Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
25.9 ఎకరాల్లో టౌన్‌షిప్‌
 

పీపీపీ విధానంలో ఎండాడలో నిర్మాణం
భాగస్వామ్య సంస్థ కోసం దరఖాస్తుల ఆహ్వానం
వీఎంఆర్‌డీఏ ఏర్పాట్లు

vsp-gen7a_2.jpg

ఈనాడు, విశాఖపట్నం:  మధురవాడ ఐటీ సిటీకి దగ్గరగా, రుషికొండ తీరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎండాడలోని 25.9 ఎకరాల ప్రభుత్వ భూమిలో టౌన్‌షిప్‌ రాబోతోంది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్మించనున్నారు. స్థానిక అవసరాలు, గృహ వసతి సమస్యను పరిష్కరించేందుకు అందుబాటు ధరల్లో ఉండేలా ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. పీపీపీ విధానంలో ఆసక్తి ఉన్న నిర్మాణ సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించేందుకు వీఎంఆర్‌డీఏ ఆన్‌లైన్‌లో వివరాలను అందుబాటులో ఉంచింది. ఎప్పుడో పదేళ్ల కిందట నాటి వుడా హరితా ప్రాజెక్టు కింద ఇళ్లు నిర్మించింది. మళ్లీ ఇపుడు టౌన్‌షిప్‌ నిర్మాణానికి ముందుకొచ్చింది. ప్రతిపాదిత టౌన్‌షిప్‌ పరిసరాల్లో అనేక నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. దీనికి మూడువైపులా ప్రభుత్వ స్థలాలు, మరోవైపు ఓ ప్రయివేటు టౌన్‌షిప్‌ ఉంది.
* టౌన్‌షిప్‌ నిర్మాణ ప్రాంతం ప్రస్తుతం సంరక్షణ జోన్‌లో ఉంది. కొండపైభాగాన్ని చదును చేయాల్సి ఉంది. 30 మీటర్ల వెడల్పుతో రహదారులు నిర్మించి మధురవాడ రహదారికి కలుపుతారు. ఆ తరువాత జాతీయ రహదారికి అనుసంధానిస్తారు.
* మధ్య, అధికాదాయ వర్గాల వారి కోసం బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తారు. చదరపు అడుగు ధర రూ. 3,500 నుంచి రూ. 3,800 మధ్యలో ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

భూమిని పెట్టుబడిగా ఇస్తాం...
ఎండాడలో టౌన్‌షిప్‌ నిర్మాణానికి అవసరమైన భూమిని వీఎంఆర్‌డీఏ పెట్టుబడిగా ఇస్తుంది. మిగిలిన నిర్మాణాలను భాగస్వామి సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం బిల్డర్లు, డెవలపర్ల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానించాం. మంచి సంస్థను ఎంపిక చేసి సవివర ప్రాజెక్టు నివేదికను కోరతాం. ఎలా నిర్మిస్తారు? ఎలాంటి ఇళ్లను అందుబాటులోకి తెస్తారు? వీఎంఆర్‌డీఏ షేర్‌ ఎంత ఉంటుంది తదితర అంశాలన్నింటినీ పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటాం. వీలైనంతగా పీపీపీ విధానంలోనే వెళ్లాలనుకుంటున్నాం. లేని పక్షంలో నేరుగా చేపట్టేందుకు చూస్తాం.

- పి.బసంత్‌కుమార్‌, కమ్లిషనర్‌, వీఎంఆర్‌డీఏ
Link to comment
Share on other sites

భీమిలి టు భోగాపురం
 

22కిమీ మేర గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ రహదారి
సీఎం ఆదేశాలతో సిద్ధమైన ప్రతిపాదనలు
త్వరలోనే సుమారు రూ.750 కోట్లతో టెండర్లు
తగరపువలస, న్యూస్‌టుడే

vsp-gen13a_4.jpg

భీమిలి నుంచి భోగాపురానికి గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి రానుంది. ఇటీవల నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయం ప్రకటించిన నేపథ్యంలో దీనిపై కదలిక వచ్చింది. ప్రస్తుతం విశాఖ నుంచి భీమిలి వరకూ వేసిన నాలుగు వరసల రహదారికి ఇది అనుసంధానం కానుంది.

2003 సం.లో చంద్రబాబు సీఎంగా ఉండగా విశాఖ-భీమిలి నాలుగు వరసల బీచ్‌రోడ్డు ప్రారంభమయ్యింది. మళ్లీ ఆయన హయాంలోనే భీమిలి జగ్గారావుతోట నుంచి అల్సా కంపెనీ వరకూ ప్రస్తుతం ఈరోడ్డు దాదాపుగా పూర్తికావొచ్చింది. దీన్ని భోగాపురం వద్ద రానున్న గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖకు వెళ్లే మార్గంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా భీమిలి బీచ్‌రోడ్డు నుంచి భీమిలిజోనల్‌ కార్యాలయం, ఫుట్‌బాల్‌ మైదానం, మూలకుద్దు, చిట్టివలస, చిప్పాడ, నాగమయ్యపాలెం, అన్నవరం మీదుగా మండలాన్ని దాటి భోగాపురానికి వెళ్లనుంది.

22కిమీ మేర రహదారి
విశాఖ నుంచి భీమిలికి 26 కిమీ రోడ్డు ఉంది. ఇక్కడ్నుంచి మరో 22కిమీ రోడ్డును భోగాపురం వరకూ విస్తరించనున్నారు. ఇందుకోసం 156 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఇందులో 23 ఎకరాలు ప్రైవేటు స్థలం. వీరికి పరిహారం ఇవ్వాల్సి ఉంది. మిగిలినదంతా ప్రభుత్వ స్థలం కావడంతో దాదాపుగా స్థల సేకరణకు పెద్దగా ఇబ్బంది ఉండబోదన్నది అధికారుల మాట. గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుగా పిలవనున్న ఈమార్గం నిర్మాణానికి దాదాపు రూ.750కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈరోడ్డుకు ఇరువైపులా పర్యటకాన్ని అభివృద్ధి చేయనున్నారు.

మారుమూల గ్రామాలకు మహర్దశ
భీమిలి, భోగాపురం మండలాల పరిధిలోని దాదాపు 50 గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఇప్పటి వరకూ సరైన రవాణా, ఇతర సదుపాయాలు ఈగ్రామాలకు లేవు. పర్యటకం అనేది దాదాపుగా లేదు. ఈనేపథ్యంలో శీఘ్ర రవాణా, పర్యటకం వంటివి అందుబాటులోకి రానున్నాయి. దీనికి తోడు తగరపువలస, భీమిలి పట్టణాలకు, విశాఖ నగరానికి దూరం తగ్గనుంది. ఇప్పటివరకూ వలస గ్రామాలుగా పేరుపడ్డ ఈ ప్రాంతాల్లో వినూత్న మార్పులు చోటుచేసుకోనున్నాయి.

సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు
గ్రీన్‌ఫీల్డ్‌, బీచ్‌రోడ్డు అనుసంధానం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు దానికి సంబంధించిన స్కెచ్‌ను, ప్రతిపాదనలు వివరించాం. దీనిని ఎలా అభివృద్ధి చేయాల్లో సూచనలు చేశారు. నిధుల విషయంలో రాజీపడొద్దని, సందర్శకుల మదిని దోచే అద్భుతమైన కారిడార్‌గా దీనిని తీర్చిదిద్దాలని చెప్పారు.

-గంటా శ్రీనివాసరావు(రాష్ట్ర మంత్రి, భీమిలి ఎమ్మెల్యే)

రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు
రహదారులు, భవనాలశాఖ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(ఇన్‌కాప్‌) సంయుక్తంగా ఈరోడ్డు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. సీఎం ఆదేశాల నేపథ్యంలో జిల్లా కలెక్టరు దీనిని పర్యవేక్షిస్తున్నారు. స్థల సేకరణ పూర్తయ్యింది. రెండు, మూడు నెలల్లో టెండర్లు పిలుస్తాం. విశాఖ-భీమిలి రోడ్డుకు ఇది అనుసంధానం కానుంది.

-పి.మురళీకృష్ణ(విశాఖపట్నం జిల్లా పర్యవేక్షక ఇంజనీరు, రహదారులు భవనాలశాఖ
Link to comment
Share on other sites

లులూ’ డిజైన్‌ సిద్ధం
21-12-2018 03:51:57
 
636809611187899088.jpg
విశాఖపట్నం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో భారీ సమావేశాల నిర్వహణకు అవసరమైన అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బీచ్‌ రోడ్డులో 13.83 ఎకరాలు కేటాయించింది. కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణ బాధ్యతలను దుబాయ్‌కు చెందిన లులూ గ్రూపునకు అప్పగించింది. దీనికి సంబంధించిన డిజైన్‌ను దాదాపుగా ఖరారు చేశారు. పీపీపీ పద్ధతిలో నిర్మించే ఈ ప్రాజెక్టు వ్యయం 1,500కోట్లు. ఇందులో అన్నీ ఆల్ర్టా మోడర్న్‌ పరికరాలను ఉపయోగించాలని నిర్ణయించారు. సుమారు ఐదువేల మంది కూర్చొనే సామర్థ్యంతో ఈ సెంటర్‌ నిర్మిస్తారు. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...