Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
ఆర్కే బీచ్‌లో భూగర్భ మార్గం!
రెండు కిలోమీటర్ల పొడవున వుడా ప్రాజెక్టు
vsp-gen6a.jpg

విశాఖపట్నం: ఆర్కే బీచ్‌లో రెండు కిలోమీటర్ల పొడవున భూగర్భ మార్గం నిర్మించేందుకు వుడా సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ పార్కింగ్‌ సదుపాయాల్లేకుండానే పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. నగరవాసుల ఉదయపు నడకకూ వాహనాలను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరచూ వివిధ కార్యక్రమాలు, వేడుకల కారణంగా సామాన్య జనం సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇదే ప్రాంతంలో టీయూ-142 యుద్ధవిమాన ప్రదర్శనశాల ఏర్పాటు తర్వాత సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాల పార్కింగ్‌ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు అనివార్యమయ్యాయి. అమెరికా తరహాలో భూగర్భ పార్కింగు, వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. ఇందుకోసం ప్రణాళికలు, త్రీడీ ఆకృతులు సిద్ధమయ్యాయి. ఇది దేశంలోనే తొలిప్రాజెక్టుగా వుడా అభివర్ణిస్తోంది.

సమీకృత ప్రాజెక్టులో భాగంగా...
కురుసుర జలాంతర్గామి, టీయూ-142 యుద్ధ విమాన ప్రదర్శనశాల, విక్టరీ ఎట్‌ సీ, రాజీవ్‌ స్మృతి భవన్‌, రూ. 10 కోట్లతో ఏర్పాటు చేయనున్న సీ హారియర్స్‌ ప్రదర్శనశాల.. అన్నిటినీ కలిపి రూ. 60 కోట్లతో సమీకృత ప్రాజెక్టుగా వుడా అభివృద్ధి చేస్తోంది. కురుసుర మ్యూజియం ఏర్పాటు కోసం తాజాగా ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించింది. సమీకృత ప్రాజెక్టులో భాగంగానే భూగర్భ వాహన వ్యవస్థను చేపట్టనున్నారు. ఆకర్షణీయ పథకంలో భాగంగా బహుళ అంతస్థుల పార్కింగ్‌ కోసం జీవీఎంసీ నుంచి వుడా కనీసం రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకు ఆశిస్తోంది. ఈ మొత్తాన్ని భూగర్భ ప్రాజెక్టుకు వెచ్చిస్తుంది.

అమెరికా తరహాలో...
* అమెరికాలో పట్టణ పునరుద్ధరణ ఉద్యమంలో భాగంగా న్యూయార్క్‌, బోస్టన్‌, డల్లాస్‌, చికాగో తదితర నగరాల్లో రహదారులు, రైల్వే లైన్లను భూగర్భం నుంచే వేస్తూ.. ఆయా మార్గాల పైప్రాంతాలను ఆహ్లాదకర ఉద్యానవనాలుగా.. పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాలుగా మారుస్తున్నారు.

* ఈ తరహాలోనే ఆర్కే బీచ్‌లో రెండు కిలోమీటర్ల మేర భూగర్భ మార్గం నిర్మిస్తారు. మరో పదెకరాలకుపైగా స్థలాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో యంత్రాంగం ఉంది.

* భూగర్భ మార్గంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గాలి, వెలుతురు లభ్యమయ్యేలా నిర్మించనున్నారు. పైన పచ్చదనం అభివృద్ధి చేస్తారు.

* భవిష్యత్తులో బీచ్‌రోడ్డు ట్రాఫిక్‌ రహితంగా.. పర్యావరణ హితంగా మార్చాలన్నది ఆలోచన.

* వేలాది వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా.. సందర్శనకు వచ్చేవారికి అనువుగా 800 కార్లు.. 400 ద్విచక్రవాహనాలు నిలిపేలా భూగర్భ పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తారు.

* ప్రతీ వంద కార్ల తర్వాత బయటకు రావడానికి మెట్ల మార్గం, లాబీ, లిఫ్ట్‌మార్గం ఉండేలా ఆకృతులు సిద్ధం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి ఆమోద ముద్ర కోసం..
మధురవాడ ఐటీ సిటీ, ఆర్కే బీచ్‌లో భూగర్భ మార్గం - పార్కింగ్‌ వ్యవస్థ ఆకృతులను ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చూపించేందుకు వుడా అధికారులు సన్నద్ధమవుతున్నారు. భూగర్భ మార్గం కోసం 11 ఆకృతులు రూపొందించారు. ఆర్కే బీచ్‌ను ప్రతి నెలా 3 లక్షల మంది వరకు పర్యాటకులు సందర్శిస్తుంటారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే పర్యాటకులు ప్రశాంతంగా విహరించేందుకు అనువైన వాతావరణం ఉంటుంది. ఉదయం వేళల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండవు. బీచ్‌ అందాలు ఏమాత్రం చెక్కుచెదరకుండా ప్రాజెక్టు నిర్మించాలన్నది వుడా ఆలోచన. సీఆర్‌జెడ్‌ అనుమతులు, ఇతరత్రా సవాళ్లను అధిగమించాల్సి ఉంది.

దేశంలోనే తొలిసారిగా..
- పట్నాల బసంత్‌కుమార్‌, వీసీ, వుడా
దేశంలో తొలిసారిగా.. ఆర్కేబీచ్‌లో భూగర్భ వాహన రవాణా మార్గం, పార్కింగ్‌ వ్యవస్థల ప్రాజెక్టును నిర్మించనున్నాం. ఆకృతులను సిద్ధం చేశాం. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత ముందుకెళ్తాం. ఇప్పుటికే పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఈ ఆకృతులను మంత్రి గంటా ఎదుట ప్రదర్శించాం. ఆయన సంతృప్తి చెందారు. రహదారులను ప్రజల అవసరాలకే వదిలేయాలన్న నినాదంతో బీచ్‌రోడ్డులో రెండు కిలోమీటర్ల నిడివిన భూగర్భ రవాణా, పార్కింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఇది పూర్తయితే బీచ్‌రోడ్డంతా నడకకు, పర్యాటకుల సందర్శనకే ఉంటుంది. వాహనాల రాకపోకలు, పార్కింగ్‌ అంతా భూగర్భం నుంచే.

Link to comment
Share on other sites

విశాఖలో ఆ మార్గానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌
23-06-2018 11:21:10
 
636653496848444888.jpg
  • బీచ్‌రోడ్డులో భూగర్భ మార్గం
  • సీఎం గ్రీన్‌సిగ్నల్‌ 
  • పోలీస్‌ మెస్‌ నుంచి వైఎంసీఏ వరకూ నిర్మాణం
  • కురుసుర, టీయూ-142, సీహ్యారియర్‌లతో సమీకృత మ్యూజియం ఏర్పాటు
  • పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌య ఇచ్చిన వుడా వీసీ
  • అన్నింటికీ ఒకటే టిక్కెట్‌
  • పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)
విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఆర్‌కే బీచ్‌ రోడ్డులో ప్రతిపాదించిన భూగర్భ మార్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకారం తెలిపారు. అనేక దేశాల్లో ఆదరణ పొందుతున్న ఈ తరహా నిర్మాణాల గురించి వుడా వీసీ బసంత్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించడంతో సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం...ఇది విశాఖకు ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారేలా చూడాలని సూచించారు. బీచ్‌లో పోలీస్‌ మెస్‌ నుంచి అటు వైఎంసీఏ వరకు అన్నింటిని కలుపుకొని సమీకృత మ్యూజియంగా తీర్చిదిద్దుతారు. పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా, రోడ్డుపై పార్కింగ్‌ లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తారు. బీచ్‌లో రెండో వైపున భూగర్భంలో పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తారు. వాహనాలతో నేరుగా వెళ్లిపోయి, అక్కడ పార్కింగ్‌ చేసుకొని కోరుకున్న ప్రాంతానికి చేరుకునే సౌకర్యం సమకూరుస్తారు. మొత్తం 800 కార్లు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేసుకోవచ్చు. ఈ స్ట్రెచ్‌లో రహదారిపై వాహనాలు నడవకుండా ఆంక్షలు విధించి, కింద భూగర్భ మార్గం వేస్తారు. అందులో నుంచే వెళ్లి రావాలి.
 
కొత్తగా సీ హ్యారియర్‌ యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటుచేస్తారు. టీయూ-142లా దీనిని భూమిపై నిలపకుండా, గాలిలో వేలాడ దీస్తారు. చూసేవారికి కొత్తగా ఉంటుంది. ఆకట్టుకుంటుంది. అలాగే నేవీ అధికారులు సబ్‌మెరైన్‌ మ్యూజియం కూడా ఒకటి ఏర్పాటుచేస్తారు. ఇవన్నీ పూర్తయ్యాక బీచ్‌ రోడ్డులో టీయూ-142, సీ హ్యారియర్‌, సబ్‌మెరైన్‌ మ్యూజియం అన్నీ చూడడానికి ఒకటే టిక్కెట్‌ పెడతారు. దాంతోనే అన్నింటిని తిలకించవచ్చు. రాజీవ్‌ స్మృతి భవన్‌, నేవీ విక్టరీ ఎట్‌ సీలను నవీకరించి, కొత్తగా తీర్చిదిద్దుతారు. వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. పర్యాటకులను ఆకట్టుకునేలా, చక్కటి పార్కులను కూడా నిర్మిస్తారు. ఇక్కడి ప్రాజెక్టులకు పర్యాటక శాఖ రూ.20 కోట్లు కేటాయించగా, నేవీ సబ్‌మెరైన్‌ మ్యూజియంకు మరో రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులన్నింటినీ సమీకరించి, వుడా పర్యవేక్షణలో ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తామని వీసీ బసంత్‌కుమార్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

వైద్య పర్యాటకానికి రంగం సిద్ధం
విశాఖ రుషికొండ ప్రాంతంలో ఏర్పాటుకు సన్నద్ధం
తొలుత 15 గృహాల్లో ప్రారంభం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో మౌలికవసతుల అభివృద్ధి!
ఈనాడు - విశాఖపట్నం
22ap-main11a.jpg
రాష్ట్రంలో మొదటిసారిగా వైద్య పర్యాటకానికి విశాఖలో బీజం పడింది. పలు రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, శస్త్రచికిత్స చేయించుకున్నవారు ప్రశాంతమైన వాతావరణంలో కొంతకాలంపాటు విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వారికి అవసరమైన వైద్యం పొందడంతో పాటు ఆరోగ్య బాగోగులు చూసుకోవడానికి నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉంటే కొండంత భరోసాగా ఉన్నట్లు భావిస్తారు. అన్ని రకాల వైద్యసేవలు ఒకేచోట లభిస్తే బాగుంటుందని కోరుకుంటారు..వీటన్నింటినీ విశాఖలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆదర్శనీయంగా కేరళ..
కేరళ మినహా దేశంలో మరెక్కడా ఎక్కడా ఇలాంటి ప్రత్యేక కేంద్రాలు అందుబాటులో లేవు. కేరళ ప్రభుత్వం వైద్య పర్యాటకాన్ని ఎంతగానో అభివృద్ధి చేసింది. శస్త్రచికిత్సల అనంతర సేవలను అందించడానికి, విశ్రాంతిగా గడపడానికి వీలుకల్పించే మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలతో అభివృద్ధి చేయించింది. ఇంగ్లిషు వైద్యంతోపాటు హోమియోపతి, ఆయుర్వేదం తదితర వైదవిధానాల్లోనూ, నాచురోపతి పేరుతో ప్రకృతివైద్య సేవలను వైద్య పర్యాటకంలో భాగంగా అందిస్తున్నారు. ఆహార నియమాలు, వ్యాయామం, వైద్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపైనా నిపుణులు అవగాహన కల్పిస్తారు. ఈ తరహా సేవలన్నీ లభించేలా వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశాఖను వేదికగా ఎంచుకుంది.

విశాఖలోని సుందర సాగరతీరం ఉన్న రుషికొండ ప్రాంతంలో వుడా రోహౌసింగ్‌ ప్రాంగణంలోని 15 భవనాలను ముందుగా వైద్యపర్యాటకంలో భాగంగా వివిధ రకాల సేవలందించే సంస్థలకు కేటాయిస్తారు. అందుకోసం ఇప్పటికే ‘అమృత్‌ సొసైటీ’ పేరుతో సంస్థను ఏర్పాటుచేశారు. వైద్య, ఆరోగ్యశాఖ, పర్యాటకశాఖలు ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి కృషి చేస్తాయి. వైద్యఆరోగ్యశాఖ తరఫున ‘ఆయుష్‌’ విభాగం వైద్య పర్యాటకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తోంది. అవసరమైన మౌలికవసతులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. విశాఖలో ఏర్పాటు చేయనున్న వైద్యపర్యాటక ప్రాజెక్టు విజయవంతానికి తొలుత ప్రతిపాదనలు ఆహ్వానించి (ఆర్‌.ఎఫ్‌.పి.) ఎలాంటి వసతులను అందించాలన్న అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నారు.

వైద్య పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ
ఏటా లక్షలాది మంది దేశ విదేశీ పర్యాటకులు విశాఖకు వస్తున్న నేపథ్యంలో వైద్య పర్యాటకానికి అవసరమైన మౌలికవసతులను విశాఖలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ప్రయోగాత్మకంగా 15 గృహాలను అవసరమైన సేవలు అందించడానికి కేటాయించి స్పందన బట్టి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమృత్‌ ప్రాజెక్టును గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

- పూనం మాలకొండయ్య,
వైద్య,ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
 
 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...