sonykongara Posted November 29, 2016 Posted November 29, 2016 (edited) Edited June 27, 2018 by sonykongara
sonykongara Posted November 29, 2016 Author Posted November 29, 2016 గుంటూురు ఆసుపత్రిలో నవ్యాంధ్రప్రదేశ్ నీలోఫర్ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు రూ.65 కోట్లతో ఆరంతస్తుల భవనం అత్యాధునిక వసతులతో 600 పడకలు జింకానా వైద్యుల సహకారం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో నవ్యాంధ్ర నీలోఫర్ వైద్యశాల రూపు దాల్చనుంది. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (జింకానా) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరంతస్తులతో బ్లాక్‌ను ఏర్పాటు చేయనుంది. ఏకంగా 600 పడకల సామర్ధ్యంతో తల్లీ, పిల్లలకు సమస్త వైద్యసేవలు లభించనున్నాయి. మొత్తం రూ.65 కోట్ల వ్యయంతో ఆరంతస్తులుగా ఈ భవనాన్ని తీర్దిదిద్దునున్నారు.గుంటూరు (మెడికల్): జీజీ హెచలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని జీ ప్లస్ సిక్స్ ఫ్లోర్స్‌తో హైదరాబాద్‌కు చెందిన స్టాం డర్డ్ ఇనఫ్రా లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుం ది. గ్రౌండ్ ఫ్లోర్‌తో సహ నాలుగు అంతస్తు ల్లో సీ్త్ర, ప్రసూతి వార్డులు, రెండు అంతస్తుల్లో నవ జాత శిశువు ల వార్డులు ఉంటాయి. పీడియాట్రిక్ ఐసీ యూ, నియోనేటల్ ఐసీయూ, స్పెషల్ కేర్ న్యూబార్న్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ) వంటి అన్ని పిల్లల వార్డులు ఈ భవనంలోకే తరలిస్తారు. రెండేళ్ల కాల వ్యవధిలో దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు జీజీహెచ్‌లో 180 కాన్పుల పడకలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడవి మూడు రెట్లకు పెరగనున్నాయి. దీంతో కాన్పుల కష్టాలు తీరతాయని వైద్యాధికారులు భావిస్తున్నారు. జింకానా వైద్యుల సహకారం జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్‌ఆర్‌హెచ్ ఎం) కింద కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట రూ.20 కోట్లతో జీజీహెచ్‌కు మాతా శిశు ఆరోగ్య కేంద్రం మం జూరు చేసింది. దీంతో 200 ప్రసూతి పడకలు సమ కూరుతాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాలుగు అంతస్తులుగా ఈ భవనం నిర్మించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. మూడు అదనపు అంతస్తుల నిర్మాణానికి రూ.30 కో ట్ల వ్యయం అవుతుందని వివరించారు. ఈ నేపథ్యం లో జింకానా వైద్యులు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపారు. అదనపు అంతస్తుల నిర్మాణానికి తమ వంతుగా రూ.15 కోట్ల వరకు విరాళంగా ఇస్తామని జింకానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ త్రిపురనేని రవికుమార్ హా మీ ఇచ్చారు. దీనికి 50 శాతం మ్యాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.15 కోట్లు అందించాలని ఇటీవల హైదరాబాద్‌లో సీఎంను కలసిన డాక్టర్ రవికుమార్ విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు. మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చొరవతో మరో ఎన్నారై డాక్టర్ రూ.15 కోట్లు విరాళం అందించేందుకు అంగీకరించారు. దీంతో కేంద్ర మంజూరు చేసిన రూ.20 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటు రూ.15 కోట్లు, ఎన్నారై డాక్టర్‌లు విరాళంగా అందజేసే రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.65 కోట్లుతో ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. ఇదే విషయం మంత్రి కామినేని సచివాలయంలో మంగళవారం ప్రకటించారు.అత్యాధునిక వైద్య సేవలు ఈ భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో లేబర్ రూమ్‌లు ఉంటాయి. యాంటీ నేటల్, పోస్ట్ నేటల్, పోస్ట్ రికవరీ రూమ్‌లను, ఎలెక్టివ్ ఆపరేషన , సోలేషన ఆపరేషన, సాధారణ ఆపరేషన థియేటర్లను నిర్మిస్తారు. ఒక్కొక్క అంతస్తులో 60 పడకలతో మెటర్నిటీ బ్లాక్‌లు నిర్మిస్తారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు ప్రత్యేక లేబర్ రూమ్‌లు, ఎక్లాంప్సియా కేసుల కోసం రెండు రూమ్‌లు, సెప్టిక్ లేబర్ కాన్పుల కోసం రెండు వ్యక్తిగత రూమ్‌లను నిర్మిస్తారు. చివరి నిమిషంలో కాన్పుల కోసం వచ్చే అత్యవసర ప్రెగ్నెన్నీ కేసుల కోసం ట్రయేజీ రూమ్‌లను నిర్మిస్తారు. విజిటర్ల కోసం వెయిటింగ్ హాల్, స్టోరేజ్ రూమ్ ఏర్పాటు చేస్తారు. సెల్లార్‌లో సుమారు 3 లక్షల వేల లీటర్ల సామర్ధ్యంతో ట్యాంక్, మరో 75 వేల లీటర్ల నీటి నిల్వ కోసం సంపు నిర్మిస్తారు.
sonykongara Posted November 29, 2016 Author Posted November 29, 2016 గుండె మార్పిడికి సిద్ధం గుంటూరు: గుంటూరు సర్వజనాసుపత్రి(జీజీహెచ్)లో గుండెమార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ శస్త్రచికిత్స ప్రారంభిస్తే మన దేశంలో ఈ ఘనత సాధించిన ప్రభుత్వాసుపత్రుల్లో జీజీహెచ్ నాలుగోదిగా గుర్తింపు పొందనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఆసుపత్రిగా పేరు తెచ్చుకోనుంది. గుండె మార్పిడి అవసరమైన తొమ్మిది మందిని గుర్తించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని జీవన్‌దాన్ కేంద్రంలో ఒకరి పేరు ఇప్పటికే నమోదు చేశారు. ఆ విధంగా నమోదు చేసుకున్న తర్వాత ఎవరైన బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు సమాచారం వస్తే వారి గుండె అమర్చడానికి వీలవుతుంది. ఈనెల 18 లోపు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు డాక్టర్ గోఖలే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న గుండె శస్త్రచికిత్సలు మరో రెండు రోజుల్లో 150 పూర్తికానున్నాయి. గత సంవత్సరం మార్చి 18న ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగికి పైసా ఖర్చు లేకుండా ఈ సర్జరీలు నిర్వహిస్తుండటం వల్ల రోగులకు ఎంతో మేలు జరుగుతున్నది. అదేవిధంగా గుండె శస్త్రచికిత్సల వల్ల ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ ఇటీవల ప్రకటించారు.
sonykongara Posted December 28, 2016 Author Posted December 28, 2016 జీజీహెచ్ లో చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సలు 31న ప్రారంభించనున్న మంత్రి కామినేని పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనం గుంటూరు (మెడికల్):హృద్రోగ చిన్నారుల తల్లిదండ్రులకు శుభవార్త. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలను డిసెంబర్ 31వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన, పద్మశ్రీ అవార్డుగ్రహీత డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, ఆయన సహచర వైద్య బృందం ఈ ఆపరేషన్లు నిర్వహిస్తారు.పిల్లలు పుట్టుకతో ఏర్పడే గుండె రంధ్రాలు, గుండె రక్తనాళాల్లో మార్పులు ఉన్న చిన్నారులకు ఇకపై జీజీహెచలోనే శస్త్రచికిత్సలు అందుబాటులోకితెస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డాక్టర్ గోఖలేకు చెందిన సహృదయ ట్రస్ట్ ద్వారా ఈ ఆపరేషన్లు నిర్వహిస్తారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద పిల్లలకు పూర్తి ఉచితంగా ఈ ఆపరేషన్లు చేస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ డీఎస్ రాజునాయుడు వెల్లడించారు. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వ వైద్యరంగంలో చిన్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు అందుబాటులో లేవు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నా అవి బాగా ఖరీదైనవి. 300 ఓపెన్ హార్ట్ సర్జరీలు.. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో సహృదయ ట్రస్ట్ ద్వారా డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ఇప్పటివరకు 300 ఓపెన్ హార్ట్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేశారు. రెండు గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించారు. గత ఏడాది మార్చిలో పీపీపీ పద్దతిలో సహృదయ ట్రస్ట్ ద్వారా డాక్టర్ గోఖలే గుండె ఆపరేషన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. రోజులు, నెలల వయస్సు ఉన్న శిశువుల గుండె ఆపరేషన్లలో వినియోగించేందుకు పలు సున్నితమైన వైద్యపరికరాలు అవసరం. దీంతో సహృదయ ట్రస్ట్, వసుధ ఫౌండేషన, నాట్కో ట్రస్ట్‌లు నిధులు అందించడంతో ఈ పరికరాలను కొనుగోలు చేశారు. వీటి కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం కొంత మేరకు నిధులు అందజేసింది. జీజీహెచ్ లోని పొదిల ప్రసాద్ బ్లాక్‌లో శనివారం ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ లాంఛనంగా పిల్లల గుండె జబ్బుల విభాగం ప్రారంభిస్తారు.
sskmaestro Posted April 13, 2017 Posted April 13, 2017 Last month maa relatives vellaru.... full janaalu unnaru and also severe water problem!
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now