజమండ్రి నుంచి ఇటు నెల్లూరు దాకా ఉన్న అనేక జిల్లా ఆసుపత్రుల నుంచి రిఫరల్‌ కేసులు ఇక్కడకు వస్తున్నాయి. వైద్యసేవల కోసం గంపెడాశలతో వ్యయ, ప్రయాసలకోర్చి వస్తున్న వారికి తీరా ఇక్కడ వైద్యులు అందుబాటులో లేక వచ్చిన మరుక్షణమే వెనుదిరిగాల్సి వస్తోంది.

ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రతి వైద్యుడిలో రెగ్యులారిటీ కోసం ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటు చేసి వాటి సాయంతోనే హాజరు తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన యంత్రాలను సమకూర్చుకునే పనిలో అధికారులు ఉన్నారు. ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరును టాంపరింగ్‌ చేయటం సాధ్యపడదు. ఒక్కసారి వేలు పెట్టగానే అతని ఆదార్‌తో నంబరు ఉంటేనే హాజరు స్వీకరిస్తుంది. ఇప్పటి దాకా ఆసుపత్రిలో ఈ రకమైన ఏర్పాట్లు లేకపోవటంతో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పరిపాలనా సిబ్బంది సమయపాలన లేకుండా విధులకు హాజరవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరుకు మొగ్గుచూపినట్లు జీజీహెచ్‌ వర్గాలు తెలిపాయి.

ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా కచ్చితంగా వారు ఆసుప్రతిలోనే ఉండి ప్రజలకు సేవలు అందించేలా అవసరమైతే ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను కూడా వైద్యుల చేతికి తొడగాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. నిర్దేశిత పనివేళల్లో ఆసుపత్రి ప్రాంగణం వెలుపలికి వస్తే ఈ ట్యాగ్‌ బీప్‌ సౌండ్‌ చేస్తుంది. దీనివల్ల వైద్యులు ఎవరూ కూడా పనివేళల్లో విధి నిర్వహణకు డుమ్మాకొట్టే ఆలోచన చేయరని ఈ నూతన విధానం కూడా అవలంభించాలని భావిస్తున్నట్లు జీజీహెచ్‌ వర్గాలు తెలిపాయి.

సుమారు ఏడాది కిందట ఆసుపత్రిలో పుట్టిన శిశువులను శస్త్రచికిత్స ధియేటర్‌ నుంచి వార్డులోకి వచ్చే సమయంలో మార్పిడి జరుగుతోందని తమ శిశువుకు బదులు వేరే శిశువును తమకు తీసుకొచ్చి అప్పగించారని గతంలో కొందరు తల్లులు జీజీహెచ్‌లో ఆందోళనకు దిగిన ఉదంతాలు కూడా లేకపోలేదు. దీన్ని నివారించటానికి ఏడాది కిందట తల్లీ, బిడ్డకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ను తొడిగే విŸధానాన్ని ప్రారంభించారు. అయితే అది మున్నాళ్ల ముచ్చటగా మారింది. ట్యాగ్‌లో ఫీచర్స్‌ సరిగా లేక అది పనిచేయటం లేదని తేలింది. దీంతోఅప్పటి నుంచి తిరిగి దాన్ని పునరుద్ధరించలేదు. ప్రస్తుతం వైద్యులతో పాటు తల్లీ, బిడ్డలకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ ఏర్పాట్లపై జిల్లా పాలనాధికారి కోన శశిధర్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నాయో తన ఛాంబర్‌ నుంచి తెలుసుకునే విధానాన్ని అందుబాటులోకి తేవాలని ఎన్‌ఐసీ అధికారులను ఆదేశించానని ఇది ట్రయల్‌రన్‌ సక్సెస్‌ అయిందని ప్రస్తుతం అన్ని విభాగాలను అనుసంధానించే పనులు చేస్తున్నట్లు చెప్పారు. పనివేళల్లో వైద్యులు కచ్చితంగా ఆసుపత్రిలోనే ఉండేలా ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు, దానికి ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్‌ను అనుసంధానించి వారు పనివేళల్లో కచ్చితంగా ఆసుపత్రిలోనే ఉండేలా చేయటానికి ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్యసేవలకు వచ్చే ప్రతి పేదోడికి సత్వర వైద్యం అందించాలన్నదే తన లక్ష్యమని అందుకే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ హోదాలో ఈ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
నవ్యాంధ్రకే తలమానికం...గుంటూరు ఆసుపత్రి
636324197880204350.jpg
మూడేళ్ల కిందట నూతనంగా రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో ఏపీ వైద్య ఆరోగ్యరంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఏ పెద్ద శస్త్ర చికిత్సకైనా హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్‌ స్టేట్‌ లెవెల్‌ రిఫరల్‌ హాస్పిటల్‌గా మారింది. నాలుగేళ్ల కిందట రోజుకు 1,500గా ఉన్న ఓపీ రోగుల సంఖ్య నేడు ఏకంగా 4,200కు పెరిగింది. పలు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విరివిరిగా జరుగుతున్నాయి. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ చేయూత ఆస్పత్రిని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది.
 
గుంటూరు: రాష్ట్రం విడిపోయిన సమయంలో నవ్యాంధ్రకు ఎయిమ్స్‌ను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాట్లోకి రావడానికి ఐదారేళ్లు పడుతుంది. ఈ పరిస్థితుల్లో అప్పటివరకు నాలుగైదు జిల్లాల ప్రజలకు మాత్రమే పరిమితమైన గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిపై అందరి దృష్టి నిలిచింది. నవ్యాంధ్రలో గుంటూరు జీజీహెచ్‌ స్టేట్‌ లెవెల్‌ రిఫరల్‌ హాస్పిటల్‌గా మారింది. ఓపీ రోగుల సంఖ్య పెరిగింది. 1,177 పడకల సామర్ధ్యం ఉన్న జీజీహెచ్‌లో నేడు ఇన్‌పేషెంట్‌ రోగుల సంఖ్య ఏకంగా 1,600కు చేరింది. దీంతో పడక సామర్ధ్యం 50 శాతం మేరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ల స్వల్ప కాలంలో జీజీహెచ్ ప్రగతిని పరిశీలిస్తే..
 
అవయవ మార్పిడి ఆపరేషన్లు..
జీజీహెచలో గుండె మార్పిడి ఆపరేషన్‌ విజయవంతంగా జరిగింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న వైద్య వర్గాలు పలు అవయవ మార్పిడి శస్త్రచికత్సలకు శ్రీకారం చుట్టాయి. మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్లు, మోకీలు, పూర్తి తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్లు రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడే చిన్నారులకు త్వరలో గుంటూరు జీజీహెచ్‌లో కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ శస్త్రచికిత్సలను కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అనుమతులు లభించాయి. గుంటూరుకు చెందిన ఈన్‌టీ సర్జన్‌ డాక్టర్‌ యార్లగడ్డ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్సలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ చైర్మన్‌ డాక్టర్‌ గుళ్లపల్లి నాగేశ్వరరావు సహకారంతో గుంటూరు జీజీహెచ్‌లో కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ శస్త్రచికిత్సలను ప్రారంభిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారం ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల డాక్టర్లు అందిస్తారని తెలిపారు. ప్లాస్టిక్‌ సర్జరీ, డెర్మటాలజీ, ఈన్‌టీ తదితర విభాగాల్లో కాస్మోటిక్‌ శస్త్రచికిత్సలను కూడా ప్రారంభించారు. ఇక్కడ పూర్తి డయాలసిస్‌ సేవలు అందుబాట్లో ఉన్నాయి.
ఫ తెలుగు రాషా్ట్రల్లో తొలిసారిగా గుంటూరు జీజీహెచ్‌లో హ్యూమన్‌ స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో చదువుకొని ఉత్తర అమెరికాలో స్థిరపడిన ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ హనుమాన్‌దాస్‌ మారెళ్ల ఈ స్కిన్‌బ్యాంక్‌ ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందజేస్తున్నారు. దీనికి అనుబంధంగా 20 పడకలతో కూడిన బర్న్స్‌ ఐసీయూ వార్డు కూడా ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
 ఆయా వ్యాధి కారక క్రిములను శాస్త్రీయంగా తెలుసుకొనేందుకు జీజీహెచ్‌కు రూ.4 కోట్లతో అత్యాధునిక వైరాలజీ ల్యాబ్‌ను మంజూరు చేశారు. త్వరలో పనులను ప్రారంభిస్తారు. వైద్య విద్యార్థులకు పాఠాలు బోధించి పలు రకాల ప్రొసీజర్లు నేర్పేందుకు వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం సిములేటర్‌ సెంటర్‌ను మంజూరు చేసింది. ఇది రాష్ట్రస్థాయిలో రిఫరల్‌ సెంటర్‌గా పని చేస్తుంది.జీజీహెచ్‌ అభివృద్ధిలో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి, సీటీ సర్జన్‌ డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో తొలిసారిగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు ప్రారంభించారు. 2015 మార్చి 18న తొలిసారిగా బైపాస్‌ ఆపరేషన్‌లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 200 వరకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు నిర్వహించారు. ప్రభుత్వ సమగ్రాస్పత్రి అభివృద్ధి చెందటం వెనుక ప్రభుత్వ కృషితో పాటు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కూడా ఉంది. ముఖ్యంగా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబిలిటీ కింద ప్రముఖ ఔషథ తయారీ కంపెనీ నాట్కో చేయూత నిస్తోంది. పిల్లల వార్డును దత్తత తీసుకుని రూ.కోటి వ్యయంతో వెంటిలేటర్లు అందజేసింది. రూ.కోటితో పిల్లల వార్డు, నర్సింగ్‌ పాఠశాల తరగతి గదులు నిర్మించింది. రూ.16.50 కోట్ల వ్యయంతో ఇటీవల కేన్సర్‌ సమగ్ర కేంద్రం నిరర్మాణానికి నిధులు కేటాయించింది. గుంటూరు వైద్య కళాశాలలో చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన (జింకానా) ప్రవాసాంధ్ర వైద్యులు కూడా భారీ విరాళాలు అందజేస్తున్నారు. జీజీహెచ్‌లో నిర్మిస్తున్న తల్లీ బిడ్డల సంరక్షణ శాలకు జింకానా తరపున రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. మరో ఎన్నారై డాక్టర్‌ కూడా స్వచ్ఛందంగా ఈ బ్లాక్‌ నిర్మాణానికి వ్యక్తిగతంగా రూ.15 కోట్ల భారీ విరాళం ప్రకటించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. మరికొన్ని కార్పొరేట్‌ కంపెనీలు కూడా గుంటూరు ప్రభుత్వాస్పత్రి అభివృద్దికి ఆసక్తి చూపుతున్నాయి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
  • 4 weeks later...
  • 4 weeks later...
మృత్యుంజయుడీ బాలుడు!
23-09-2017 02:58:44
 
636417323449290333.jpg
  • 40లక్షల ఖర్చు... అయినా బతకడన్నారు
  • జీజీహెచ్‌లో వారంలోనే కోలుకున్నాడు
గుంటూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తమిళనాడులోని రెండు పేరుమోసిన కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆ బాలుడికి దాదాపు వంద రోజుల పాటు చికిత్సలు చేశారు. చికిత్సలకు అతడి తల్లిదండ్రులు రూ.40లక్షలు ఖర్చు చేశారు. ఇంత చేసినా మీ పిల్లాడు బతికే అవకాశం లేదు... ఇంటికి తీసుకెళ్లండని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. చివరి ప్రయత్నంగా పిల్లాడిని గుంటూరు ప్రభుత్వాస్పత్రి నరాల వైద్య విభాగంలో చేర్చారు. ఇక్కడ అందించిన వైద్యంతో వారం రోజుల్లోనే బాలుడు లేచి కూర్చున్నాడు. వివరాలు... రాజమండ్రికి చెందిన జి.గోవిందరావు, స్పందన దంపతుల కుమారుడు అజిత్‌ ప్రభాత్‌ (6) ఈ ఏడాది మార్చి 3న ర్యాన్‌సమ్‌సేన్స్‌ ఎన్‌సెఫలైటి్‌స (మెదడువాపు)తో మూర్ఛకు గురయ్యాడు.
 
రెండు రోజులు స్ధానికంగా చికిత్సలు చేయించిన అనంతరం వైద్యుల సూచన మేరకు విజయవాడలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడ 43 రోజుల పాటు చికిత్సలు చేసిన డాక్టర్లు రూ.30లక్షల 17వేలు వసూలు చేశారు. చివరకు బాలుడి పరిస్థితి విషమంగా ఉందంటూ చెన్నైలోని మరో పెద్ద ఆసుపత్రికి సిఫారసు చేశారు. అక్కడ 55 రోజుల పాటు చికిత్సలు చేసినా లాభం లేదని తేల్చారు. చివరి ప్రయత్నంగా జూన్‌ 26న గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో బాలుడిని చేర్పించారు. న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌వీ సుందరాచారీ, సహచర వైద్య బృందం పలు రకాల పరీక్షలు చేసి చివరకు బాలుడు వైరల్‌ ఎన్‌సెఫలైటి్‌స (ర్యాన్‌సమ్‌సేన్స్‌ ఎన్‌సెఫలైటి్‌స)కు గురైనట్లు నిర్ధారించారు. నాలుగు రకాల మూర్చ మందులతో పాలీ థెరపీ ప్రారంభించారు. వారంలోనే బాలుడు లేచి కూర్చున్నాడు. మూడు నెలల తర్వాత జూన్‌ 11న అజిత్‌ ‘అమ్మా’ అంటూ పలుకరించడంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...